Brahmamudi May 15th episode: బిడ్డ తల్లిపై అనుమానాలు? సుభాష్ నుంచి గుట్టు లాగిన కావ్య!

బిడ్డ తల్లిని తీసుకువస్తానని అత్తగారికి మాటిస్తుంది కావ్య. కావ్యకి నిజం తెలుసని సుభాష్ తెలుసుకొని షాక్ అవుతాడు. కంపెనీకి వెళ్లనని తనకు నచ్చిన పని మాత్రమే చేస్తానని మొండికేస్తాడు కళ్యాణ్.ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక మే 15వ తేదీ ఎపిసోడ్ 410 లో ఏం జరిగిందంటే..

ఈ సమస్య నాది, కంపెనీ ని నడిపించడానికి అన్నయ్య మాత్రమే సమర్ధుడు అని తెలిసి కూడా తనని పక్కన పెట్టారు, అందుకే ఈ విషయంలో మీరే ఆలోచించండి అంటాడు కళ్యాణ్. అతనిని కోప్పడుతుంది అపర్ణ. కళ్యాణ్ ని సమర్థిస్తాడు సుభాష్. చిన్నవాడైనా నిజం చెప్పాడు వాడినెందుకు కోప్పడుతున్నావు అని భార్య పై కోప్పడతాడు. అనామిక తో మాట్లాడుతూ నేను కంపెనీకి వెళ్ళను, నేను కవితలు మాత్రమే రాస్తాను.

Brahmamudi serial May 15th Episode of 410 Here is full story

నీకు నచ్చితే ఉండు లేదంటే బయటకి పో, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకో అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కళ్యాణ్. ఇదంతా చూసిన చిట్టి బాధపడుతుంది. ఇంతకుముందు ఇల్లు ఇలా ఉండేది కాదు, ఇప్పుడు ఎవరికి వారే నిర్ణయాలు తీసుకుంటున్నారు అందుకే ఇల్లు ఇలా తయారయింది. ఇంట్లో పరిస్థితులు చేయి జారితే నేను, బావ ఎవర్ని క్షమించేది లేదు.

ఈ విషయం పెద్దవాళ్ళకి కూడా చెప్తున్నాను అంటూ అపర్ణ వైపు చూసి చెప్తుంది. మరోవైపు రెడీ అవుతున్న రాహుల్ దగ్గరికి వచ్చిన రుద్రాణి ఇలాంటి ఛాన్స్ నీకు మళ్ళీ రాదు, కళ్యాణ్ కంపెనీకి వెళ్లానంటున్నాడు, రాజ్ కంపెనీకి వచ్చే పరిస్థితి లేదు, ఇక మిగిలింది నువ్వే కాబట్టి జాగ్రత్తగా హేండిల్ చేయు అని చెప్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన స్వప్న మీరు మీ కొడుక్కి నీతులు చెప్పడం వింటే చాలా ఆనందంగా ఉంది అంటుంది.

ఈ ఇంట్లోనే రాజ్, కళ్యాణ్ పెరిగారు అయినా రాహుల్ వాళ్ళలా కాకుండా మీలా తయారయ్యాడంటే మీ బ్లడ్ లోనే ఏదో దోషం ఉంది అంటుంది. ఆ మాటలకి కోప్పడతాడు రాహుల్. నువ్వేదో పెద్ద నీతిమంతురాల్లాగా మాట్లాడుతున్నావు అంటాడు రాహుల్. తనతో వాదన ఎందుకు ఆఫీస్ కి టైం అవుతుంది వెళ్ళు అని రుద్రాణి చెప్పడంతో అక్కడినుంచి వెళ్ళిపోతాడు రాహుల్. మరోవైపు ఆలోచనలో ఉన్న మామ గారి దగ్గరికి వస్తుంది కావ్య. బిడ్డ తల్లి గురించి మాట్లాడుతూ ఈ విషయంలో నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి.

ఏ తల్లీ పాలు తాగే పిల్లవాడిని వదిలిపెట్టి ఉండలేదు అసలు తను ఏం ఆశిస్తుంది అంటుంది. ఆశిస్తుంది తను నాకు ఊటీలో అసిస్టెంట్ గా పని చేసేది, హైదరాబాద్ వచ్చిన తర్వాత కాంటాక్ట్ లో లేకుండా పోయింది సంవత్సరం తర్వాత బిడ్డను తీసుకొని వచ్చింది అని జరిగిందంతా చెప్తాడు సుభాష్. అప్పుడే నేను సూసైడ్ చేసుకోవాలనుకుంటే రాజ్ వచ్చి కాపాడాడు అని చెప్తాడు. మీరు ఎంత మంచి కొడుకుని కన్నారు మావయ్య అంటుంది కావ్య.

కానీ నేనే వాడి కోసం ఏమి చేయలేకపోతున్నాను అంటాడు సుభాష్. ఆ సమయం ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది అంటుంది కావ్య. సుభాష్ దగ్గర నుంచి మాయ బ్యాంక్ అకౌంట్స్ తీసుకొని ఈ విషయం గురించి మీరు రిలాక్స్డ్ గా ఉండండి, అత్తయ్యకు నిజం చెప్పే ప్రయత్నం చేయకండి అంటుంది. నాకోసం నువ్వు ఎలాంటి సమస్యలు తలకెత్తుకోవద్దు అంటాడు సుభాష్. మరోవైపు కావ్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు రాజ్.

కావ్య మొండిది ఎలాగైనా నిజం తెలుసుకొని ఆ మాయని తీసుకువచ్చి అమ్మ ముందు నిలబెట్టినా నిలబెడుతుంది.. అలా జరగకుండా చూడాలి అని మాయ దగ్గరికి బయలుదేరుతాడు రాజ్. కావ్య కూడా అప్పుడే సుభాష్ ఇచ్చిన డీటెయిల్స్ తీసుకొని బయటికి బయలుదేరుతుంది. ఎక్కడికి వెళ్తున్నావ్ అని రాజ్ అడిగినా నిజం చెప్పదు కావ్య. రాజ్ కూడా ఎక్కడికి వెళ్తున్నాడన్న విషయం చెప్పడు. బ్యాంక్ డీటెయిల్స్ ప్రకారం ఒక బస్తి దగ్గరికి చేరుకుంటుంది కావ్య.

కారు లోపలికి వెళ్లకపోవటంతో నడుచుకొని వెళ్తుంది. అక్కడ అడ్రస్ అడుగుతూ ఉంటే ఇద్దరు రౌడీలు ఆమె ఫోటో తీసి వేరే వాళ్ళకి పంపిస్తారు. ఆ అమ్మాయిని పట్టుకో నీకు ఐదు లక్షలు ఇస్తాను అని చెప్పి తిరిగి ఫోన్ చేస్తారు అమ్మాయిల దందా చేసే రౌడీలు. సరే అంటూ కావ్య వెనుక పడతారు లోకల్ రౌడీలు. రాజ్ కూడా నడక దారిలో అక్కడికే వస్తూ ఉంటాడు.

తరువాయి భాగంలో ఆఫీస్ నుంచి కావ్య హార్డ్ డిస్క్ తీసుకుందని సెక్యూరిటీ ద్వారా తెలుసుకున్న రాజ్ ఆశ్చర్యపోతాడు. నెక్స్ట్ సీన్ లో కావ్యని రౌడీలు కిడ్నాప్ చేస్తారు. ఆ సంఘటన అప్పు చూస్తుంది. వ్యాన్ వెనక పరిగెడుతుంది కానీ అందుకోలేక పోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X