Brahmamudi May 1st episode: అత్తగారిని క్షమాపణ కోరిన అనామిక.. భార్యని జీవితంలో క్షమించనంటున్న కళ్యాణ్!
రాజ్ ని ఇంట్లోంచి బయటికి గెంటేసే క్రమంలో ఎవరైనా అడ్డొస్తే తానే చనిపోతానంటూ బెదిరిస్తుంది అపర్ణ. అనామిక కళ్యాణ్ మీద, అప్పు మీద కేసులు పెట్టి అరెస్టు చేయిస్తుంది. అప్పుని అరెస్టు చేయించినందుకు దుగ్గిరాల ఇంటికి వచ్చి రచ్చ రచ్చ చేస్తుంది కనకం. అప్పుని, కళ్యాణ్ ని విడిపించి ఇంటికి తీసుకు వస్తారు కావ్య దంపతులు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక మే1వ తేదీ ఎపిసోడ్ 398లో ఏం జరిగిందంటే..
అప్పు వాళ్లని జైల్లో పెట్టించి ఏం సాధించావు అక్కడ కూడా టీ, కాఫీ అంటూ కళ్యాణ్ నా చెల్లెలికి సేవ చేశాడంట కదా అంటుంది స్వప్న. అయినా పర్వాలేదు ఇకమీదట కళ్యాణ్ అప్పుతో మాట్లాడాలంటే ఆలోచిస్తాడు, ఇదంతా నన్ను ఒక చెంప దెబ్బ కొట్టినందుకే చేశాను అంటుంది అనామిక. ఒక్క చెంప మీదే కొట్టారని ఫీల్ అయ్యావా అంటూ మరో చెంప పగలగొడుతుంది స్వప్న. మళ్లీ పోలీస్ కేసు అంటూ అప్పు ని అరెస్టు చేయిస్తావేమో అప్పు ఒక్కసారే ఛాన్స్ ఇస్తుంది మళ్ళీ దాని జోలికి వెళ్ళావంటే శీలు రాకాసి లాగా చీరేస్తుంది అని అనామిక కి వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది.

మరోవైపు వంటగదిలో పని చేసుకుంటున్నా కావ్య దగ్గరికి వచ్చిన రుద్రాణి సమస్యలన్నీ తీరిపోయినట్లు అంత ప్రశాంతంగా పనిచేసుకుంటున్నావేంటి, మీ అత్త పెట్టిన గడువు కి ఇంకా రెండు రోజులు మాత్రమే సమయం ఉంది, ఇ లోగా ఏదైనా మంచి ఇల్లు చూసి పెట్టుకోండి, సడన్గా ఇంట్లోంచి గెంటేస్తే నడిరోడ్డుమీద ఉండలేరు కదా అని వెటకారంగా మాట్లాడుతుంది రుద్రాణి. మేము ఈ ఇంట్లోంచి వెళ్లిపోవాలని మీకు చాలా కోరికగా ఉన్నట్లుంది.
కానీ ఆ ఆశలు నెరవేరవు, నా భర్తని ఇంట్లోంచి వెళ్ళనిచ్చేది లేదు ఇలోగానే నిజం నిరూపిస్తాను అంటుంది కావ్య. మరోవైపు అనామిక, ధాన్యలక్ష్మికి ఎదురు పడుతుంది. ధాన్య లక్ష్మి ఏమి మాట్లాడకుండా కిచెన్లోకి వెళ్ళిపోతుంది. ఈ కోపం అంతా కొడుకుని అరెస్టు చేయించినందుకే కాబోలు అనుకుంటూ అత్తగారి వెనకే వెళ్లి నన్ను టీ పెట్టమంటారా అని అడుగుతుంది. వద్దమ్మా మళ్లీ టీ పెట్టమన్నారు, డొమెస్టిక్ వైలెన్స్ అంటూ నా మీద కేసు పెట్టినా పెడతావు అని నిష్టూరంగా మాట్లాడుతుంది ధాన్యలక్ష్మి.

నన్నేం చేయమంటారాంటీ కళ్యాణ్ ఎంత చెప్పినా ఆ అప్పు తో మాట్లాడకుండా ఉండటం లేదు అందుకే ఇలా చేశాను అంటుంది అనామిక. ఆ అప్పు అలాంటిదేమో కానీ నా కొడుకు అలాంటివాడు కాదు, నా పెంపకాన్ని అవమానించావు నా కొడుకుని ఎక్కడకో తీసుకువెళ్తాను అని చెప్పి తీసుకు వెళ్లి రోడ్డుమీద పెట్టావు అందరి ముందు వాడి పరువు తీసేశావు అంటుంది ధాన్యలక్ష్మి. నన్ను క్షమించండి అత్తయ్య అంటుంది అనామిక.
నన్ను కూడా నువ్వు క్షమించు ఎందుకంటే ఈ విషయంలో నేను నిన్ను అస్సలు క్షమించలేను అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ధాన్యలక్ష్మి. ఇదంతా ఆ రుద్రాణి వల్లే ఆవిడ సంగతి చెప్తాను అనుకుంటూ ఆమె దగ్గరికి బయలుదేరుతుంది అనామిక. మరోవైపు అప్పుకి ఫోన్ చేసి క్షమాపణ చెప్పాడు కళ్యాణ్. నాతో పాటు నువ్వు కూడా అరెస్టు అయ్యావు కదా మరెందుకు క్షమాపణ అయినా ఇంత జరిగాక కూడా మళ్లీ నాకు ఫోన్ చేయాలని ఎలా అనిపించింది అంటుంది అప్పు.

నేను పైకి కనిపించడానికి చాలా సాఫ్ట్ గా కనిపిస్తాను కాని నేను చాలా మొండి వాడిని, పంతం అంటూ వస్తే నేను ఎవరి మాట వినను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు కళ్యాణ్. అప్పుడే వచ్చిన అనామిక ఇంత జరిగినా కూడా నీకు సిగ్గు రాలేదా అని భర్తని మందలిస్తుంది. నువ్వు ముందులా ఉండి ఉండే నేను మారేవాడినేమో కానీ ఇప్పుడు నేను మారేది లేదు, నిన్ను క్షమించేది లేదు అని కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు కళ్యాణ్.
మరోవైపు రోడ్డు వైండింగ్ జరుగుతుందంట మన ప్రాపర్టీస్ మూడు అడుగులు వెనక్కి జరపాలని నోటీసు వచ్చింది అని తండ్రితో చెప్పి స్వప్నతో డాక్యుమెంట్స్ తీసుకొని రమ్మని చెప్తాడు సుభాష్. డాక్యుమెంట్స్ కోసం వెళ్ళిన స్వప్నకి డాక్యుమెంట్స్ కనిపించకపోవడంతో ఇంట్లో వాళ్ళందరికీ చెప్తుంది. జాగ్రత్తగా దాచావా లేదంటే ఎక్కడైనా తాకట్టు పెట్టేసావా అని అడుగుతుంది రుద్రాణి. ఆ ఆలోచన మీకెందుకు వచ్చింది, బంగారు బాతు గుడ్డిని ఒకేసారి పోసుకొని తినే రకం కాదు నేను అంటుంది స్వప్న.
కావ్య మరొకసారి వెతకమనటంతో మళ్ళీ తన రూమ్ లోకి వెళుతుంది స్వప్న. ఇంతలో రాహుల్ ని పక్కకు తీసుకువచ్చిన రుద్రాణి ఆ సేటుని ఇప్పుడే రమ్మని చెప్పు స్వప్నని ఇరికించడానికి ఇదే మంచి సమయం అంటుంది. సరే అంటూ సేటును తీసుకురావడానికి బయలుదేరుతాడు రాహుల్. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











