Brahmamudi May 16th Episode: దుగ్గిరాల వారసుడిని వెంటాడుతున్న రేఖ.. ఊరు వదిలేయాలని రాజ్ పేరెంట్స్ నిర్ణయం

Photo Courtesy: JioHotstar

చిన్నప్పుడు రేఖ ఆంటీకి భయపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయానని ఇందూకి చెబుతుంది నందూ. అయినా నువ్వు వాడిని ఎందుకు పెళ్లి చేసుకున్నావని నందూ అడగ్గా.. జరిగినదంతా చెబుతుంది ఇందూ. లోపలికి వెళ్లి నానమ్మతో మాట్లాడదామని ఇందూ తీసుకెళ్తుండగా.. నా చదువు త్వరలోనే పూర్తవుతుంది, ఆ లోపు ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని అంటుంది నందూ. నేను పోలీస్‌ని అయ్యాక నీకు కూడా సాయం చేస్తానని చెబుతుంది. చెల్లెలి మాటలతో ఏం చేయలేక మౌనంగా ఉంటుంది ఇందూ.

ఆంటోనీని తన తల్లి గురించి చెప్పమని అడుగుతాడు లక్కీ. దాంతో ఆంటోనీ జరిగినదంతా గుర్తుచేసుకుంటాడు. లక్కీగాడు రేఖకి పుట్టిన అక్రమ సంతానం కావడంతో కథ ఊహించని మలుపు తిరుగుతుంది. రేఖ ఫ్యామిలీ అంతా లాయర్‌ను కలిసి ఇందూ ఆస్తిని తమ పేరిటకి ట్రాన్స్‌ఫర్ చేయమని అడుగుతుంది. ఇందూ మ్యారేజ్ సర్టిఫికెట్, ఆమె వేలిముద్రలు, ఆమె భర్త సంతకం కావాలని అప్పుడే ఆస్తి మీ పేరు మీదకి వస్తుందని లాయర్ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. ఇంత ఆస్తి తనకు వస్తుందని తెలిస్తే రాజ్ గాడు సంతకం పెట్టడని వాడికి డబ్బులు ఆశ చూపించి సంతకం పెట్టించుకోవాలని రేఖ ప్లాన్ చేస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక మే 16వ తేదీ ఎపిసోడ్ 1034లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial May 16th 2026 Episode 1034 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

ఇందూని పెళ్లి చేసుకుని నన్ను మోసం చేశావు.. ఐశ్వర్యకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవడంతో తను ఇప్పుడు నాతో మాట్లాడటం మానేసిందని రాజ్‌పై మండిపడతాడు లక్కీ. తనను లైన్‌లో పెట్టి ఆ ఇంట్లో సెటిల్ అవుదామని అనుకుంటే.. నాకు బదులు నువ్వు ఇందూని పెళ్లి చేసుకుని ఆ ఇంట్లో సెటిల్ అయ్యావని ఫైర్ అవుతాడు. నాకు అవకాశం దొరికింది కాబట్టే ఇందూని పెళ్లి చేసుకుని ఆ ఇంట్లో సెటిల్ అయ్యాను.. టైం చూసుకుని నువ్వు కూడా ఆ ఇంట్లో అడుగుపెట్టేలా చేస్తానని రాజ్ చెబుతాడు.

ఆ ఇంట్లోకి వచ్చాక నువ్వు ఐశ్వర్యతో కలిసి తిరగడానికి నీకు టైం దొరుకుతుంది. ఆ టైంలో నువ్వు ఆమెను లవ్‌లో పడేస్తే ఆ ఇంట్లో నువ్వు కూడా సెటిల్ అవ్వొచ్చని చెబుతాడు రాజ్. ఆ మాటలతో లక్కీ సంతోషిస్తాడు. నేను ఇందూకి అద్దె మొగుడినని తెలిస్తే వీడి గుండె ఆగిపోతుందని అనుకుంటాడు రాజ్. ఇంతలో హాస్పిటల్ నుంచి రాజ్‌కి ఫోన్ వస్తుంది. బిల్ ఇంకా కట్టలేదు.. ఐసీయూలో ఉన్న పేషెంట్‌కి బిల్లు కట్టకపోతే ఎలా అని డాక్టర్ ఫైర్ అవుతాడు. మీరు వన్ వీక్‌లో బిల్ కట్టకపోతే నేను ట్రీట్‌మెంట్ ఆపేస్తానని డాక్టర్ చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు. దాంతో ఇందూని పేమెంట్ అడగాలని అనుకుంటాడు రాజ్.

ఇంటికొస్తూనే రేఖపై సీరియస్ అవుతుంది అపర్ణ. నువ్వు చేసే పనులకు పట్టరాని కోపం వస్తోంది, నీకు ఎదురుచెప్పే వాళ్లు లేరని అడ్డుఅదుపు లేకుండా పోయిందని మండిపడుతుంది అపర్ణ. ఇప్పటి వరకు కంపెనీలోని ఎంప్లాయిస్‌కి శాలరీ ఎందుకు వేయలేదని అడుగుతుంది అపర్ణ. ఆ విషయం నీకెలా తెలుసని సుభాష్ అడగ్గా.. ఇందాక దారిలో మన కంపెనీ ఎంప్లాయ్ ఒకరు కలిసి చెప్పారని అంటుంది అపర్ణ. ఇప్పుడు వేయకపోతే ఏంటీ? అసలెందుకు గొడవ చేస్తున్నావని రేఖ సీరియస్ అవుతుంది.

అసలు కంపెనీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? ఎంప్లాయిస్‌ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కదా? కంపెనీ మా చేతిలో ఉన్నప్పుడు ఏ రోజూ ఎంప్లాయిస్ విషయంలో అశ్రద్ధ చేయలేదు. అంతా టైంకి పర్ఫెక్ట్‌గా చేసేవాళ్లమని అపర్ణ చెబుతుంది. నువ్వు నీ స్వలాభం కోసం చేసే పనుల వల్ల దుగ్గిరాల ఇంటి పరువు పోయేలా ఉంది.. స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ గురించి అందరూ తప్పుగా మాట్లాడుకుంటున్నారు. మేం కష్టపడి సంపాదించుకున్న పేరు ప్రతిష్టలకు నువ్వు భంగం కలిగేలా చేస్తున్నావని సీరియస్ అవుతుంది.

మీకు ఒక్క నెల జీతం అనిపిస్తోంది.. కానీ ఒక్క నెల జీతం మీద ఆధారపడి ఎన్నో కుటుంబాలు బతుకుతున్నాయి, వాళ్ల ఆకల్ని కష్టాన్ని మనమే అర్ధం చేసుకోవాలి. మమ్మల్ని ఇబ్బంది పెట్టినట్లు ఎంప్లాయిస్‌ని ఇబ్బంది పెడితే మాత్రం చూస్తూ ఊరుకోమని సీరియస్ అవుతుంది అపర్ణ. ఈ నెల శాలరీ ఇవ్వలేదు.. ఆ డబ్బుని నేనే ఖర్చు పెట్టుకున్నానని చెబుతుంది రేఖ. నేనేం ఆ డబ్బును జల్సాలకు ఖర్చు పెట్టుకోలేదు.. నీ మనవరాలు కిడ్నాప్ అయినప్పుడు ఆ 20 లక్షల్ని ఆ రాజ్‌కిచ్చి దీనిని తీసుకొచ్చానని చెబుతుంది రేఖ. ఇన్నాళ్లూ కంపెనీ నుంచి వచ్చిన డబ్బుల్ని ఇవ్వకుండా కంపెనీ డబ్బుల్ని ఎందుకు ఇచ్చావని నిలదీస్తుంది అపర్ణ.

వాళ్ల డబ్బులు వాళ్లకు ట్రాన్స్‌ఫర్ చేయాలని అపర్ణ అడగ్గా.. కుదరదని తేల్చేస్తుంది రేఖ. ఎంప్లాయిస్ గురించి, కంపెనీ గురించి నీకెందుకు పెట్టింది తిని ఒక మూలన ఉండమని అపర్ణని నానామాటలు అంటుంది. ఎంప్లాయిస్‌కి ఆంటీ శాలరీలు ఇచ్చేస్తుందని అంటుంది కదా? గొడవలు వద్దని చెబుతుంది ఇందూ. మీరు మీ ఆవేశం తగ్గించుకుంటే మీకే కాదు.. మీ భర్తకి కూడా చాలా మంచిదని వార్నింగ్ ఇస్తుంది రేఖ. ఇదంతా విన్న రాజ్.. ఈ రేఖ పిన్ని ఎంప్లాయిస్ డబ్బులన్నీ నొక్కేసి నాకు ఇచ్చింది, నా డబ్బులు నాకొచ్చేశాయి... ఈరోజు ఇందూ దగ్గర నా పేమెంట్ వసూలు చేసుకోవాలని అనుకుంటాడు.

ఆ రేఖని మనం ఎదిరించలేకపోతున్నాం.. కంపెనీలో ఇంకెన్నీ తప్పులు జరుగుతున్నాయోనని బాధపడతాడు సుభాష్. ఇంతలో ఇందూ రావడంతో నువ్వు కంపెనీకి వెళ్లి అక్కడి తప్పులన్నీ సరిదిద్దుతావా? ఇలా భయపడుతూ ఇంకెన్నాళ్లు ఉంటావు. మీ అమ్మానాన్న ఎంప్లాయిస్ విషయంలో ఎంత పర్ఫెక్ట్‌గా ఉండేవారో తెలుసా? శాలరీ టైంకి రాకపోతే మిడిల్ క్లాస్ వాళ్ల జీవితాలు ఎలా ఉంటాయో నీకెం తెలుసు. మనల్ని నమ్ముకుని బతుకుతున్న వాళ్లకి అండగా ఉండాలి. నీ స్థానంలో మీ అమ్మ ఉంటే కంపెనీ బాధ్యతలు తీసుకునేది, ఆ రేఖని ఎదిరించేదని అంటుంది అపర్ణ. నువ్వు చెప్పినవన్నీ మా అమ్మ చేసేది.. కానీ నేను చేయలేనని అంటుంది ఇందూ. కంపెనీని పాతాళానికి తీసుకెళ్తావో? మనల్ని నమ్ముకున్న వాళ్లకి అన్యాయం చేస్తావో ఆలోచించుకోమని చెబుతుంది అపర్ణ.

రాజ్ గాడు ఇంకా ఇంటికి రాకపోవడంతో చలపతి - లక్ష్మీలు బాధపడతారు. వాడికి గతం తెలియక స్వేచ్ఛగా తిరిగేస్తున్నాడు. వాడి గురించి ఆ రేఖకి తెలిస్తే వాడి ప్రాణాలకే ప్రమాదం. ఆస్తి, కంపెనీ లాక్కున్న రేఖని నేను ఎలా ఎదిరించగలను అని చలపతి బాధపడతాడు. పిల్లల్ని తీసుకుని వేరే ఊరు వెళ్లిపోదామని చలపతితో అంటుంది లక్ష్మీ. నేను, చిన్నోడు ఇక్కడే ఉద్యోగం చేస్తున్నాం... ఈరోజుల్లో ఉద్యోగం వదిలేస్తే కొత్త ఉద్యోగం దొరకడం కష్టం. రేఖ దృష్టిలో నుంచి రాజ్‌ని కాపాడుకోవాలని అంటాడు చలపతి.

ఇందూని రెండు రోజుల పేమంట్ కింద 20000 ఇవ్వమని అడుగుతాడు రాజ్. అయితే చేతిలో 1000 రూపాయలు పెట్టడంతో రాజ్ షాక్ అవుతాడు. అన్ని కటింగ్స్ పోను నీకు ఇవ్వాల్సింది ఇంతేనని అంటుంది ఇందూ. నా కండీషన్స్ నువ్వు బ్రేక్ చేశావు కదా? అని తనను పట్టుకున్న సంగతి గుర్తుచేస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X