Brahmamudi May 14th episode: ఏ తల్లి పాలు తాగే పిల్లాడిని వదిలేయదు.. కావ్య దిమ్మతిరిగే లాజిక్‌కు చిత్తు

రాజ్ తీసుకొచ్చిన బిడ్డకు తల్లి ఎవరు అనే విషయాన్ని బయటపెడుతానని మీ అత్తగారికి అలా ఎలా మాటిస్తావు, అలా చేస్తే కోడలుగా ఈ ఇంట్లో నీ స్థానం ఏమైపోతుంది అని కోప్పడుతుంది. ఆ నిమిషంలో నాకు వేరే దారి తోచలేదు అమ్మమ్మ గారు అంటుంది. ఈ మంచితనమే నీ కాపురాన్ని కూలదోసేలా ఉంది , అయినా అదేం తల్లి పాలు తాగే పిల్లాడిని వదిలేసి ఎక్కడో ఉంది, ఏ తల్లి అయినా అలా ఉండగలదా, 30 ఏళ్ల కొడుకుని వదిలి ఉండడానికే మీ అత్త అంత దిగులు పడిపోయింది.

అయితే ఏ తల్లి పాలు తాగే పిల్లల్ని వదిలేసి ఉండలేదు అయినా ఈ పిల్లాడి తల్లి ఉంటుంది అంటే నాకు ఏదో అనుమానంగా ఉంది అసలు ఆమె ఏం ఆశిస్తుంది అని మామగారిని అడుగుతుంది కావ్య. డబ్బు అంటాడు సుభాష్. ఆమె అకౌంట్లో నిన్నే డబ్బు వేశాను అంటాడు. ఆ ఎకౌంట్ డీటెయిల్స్ నాకు ఇవ్వండి అంటుంది కావ్య. ఆమెకి డీటెయిల్స్ సెండ్ చేస్తాడు సుభాష్. ఆ డీటెయిల్స్ తో ఆమెని వెతికే ప్రయత్నంలో ఉంటుంది కావ్య. ఇదంతా 408 ఎపిసోడ్‌లో జరిగిన కథ. మే 14వ తేదీ 409 ఎపిసోడ్‌లో జరిగినది ఏమిటంటే?

Brahmamudi serial

భర్త చేతిని ముద్దు పెట్టుకోవాలనుకుంటుంది అనామిక. కానీ అందుకు ఛాన్స్ ఇవ్వడు కళ్యాణ్. నీకు అరెస్టు చేయించడం మాత్రమే తెలుసు అనుకున్నాను ముద్ధులు పెట్టడం కూడా తెలుసా అని అడుగుతాడు. జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకు, నేను నీతో గొడవపడాలనుకోవట్లేదు నన్ను క్షమించు అంటుంది అనామిక. ఎదురుగా ఉన్న ఫ్లవర్ వాజ్ ని తీసుకొని కిందికేసి పగలగొట్టమంటాడు కళ్యాణ్. అనామిక అలాగే చేస్తుంది. దానికి సారీ చెప్పమంటాడు కళ్యాణ్.

ఇష్టం లేకపోయినా భర్త చెప్పినట్లు చేస్తుంది అనామిక. ఇప్పుడు ఆ ఫ్లవర్ వాజ్ అతుక్కుందా అని అడుగుతాడు. అది ఎలా అతుక్కుంటుంది అంటుంది అనామిక. నా మనసు కూడా అలాంటిదే. ఒకప్పుడు నేను కూడా నీ దగ్గరికి ఇలాగే వచ్చాను కానీ చీదిరించుకున్నావు, నన్ను నాలాగా కాకుండా నీకు ఇష్టమయ్యేలాగా ఉండాలనుకున్నావు. ఇప్పుడు కూడా నీకు నచ్చినట్లుగానే ఉండాలంటున్నావు అని ఆమెపై కోప్పడి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు కళ్యాణ్.

మరోవైపు పడుకున్న భర్తని చూస్తూ మురిసిపోతూ అతనికి ముద్దు పెట్టాలనుకుంటుంది కావ్య. కానీ టెన్షన్ తో పెట్టలేక పోతుంది అప్పుడు ఆమెలోని ఆత్మ బయటికి వచ్చి ముద్దు పెట్టు నీ భర్తే కదా అంటుంది. భయంగా ఉంది అంటుంది కావ్య. నువ్వు ఇలాగే భయపడుతూ ఉండు, రేపు మరొక బిడ్డను తెచ్చి ఉయ్యాలలో పెడతాడు నువ్వు వాడికి కూడా సేవలు చేస్తూ గడిపేద్దువు గానివి, నీకంటూ సుఖం సంతోషం అక్కర్లేదా అంటుంది ఆత్మ. కావాలి అంటుంది కావ్య.

అయితే ముద్దు పెట్టు అంటుంది ఆత్మ అయినా భయపడుతున్న కావ్య తో నేను ముద్దు పెట్టి చూపిస్తాను అంటూ రాజ్ కి ముద్దు పెడుతుంది ఆత్మ. అది చూసి సిగ్గు పడుతుంది కావ్య. అప్పుడే నిద్ర లేచిన రాజ్ కంగారు పడతాడు, నా బట్టలన్నీ బాగానే ఉన్నాయి కదా ఎందుకు నవ్వుతున్నావు అంటాడు. సిగ్గుతో అక్కడి నుంచి పారిపోతుంది కావ్య. ఏం జరిగిందో తెలియక అయోమయంలో ఉండిపోతాడు రాజ్. మరోవైపు హాల్లో కూర్చొని కవితలు రాసుకుంటూ ఉంటాడు కళ్యాణ్.

అప్పుడే అక్కడికి వచ్చిన రుద్రాణి వీడేంటి ఆఫీసుకి వెళ్ళకుండా కవితలు రాస్తున్నాడు, ఇది గాని అనామిక చూసిందంటే రచ్చ చేస్తుంది అనుకొని అనామికని వెతికి మరీ కళ్యాణ్ దగ్గరికి తీసుకువచ్చి చూడు నీ భర్త ఏం చేస్తున్నాడో అంటుంది. అనామిక కోపంతో రగిలిపోతూ విషయం అత్తగారికి చెప్తుంది. ధాన్యలక్ష్మి వచ్చి కవితలు రాస్తున్న కళ్యాణ్ ని చూసి కోప్పడుతుంది. కొత్త ఆలోచన వచ్చింది రాస్తున్నాను అంటాడు కళ్యాణ్. అయితే పాత పనిని మానేస్తావా అంటుంది ధనలక్ష్మి.

ఇకమీదట నేను ఆఫీస్ కి వెళ్ళను, నాకు వచ్చిన పని, నచ్చిన పని చేసుకుని కూర్చుంటాను అంటాడు కళ్యాణ్. ఆఫీస్ కి ఎందుకు వెళ్ళవు అంటుంది అనామిక. అడగడానికి నువ్వు ఎవరు అంటాడు కళ్యాణ్. నీ భార్యని అంటుంది అనామిక. నా మీద కేసు పెట్టిన మనిషి నా భార్య ఎలా అవుతుంది, సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకెందుకు ఉంటుంది, నీకు నచ్చినట్లు నడుచుకుంటే క్షమిస్తావు లేదంటే పోలీస్ కేసు పెట్టి జైల్లో వేయిస్తావు.

అలాంటి నిన్ను భార్యగా ఎలా అనుకోమంటావు ఇకమీదట నీకు నచ్చినట్లుగా నేను బ్రతకలేను, నాకు నచ్చినట్లుగానే నేను ఉంటాను నాకు నచ్చిన పనే చేస్తాను అంటాడు కళ్యాణ్. ఇలా ఆఫీసుకి ఎవరు వెళ్ళనంటే ఆఫీసు వ్యవహారాలు ఎవరు చూస్తారు అంటుంది అపర్ణ. అది నా సమస్య కాదు మీ సమస్య అసలు అన్నయ్యని ఆఫీసుకు వెళ్ళొద్దని చెప్పింది మీరు, ఆ స్థానానికి అన్నయ్య ఒక్కడే సమర్ధుడు అని తెలిసినా కూడా ఆంక్షలు విధించావు అంటాడు. కళ్యాణ్ ని
కోప్పడుతుంది అపర్ణ.

తరువాయి భాగంలో మామ గారితో మాట్లాడుతున్న కావ్య నాకు బిడ్డ తల్లి విషయంలో కొన్ని అనుమానాలు ఉన్నాయి అంటుంది. ఏంటవి అంటాడు సుభాష్. పాలు తాగే పిల్లవాడిని వదిలేసి ఏ తల్లి ఉండలేదు అయినా ఈమె ఉంటుంది, అసలు ఆ బిడ్డ తల్లి ఏం ఆశిస్తుంది అంటుంది కావ్య. డబ్బు ఆశిస్తుంది రెండు రోజుల క్రితమే ఆమె అకౌంట్లో డబ్బులు వేశాను అంటాడు సుభాష్. ఆ డీటెయిల్స్ నాకు పంపించండి అంటుంది కావ్య. సరే అంటాడు సుభాష్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X