Brahmamudi May 19th Episode: కంపెనీ బాధ్యతలు తీసుకున్న ఇందూ..భ్రమరాంబ కారు లాక్కున్న రాజ్

Photo Courtesy: JioHotstar

రాజ్‌కి ఇవ్వాల్సిన డబ్బుల్ని ఇందూ కట్ చేయడంతో అతను రగిలిపోతాడు. నువ్వు చాలా కండీషన్స్ బ్రేక్ చేశావు అందుకే డబ్బులు కట్ చేశానని అంటుంది ఇందూ. నిన్న రాత్రి నేను వంట చేస్తుంటే నువ్వు నా నడుము చూశావు. ఆ ఓవరాక్షన్‌కే నాకు మండింది అని చెబుతుంది ఇందూ. ఇకపై ఇలాంటి వేషాలు వేస్తే డబ్బులు ఇవ్వనని తేల్చేస్తుంది. తన డబ్బులు కట్ చేయడంతో భోజనానికి రానని రాజ్ మారాం చేస్తాడు. దాంతో బలవంతంగా లాక్కెళ్తుంది ఇందూ.

రాజ్ అసలు ఇందూని ఎందుకు పెళ్లి చేసుకున్నాడో తెలుసుకోవాలని రేఖ అండ్ బ్యాచ్ డైనింగ్ టేబుల్ దగ్గర ప్లాన్ చేస్తుంది. రాజ్ రాగానే.. ఫోన్ కోసం ఇందూని తన గదిలోకి పంపిస్తుంది రేఖ. ఇందూ వెళ్లగానే అసలు ఇందూని ఎందుకు పెళ్లి చేసుకున్నావని అడుగుతుంది రేఖ. నాకు చిన్నప్పటి నుంచి బిజినెస్ చేయాలని, ఇండస్ట్రియలిస్ట్ కావాలని ఆశ అందుకే ఇందూని పెళ్లి చేసుకున్నాను. రేపు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌ని నడిపిస్తానని రాజ్ చెప్పడంతో రేఖ అండ్ బ్యాచ్ షాక్ అవుతుంది. రాజ్ గాడికి డబ్బుల అవసరం మనమే క్రియేట్ చేసి.. వాడి చేత ఆస్తి పేపర్ల మీద సంతకం పెట్టించాలని అంటుంది రేఖ. తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలని ఐశ్వర్యతో రాకేష్ గొడవ పడుతుండగా ఇందూ చూసి ఏం జరిగిందని అడుగుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక మే 19వ తేదీ ఎపిసోడ్ 1036లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial May 19th 2026 Episode 1036 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

డబ్బుల కోసం రాకేష్ - ఐశ్వర్య గొడవ పడటం చూసిన ఇందూ ఏం జరిగిందని అడుగుతుంది. ఐశ్వర్య నా దగ్గర పది లక్షల రూపాయలు తీసుకుందని, తిరిగి ఇవ్వమంటే ఇవ్వడం లేదని రాకేష్ చెప్పడంతో ఇందూ షాక్ అవుతుంది. 10 లక్షల రూపాయలు అప్పు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఇందూ అడుగుతుంది. నీ సంగతి నువ్వు చూసుకోమని వార్నింగ్ ఇస్తుంది. నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను.. అప్పటి వరకు ఇంటికి రావొద్దని రాకేష్‌కు చెబుతుంది ఐశ్వర్య. నా డబ్బు నాకు ఇవ్వకుండా టార్చర్ చూపిస్తోంది, ఇప్పటికే చాలా గడువు ఇచ్చానని నా డబ్బులు నాకు ఇవ్వకపోతే న్యూసెన్స్ చేస్తానని రాకేష్ చెప్పడంతో ఇందూ కంగారుపడుతుంది.

మా ఆంటీ గురించి మీకు తెలియదు. డబ్బు తీసుకున్నందుకు తన మీద ఎంత సీరియస్ అవుతుందో, ఇచ్చినందుకు అంతకన్నా ఎక్కువే సీరియస్ అవుతుంది. ఖచ్చితంగా మీ డబ్బులు మీకు తిరిగి ఇప్పిస్తానని రాకేష్‌కు చెబుతుంది ఇందూ. ఖచ్చితంగా నా డబ్బులు నాకు తిరిగి ఇప్పించండి, లేదంటే ఏం చేయాలో నాకు బాగా తెలుసని అంటాడు రాకేష్. కంపెనీలో జరుగుతున్న మోసాలు, రాకేష్‌ బాకీ, అపర్ణ చెప్పిన మాటలు గుర్తొచ్చి బాధపడుతుంది ఇందూ. వెంటనే తన తండ్రి షర్ట్ తీసుకుని బాధపడుతుంది.

ఉదయాన్నే సూట్ పట్టుకుని రాజ్‌కి కనిపిస్తుంది ఇందూ. ఈ సూట్ చాలా కాస్ట్‌లీగా కనిపిస్తోందని, ఇప్పుడు ఇది పట్టుకుని ఎందుకు నిలబడ్డావని అడుగుతుంది ఇందూ. ఈ సూట్ ఇప్పుడు నువ్వు వేసుకోవాలని ఇందూ చెప్పగానే.. మా నాన్న సూట్ వేసుకున్నావని మళ్లీ 2 వేలు కట్ చేస్తావా? అని మండిపడుతుంది. నేనే వేసుకోమని చెబుతున్నప్పుడు డబ్బులు ఎందుకు కట్ చేస్తాను. మా నాన్న ఈ సూట్ వేసుకుని ప్రాజెక్ట్ మీద సైన్ చేస్తే అది అలా పూర్తయ్యేదని చెబుతుంది ఇందూ.

మీ నాన్న బిజినెస్ పనుల మీద, ఆఫీస్‌కి వెళ్లేటప్పుడు వేసుకునేవాడు. మరి నేనేందుకు వేసుకోవాలని రాజ్ అడగ్గా.. నువ్వు ఈ సూట్ వేసుకుని నాతో పాటు ఆఫీస్‌కి రావాలని చెబుతుంది ఇందూ. నేను రానని రాజ్ చెప్పగా.. మా కంపెనీ బాధ్యతల్ని రేఖ ఆంటీ తీసుకున్న తర్వాత కంపెనీ పరిస్ధితి దిగజారిపోతోంది, ఎంప్లాయిస్ శాలరీలు వేయలేదు. అందుకే నేను కంపెనీ బాధ్యతల్ని తీసుకుంటున్నానని చెబుతుంది. నువ్వు పెద్ద బిజినెస్‌మెన్ అవ్వాలని అనుకుంటున్నావు కదా నీకు కూడా ఎక్స్‌పీరియన్స్ వస్తుందని అంటుంది ఇందూ. నువ్వు నాకు అద్దె మొగుడిగా ఉంటానని చెప్పావు, ఇప్పుడు ఎక్స్‌ట్రా వర్క్ చేయనని చెబుతుంది. అయితే దీనికి ఎక్స్‌ట్రా పేమెంట్ ఇస్తానని చెబుతుంది రాజ్.

రాజ్ తనతో పాటు ఆఫీస్‌కి వస్తే ఎక్స్‌ట్రాగా 2500 ఇస్తానని డీల్ మాట్లాడుకుంటుంది ఇందూ. నేను ఆఫీస్‌కి వస్తాను కానీ, నువ్వు కండీషన్స్ పేరుతో బొక్క పెట్టనని చెబితేనే నేను సూట్ వేసుకుంటాను, నీతో పాటు ఆఫీస్‌కి వస్తానని అంటాడు రాజ్. కండీషన్స్ మాత్రం తగ్గేదే లేదని తేల్చేస్తుంది ఇందూ. ఉదయాన్నే గుడ్లు తింటున్న మదన్‌ని చూసి మురిసిపోతుంది స్వాతి. మనిద్దరం ఫేమస్ సింగర్ లైవ్ ఈవెంట్‌కి వెళ్దామని అడుగుతుంది. నేను రానని తేల్చేస్తాడు స్వాతి. నువ్వెందుకు రావో చెబితేనే కానీ వెళ్లనని స్వాతి మారాం చేస్తుండగా.. నైట్ టైం రౌడీలు ఉంటారు అందుకే వెళ్లొద్దని చెబుతున్నా అంటాడు మదన్.

మదన్‌ని ఆటపట్టించడానికి గుడ్లు తీసుకుని పరిగెడుతుంది స్వాతి. ఇదంతా చూసి భ్రమరాంబ మురిసిపోతుంది. వాడే నా కూతురికి భర్త ఈ ఇంటికి యువరాజు అని భ్రమరాంబ అంటుండగా.. సూట్ బూటు వేసుకుని రాజ్ ఎంట్రీ ఇవ్వడంతో భ్రమరాంబ, మదన్‌లు షాక్ అవుతారు. రాజ్, ఇందూలను చూసి అపర్ణ, సుభాష్ మురిసిపోతారు. త్వరలోనే నా భార్య బాధ్యతలన్నీ నేనే తీసుకుంటానని చెప్పాను కదా. ఈరోజు నుంచే ఇందూని తీసుకుని ఆఫీస్‌కి వెళ్తున్నానని అంటాడు రాజ్. దీనికి ఇంటిపని, వంటపని తప్పించి ఏం తెలియదు. ఫైల్స్ చెక్ చేయడమే కాదు.. సంతకం కూడా పెట్టలేదు. దీనిని తీసుకెళ్లి నువ్వేం చేస్తావు? దీని వెనుక తోకలా వెళ్లి నువ్వేం చేస్తావు? అని భ్రమరాంబ మండిపడుతుంది. నాకు చదువు వచ్చని అంటాడు రాజ్. ఆఫీస్‌లో మా రేఖ ఉంది.. తనే అన్నీ చూసుకుంటుందని అంటుంది భ్రమరాంబ.

కంపెనీ బాధ్యతలు తీసుకోవాలని నేను నిర్ణయించుకున్నానని ఇందూ చెప్పి అపర్ణ ఆశీర్వాదం తీసుకుంటుంది. కంపెనీకి వెళ్లడానికి కారు లేకపోవడంతో రాజ్ షాక్ అవుతాడు. ఆటోలో వెళ్దామని ఇందూ చెప్పగా.. రాజ్ షాక్ అవుతాడు. ఈ కారు ఎవరిదని అడగ్గా.. భ్రమరాంబ పిన్నిదని చెబుతుంది ఇందూ. వెంటనే ఆమెను పిలిచి ఈ కారు నాకు కావాలని అంటాడు. దీనిని ఎంతో ఇష్టంతో అప్పు చేసి మరి కొన్నానని చెబుతుంది. భ్రమరాంబ ఇవ్వకపోవడంతో తాళాలు లాక్కుంటాడు రాజ్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X