Brahmamudi May 15th Episode: కథలో షాకింగ్ ట్విస్ట్... లక్కీగాడు రేఖ అక్రమ సంతానం, ఆస్తిపై రేఖకి మరో షాక్
Photo Courtesy: JioHotstar
రాజ్ తల్లిదండ్రులను వెతుక్కుంటూ వెళ్లిన అపర్ణ.. తనను తాను దుగ్గిరాల కుటుంబానికి చెందిన వ్యక్తినని చెప్పడంతో లక్ష్మీ- చలపతిలు షాక్ అవుతారు. మీ ఇంట్లో ఉన్నది నా మనవడే, వాడిది దుగ్గిరాల రక్తమని అంటుంది. అపర్ణ కన్నీటితో కరిగిపోయిన చలపతి నిజం చెప్పబోతుండగా పీఏ శృతి మాటలు గుర్తొచ్చి రాజ్ మా పెద్ద కొడుకని అబద్ధం చెబుతాడు. దాంతో అపర్ణ ఏడుస్తూ వెళ్లిపోతుంది. రాజ్ పనిపాటా చేయకుండా జీవితాంతం ప్రాణాలతో నా కళ్లముందే ఉంటే చాలని, ఎప్పటికీ ఈ నిజం చెప్పనని లక్ష్మీతో అంటాడు చలపతి. లక్కీ తండ్రి ఆంటోనీ జైలు నుంచి విడుదలవుతాడు.
చలపతి ఇంటి నుంచి వస్తున్న అపర్ణని పీఏ శృతి చూసి తనను తాను పరిచయం చేసుకుంటుంది. రాజ్ సార్, కావ్య మేడం ఉన్నప్పుడు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వైభవంగా ఉన్నాయి. కానీ రేఖ మేడం కంపెనీని నాశనం చేస్తోందని, ఈ నెలలో ఉద్యోగులకు జీతం కూడా వేయలేదని శృతి చెప్పడంతో అపర్ణ కోపంతో రగిలిపోతుంది. రాజ్‌ని ఇందూ పెళ్లి చేసుకున్నట్లు తెలుసుకున్న నందూ నేరుగా ఇంటికొచ్చి అక్కని నిలదీస్తుంది. నువ్వు ఆ జులాయిగాడిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు.. వెంటనే ఈ పెళ్లి క్యాన్సిల్ చేయమని కోప్పడుతుంది. దాంతో సీరియస్ అయిన ఇందూ.. నా పెళ్లి గురించి నీకెందుకు? నువ్వు నా సొంత చెల్లివా? అని అడుగుతుంది. సొంత చెల్లెలిని కాబట్టే బాధపడుతున్నానని.. నేనెవరో కాదు నందూని అని చెప్పడంతో ఇందూ షాక్‌తో కంటతడి పెడుతుంది. ఇన్నాళ్లూ ఎక్కడికి వెళ్లిపోయావని చెల్లిని హత్తుకుంటుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక మే 15వ తేదీ ఎపిసోడ్ 1033లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
నేను నీ అక్కని అని తెలిసి కూడా నువ్వు నా దగ్గర నిజం దాచావా అని నందూపై కోప్పడుతుంది ఇందూ. ఆ రేఖ ఆంటీ పెట్టే టార్చర్ తట్టుకోలేక నేను వెళ్లిపోయా? రేఖ ఆంటీని చూసి ఇంకా భయం వేసింది అందుకే వెళ్లిపోయానని అంటుంది నందూ. ఆ రేఖ ఆంటీ పెట్టిన టార్చర్ నీ కళ్లారా చూశా.. కానీ ఏం చేయలేక నిన్ను కాపాడుకోలేకపోయానని ఇందూ బాధపడుతుంది. ఇన్నాళ్లూ నేను ఒంటరి దానిని అనే ఫీలింగ్ ఉండేది.. కానీ ఇన్నాళ్లకి నా చెల్లెలు నాకు దొరికిందని సంతోషిస్తుంది ఇందూ. నాకు కూడా ఈ భారాన్ని ఎప్పుడు దింపుకుందామా అని అనిపించేది.. ఇన్నాళ్లకు నీకు నిజం చెప్పేశానని అంటుంది నందూ.
అసలు ఈ తాళి ఏంటీ? నువ్వు వాడిని పెళ్లి చేసుకోవడం ఏంటీ? అని ఇందూని నిలదీస్తుంది నందూ. ఇప్పుడు నేను నీతో చెప్పే నిజాన్ని ఎవరితోనూ చెప్పనని నాకు మాటివ్వమని నందూ దగ్గర మాట తీసుకుంటుంది. నిజానికి ఇది పెళ్లి కాదు.. ఇది నాటకం, తను నాకు అద్దె మొగుడిగా ఈ ఇంటికొచ్చాడని జరిగినదంతా చెబుతుంది ఇందూ. ఇప్పుడు ఇంట్లో ఉన్న పరిస్ధితులకు, రేఖ ఆంటీ పెట్టే టార్చర్‌కు ఇదే సరైన నిర్ణయం. మన అమ్మానాన్నల ఆశయాల్ని నిలబెట్టడానికి నేను ఈ నిర్ణయం తీసుకున్నానని చెబుతుంది.
ముందు మన ఐశ్వర్య అక్కని మన దారికి తీసుకురావాలి.. మన మీద కోపంతో రేఖ ఆంటీకి సపోర్ట్ చేస్తోంది. ఆ తర్వాత ఒక్కొక్కరిగా ఈ ఇంట్లో వాళ్లని మార్చి మన దారికి తెచ్చుకోవాలని తన ప్లాన్ చెబుతుంది ఇందూ. నీ ప్రయత్నం నువ్వు చేయ్.. నేను పోలీస్ అయి ఏం చేయాలో అది చేస్తాను, అలా పోలీస్ అయి నీకు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తానని చెబుతుంది నందూ. నానమ్మ దగ్గరికి నిన్ను తీసుకెళ్తానని ఇందూ అనగా.. నేను పోలీస్ అయ్యాకే ఈ ఇంట్లోకి వస్తా, ఆ రేఖ ఆంటీకి చుక్కలు చూపిస్తా. అప్పటి వరకు నేనే నీ చెల్లెల్ని అని ఎవ్వరికీ చెప్పొద్దని బతిమలాడుతుంది నందూ.
నేను పుట్టగానే మా అమ్మ నీ చేతుల్లో పెట్టింది.. నాకు మా అమ్మ ఎవరో తెలియాలని ఆంటోనీతో అంటాడు లక్కీ. ఈ అవమానాలు, ఛీత్కారాలు ఇంకా ఎన్నాళ్లూ భరించాలని మండిపడతాడు లక్కీ. మీ అమ్మ ఖచ్చితంగా దొరుకుతుంది. ఇన్ని రోజులూ జైళ్లో ఉన్నాను కాబట్టి వెతకలేకపోయాను.. బయటికొచ్చాను కదా ఇక నుంచి అదే పనిలో ఉంటానని అంటాడు. మీ అమ్మ ఎక్కడున్నాసరే వెతికి పెడతానని అంటాడు ఆంటోనీ. మా అమ్మని త్వరగా వెతికి పట్టుకోమని చెబుతాడు లక్కీ. నేను మీ అమ్మని వెతికే పనిలో ఉంటాను.. నేను ఎక్కడ ఉండాలో నువ్వే తేల్చుకోమని అంటాడు. బాధతో లక్కీ అక్కడి నుంచి వెళ్లిపోగానే.. మీ అమ్మని వెతికితే నాకేం వస్తుందని జేబులోంచి ఫోటో తీసి చూసుకుంటాడు ఆంటోనీ. అందులో రేఖ ఫోటో ఉంటుంది.. నువ్వు నా పాలిట దేవతవి, నువ్వు ఆ రోజు చేసిన పనివాళ్ల.. నేను వీడి దగ్గరి నుంచి బిర్యానీ, బీరు తీసుకుంటూ బతికేస్తున్నానని సంబరపడిపోతూ గతాన్ని గుర్తుచేసుకుంటాడు ఆంటోనీ.
రేఖ తన బిడ్డని ఆంటోనీ చేతుల్లో పెడుతూ.. వీడు నాకు పుట్టిన బిడ్డ అని మా అమ్మకి కూడా తెలియదు, ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చా. నన్ను ప్రేమించినవాడు నాకు నచ్చలేదు.. అందుకే వదిలేశాను, వాడికి పుట్టిన వీడు నాకెందుకు వీడిని కూడా వదిలించుకుంటున్నానని చేతులో డబ్బులు పెడుతుంది రేఖ. నువ్వు కూడా ఎప్పుడూ నా కంటికి కనిపించకూడదని అంటుంది రేఖ. ఇదంతా గుర్తుచేసుకుని నవ్వుకుంటాడు ఆంటోనీ.
రేఖ ఫ్యామిలీ మొత్తం లాయర్‌ను కలుస్తారు. ఇందూకి పెళ్లి అయ్యింది కాబట్టి కోర్టు ఒప్పుకుంటుందని లాయర్ చెబుతాడు. ఇందూ పెళ్లి గురించి ప్రూఫ్స్ అడగటంతో అంతా షాక్ అవుతారు. ఇందూ గారికి పెళ్లయినట్లు మ్యారేజ్ సర్టిఫికెట్ కావాల్సిందే లేదంటే కోర్ట్ ఒప్పుకోదని చెబుతాడు లాయర్. మ్యారేజ్ సర్టిఫికేట్‌తో పాటు ఇందూ గారి భర్త సంతకం కూడా కావాలని చెప్పడంతో రేఖ షాక్ అవుతుంది.
ఇందూ గారి పేరు మీదున్న ఆస్తి మీ మీదకి రావాలంటే ఇందూ గారికి పెళ్లయినట్లుగా మ్యారేజ్ సర్టిఫికెట్ కావాలి, అలాగే ఇందూగారి వేలిముద్రలు, ఇందూగారి భర్త కూడా ఆ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టాలని చెబుతాడు లాయర్. ఇందులో ఏదో తేడాగా ఉంది.. ప్రతిసారి ఏదో ఒకటి అంటున్నారని రేఖ కోప్పడుతుంది. ఇందూగారిపై రాసిన వీలుమానా మీకు పూర్తిగా అర్ధం కాలేదు.. ఇందూగారికి పెళ్లయితేనే ఆమెకు ఆస్తిపై సర్వహక్కులు వస్తాయి. అంటే తన భర్తకి కూడా ఆస్తి మీద హక్కు ఉన్నట్లే కదా? లేదంటే ఇందూ గారు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంటీ? అని లాయర్ ప్రశ్నించడంతో రేఖ షాక్ అవుతుంది.
లాయర్ చెప్పిన విషయం గురించి రేఖ ఆలోచిస్తుంది. ఇందూ ఓకే గానీ, ఆ రాజ్‌గాడు సంతకం పెడతాడా అని భూషణ్, భ్రమరాంబ ప్రశ్నిస్తారు. ఆ రాజ్ గాడిని మాయ చేద్దామని చెబుతుంది రేఖ. అసలు వాడి క్యారెక్టర్ ఏంటీ? నిజంగానే ఆస్తికి ఆశపడే రకమో కాదో తెలుసుకుందామని చెబుతుంది. వాడు ఖచ్చితంగా డబ్బు కోసమే పెళ్లి చేసుకుంటే.. అదే డబ్బుని ఎరగా వేసి వాడిని మనదారిలోకి తీసుకొచ్చుకుందామని చెబుతుంది రేఖ. రాజ్‌కి పెళ్లయినట్లు తెలియడంతో లక్కీ తన ఫ్రెండ్‌ని నిలదీస్తాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications