Brahmamudi May 15th Episode: కావ్య మనసు మార్చిన సీతారామయ్య.. రాజ్‌కి లైన్ క్లియర్, యామినికి షాక్
కావ్య గురించి ముఖ్యమైన విషయం మాట్లాడాలని రాజ్‌ను ఇంటికి పిలిపిస్తుంది దుగ్గిరాల ఫ్యామిలీ. కావ్య చాలా మంచిదని, తనకు నువ్వంటే ఎంతో ఇష్టమని చెబుతారు. మరి నాతో దూరంగా ఎందుకు ఉంటుందని రాజ్ అడగ్గా.. నీకు యామినితో పెళ్లి నిశ్చయమైపోయిందని అందుకే కావ్య దూరంగా ఉంటుందని చెబుతారు. కావ్య మనసును గెలుచుకోవడానికి ప్రయత్నిస్తే మేమంతా నీకు హెల్ప్ చేస్తామని మాట ఇస్తారు.
ఉదయాన్నే కావ్య రెడీ అవుతుండగా ఇంట్లో నవ్వులు, అరుపులు వినిపిస్తాయి. ఏం జరిగిందో తెలుసుకోవడానికి కావ్య కిందకి రాగా రాజ్‌కు అందరూ కలిసి టిఫిన్ పెడతారు. ఇది చూసిన కావ్య షాక్ అవుతుంది. మా ఇంటికి రావొద్దని చెప్పాను కదా? ఎందుకు వచ్చారు వెళ్లిపోమని చెబుతుంది. ఇంతలో రాహుల్, రుద్రాణిలు వచ్చి రాజ్‌ను చూసి ఉలిక్కిపడతారు. ఎంత చెప్పినా వినకపోవడంతో రాజ్‌ను తీసుకుని కావ్య బయటకి వెళ్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక మే 15వ తేదీ ఎపిసోడ్ 722లో ఏం జరిగిందంటే?

రాజ్‌ను ఇంటికి తీసుకొచ్చి మర్యాద చేయడంతో దుగ్గిరాల ఫ్యామిలీపై కావ్య రగిలిపోతుంది. అసలు ఆయనని ఎందుకు తీసుకొచ్చారు? మీరంతా ఎందుకు క్లోజ్ అవుతున్నారని నిలదీస్తుంది. వాడు నా మనవడే కాదు.. ఈ ఇంటికి వారసుడని అంటుంది ఇందిర. ఆ విషయం ఆయనకు గుర్తులేదని, మేం చేసిన పనికి మమ్మల్ని పొగడాల్సిందిపోయి తిడతావేంటీ అని మండిపడుతుంది స్వప్న. రిసార్ట్‌లో ఏం జరిగిందో మరిచిపోయారా అని ప్రశ్నిస్తుంది కావ్య. వాడికి ఎటువంటి ప్రాబ్లమ్ రాకుండా నీకు దగ్గర చేస్తున్నామని చెబుతుంది అపర్ణ.
ఆయనకు నేను దగ్గర అవ్వడమే అసలు సమస్య అని చెబుతుంది కావ్య. వాడు ప్రస్తుతంలో బ్రతకలేక.. గతం గుర్తురాక తనలో తాను కుమిలిపోతున్నాడని చెబుతుంది ఇందిర. ఒకప్పుడు యామినిని వద్దు అనుకుని వదిలేశాడని, కానీ ఇప్పుడు అవేవి గుర్తులేకపోయినా తనను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక నీకు దగ్గరవ్వాలని అనుకుంటున్నాడని మండిపడుతుంది ఇందిర. వాడికి నీమీదున్న ఇష్టం నిజమైనది కాబట్టే యామినితో పెళ్లికి టైం దగ్గరపడుతున్నా నీ వెంట పడుతున్నాడని చెబుతుంది అపర్ణ. ఒకవేళ మీరెంత ప్రయత్నించినా వాడికి గతం గుర్తురాకపోతే అని ప్రశ్నిస్తుంది కావ్య.
ఇన్నాళ్లు కావ్యగా వాడితో ఉన్నావ్.. రేపటి నుంచి కళావతిగా కొత్త జీవితాన్ని మొదలుపెడతావ్, మళ్లీ వాడిని పెళ్లి చేసుకుంటావని అంటుంది అపర్ణ. ఏదైనా వాడు సంతోషంగా ఉండటమే కావాలని చెబుతుంది. ఇలా చేయడం నాకు ఇష్టం లేదని, దీనికి నేను ఒప్పుకోనని చెప్పి వెళ్లిపోతుంది. ఇంట్లో అందరి సపోర్ట్ కావ్యకే ఉంటుందని ఒక్క రుద్రాణిది తప్ప అని అంటాడు ప్రకాశం. మా పనులు మేం చేసుకుంటాం, నువ్వు అడ్డుపడొద్దని రుద్రాణికి గడ్డిపెడుతుంది ఇందిర. ఆ యామినిని తీసుకొచ్చి షాకిస్తే ఫ్యామిలీ అంతా ఒక్కటై, ఇప్పుడు కావ్యకి గుర్తు చేస్తున్నారని మండిపడుతుంది. రాజ్‌కు గతం గుర్తుచేయడానికి ముందే ఆ యామినితో పెళ్లి జరిగిపోవాలని రాహుల్‌తో అంటుంది.
ఉత్సాహంగా ఇంటికి వచ్చిన రాజ్‌ని చూసిన యామిని చాలా జోష్‌తో ఉన్నావ్.. ఎక్కడి నుంచి వెళ్లి వస్తున్నావని అడుగుతుంది. మన వెడ్డింగ్ కార్డ్స్‌ని నా ఫ్రెండ్ సర్కిల్‌లో ఉన్నవాళ్లకి పంచడానికి వెళ్లానని అంటాడు రాజ్. నీ మాటలు నేను నమ్మలేకపోతున్నానని చాలా సంతోషంగా ఉందని యామిని అనుకుంటుంది. నీకు అబద్ధం చెప్పానని.. నువ్వు ఇప్పుడు సంతోషంగా ఉండొచ్చు కానీ నేను హ్యాపీగా ఉన్నరోజున నీకు అబద్ధం చెబుతానని మనసులో అనుకుంటాడు రాజ్. ఇన్ని రోజులు పెళ్లి పెళ్లి అని నిన్ను చాలా ఇబ్బంది పెట్టానని, కానీ ఈరోజు మాత్రం నీకు నువ్వుగా స్టెప్ తీసుకుని కార్డ్స్ పంచుతున్నావని మురిసిపోతుంది యామిని.
భోజనం చేస్తున్న తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి మా పెళ్లి పత్రికలు తన ఫ్రెండ్స్ అందరికీ పంచేశాడని యామిని చెబుతుంది. ఆ మాటలతో వైదేహి- యామిని చాలా సంతోషిస్తారు. ఇక నుంచి మీ ఇద్దరూ కలిసి మన చుట్టాలకి కార్డ్స్ పంచుతానని అంటుంది. ఈ విషయాన్ని అర్జెంట్‌గా నా శత్రువుకి చెప్పాలని కావ్యకి ఫోన్ చేస్తుంది యామిని. నా కాబోయే శ్రీవారు తనకు కాబోయే శ్రీమతికి ఒక సర్‌ప్రైజ్ ఇచ్చాడని, తనే స్వయంగా వెళ్లి పెళ్లి పత్రికలు పంచి పెట్టాడని చెబుతుంది.గుండెల్లో బాంబు పేలినట్లుగా ఉందా? ఇలాంటి బాంబులు చాలానే పేలుతాయని తట్టుకోవడానికి సిద్ధంగా ఉండమని సెటైర్లు వేస్తుంది యామిని
నేను కూడా ఒక బాంబు పేలుస్తానని అది తట్టుకుని నిలబడటానికి నువ్వు సిద్ధంగా ఉండమని అంటుంది యామిని. మీ ఇంటికి హుషారుగా వచ్చిన మా ఆయన పొద్దుపొద్దున్నే వచ్చింది ఎక్కడికో తెలుసా? అని ప్రశ్నిస్తుంది కావ్య. మా ఇంటికి అని చెప్పడంతో యామిని షాక్ అవుతుంది. నా ఫ్యామిలీని బుట్టలో వేసుకోవడానికి వచ్చాడని, మా ఇంట్లో వాళ్లు బిడ్డకి ప్రేమగా తిండి పెట్టారని కావ్య చెప్పడంతో యామిని వణికిపోతుంది. నా దారిలోకి వచ్చానని చెబుతూ, నన్నే మోసం చేస్తాడా అని రాజ్‌పై మండిపడుతుంది యామిని.
దుగ్గిరాల ఫ్యామిలీ అంతా సమావేశమై ఇక నుంచి రాజ్ ఇంటికి వస్తూనే ఉంటాడని కావ్యకు చెబుతాడు సీతారామయ్య. అది నీకు ఇష్టమున్నా, లేకున్నా నువ్వు ఒప్పుకోవాల్సిందేనని చెబుతాడు. గతంలో లాగా ఏ తప్పు చేయమని అపర్ణ చెప్పడంతో .. గతంలోనూ మీ మాట విని ఆయనికి గతం గుర్తుచేయడానికి ప్రయత్నించి ఆయన ప్రాణాలతో ఆడుకున్నానని, మళ్లీ అలాంటి తప్పు చేయడానికి సిద్ధంగా లేనని చెబుతుంది కావ్య. వాడి ప్రాణాలతో ఆడుకోవాలని మాకు మాత్రం లేదని, కానీ వదిలేస్తే ఆ యామిని వాడిని లాక్కుంటుందని భయపడుతుంది ఇందిర. ఆయన దూరంగా ఉన్నా ప్రాణాలతో ఉంటే చాలని కావ్య అంటుంది.
మేం ఏం చేసినా నువ్వు మాకు అడ్డు రావొద్దని సీతారామయ్య తేల్చిచెబుతాడు. ఆయన నా కళ్ల ముందుకు వస్తే నన్ను నేను మరిచిపోతున్నానని, నా ప్రేమ కోసం తపిస్తుంటే ఆయనని ఎలా దూరం పెట్టగలనని ప్రశ్నిస్తుంది కావ్య. వాడు మనకి దక్కాలంటే ఇదొక్కటే మార్గమని, నువ్వు మాత్రమే వాడిని దక్కేలా చేయగలవని చెబుతాడు. భోజనం చేయకుండా కవితలు రాస్తూ కూర్చొన్న కళ్యాణ్‌పై మండిపడుతుంది ధాన్యలక్ష్మీ. అప్పూ వచ్చిన తర్వాత తింటానని కళ్యాణ్ చెప్పడంతో ఆమె మండిపడుతుంది. అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన అప్పూని చూసి కోప్పడుతుంది ధాన్యలక్ష్మీ. తనకు ఏదో ఒక దారి చూపించమని కృష్ణుడికి దండం పెట్టుకుంటుంది కావ్య. కావ్యని ఇంప్రెస్ చేయడానికి రాజ్ రకరకాల డ్రెస్‌లు వేసుకుని ట్రయల్ వేస్తాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











