Brahmamudi May 1st Episode: రేఖ చేతికి చిక్కిన ఇందూ.. ఇందూని వదులుకోలేక రాజ్ నరకం
Photo Courtesy: JioHotstar
రాజ్- లక్కీలు చదివింపులు తీసుకుంటుండగా ఇందూ చూసి ఇద్దరి మీదా మండిపడుతుంది. ఆ వెంటనే అందరికీ స్వీట్ పెడుతుంది ఇందూ. రూపాయి ఖర్చు లేకుండా ఫంక్షన్ చాలా బాగా చేశావని ఇందూని మెచ్చుకుంటాడు చలపతి. ఇంతలో సాహూ అక్కడికి వచ్చి ఫంక్షన్‌లో ఒక్కటి మిస్ అయ్యిందని చెప్పి కేక్ తీసుకొచ్చి ఇస్తాడు. సాహూని చూడగానే రాజ్, లక్కీలు వణికిపోతారు. మీరిద్దరూ ఫంక్షన్‌లో కేక్ కట్ చేయకపోతే ఏదోలా ఉంటుందని సాహూ చెప్పడంతో చలపతి సంతోషించి కేక్ కట్ చేస్తుండగా అందులో విషం ఉందేమోనని భయపడి కేక్‌ను లాక్కోబోతాడు రాజ్. అందులో విషం లేదని చెప్పి రాజ్‌ని పక్కకి తీసుకెళ్తాడు సాహూ.
నీకు 24 గంటలు టైమ్ ఇస్తున్నా.. ఆ లోగా నా డబ్బు నాకు ఇవ్వకుంటే నీ ఫ్యామిలీని చంపేస్తానని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు. దాంతో రాజ్ తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి వెంటనే రేఖకి ఫోన్ చేసి నా డబ్బులు నాకు అప్పగించకపోతే మీ అమ్మాయిని చంపేస్తానని వార్నింగ్ ఇస్తాడు. దాంతో రేఖ ఆఫీసులో శాలరీలు ఆపేసి ఆ డబ్బుని తన సొంతానికి వాడుకుంటుంది. ఇది చూసిన రాజ్ పీఏ శృతి.. గతంలో రాజ్- కావ్యలు ఉన్నప్పుడు ఆఫీసు ఎలా ఉండేది? ఉద్యోగస్తులను వారిద్దరూ ఎలా చూసుకునేవారో తలచుకుని ఏడుస్తుంది. రాజ్ దగ్గరికి వెళ్లిన ఇందూ.. ఇకనైనా కిడ్నాప్‌లు, చీటింగ్‌లు కాకుండా కష్టపడి పనిచేయమని చెబుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక మే 1వ తేదీ ఎపిసోడ్ 1021లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
మధ్య తరగతి వాళ్ల కష్టాల గురించి ఇందూకి క్లాస్ పీకుతాడు రాజ్. డబ్బు మాకు కడుపు నింపుతుంది, సొసైటీలో గౌరవాన్ని ఇస్తుందని చెబుతాడు. మాకు డబ్బు ఆనందాన్ని ఇస్తుందని అంటాడు. వీడు మంచోడే కానీ కాస్త డబ్బు పిచ్చి ఎక్కువ అని ఇందూ మెచ్చుకుంటుంది. నా డబ్బులు నాకు తిరిగివ్వాలని ఐశ్వర్యని బెదిరిస్తాడు రాకేష్. నా ఫ్రెండ్‌వి కదా అని డబ్బులిస్తే.. నన్ను ఇంత ఇబ్బంది పెట్టొద్దు. రేపటి లోగా డబ్బులు ఇస్తే ఓకే.. లేదంటే డైరెక్ట్‌గా మీ ఆంటీతోనే తేల్చుకుంటానని రాకేష్ చెప్పడంతో ఐశ్వర్య కంగారుపడుతుంది. వీడు ఆంటీ దగ్గరికి వస్తే.. నా గురించి తెలిసిపోతుంది, నా ప్లాన్ కూడా వేస్ట్ అయిపోతుందని అనుకుంటుంది ఐశ్వర్య.
కిడ్నాపర్లకు ఇస్తానన్న కోటి రూపాయల గురించి రేఖ ఆంటీ ఏం ఆలోచిస్తుందో తెలుసుకోవాలని కిందకి వెళ్తుంది ఐశ్వర్య. ఆస్తి మన చేతికి వస్తుందనుకున్న చివరి క్షణంలో ఇందూని కిడ్నాప్ చేసిన వాళ్లు, వాళ్ల వెనకున్న వాళ్ల కాళ్లు పడిపోవాలని శాపనార్థాలు పెడుతుంది భ్రమరాంబ. ఇందూకి ఇస్తానన్న డబ్బులు అరెంజ్ అయ్యాయా? లేదా? అని ఐశ్వర్య అడగ్గా.. మన కంపెనీ ఎంప్లాయిస్ శాలరీలు అన్ని కలిపితే 20 లక్షల రూపాయలు వచ్చాయి. అంతకుమించి ఎక్కడా డబ్బు రావడం లేదు.. ఆ కిడ్నాపర్లు అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే ఇందూని కనిపించకుండా చేస్తామని బెదిరిస్తున్నారని చెబుతుంది రేఖ. ఈ 20 లక్షలైనా చేతిలో పడితే ఆ రాకేష్ గాడి పీడ వదిలిపోతుందని అనుకుంటుంది ఐశ్వర్య.
20 లక్షలు ఇస్తామని కిడ్నాపర్లను కన్విన్స్ చేయమని రేఖని అడుగుతుంది ఐశ్వర్య. లాస్ట్ టైం 50 లక్షలు ఇస్తామంటేనే వాళ్లు ఒప్పుకోలేదు.. ఇప్పుడు 20 లక్షలంటే ఒప్పుకుంటారా అని ప్రశ్నిస్తుంది రేఖ. డబ్బులు ప్రతిమనిషికి చాలా అవసరం. ఏదో ఒక ప్రెజర్ ఎక్కువైతే ఖచ్చితంగా ఒప్పుకుంటారని చెబుతుంది ఐశ్వర్య. దాంతో ఆమెపై భ్రమరాంబకి అనుమానం వస్తుంది. మా దగ్గర ఉన్నది 20 లక్షలు మాత్రమే.. ఆ డబ్బు తీసుకోవడాదనికి ఒప్పుకుంటారేమో ట్రై చేయమని చెబుతుంది ఐశ్వర్య. భ్రమరాంబ కూడా ఈ ప్లాన్‌కి ఒప్పుకోవడంతో సరేనని చెబుతుంది. ఫోన్ చేస్తే ఏమవుతుంది? ఒకసారి ఫోన్ చేయమని అంటుంది.
దాంతో రాజ్‌కి ఫోన్ చేస్తుంది రేఖ. నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను.. డబ్బులు రెడీ అయ్యాయా? లేదా అని అడుగుతాడు. రెడీ అయ్యాయని రేఖ చెప్పగా.. ఎప్పుడు? ఎక్కడ కలవాలో చెబుతానని అంటాడు రాజ్. రెడీ అయ్యింది 20 లక్షలు మాత్రమేనని రేఖ చెప్పడంతో రాజ్ మండిపడతాడు. ఇన్నిరోజులు వెయిట్ చేయించి.. వెయిట్ చేయించి 20 లక్షలే ఇస్తారా? ఇదేమైనా కూరగాయల బేరమా? నేను అడిగిన డబ్బు నాకివ్వండి లేదంటే ఫ్రస్ట్రేషన్‌లో నేనేం చేస్తానో నాకే తెలియదని ఫోన్ పెట్టేస్తాడు రాజ్. దాంతో ఐశ్వర్య వెళ్లి రాజ్‌కి ఫోన్ చేసి సీరియస్ అవుతుంది. మా ఆంటీ 20 లక్షలు ఇస్తానంటే ఎందుకు తీసుకోలేదని మండిపడుతుంది. అప్పుడు మనం చీప్ అయిపోతాం.. అప్పుడు వాటిని పంచుకుంటే చెరో పది లక్షలు మాత్రమే వస్తాయని అంటాడు. ఇప్పుడున్న పరిస్ధితుల్లో మా ఆంటీ దగ్గర పైసా కూడా లేదు. ఎక్కడా అప్పు పుట్టడం లేదు, నా నగలు అమ్మేస్తేనే ఆ 20 లక్షలు రెడీ అయ్యాయి. లాస్ట్ టైం 50 లక్షల రూపాయలు తీసుకోనుంటే బాగుండేది, ఇంకా ఆలస్యం చేస్తే ఈ డబ్బులు కూడా మిగలవని చెబుతుంది ఐశ్వర్య.
నా ప్లాన్, నీ కష్టం రెండూ వృథానే అంటుంది ఐశ్వర్య. చివరికి ఐశ్వర్య చెప్పినట్లుగానే రేఖకి కాల్ చేస్తాడు రాజ్. నాకు 20 లక్షలు ఓకే, ఇక దీనిని ఇంతటితో ఆపేద్దాం. డబ్బులు ఎక్కడ అందజేయాలో రేపు చెబుతానని అంటాడు రాజ్. నేను తగ్గాను కదా అని పోలీసులకు చెబితే ఇందూ బతకదని బెదిరించడంతో ఎవ్వరికి చెప్పమని అంటుంది రేఖ. అసలు వీళ్లు నిజంగా కిడ్నాపరేనా? అని శేషంకి డౌట్ వస్తుంది. మనం 50 లక్షలు ఇస్తామంటేనే వద్దు అన్నాడు.. అలాంటిది చీప్‌గా 20 లక్షలకు ఒప్పుకోవడం ఏంటీ? అని అంటాడు. అవసరం అనేది మనిషిని ఎంతకైనా తగ్గేలా చేస్తుందని చెబుతుంది భ్రమరాంబ. 20 లక్షలు వాడి ముఖాన కొడితే ఇందూ ఇంటికి వచ్చేస్తుందని అంటుంది.
20 లక్షలకు ఎందుకు ఒప్పుకున్నావని రాజ్‌పై మండిపడతాడు లక్కీ. అమ్మానాన్నలు నా వల్ల అవమానపడకుండా ఉంటే చాలని చెబుతాడు రాజ్. ఇందూని వాళ్లకి అప్పగిస్తే ఆమె పరిస్ధితి ఏంటీ అని లక్కీ బాధపడతాడు. ఉదయాన్నే ఇందూని గుడికి తీసుకొస్తారు లక్కీ, రాజ్. ఎప్పుడూ దేవుడి గురించి మాట్లాడలేదు.. ఇప్పుడు సడెన్‌గా గుడికెందుకు అని అడుగుతుంది ఇందూ. ఇన్ని రోజులు నీతో ఉన్నందుకు కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇచ్చావు.. నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని అంటుంది ఇందూ. నేను నిన్ను నమ్మొచ్చా అని అడగ్గా.. రాజ్ అంటే నమ్మకం, నమ్మకమంటే రాజ్ అని చెబుతాడు. నా మీద తను చాలా నమ్మకం పెట్టుకుందని బాధపడతాడు.
కిడ్నాపర్లు ఇందూని వదిలేస్తారా? లేక 20 లక్షలు తీసుకుని మోసం చేస్తారా అని భూషణ్ అడగ్గా... ఇందూని వదలకపోతే వాళ్లని నేనే చంపేస్తానని అంటుంది రేఖ. ఇందూని తీసుకుని మనల్ని పోలీసులకు పట్టిస్తే పరిస్ధితి ఏంటీ అని లక్కీ అడగ్గా... అక్కడి వరకు వస్తే నేనేంటో చూపిస్తానని చెబుతాడు రాజ్. గుడిలో దేవుడికి దండం పెడుతూ.. రేఖ ఆంటీ నుంచి ఆస్తిని కాపాడటానికి నన్ను నేను కిడ్నాప్ చేయించుకోవాలని ప్లాన్ చేసుకున్నాను. కానీ రాజ్‌కి నిజంగానే డబ్బులు అవసరముండి, నన్ను కిడ్నాప్ చేశాడు. రాజ్ నన్ను కిడ్నాప్ చేసినా మంచిగానే చూసుకున్నాడు. నాకు ఏ ఇబ్బంది రాకుండా నన్ను నడిపిస్తున్నాడు. అలాగే నా సమస్యలకు నాకు ఒక పరిష్కారం నువ్వే చూపించమని అడుగుతుంది. ఇంతలో వెనక్కి తిరిగిచూసేసరికి రేఖ ఉండటంతో ఇందూ షాక్ అవుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications