Brahmamudi May 20th Episode: రుద్రాణి ప్లాన్ అట్టర్ ఫ్లాప్.. రాజ్‌ని ఇరికించిన ఇందిర, రంగంలోకి యామిని
ఇంటికొచ్చిన రాజ్‌ను కావ్య వెళ్లిపోమ్మని చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. మీ మనవరాలు నన్ను వెళ్లిపోమ్మని అంటోందని ఇందిరతో అంటాడు. దాంతో అందరూ కావ్యకి చీవాట్లు పెట్టి రాజ్ కోసం టిఫిన్ చేయమని చెబుతారు. నేనేం టిఫిన్ చేయలేదని కావ్య చెప్పడంతో నేనే దోశలు వేస్తానని రాజ్ వంటింట్లోకి వెళ్తాడు. దోశలు వేయడం రాకపోవడంతో ఇందిర, అపర్ణలు హెల్ప్ చేస్తారు. తర్వాత రాజ్ టమోటా కెచప్‌తో చెట్నీ చేయడంతో అత్తాకోడళ్లు షాక్ అవుతారు.
అందరినీ పిలిచి దోశలు, టమోటా కెచప్‌తో చేసిన చెట్నీ వడ్డిస్తాడు రాజ్. అందరూ దోశ నోట్లో పెట్టుకోగానే అది చెండాలంగా ఉండటంతో తినలేక వెళ్లిపోతారు. కావ్య పెళ్లి ఫోటోని తన బెడ్‌పై కనిపించేలా పెట్టి రాజ్‌ను పిలుస్తుంది రుద్రాణి. రాజ్ రెస్ట్ తీసుకుందామని పైకి వెళ్లి ఆ ఫోటో చూసి షాక్ అవుతాడు. బయటికొచ్చి మీ కోడలి ఫోటో పరాయి మగాడు చూసేలా పెడతారా అంటూ మండిపడతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక మే 20వ తేదీ ఎపిసోడ్ 726లో ఏం జరిగిందంటే?

సిగ్గు లేకుండా మీ కోడలి ఫోటోని అలా ఎవరికి పడితే వాళ్లకి చూపించేస్తారా అని రుద్రాణిపై మండిపడుతుంది స్వప్న. నాకేమీ తెలియదని రుద్రాణి తేల్చిచెబుతుంది. మీరు ప్రతిసారి చెండాలమైన పనులు చేస్తున్నారని ఆఖరికి మీ కోడలిని అని కూడా చూడకుండా నా పరువుని కూడా బజారున పడేయాలని చూస్తున్నారా అని ఫైర్ అవుతుంది. ఈ ఫోటో పెట్టలేదంటే మరేదైనా ఫోటో పెట్టారా అని నిలదీస్తుంది స్వప్న. అసలు నేను ఏ ఫోటో పెట్టలేదని వెళ్లిపోతుంది రుద్రాణి.
రుద్రాణి రూమ్ నుంచి వచ్చిన రాజ్ సోఫాలో పడిపోవడంతో ఇందిర, అపర్ణలు సెటైర్లు వేస్తారు. కళావతిని ఇంప్రెస్ చేయాలని నీకు ఉందా? లేదా అని అడుగుతుంది అపర్ణ. తన కోసమే వంట రాకపోయినా వచ్చినట్లు కలరింగ్ ఇచ్చి ఇంత కష్టపడ్డానని చెబుతాడు రాజ్. ఫస్ట్ స్టెప్ ఫెయిలైందని సైలెంట్‌గా కూర్చొంటే ఎలా? మళ్లీ ప్రయత్నించు మేం ఉన్నాం కదా అని అంటుంది ఇందిర. గిఫ్ట్ తీసుకుని రమ్మని చెప్పాను కదా తెచ్చావా అని అపర్ణ అడగ్గా.. రాజ్ బయటికి వెళ్లి అపర్ణ ముందు పెడతాడు.
చీర తీసుకురావడంతో ఇందిర కోప్పడుతుంది. నేను మీ జనరేషన్‌లో ఉంటే మీరిద్దరూ నా జనరేషన్‌లో ఉన్నారేంటీ అని అపర్ణ, రాజ్‌లపై కోప్పడుతుంది. అమ్మాయిలు ఇష్టపడినవి తీసుకొస్తే సంతోషిస్తారని, అదే థ్రిల్ అయ్యేవి తీసుకొస్తే మనకి పడతారని అంటుంది. నా దగ్గర అలాంటి డ్రెస్ ఏం లేదని రాజ్ చెప్పడంతో నా దగ్గర ఉంది కదా అని ఓ మోడ్రన్ డ్రెస్ తీసి రాజ్ చేతిలో పెడుతుంది ఇందిర. ముందు జాగ్రత్తగా నేను కొనుక్కొని వచ్చానని, ఈ రోజుల్లో అమ్మాయిలకి పద్ధతిగా ఉన్న అబ్బాయిలు నచ్చడం లేదని అంటుంది. మీ మనవరాలికి ఇలాంటి డ్రెస్‌లు సెట్ కావని రాజ్ చెప్పడంతో నీకు తెలుసా? నాకు తెలుసా? అని మండిపడుతుంది ఇందిర.
అక్కడేం జరుగుతుందో నేను చెబుతాను విను అని అపర్ణతో అంటుంది ఇందిర. కావ్య దగ్గరికి రాజ్ వెళ్లి ఈ డ్రెస్ ఇచ్చి వేసుకోమంటాడని, ఆ తర్వాత ఇద్దరూ కలిసిపోయారని కలలు కంటూ ఉంటుంది. లోపల నేను అనుకున్నది అనుకున్నట్లే జరుగుతుందని, ఇద్దరూ చిలక గోరింకల్లా సంతోషంగా కిందకి వస్తారని చెబుతుంది. ఇంతలో రాజ్ డల్‌గా మెట్లు దిగుతుండటం చూసి అపర్ణ, ఇందిరలు షాక్ అవుతారు. కావ్య ఆడపిల్ల కదా సిగ్గుతో లోపలే ఉండిపోయిందని చెబుతుంది ఇందిర. నా ప్లాన్ సక్సెసేనా అని రాజ్‌ను అడుగుతుంది ఇందిర. అమ్మాయికి గిఫ్ట్ నచ్చిందా? అని అపర్ణ కూడా అడుగుతుంది. లోపల పెద్ద అద్భుతం జరిగిందని జరిగిందంతా చెబుతాడు.
రాజ్ గిఫ్ట్ తీసుకుని కావ్య గదిలోకి వెళ్లగా డైరెక్ట్‌గా నా గదిలోకి వచ్చేస్తారా అని కావ్య అడుగుతుంది. అలా సీరియస్ అవుతారేంటీ? పోయినసారి ఇంటికి వచ్చినప్పుడు మీరు నన్ను ఇదే గదికి తీసుకొచ్చారు కదా అని అంటాడు రాజ్. అప్పుడు వేరు.. ఇప్పుడు వేరు అని చెబుతుంది కావ్య. మీకు గిఫ్ట్ ఇద్దామని వచ్చానని ఆమెకు ఇవ్వగా అదేంటీ అని అడుగుతుంది . ఓపెన్ చేస్తే మీరు థ్రిల్ అయిపోతారని చెబుతాడు. ఆ డ్రెస్ చూసిన కావ్య షాక్ అవుతుంది. ఇది చూడగానే మీరు థ్రిల్ అయ్యారు కదా? వేసుకుంటే ఇంకా బాగుంటుందని అంటాడు. ఆ మాటలతో కావ్య కోపంగా చూడటంతో రాజ్ భయపడి వచ్చేస్తాడు.
మీ మనవరాలు ఓటీటీలో కనిపించే అమ్మాయి లాంటిది కాదని, వ్రతాలు, పూజలు చేసేటైప్ అని మొత్తుకుంటాడు. కళావతిని ఎలా ఇంప్రెస్ చేయాలో నా చావు నేను చస్తానని అంటాడు రాజ్. ప్లాన్స్ అన్నాక ఏదో ఒకటి ఫెయిల్ అవుతుందని, అంత మాత్రానికే నన్ను తక్కువగా అంచనా వేస్తున్నావా అని అపర్ణపై కోప్పడుతుంది ఇందిర. కావ్య ఫోటోను పెడితే ఆ ప్లేస్‌లోకి స్వప్న ఫోటో ఎలా వచ్చిందో అర్ధం కాక జుట్టు పీక్కుంటుంది రుద్రాణి. ఆ స్వప్న నన్ను తిట్టిందంటే అది మార్చే అవకాశమే లేదని, మరి ఎవరు మార్చారో ఆలోచిస్తుంది. ఇంతలో రుద్రాణికి యామిని ఫోన్ చేస్తుంది. ఫోటో చూపించారా? రాజ్ చూసి షాకయ్యాడా? అని ప్రశ్నిస్తుంది. చూసి షాక్ అవ్వడమే కాదు థ్రిల్ అయిపోయాడని అంటుంది రుద్రాణి.
ఈ పాటికే రాజ్ గొడవ పెట్టుకున్నాడా? నన్నే మోసం చేస్తావా? అని కావ్యపై మండిపడ్డాడా? అని రుద్రాణిని అడుగుతుంది యామిని. మనం అనుకున్నట్లే రాజ్ కావ్యని బాగా తిట్టాడని కానీ కావ్యని కాదని నన్ను అని చెబుతుంది రుద్రాణి. నా కోడలు మోడ్రన్ డ్రెస్‌లో ఉన్న ఫోటోని చూసి తిట్టాడని చెబుతుంది రుద్రాణి. నేను కావ్య ఫోటోని పెడితే ఆ ప్లేస్‌లోకి నా కోడలు ఫోటో ఎలా వచ్చిందో అర్ధం కావడం లేదని అంటుంది. నువ్వు ఏమనుకున్నా సరే ఇక్కడ ప్లాన్ మాత్రం ఫెయిల్ అని యామినితో చెబుతుంది.
ఇక నక్కల వేట కాదు ఏకంగా సింహంతోనే యుద్ధం చేయాలని చెబుతుంది యామిని. ఆ ఇంట్లో కావ్యకి అత్తయ్య ఉన్నాడు, మామయ్య ఉన్నాడు మరి అత్తయ్య కొడుకు ఏమయ్యాడని అడుగుతుంది యామిని. ఇదే ప్రశ్నని తీసుకెళ్లి రాజ్ ముందు పెట్టండి ఆ ప్రశ్నని అతను కావ్యని అడుగుతాడని చెబుతుంది. దానికి సమాధానం చెప్పలేక కావ్యతో పాటు ఆ ఇంట్లో వాళ్లంతా తలదించుకుంటారని అంటుంది. రాజ్ తన కొడుకన్న నిజం బయటపెట్టలేక , కావ్య కోడలు ఎలా అయ్యిందో చెప్పలేక అందరూ తెల్లమొహాలు వేస్తారని అనుకుంటుంది రుద్రాణి. ప్లాన్ అదిరిందని వెంటనే అమలు చేస్తానని రుద్రాణి వెళ్తుంది. రాజ్‌తో ఎందుకు అలా ఉంటున్నావని కావ్యపై మండిపడతారు ఇందిర, అపర్ణ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











