Brahmamudi May 18th episode: కావ్య కిడ్నాప్ విషయం భర్తకు.. రాజ్ రియాక్షన్ ఏమిటంటే?
కంపెనీకి వెళ్లనని తనకు నచ్చిన పని మాత్రమే చేస్తానని మొండికేస్తాడు కళ్యాణ్. సుభాష్ ఇచ్చిన డీటెయిల్స్ తీసుకొని మాయని వెతకటానికి బయలుదేరుతుంది కావ్య. కళ్యాణ్ తనకి నచ్చినట్లుగా ఉండటం లేదని పంచాయతీ పెడుతుంది అనామిక. మాయని వెతుకుతున్న కావ్య ని రౌడీలు కిడ్నాప్ చేస్తారు.ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక మే 18వ తేదీ ఎపిసోడ్ 413 లో ఏం జరిగిందంటే..
ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేశావు బావ అని అప్పు అడగగా అదే స్విచ్ ఆఫ్ అయిపోయింది అని రాజ్ ధీమాగా చెప్తాడు. అప్పుడు అక్క కిడ్నాప్ అయింది అని అప్పు అనేసరికి ఒకేసారి షాక్ అవుతాడు రాజ్. మాయ కోసం అక్కడికి వెళ్తే మల్కాజ్గిరి పాతబస్తీ దగ్గర ఎవరో నలుగురు వచ్చి కిడ్నాప్ చేశారు అంటుంది అప్పు. మీ అక్కకి అస్సలు బుద్ధి లేదా? అని రాజ్ తిట్టబోతుండగా, ముందు అక్కని కనిపెట్టిన తర్వాత తిడుదువులే బావ. నా దగ్గర కార్ నెంబర్ ప్లేట్ ఫోటో ఉంది.

నీ ఇన్ఫ్లుయెన్స్తో అక్కని కనిపెట్టు అని అనగా ఇద్దరూ కార్ ఎక్కుతారు. మరోవైపు కావ్యతో పాటు చాలామంది అమ్మాయిలు కిడ్నాప్ అయి ఉంటారు. వాళ్లందరూ ఏడుస్తూ ఉండగా ఎందుకు ఏడుస్తున్నారు అని కావ్య అడుగుతుంది. ఇక్కడ కిడ్నాప్ అయిన అమ్మాయిలందరినీ దుబాయ్ పంపించేస్తారు. తర్వాత వాళ్ల డెడ్ బాడీ సే తిరిగి వస్తాయి అని వాళ్ళందరూ భయపడుతూ ఏడుస్తారు. ఆ మాటలు విని కావ్య, మన మధ్యనే ఉంటూ ఇంత కథ నడిపిస్తున్నారా వీళ్ళు అని అంటూ భయపడొద్దని వాళ్ళకి ధైర్యం చెబుతుంది.
మరోవైపు రాజ్ పోలీసులకు విషయం అంతా చెప్పి కార్ నెంబర్ ప్లేట్ ఫోటోను పెడతాడు. పోలీసులు కార్ ని ట్రాక్ చేసి ఇది పాత బస్తి దగ్గర ఉంది. వీళ్లు అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి దుబాయ్ పంపించేస్తారు. ఆరు నెలల నుంచి పట్టుకోవాలనుకుంటున్నాము మీ వల్ల మాకు ఈ ఛాన్స్ దొరికింది ఎలాగైనా పట్టుకుంటాము అని అంటారు. ఆరు నెలల నుంచి పట్టుకోలేని వారు ఇప్పుడేం పట్టుకుంటారు బావ మనం కూడా వెతుకుదాము అని అప్పు అనగా, ఎక్కడలేని సమస్యలు అన్నీ నా నెత్తిన తెచ్చి పెడతాది మీ అక్క అని కోప్పడుతూ ఉండగా , అంత ప్రేమ ఉన్నవాడివి ఎందుకు అంత కోపం చూపిస్తావు బావ అని అంటుంది అప్పు.

మరోవైపు కిడ్నాపర్స్ అరగంటలో వ్యాన్ వస్తుంది గంటలో చెక్పోస్ట్ దాటించేస్తాము అని మాట్లాడుకోవడం కావ్య వాళ్ళు వింటారు. వెంటనే కావ్య అక్కడ ఉన్న అమ్మాయిలకు ఒక ప్లాన్ చెప్తుంది. ఒక కిడ్నాపర్ వాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. కావ్య సైగ చేయడంతో ఒక అమ్మాయి వెళ్లి అన్నా నన్ను వదిలేయండి అని ఏడుస్తుంది. తను చూసి మిగిలిన వాళ్ళందరూ వాళ్ళని వదిలేయమని బతిమిలాడుతూ ఉండగా వెనకనుంచి ఆ కిడ్నాపర్ ఫోన్ ని కావ్య తీసుకుని రాజ్ కు లోకేషన్ పెడుతుంది.
ఆ లొకేషన్ చూసిన అప్పు, రాజ్ లు వెంటనే అటువైపు బయలుదేరుతారు. ఇంతలో తన ఫోన్ నుంచి మెసేజ్ వెళ్లడం చూసిన కిడ్నాపర్ కావ్య ని తిట్టి, మిగిలిన కిడ్నాపర్స్ కి విషయం అంతా చెప్పి అలర్ట్ చేస్తాడు. మా ఆయన వస్తాడు మీ అంతు చూస్తాడు. అరగంటలో ఏం చేయాలో చేసుకోండి అని వార్నింగ్ ఇస్తుంది కావ్య. కిడ్నాపర్స్ అమ్మాయిల చేతులను కట్టేసి నోటిమీద టేప్ అంటించేస్తారు. ఇంతలో ఆ లొకేషన్ ని వెతుక్కుంటూ రాజ్, అప్పులు అక్కడికి వస్తారు.

వీళ్ళకే లోకేషన్ పంపి ఉంటుంది అని గ్రహించిన కిడ్నాపర్లు మీకేం కావాలి అని ఏమీ తెలియనట్టు అడుగుతారు. ఊరికే చూడడానికి వచ్చాము అంటూ గార్డెన్ ఏరియా అంతా గమనిస్తాడు రాజ్. ఇలా లోపలికి వచ్చేస్తే ఎలాగా ఇది ప్రైవేట్ ప్రాపర్టీ అని కిడ్నాపర్ అనడంతో కొంచెంసేపు అటు ఇటు తిరిగిన రాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చూసావా నీ మొగుడు వచ్చి కాపాడతాడు అన్నావు వెళ్లిపోయాడు అని లోపల ఉన్న కిడ్నాపర్ కావ్యకు చెప్తాడు.
రాజ్ వెళ్లిపోయిన కొద్దిసేపటికే వెహికల్ వచ్చిందని కావ్య తో పాటు మిగిలిన అమ్మాయిల్ని కూడా బలవంతంగా వ్యాన్ ఎక్కిస్తారు. ఫార్మ్హౌస్ దాటిన వెంటనే రాజ్, అప్పులు వెహికల్ కి అడ్డంగా నించుంటారు. వాళ్లను చూసిన కిడ్నాపర్స్ వాన్ వెనక్కి తిప్పేలోగా పోలీస్లు అందరూ అక్కడికి వచ్చి ఆ ముఠాని అరెస్టు చేస్తారు. కావ్య రాజ్ ని చూసి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి హత్తుకుంటుంది. ఇంతలో థాంక్యూ సర్ చాలా నెలల నుంచి తప్పించుకుంటున్న వీళ్ళని మీ వల్లే పట్టుకోగలిగాము అంటారు పోలీసులు.
నేనే మా ఆయనకి లోకేషన్ పెట్టాను అందుకే దొరికారు అని అనగా చేశావులే గొప్ప పని అని అంటాడు రాజ్. పోలీసులు వెళ్లిపోయిన తర్వాత, అయినా ఇటువైపు వస్తామని మీకు ఎలా తెలుసు అని అడుగుతుంది కావ్య. అప్పుడు జేబులో ఉన్న చెవి రింగును చూపిస్తూ ఇందాక గార్డెన్ లో నడుస్తున్నప్పుడు తన కాళ్ళ దగ్గర అది కనిపించిన విషయం చెప్తాడు రాజ్. నువ్వు సూపర్ బావ అని అంటుంది అప్పు. తర్వాత ముగ్గురు కారులో తిరిగి వెళ్ళిపోతారు.
తరువాయి భాగంలో, ఏ తల్లి అయినా బిడ్డను ఒకరికి అప్పజెప్పి చేతులు దులుపుపోదు. నిజంగా తనకు అన్యాయం జరిగితే న్యాయం కోసం ఇంటికి వస్తుంది. బిడ్డ భవిష్యత్తుకి న్యాయం చేయమని అర్థిస్తుంది కానీ మాయ ఏదో మాయ చేస్తుంది అంటుంది కావ్య. ఈ విషయం కాస్త అటు ఇటు అయినా మొత్తం గందరగోళం అయిపోతుంది. చేసిన ఘనకార్యం చాలు ఇకనుంచి అయినా ప్రయత్నాలు అంటాడు రాజ్.


Click it and Unblock the Notifications











