Brahmamudi May 18th Episode: రాజ్‌ని రెచ్చగొడుతోన్న ఇందూ అందం... ఆస్తిపై రాజ్ ప్లాన్‌ పసిగట్టిన రేఖ

Photo Courtesy: JioHotstar

ఇందూని పెళ్లి చేసుకున్నావు.. ఐశ్వర్యకి ఇవ్వాల్సిన డబ్బుల్ని ఇవ్వకుండా ఆమెను నాకు దూరం చేశావని రాజ్‌పై మండిపడతాడు లక్కీ. నిన్ను కూడా ఆ ఇంటికి వచ్చేలా చేస్తాను.. అప్పుడు ఐశ్వర్యకి ఇంకా దగ్గరగా ఉండి ఆమెను పెళ్లి చేసుకోవచ్చని అంటాడు రాజ్. ఆ మాటలకు లక్కీ సంబరపడిపోతాడు. ఉద్యోగులకు జీతం ఇవ్వకపోవడంపై రేఖపై మండిపడుతుంది అపర్ణ. ఆ డబ్బుతో నేను జల్సాలు చేయలేదు. నీ మనవరాలిని విడిపించడానికి కిడ్నాపర్లకు ఇచ్చానని అంటుంది. నా జోలికి వస్తే ఏం జరుగుతుందో తెలిసి కూడా రెచ్చిపోతున్నావని వార్నింగ్ ఇవ్వడంతో అపర్ణని ఇందూ కూల్ చేస్తుంది.

కంపెనీలో ఆ రేఖ ఇంకా ఎలాంటి తప్పులు చేస్తుందోనని సుభాష్‌ దగ్గర బాధపడుతుంది అపర్ణ. ఇంతలో ఇందూ రావడంతో నీ స్థానంలో మీ అమ్మ ఉండి ఉంటే ఆ రేఖని ఎదిరించేది, మనవాళ్లకు అండగా నిలిచేదని క్లాస్ పీకుతుంది అపర్ణ. రాజ్‌కి డాక్టర్ ఫోన్ చేసి నా డబ్బులు నాకు ఇవ్వకపోతే ట్రీట్‌మెంట్ ఆపేస్తానని వార్నింగ్ ఇస్తాడు. దాంతో తన పేమెంట్ గురించి ఇందూని అడగ్గా.. ఆమె 1000 రూపాయలు చేతిలో పెడుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక మే 18వ తేదీ ఎపిసోడ్ 1035లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial May 18th 2026 Episode 1035 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

తనకు రావాల్సిన డబ్బుల్ని ఇందూ కట్ చేయడంతో రాజ్ గొడవ పడతాడు. చివరికి మిగిలిన 5 వేల రూపాయలైనా ఇవ్వమని రాజ్ అడగ్గా.. నిన్న సాయంత్రం నేను వంట చేసుకుంటుంటే నువ్వేం చేశావో గుర్తుచేసుకోమని చెబుతుంది ఇందూ. ఆమె వంట చేసుకుంటుండగా.. ఇందూ నడుం చూస్తాడు రాజ్. అది చూసిన ఇందూ చీరను సరిచేసుకుంటుంది. అయితే రాజ్ మాత్రం ఇక్కడ సరిగా కనిపించడం లేదని పక్కకి వెళ్లి ఇందూ నడుం చూస్తాడు. అలా నువ్వు కండీషన్స్ అన్నీ బ్రేక్ చేశావు కాబట్టి నీ శాలరీలో 19 వేలు కట్ మిగిలిన 1000 రూపాయలు ఇచ్చానని చెబుతుంది ఇందూ. ఇదంతా మోసం.. నాకు ఇవ్వాల్సిన డబ్బుల్ని ఇలా కట్ చేసుకుంటూ వస్తే నాకేం మిగులుతుందని ఫైర్ అవుతాడు రాజ్.

ఇక నుంచి డైలీ పేమెంట్ ఇవ్వడం కుదరదు, వీక్లీ పేమెంట్ ఇస్తానని చెబుతుంది ఇందూ. నాకు ఏ రోజు పేమెంట్ ఆ రోజే కావాలని చెబుతాడు రాజ్. డైలీ పేమెంట్‌కి ఒప్పుకోకపోతే నేనేం ఊరుకోనని చెబుతాడు రాజ్. ఇక్కడ రూల్స్ పెట్టేది నేనే, వాటిని మార్చేది నేనే అని అంటుంది ఇందూ. అయితే నేను ఉండను, వెళ్లిపోతానని రాజ్ బెదిరించగా వెళ్లిపోమని చెబుతుంది ఇందూ. బయటికి వెళ్తే ఎక్కడా డబ్బులు దొరకడం లేదు.. ఎలాగైనా చేయాల్సిందేనని అంటాడు రాజ్. వీక్లీ పేమెంట్ అయినా కరెక్ట్‌గా ఇస్తావా అని రాజ్ అడగ్గా.. నువ్వు వెళ్లిపోవని నాకు తెలుసని అంటుంది ఇందూ. రాజ్‌ని ఎలాగైనా భోజనానికి తీసుకెళ్దామని చెప్పి లాక్కెళ్తుంది ఇందూ.

రాజ్ గాడు ఏ ఉద్దేశంతో ఇందూని పెళ్లి చేసుకున్నాడో తెలుసుకోవాలని రేఖ అనుకుంటుంది. ఇంతలో స్వాతి వచ్చి ఒక ప్లేటులో భోజనం పెట్టుకుంటుంది. ఇక్కడే తినమని రేఖ చెప్పగా. బావ రూమ్‌లోనే తింటానని చెప్పాడని స్వాతి అనడంతో నీ కొడుకంటే నా కూతురికి ఎంత ఇష్టమో చూశావా అని అంటుంది భ్రమరాంబ. వాడు అలా భోజనం తీసుకురమ్మని చెప్పడంతో ఇది తీసుకెళ్తోందని చెబుతుంది. ఇద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు.. వాడు అడిగితే అన్నం తెచ్చి పెట్టడంలో తప్పేముందని అంటుంది రేఖ.

ఇంతలో రాజ్, ఇందూలు రావడంతో ఇంతసేపు మీ కోసం వెయిట్ చేయాలా అని మండిపడుతుంది రేఖ. అక్కడా ఇక్కడా అన్ని చోట్లా వంటల సెక్షన్ నీదేనా అని అడగటంతో ఇందూ షాక్ అవుతుంది. నేను కిడ్నాప్ చేసినప్పుడు ఇందూ చక్కగా వంట చేసి పెట్టింది. తన వంట టేస్ట్‌కి కూడా నేను పడిపోయానని చెబుతాడు రాజ్. ఇందూ సీరియస్ అవ్వడంతో రాజ్ సైలెంట్ అయిపోతాడు. రాజ్ నుంచి నిజం తెలుసుకోవాలని అనుకున్న రేఖ.. ఇందూని అక్కడి నుంచి తప్పించడానికి తన గదిలో ఉన్న ఫోన్ తీసుకురమ్మని చెబుతుంది.

నాకు నీ పెళ్లి గురించి చిన్న డౌట్ ఉంది.. దానిని క్లారిఫై చేస్తావా అని రేఖ అడుగుతుంది. ఆల్రెడీ క్లారిఫై చేశాను కదా మళ్లీ డౌట్ ఏంటీ అని ప్రశ్నిస్తాడు రాజ్. నువ్వు ఇందూని ఎందుకు పెళ్లి చేసుకున్నావని రేఖ అడగ్గా... పెళ్లి కోసమే అంటాడు రాజ్. నువ్వు పెళ్లి చేసుకోవాలని అనుకుంటే ఇందూ కంటే అందమైన వాళ్లు, చదువుకున్న వాళ్లు బయట చాలామంది ఉన్నారు. వాళ్లని చేసుకోకుండా ఇందూనే ఎందుకు పెళ్లి చేసుకున్నావని ప్రశ్నిస్తాడు భూషణ్. ఇందూకి ఏం తక్కువ.. అచ్చ తెలుగు అమ్మాయిలా ఉంటుంది. నా తిప్పలేవో పడి తనని ప్రేమించుకున్నానని చెబుతాడు రాజ్.

ఆ ప్రేమ ఇప్పుడు కూడా ఉందా? ఇంతకీ నువ్వేం చేస్తావని రేఖ అడగ్గా.. గాలికి తిరుగుతుంటానని చెబుతాడు రాజ్. నా ముఖం జాబ్ చేసేవాడిలా కనిపిస్తోందా? జాబ్ అనే పదం వింటేనే నాకు కాలుతుంది. టైంకి ఆఫీస్‌కి వెళ్లి చాలీ చాలని జీతంతో బతకడం నాకు ఇష్టం లేదు, ఇకపై చేయను కూడా అని చెబుతాడు రాజ్. మరేం చేస్తావు? ఏం చేయాలని అనుకుంటున్నావని అడుగుతుంది రేఖ. బిజినెస్‌మెన్ అవ్వాలని అనుకుంటున్నానని రాజ్ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. చిన్నప్పటి నుంచి నా లక్ష్యం, నా కల, ఆశయం ఇదే.. స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఇండస్ట్రీయలిస్ట్ అవుతానని అంటాడు రాజ్. అదెలా సాధ్యమని శేషం అడగ్గా.. ఇందూని పెళ్లి చేసుకున్నాను కదా అని రాజ్ చెప్పడంతో అంతా షాక్ అవుతారు.

నీ పెళ్లికి, నువ్వు ఇండస్ట్రియలిస్ట్ కావడానికి సంబంధం ఏంటని భ్రమరాంబ అడగ్గా.. ఈ ఆస్తికి, స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కి వారసురాలు ఇందూనే కదా? త్వరలోనే తన భర్తగా ఆ బాధ్యతలన్నీ నేనే తీసుకుంటాను. కంపెనీని నా భుజాల మీద మోస్తూ ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తుకు తీసుకెళ్తానని రాజ్ చెప్పడంతో రేఖ షాక్ అవుతుంది. డబ్బు కోసమే ఇందూని పెళ్లి చేసుకున్నావా అని రేఖ అడుగుతుంది. మళ్లీ మళ్లీ ఇదే ప్రశ్న అడిగి విసిగించొద్దని రాజ్ కోప్పడతాడు.

కంపెనీని భుజాల మీద నడిపిస్తానని చెబుతున్నా వాడు.. మనం అడిగితే ఆస్తి పేపర్ల మీద సంతకం ఎలా పెడతాడని అడుగుతుంది భ్రమరాంబ. ఖచ్చితంగా పెడతాడు.. వాడు ఇందూని కేవలం డబ్బుల కోసమే పెళ్లి చేసుకున్నాడు. వాడికి డబ్బులు అవసరం అయ్యేలా మనమే క్రియేట్ చేద్దాం.. ఏదో ఒకటి చేసి వాడితో సంతకం పెట్టించి ఆస్తి మన సొంతం చేసుకుందామని అంటుంది రేఖ. డబ్బు కోసం ఐశ్వర్యతో రాకేష్ గొడవ పడుతుండగా ఇందూ చూసి ఏం జరిగిందని అడుగుతుంది. ఎవరతను? ఏం జరిగిందని ఇందూ అడుగుతుంది. నేను ఐశ్వర్యకి 10 లక్షలు ఇచ్చాను.. నా బాకీని వసూలు చేసుకుంటున్నానని రాకేష్ చెప్పడంతో ఇందూ షాక్ అవుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X