Brahmamudi May 17th Episode: అప్పూకి ధాన్యలక్ష్మీ టార్చర్.. రుద్రాణి ప్లాన్ పసిగట్టిన స్వప్న, కావ్యకి షాక్

కావ్యను ఎలా ఇంప్రెస్ చేయాలా అని ఆలోచిస్తున్న రాజ్‌కి అపర్ణ ఫోన్ చేస్తుంది. కావ్య మనసులో ఏముందో తెలుసుకోవడానికి ఓ బొకే లేదా గిఫ్ట్ తీసుకురమ్మని సలహా ఇస్తుంది. ఉద్యోగం ధ్యాసలో పడి కళ్యాణ్‌ను అప్పూ సరిగా పట్టించుకోవడం లేదని ప్రకాశంకు చెబుతుంది ధాన్యలక్ష్మీ. స్నానం చేసివచ్చిన అప్పూకి కళ్యాణ్ భోజనం తినిపించడంతో ఆమె కంటతడి పెడుతుంది. కావ్యకి ఇవ్వాల్సిన బోకేను ఆర్డర్ చేస్తున్న రాజ్ దగ్గరికి యామిని వచ్చి రేపు ఉదయం మనం పెళ్లిపత్రికలు పంచడానికి రిలేటివ్స్ ఇంటికి వెళ్లాలని చెబుతుంది.

తాను ఓ ముఖ్యమైన వ్యక్తిని కలవడానికి వెళ్తున్నానని రేపు నీతో రానని అంటాడు రాజ్. ఆ వెంటనే రుద్రాణికి ఫోన్ చేసి దుగ్గిరాల వారింట్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటుంది యామిని. రాజ్ వచ్చే సమయానికి నేను కావ్యని ఇంటి నుంచి దూరంగా పంపించేస్తానని, కావ్య-రాజ్‌ల పెళ్లి ఫోటోని చూపిస్తానని చెబుతుంది రుద్రాణి. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక మే 17వ తేదీ ఎపిసోడ్ 724లో ఏం జరిగిందంటే?

Brahmamudi Serial May 17th 2025 Episode 724 Here is Today s full story

ఆఫీస్‌కి వెళ్తున్న అప్పూని ఆగమన్న ధాన్యలక్ష్మీపై ఇందిర మండిపడుతుంది. నా కొడుకు అనుభవిస్తున్న బాధ ఎవ్వరికీ తెలియడం లేదని, నా కొడుక్కి న్యాయం కావాలి, వాడు సక్రమంగా కాపురం చేసి పిల్లలని కనాలని అంటుంది ధాన్యలక్ష్మీ. అదేమైనా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన పిజ్జానా? ఇంట్లో ఆర్డర్ చేస్తే గంటలో రావడానికి అని సెటైర్లు వేస్తాడు ప్రకాశం. ప్రతి దానికి సమయం, సందర్భం ఉంటుందని చెబుతాడు. మీ ముద్దుల కోడలు ఉద్యోగం పేరుతో అర్ధరాత్రుళ్లు పోలీసులు, దొంగలు అంటూ తిరుగుతోందని.. వీడేమో దానికోసం ఎదురుచూస్తూ పస్తులతో పడుకుంటున్నాడని బాధపడుతుంది ధాన్యలక్ష్మీ. ఇలాగైతే వీళ్లెప్పుడు కాపురం చేస్తారు? పిల్లలని ఎప్పుడు కంటారు? అని నిలదీస్తుంది.

పిల్లల విషయం మా ఇద్దరి పర్సనల్ అని కళ్యాణ్ అనగా.. నేను నీ తల్లిని నేను మాట్లాడేది నీ ఆనందం గురించేనని అంటుంది. ఇంతకీ నీకు ఏం కావాలని సుభాష్ ప్రశ్నించడంతో.. అప్పూ పోలీస్ ఉద్యోగం మానేయాలని అంటుంది ధాన్యలక్ష్మీ. ఆ మాటలతో ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు. ఈ ఇంటి కోడలిగా, ఒక హౌస్‌వైఫ్‌గా నా కొడుకు బాగోగులు చూసుకుంటూ ఇంట్లోనే ఉండాలని చెబుతుంది. అప్పూని పోలీసుని చేయాలని కళ్యాణ్ రాత్రిపగలు కష్టపడ్డాడని, వాడి కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరు అవ్వాలా అని మండిపడుతుంది ఇందిర. అసలు అప్పూ మనసులో ఏముందో తెలుసుకున్నావా అని అపర్ణ కూడా అడుగుతుంది. తను పోలీస్ కావడానికి ఎన్ని రాత్రుళ్లు కష్టపడిందో ఒక్కసారైనా ఆలోచించావా అని ప్రశ్నిస్తుంది. మన తరంలో ఆడవాళ్లంతా హౌస్‌వైఫ్‌లా ఉన్నారని ఇప్పటి పిల్లలని కూడా అలాగే ఉండమని చెప్పడం కరెక్ట్ కాదని అంటాడు సుభాష్.

కొడుకు సంతోషం కోసం కోడలి కలల్ని నాశనం చేయొద్దని సలహా ఇస్తాడు సుభాష్. అయినా ఇప్పుడు వాడికొచ్చిన లోటేముందని వాడి గురించి పట్టించుకోవడానికి ఇంతమందిమి ఉన్నాం కదా అని అంటాడు ప్రకాశం. ప్రతిదానికి డబ్బుతో ముడిపెట్టొద్దని కొంతమంది జీవితంలో ఏదో సాధించాలని కష్టపడతారని చెబుతాడు కళ్యాణ్. 25 ఏళ్లు వచ్చిన తర్వాత కూడా మేం ఏది చేయాలో మీరే చెబితే ఈ ప్రపంచంలో ఏ మార్పూ ఉండదని చెప్పడంతో ధాన్యలక్ష్మీ షాక్ అవుతుంది. ఇంట్లో అందరూ ఆవిడ గారికే సపోర్ట్ చేస్తున్నారని మండిపడుతుంది ధాన్యలక్ష్మీ. నా బాధ మీకు ఏదో రోజు అర్ధమవుతుందని చెబుతుంది. ఆడదాని మనసు తెలుసుకుని ప్రవర్తించే భర్త దొరకడం అప్పూ అదృష్టమని కళ్యాణ్‌ని మెచ్చుకుంటుంది అపర్ణ.

కావ్యను ఇంట్లో లేకుండా చేయడానికి శంషాబాద్ బ్రాంచ్‌‌కి పిలవాలని అక్కడి మేనేజర్‌కు ఫోన్ చేస్తుంది రుద్రాణి. నాకు భయంగా ఉందని, కావ్య మేడం ఇక్కడికి వచ్చాక ఆమెకు నిజం తెలిస్తే నా జాబ్ పోతుందని భయపడతాడు మేనేజర్. ఏదో ఒకటి చేసి మేనేజ్ చేయ్.. డబ్బులు ఎవ్వరికీ ఊరికే రావు కదా లక్ష రూపాయలంటే నీ మూడు నెలల జీతమని ఆశ పెడుతుంది రుద్రాణి. ఆమె చెప్పినట్లుగానే కావ్యకు ఫోన్ చేసి మీరు అర్జెంట్‌గా ఆఫీస్‌కు రావాలని, రా మెటీరియల్ రాలేదని ప్రొడక్షన్ ఆగిపోయిందని చెబుతాడు. నేను సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్‌కు ఫోన్ చేస్తానని కావ్య చెప్పగా.. అతను ఏదేదో చెప్పి ఇంకా భయపెడతాడు. రాజ్ వచ్చినప్పుడు నాకు ఇంట్లో ఉండాలని లేదని ఇదే కారణం చెప్పి బయటికి వెళ్తానని అనుకుంటుంది కావ్య.

తాను అర్జెంట్‌గా ఆఫీస్‌కు వెళ్లాల్సి ఉందని అపర్ణకి చెబుతుంది కావ్య. ఇవాళ అబ్బాయి వస్తున్నాడని చెప్పాం కదా అని ఇందిర చెప్పడంతో.. తాను ఆఫీస్‌కి వెళ్లకపోతే పనులన్నీ ఆగిపోతాయని అంటుంది కావ్య. నా కొడుకు కంటే నీకు ఆఫీస్ ఎక్కువైందా అని అపర్ణ మండిపడగా .. తన ప్లాన్ చెడిపోతుందని భయపడ్డ రుద్రాణి జోక్యం చేసుకుంటుంది. రాజ్ వస్తున్నాడని తెలిసి కూడా తను వెళ్తానని చెప్పిందంటే ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చిందో అర్ధం చేసుకోమ్మని అంటుంది. సడెన్‌గా నువ్వు కావ్యపై ఇంత ప్రేమ చూపిస్తున్నావని నిలదీస్తుంది ఇందిర. నా బాధంతా కంపెనీ గురించేనని రుద్రాణి చెప్పగా నువ్వేం టెన్షన్ పడొద్దని ప్రకాశం సెటైర్లు వేస్తాడు. మేనేజర్ కిషోర్ మాకు ఫోన్ చేశాడని రా మెటీరియల్ కూడా వెళ్లిపోయిందని నువ్వేం కంగారు పడొద్దని చెబుతాడు సుభాష్. దాంతో తన ప్లాన్ ఫెయిల్ అయ్యిందని రుద్రాణి బాధపడుతుంది.

కావ్యని ఇంట్లో నుంచి పంపించేశారా? అని రుద్రాణికి యామిని ఫోన్ చేస్తుంది. నా ప్లాన్‌ని మా అన్నయ్యలు అడ్డుకున్నారని, ఇంకో ప్లాన్ వేస్తానని చెబుతుంది. రాజ్ ఇంటికి రాగానే ఏదో ఒక సమయం చూసి కావ్య పెళ్లి బట్టల్లో ఉన్న ఫోటోని తనకి చూపిస్తానని అంటుంది. ఇన్ని రోజులు ఒక పెళ్లయిన అమ్మాయితో తిరిగినందుకు బాధపడి కావ్యను చూసి అసహ్యించుకుంటాడని చెబుతుంది. ఈ మాటలన్నీ స్వప్న వింటుంది. ఇంతలో రాజ్ రావడంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా పలకరిస్తుంది. మళ్లీ ఎందుకొచ్చారని రాజ్‌ని ప్రశ్నిస్తుంది కావ్య. నేను మళ్లీ మళ్లీ వస్తానని ముందే చెప్పాను కదా దానికి ఇంట్లో వాళ్లంతా పర్మిషన్ కూడా ఇచ్చేశారని అంటాడు రాజ్. మీరు రావడం నాకిష్టం లేదని, మర్యాదగా వెళ్లిపోమ్మని అంటుంది కావ్య. రుద్రాణి గురించి మాట్లాడుతూ ఆమెపై రాజ్ సెటైర్లు వేయడంతో అంతా నవ్వుకుంటారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X