Brahmamudi May 19th Episode: చెఫ్‌గా రాజ్.. బాత్‌రూమ్‌లోకి దుగ్గిరాల ఫ్యామిలీ, రుద్రాణి ప్లాన్ తిప్పికొట్టిన స
యామినికి చెప్పినట్లుగా కావ్యను ఇంట్లో లేకుండా చేసే ప్లాన్ అమలు చేస్తుంది రుద్రాణి. మేనేజర్‌కు ఫోన్ చేసి అర్జెంట్‌గా రాకపోతే ప్రొడక్షన్ ఆగిపోతుందని శంషాబాద్ బ్రాంచ్‌కి రమ్మని చెప్పాలని డబ్బులు ఆశ పెడుతుంది. పోలీస్ స్టేషన్‌కు వెళ్తున్న అప్పూని నువ్వు వెంటనే ఉద్యోగం మానేయాలని చెబుతుంది ధాన్యలక్ష్మీ. దాంతో అపర్ణ, ఇందిర, సుభాష్, ప్రకాశంలు ధాన్యలక్ష్మీకి చీవాట్లు పెట్టి అప్పూకి అండగా నిలుస్తారు.
రుద్రాణి చెప్పినట్లుగానే మేనేజర్ ఫోన్ చేసి అర్జెంట్‌గా శంషాబాద్ రావాలని చెప్పడంతో కావ్య హడావుడిగా బయల్దేరుతుంది. నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదని ఆ సమస్యను మేం సాల్వ్ చేశామని ప్రకాశం, సుభాష్‌లు చేయడంతో రుద్రాణి షాక్ అవుతుంది. వెంటనే యామినికి ఫోన్ చేసి మన ప్లాన్ ఫెయిలై కావ్య ఇంట్లోనే ఉండిపోయిందని, కానీ కావ్య-రాజ్‌ల పెళ్లి ఫోటోని చూపించి రాజ్ మనసుని ముక్కలు చేస్తానని చెబుతుంది. దీనిని దొంగచాటుగా విన్న స్వప్న.. రుద్రాణికి కౌంటర్ ఇవ్వాలని అనుకుంటుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక మే 19వ తేదీ ఎపిసోడ్ 725లో ఏం జరిగిందంటే?

ఇంటికొచ్చిన తనను కావ్య నానా మాటలు అనడంతో రాజ్ బాగా హర్ట్ అవుతాడు. వీరిద్దరి గొడవలో జోక్యం చేసుకున్న ఇందిర.. కావ్య పద్దతి మార్చుకుంటుందని నువ్వేం బాధపడొద్దని అంటుంది. దాంతో అప్పుడే మీరు పార్టీ మార్చేశారా? అని ఇందిరను అడుగుతుంది. నేను పార్టీ ఎప్పుడో మార్చేశానని నా మనవడితో పద్ధతిగా నడుచుకోమని అంటుంది ఇందిర. కళావతి గారు ఎలా మాట్లాడతారో నేను ప్రోగ్రెస్ కార్డ్ ప్రిపేర్ చేస్తానని దీనిని బట్టి నేను మార్క్స్ వేస్తానని అంటుంది కావ్య. రూల్స్ పెట్టడానికి పెద్ద దత్తపుత్రుడు వచ్చాడని, నేను ఎవరి కోసం నా పద్ధతి మార్చుకోనని అంటుంది కావ్య. ప్రేమ పంచుతారనుకుంటే ఇలా అవమానిస్తారా? నేను వెళ్లిపోతానంటూ రాజ్ వెళ్లిపోతుండగా అపర్ణ ఆపుతుంది.
టిఫిన్ చేద్దువుగాని రా అని అపర్ణ తీసుకెళ్తుండగా అసలు టిఫిన్ ఉంటేనే కదా చేయడానికి అని కావ్య షాకిస్తుంది. ఇప్పటి వరకు టిఫిన్ ఎందుకు ప్రిపేర్ చేయలేదని అపర్ణ అడగ్గా.. నాకు ఇష్టం లేదు, నేనే చేయలేదని తేల్చిచెబుతుంది కావ్య. నువ్వు చేయకపోతే ఏంటీ నేను చేస్తానని అంటాడు రాజ్. ఆ మాటలతో అంతా షాక్ అవుతారు. నేను ప్యూర్ హజ్బెండ్ మెటీరియల్ అని, ఇలా పరిచయం అవ్వగానే అలా నచ్చేస్తానని చెబుతాడు. మీరు దోశలు వేస్తే మీరు గ్రేట్ అని నేను కూడా ఒప్పుకుంటానని అంటుంది కావ్య.
వంట గదిలోకి వెళ్లి ఏమేం ఎక్కడ ఉన్నాయో? దోశలు ఎలా చేయాలో చెప్పమని అపర్ణ, ఇందిరను అడుగుతాడు రాజ్. అనుకున్నా దోశలు వేయడం నువ్వెప్పుడు నేర్చుకున్నావా అని నాకే ఆశ్చర్యం వేసిందని అపర్ణ చెప్పడంతో .. నాకు దోశలు వేయడం రాదని నీకెలా తెలుసని ప్రశ్నిస్తాడు. ఈ కాలం కుర్రాళ్లకు రాదు కదా అని అపర్ణ తప్పించుకుంటుంది. మీరేం చేస్తారో నాకు తెలియదు, దోశలు వేయడం మీరే నేర్పించాలని అంటాడు రాజ్. మేం దోశలు వేస్తాం కానీ నువ్వే వేసినట్లు కలరింగ్ ఇచ్చేయ్ అని ఇందిర చెబుతుంది. లవ్‌లో, లైఫ్‌లో చీటింగ్ ఉండకూడదని అంటాడు రాజ్. నువ్వు దోశలు వేసినట్లే, అది ఇంప్రెస్ అయినట్లేనని అపర్ణ సెటైర్లు వేస్తుంది. అడ్డదిడ్డంగా దోశలు వేస్తున్న రాజ్‌ను చూసి ముందు నేనొక దోశ వేసి చూపిస్తాను.. దానిని ఫాలో అవ్వమని చెబుతుంది అపర్ణ.
కష్టపడి దోశలు వేసిన రాజ్.. టమోటా కెచప్‌తో చట్నీ చేస్తాడు. అది చూసిన అపర్ణ, ఇందిరలు ఈరోజు మన పని అయిపోయినట్లేనని అంటారు. టిఫిన్ కోసం అందరూ డైనింగ్ టేబుల్ మీద కూర్చోవడంతో రాజ్ దోశలు, టమోటా కెచప్ చట్నీ తీసుకొస్తాడు. అది వింతగా అనిపించడంతో నాకు ఆకలిగా లేదని కళ్యాణ్ వెళ్లిపోతానని చెప్పడంతో రాజ్ వార్నింగ్ ఇస్తాడు. టిఫిన్ తినబోతుండగా నా బ్యాంక్ అకౌంట్ డిటెయిల్స్, లాకర్ వివరాలు బీరువాలో ఉన్నాయని చెబుతాడు సుభాష్. అందరూ దోశని నోట్లో పెట్టుకోగానే ముఖాలు మారిపోతాయి. ఈ టిఫిన్ తింటే ఇక్కడి నుంచి బాత్రూమ్‌కి, అక్కడి నుంచి హాస్పిటల్‌కి వెళ్లాల్సి వస్తుందని కావ్య చెబుతుంది.
నేను చేసిన టిఫిన్ బాలేదా అని రాజ్ అడగ్గా.. వాళ్ల ముఖాలు చూశాక కూడా మీకు అర్ధం కావడం లేదా అని అంటుంది. ఆముదం తాగినప్పుడు కూడా ఇలాంటి ఫేస్ పెట్టరని కావ్య చెబుతుంది. అందరికీ నచ్చిందని నీకు కుళ్లు అని అంటాడు. మీరు చేసిన చెట్నీతో, మీరు వేసిన దోశని పూర్తిగా తిన్నారంటే బావుందని మేమంతా ఒప్పుకుంటామని చెప్పి ప్లేట్‌లో వేసిస్తుంది. దోశ నోట్లో పెట్టుకోగానే రాజ్ ముఖం మారిపోతుంది. ఆ వెంటనే ఒక్కొక్కరు మాకు ఈ టిఫిన్ వద్దంటూ పారిపోతారు.
కావ్య- రాజ్‌ల పెళ్లి ఫోటోను బయటికి తీసిన రుద్రాణి.. ఆ ఫోటో చూస్తూ ఈరోజుతో నువ్వు ఆడుతున్న డ్రామాలన్నీ బయటపెడతానని, రాజ్ నిన్ను అసహ్యించుకునేలా చేస్తానని అనుకుంటుంది. వెంటనే ఫోటోని రెండు ముక్కలుగా కట్ చేసి కావ్య ఫోటోని మాత్రమే బెడ్ మీద కనిపించేలా పెడుతుంది. వంట చేసి అలిసిపోయిన రాజ్.. సోఫాలో అపసోపాలు పడుతుండగా అతని వద్దకి వెళ్తారు అపర్ణ, ఇందిర. నువ్వు వేసిన దోశలు కళావతి రిజెక్ట్ చేసిందని బాధపడుతున్నావా? అని అడుగుతుంది ఇందిర. వంట గదిలో కష్టపడినందుకు అలిసిపోయావా? అని అడుగుతుంది అపర్ణ. నువ్వు వంట చేసి నువ్వే తినలేకపోయానని బాధపడుతున్నావా అని అంటుంది ఇందిర. అవేవీ కాదని వేడిగా ఉందని చిరాకు పడుతున్నానని మండిపడతాడు రాజ్.
ఇంతలో రుద్రాణి వెళ్లి.. నిన్ను బాగా అర్ధం చేసుకున్నాను కాబట్టే, నా రూమ్‌లో నీ కోసం ఏసీ వేసి గది మొత్తం కూల్‌గా ఉండేలా చేశానని చెబుతుంది. ఆ మాటలతో రాజ్ సంతోషిస్తాడు. రుద్రాణికి థ్యాంక్స్ చెప్పి ఆ గదిలోకి వెళ్లబోతుండగా అపర్ణ, ఇందిరలు ఆపేస్తారు. ఐదు నిమిషాలు రెస్ట్ తీసుకుంటే ఏం కాదులే అని చెబుతుంది రుద్రాణి. నీరసించి నిరుత్సాహపడితే కావ్యని ఇంప్రెస్ చేయలేవని అపర్ణ చెప్పగా.. కాసేపు రెస్ట్ తీసుకొచ్చి తర్వాత యుద్ధం మొదలుపెడతానని అంటాడు రాజ్. అపర్ణ, ఇందిరలు చెబుతున్నా వినిపించుకోకుండా రుద్రాణి రూమ్‌లోకి వెళ్తాడు రాజ్. బెడ్ మీద పెట్టిన ఫోటోను చూసి రాజ్ షాక్ అవుతాడు. తన ప్లాన్ వర్కవుట్ అయినట్లేనని రుద్రాణి సంబరపడిపోతుంది.
రాజ్ బయటికి వస్తుండగా అప్పుడే వచ్చేస్తున్నావేంటీ? రూమ్‌లో ఫోటో చూశావా అని అడుగుతుంది. అసలు మీరు మనిషేనా? అత్తయ్య అయిఉండి మీ కోడలి ఫోటోను పబ్లిక్‌గా ఎలా పెడతారని నిలదీస్తాడు రాజ్. ఆ మాటలతో రుద్రాణి షాక్ అవుతుంది. లోపలికి వచ్చి తాను పెట్టిన ఫోటో చూడగా కావ్య ఫోటోకి బదులు స్వప్న మోడలింగ్ చేస్తున్నప్పటి ఫోటో కనిపించడంతో రుద్రాణి షాక్ అవుతుంది. ఇంతలో స్వప్న వచ్చి రాజ్ చూసేలా నా ఫోటోని ఇక్కడ ఎవరు పెట్టారని నిలదీస్తుంది. మీ గదిలో నా ఫోటోను ఎందుకు పెట్టారని రుద్రాణిపై మండిపడుతుంది స్వప్న. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











