Brahmamudi May 16th Episode: అప్పూతో కళ్యాణ్ రొమాన్స్.. యామినికి షాకిచ్చిన రాజ్‌, కావ్యపై రుద్రాణి ఫోకస్

రాజ్‌ను ఇంటికి పిలిపించి భోజనం పెట్టడంతో దుగ్గిరాల ఫ్యామిలీపై మండిపడుతుంది కావ్య. ఇలాంటి పనుల వల్ల ఆయన గతం గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తారని, అది రాజ్ ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తుంది. రాజ్‌కు ఏం జరగకుండా మా ప్రయత్నాలు మేం చేస్తామని, నువ్వు మధ్యలో అడ్డురావొద్దని రుద్రాణికి వార్నింగ్ ఇస్తుంది ఇందిర. హ్యాపీగా ఇంటికొస్తున్న రాజ్‌ను ఎక్కడి నుంచి వస్తున్నావని అడుగుతుంది యామిని.

మన పెళ్లికి వెడ్డింగ్ కార్డ్స్ పంచటానికి వెళ్లానని చెప్పడంతో యామిని సంతోషించి వెంటనే ఈ విషయాన్ని కావ్యకి ఫోన్ చేసి చెబుతుంది. ఆయన ఉదయాన్నే మా ఇంటికి వచ్చి తృప్తిగా టిఫిన్ చేశాడని కావ్య చెప్పడంతో యామిని షాక్ అవుతుంది. అప్పూ కోసం వెయిట్ చేస్తూ భోజనం చేయకుండా రాసుకుంటున్న కళ్యాణ్‌‌కి చీవాట్లు పెడుతుంది ధాన్యలక్ష్మీ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక మే 16వ తేదీ ఎపిసోడ్‌ 723లో ఏం జరిగిందంటే?

Brahmamudi Serial May 16th 2025 Episode 723 Here is Today s full story

కావ్య దగ్గరికి వెళ్లడానికి ఏ డ్రెస్‌ వేసుకోవాలో అర్ధం కాక అన్ని డ్రెస్‌లు మారుస్తుంటాడు రాజ్. ఇంతలో అపర్ణ ఫోన్ చేయడంతో హాయ్ అమ్మ అంటాడు. ఆ మాటలతో అపర్ణ చాలా సంతోషిస్తుంది. మీరు ఆనందపడతానంటే అమ్మ అని 100 సార్లు పిలుస్తానని అంటాడు రాజ్. మంచి డ్రెస్ సిద్ధం చేశానని, ఏం చేయాలో ప్రిపేర్ అవుతున్నానని రేపొచ్చి చితక్కొడతానని అంటాడు. కళావతి డ్రెస్‌ను నువ్వు గెలిచేసుకున్నావ్ కాబట్టి నువ్వు ఎలా ఉన్నా పర్లేదని అంటుంది అపర్ణ. తన మనసులోని మాటను బయటికి తీసుకురావాలంటే తనకు సంబంధించినది ఏదైనా నువ్వు ట్రై చేయాలని చెబుతుంది. తనను ఇంప్రెస్ చేయడానికి మీరే ఏదైనా ఐడియా చెప్పమని అడుగుతాడు రాజ్.

ఆడదాని మనసును గెలుచుకోవాలంటే తనకు నచ్చిన విధంగా ఏ పువ్వో, చీరో గిఫ్ట్‌గా ఇస్తే సంతోషిస్తుందని అంటుంది అపర్ణ. రేపు తనకు ఇష్టమైన గిఫ్ట్ తీసుకొచ్చి ఇంప్రెస్ చేస్తానని చెబుతాడు రాజ్. వీళ్లిద్దరూ కలిసి సంతోషంగా ఉండటానికి ఇంకా ఎన్ని రోజులు ఎదురుచూడాలో అని బాధపడుతుంది అపర్ణ. బెడ్‌రూమ్‌లో ధాన్యలక్ష్మీ కోపంతో అటూ ఇటు తిరుగుతుండగా ప్రకాశం పుస్తకం చదువుకుంటూ ఉంటాడు. ఇంట్లో ఏం జరుగుతుందో మీకు అర్ధమవుతుందా అని ప్రకాశాన్ని ప్రశ్నిస్తుంది.

మనకు ఇష్టం లేకపోయినా అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు కదా అని ఇంటికి తీసుకొచ్చి పెట్టామ్.. వాడు సంతోషంగా ఉన్నాడా? లేదా? అని కనుక్కుంటున్నారా అంటూ క్లాస్ పీకుతుంది. నేను ఇంటి పట్టున ఉండటం వల్ల మీకన్నీ సవ్యంగా చేసి పెట్టానని, కానీ మీ ముద్దుల కోడలు పోలీస్ జాబ్ అంటూ రాత్రిపగలు తిరుగుతోందని, అసలు మనబ్బాయిని పట్టించుకోవడం లేదని అంటుంది. ఆవిడకి ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముంది? ఇంట్లోనే ఉండి మనబ్బాయిని చూసుకుంటే సరిపోదా అని ప్రశ్నిస్తుంది. తనకు నచ్చినట్లు చేసుకుంటే నాకు మాత్రం మనవడిని ఎత్తుకోవాలని ఉండదా? అని నిలదీస్తుంది. ఇన్ని రోజులు ఇంట్లో లేరని గొడవ? ఇప్పుడు ఇంటికొస్తే పిల్లలు లేరని గొడవ? అని ప్రకాశం మండిపడతాడు.

కావ్య కోసం రెడ్ రోజ్ బొకే కావాలని ఫోన్‌లో రాజ్‌ ఆర్డర్ చేస్తుండగా యామిని వస్తుంది. ఏదైనా పార్టీకి వెళ్తున్నావా? ఇంత స్టైల్‌గా రెడీ అయ్యావ్? అని అడుగుతుంది. రేపు మనిద్దరం వెళ్లి మన రిలేటివ్స్‌కి పెళ్లిపత్రికలు ఇవ్వాలని అనుకున్నామ్ కదా? దాని కోసం రెడీ అయ్యావా అని అడుగుతుంది యామిని. మన రిలేటివ్స్ దగ్గరకి నేను రావడం లేదని, నాకు వేరే మీటింగ్ ఉందని, ఒక ఇంపార్టెంట్ పర్సన్‌ని కలవడానికి వెళ్తున్నానని చెబుతాడు రాజ్.

ఏదో ఒకరోజు తప్పకుండా ఈ విషయం నీ దగ్గర డిస్కష్ చేయాలని అంటాడు. ఆ టైమ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా నీకే చెబుతానని అంటాడు రాజ్. రేపు మనం వస్తున్నామని, మన రిలేటివ్స్‌కి చెప్పేశానని అంటుంది యామిని. నీతో అస్సలు టైం స్పెండ్ చేయలేనని తేల్చి చెబుతాడు రాజ్. నేను నీకు దగ్గర అవ్వాలని ఎంత ప్రయత్నిస్తున్నా నువ్వు రోజురోజుకు నాకు దూరం అవుతున్నావని మనసులో అనుకుంటుంది యామిని.

అప్పూ కోసం కళ్యాణ్ భోజనం తీసుకుని వస్తాడు. ఓ కేసు ఎటూ తేలడం లేదని, ఎంత కష్టపడ్డా సాల్వ్ చేయలేకపోతున్నానని బాధపడుతుంది అప్పూ. అయితే నీ స్ట్రెస్ నేను తీర్చనా అని అడుగుతాడు కళ్యాణ్. నీ రొమాంటిక్ ఫోజులు నాకు తెలుసని, నా దగ్గర నాటకాలు వేయొద్దని అంటుంది అప్పూ. నీ అంతట నువ్వు అడిగే వరకు ఫస్ట్ నైట్ వద్దని చెప్పిందే నేను అని అంటాడు. మరి వెనుక నుంచి ఎందుకు పట్టుకున్నావని అడుగుతుంది అప్పూ. నా పొట్టికి భోజనం తినిపిద్దామని వచ్చానని అంటాడు. అన్నం తినిపిస్తుండగా అప్పూ చాలా బాధపడుతుంది.
నీకు అస్సలు టైం ఇవ్వలేకపోతున్నానని కళ్యాణ్‌కు సారీ చెబుతుంది.

రుద్రాణికి యామిని ఫోన్ చేసి అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతోందని ప్రశ్నిస్తుంది. ఆ కావ్య ఏదో ప్లాన్ చేస్తుందో అర్ధం కావడం లేదని యామిని అంటుంది. నీ పేరు, నీ బ్యాక్‌గ్రౌండ్ విని నువ్వేదో సైకో విలన్ అనుకున్నానని నాకంటే కామెడీగా ఉన్నావని చెబుతుంది రుద్రాణి. ఈసారి ప్లాన్ చేసింది ఆ కావ్య కాదు.. రాజ్ వల్ల అమ్మ అని చెప్పడంతో యామిని షాక్ అవుతుంది. ఎవ్వరికీ తెలియకుండా రాజ్‌ని కలిసి మా కోడలు నిన్ను ఇష్టపడుతుంది, తన మనసును గెలుచుకోవడానికి ప్రయత్నించమని చెప్పిందని యామినితో అంటుంది రుద్రాణి. దాంతో మన రాజ్ రెచ్చిపోయి కావ్య మనసు గెలుచుకోవడానికి ప్రతిరోజూ ఇంటికొస్తున్నాడని చెబుతుంది.

రాజ్‌ని ఎలా ఆపాలో నేను ప్లాన్ కూడా చేసేశానని అంటుంది రుద్రాణి. రేపు రాజ్ ఇంటికి రావడానికి ముందే కావ్యకి ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉందని ఆఫీస్ నుంచి కాల్ వస్తుందని చెబుతుంది. తను ఉదయం వెళ్లి రాత్రికి గానీ తిరిగి రాదని అంటుంది రుద్రాణి. కావ్యకి మెయిన్ బ్రాంచ్ నుంచి కాకుండా సిటీకి దూరంగా ఉన్న ఇంకో బ్రాంచ్ నుంచి ఫోన్ వస్తుందని అక్కడికి రాజ్ కూడా వెళ్లలేడని చెబుతుంది. ఆ దెబ్బతో రాజ్ నీ దగ్గరికే పరిగెత్తుకుంటూ వస్తాడని అంటుంది. మీరు అలా చేస్తే మీ ఆస్తి మీకు దక్కేలా నేను చేస్తానని మాట ఇస్తుంది యామిని.

స్వప్న గురక దెబ్బకి రాహుల్‌కి నిద్రపట్టదు. ఆ వెంటనే తాళం తీసుకుని స్వప్న నగలు కొట్టేయబోతుండగా ఆమె రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటుంది. స్వప్న నిద్రలో నడిచొచ్చినట్లుగా వచ్చి రుద్రాణి అనుకుని రాహుల్‌ను కొడుతుంది. అప్పూ ఆఫీస్‌కి వెళ్తుండగా కళ్యాణ్ ముద్దు అడుగుతాడు. తమరు ముద్దులతో ఆగరు కదా అని అంటుంది అప్పూ. తర్వాత అందరికీ చెప్పి స్టేషన్‌కు వెళ్లబోతుండగా ధాన్యలక్ష్మీ ఆగమని మండిపడుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X