Brahmamudi May 20th Episode: ఆంటోనీ దెబ్బకు రేఖకి ముచ్చెమటలు.. రాజ్ ప్రాణాల కోసం నిజం దాచిన శృతి

Photo Courtesy: JioHotstar

డబ్బు కోసం రాకేష్‌తో ఐశ్వర్య గొడవ పడటం చూసిన ఇందూ ఏం జరిగిందని అడుగుతుంది. మీ ఐశ్వర్య నా దగ్గర పది లక్షల రూపాయలు అప్పు చేసింది.. డబ్బులు ఇవ్వమంటే టార్చర్ చేస్తోందని మండిపడతాడు రాకేష్. అంత డబ్బులు నీకెందుకు? ఆంటీకి తెలిస్తే అస్సలు ఊరుకోదని చెబుతుంది ఇందూ. నా సంగతి నేను చూసుకుంటానని, త్వరలోనే డబ్బులు ఇచ్చేస్తానని రాకేష్‌తో చెప్పి కోపంగా వెళ్లిపోతుంది ఐశ్వర్య. మీ డబ్బులు మీకు త్వరలోనే వచ్చేలా చేస్తానని రాకేష్‌తో చెబుతుంది ఇందూ. కంపెనీ గురించి, ఉద్యోగుల కష్టాల గురించి అపర్ణ చెప్పిన మాటలు గుర్తుచేసుకుంటూ బాధపడుతున్న ఇందూ.. తన తండ్రి సూట్ చూసి ఒక నిర్ణయానికి వస్తుంది.

ఉదయాన్నే రాజ్ దగ్గరికి వచ్చి ఈ సూట్ వేసుకుని నాతో పాటు ఆఫీస్‌కి రావాలని చెబుతుంది. ఆఫీస్‌కి వచ్చినందుకు ఎక్స్‌ట్రా పేమెంట్ ఇస్తానని అంటుంది ఇందూ. తొలుత మారాం చేసినా తర్వాత సూట్‌కి, డబ్బులకు ఆశపడతాడు రాజ్. ఉదయాన్నే రాజ్- ఇందూలు ఆఫీస్‌కి బయల్దేరుతుండటం చూసి సుభాష్, అపర్ణలు ముచ్చపడతారు. ఇద్దరి దగ్గర ఆశీర్వాదం తీసుకుని బయటకు రాగానే కంపెనీకి వెళ్లడానికి కారు లేదా అంటూ ఇందూపై మండిపడతాడు రాజ్. ఆ వెంటనే భ్రమరాంబ కారు తాళాలు కొట్టేస్తాడు రాజ్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక మే 20వ తేదీ ఎపిసోడ్ 1037లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial May 20th 2026 Episode 1037 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

రాజ్ తన కారుని తీసుకుని వెళ్లిపోవడంతో భ్రమరాంబ మండిపడుతుంది. రాబోయే రోజుల్లో ఇంకా ఏమేం దోచుకుంటాడో అంటాడు శేషం. నువ్వు మదన్‌ని ఈ ఇంటికి యువరాజులా చూడాలని అనుకున్నావు, కానీ దేవుడు మరోలా స్క్రిప్ట్ రాసినట్లుగా అనిపిస్తోందని చెబుతాడు శేషం. వాడు ఎక్కడ ఎన్ని వేషాలు వేసినా సరే రేఖ ముందు వాడి ఆటలు సాగవని అంటుంది భ్రమరాంబ. వాడు నా కారుని క్షేమంగా ఇంటికి తీసుకొస్తే చాలని చెబుతుంది. రాజ్- ఇందూలు ఆఫీసుకు వెళ్లడంతో అపర్ణ- సుభాష్‌లు చాలా సంతోషిస్తారు. రాజు నా దగ్గరికి వచ్చిన ప్రతిసారి నా గుండె ఎందుకో కొట్టుకుంటుందని చెబుతుంది అపర్ణ.

నాకు కూడా అలాగే అనిపిస్తోంది.. దేవుడు మన దగ్గర ఒకటి లాక్కుంటే మరొక రూపంలో ఇంకొకటి ఇస్తాడు, మన కొడుకు కోడలిని దూరం చేసిన ఆ దేవుడే వారి రూపాల్లో ఇందూ- రాజ్‌లని పంపాడని అంటాడు సుభాష్. ఇన్ని రోజులకు ఇందూకి నిజంగ ఒక తోడు దొరికింది, ఇందూ జీవితం ఎలా ఉంటుందోనని భయపడుతూ ఉండేదానిని, ఇందూ పక్కన ఆ అబ్బాయిని చూస్తే దానికి భరోసాగా అనిపిస్తోంది. స్వరాజ్ గ్రూప్ ఆఫ ఇండస్ట్రీస్‌కి వీళ్లు మళ్లీ పూర్వవైభవం తీసుకొస్తే అంతేచాలు. రాజ్- కావ్యలు ఏ ఆశయంతో ఈ కంపెనీని నడిపించారో వాళ్లు దీనిని కొనసాగించాలని అంటుంది అపర్ణ.

ఆఫీసులో అన్నీ పెండింగ్ వర్క్స్ ఉండటంతో రేఖ రగిలిపోతుంది. శృతిని పిలిచి చీవాట్లు పెడుతుంది. ఎంత చెబుతున్నా స్టాఫ్ వినడం లేదు.. శాలరీ ఇస్తే తప్ప పనిచేయమని చెబుతున్నారు, పని పక్కన పడేశారని చెబుతుంది పీఏ శృతి. ఎంత ధైర్యముంటే నన్నే ఎదిరిస్తారు అంటూ ఎంప్లాయిస్‌పై రగిలిపోతుంది రేఖ. వెంటనే అందరినీ పిలిచి మీ ప్రాబ్లమ్ ఏంటీ? వర్క్ ఎందుకు ఫినిష్ చేయలేదని అడుగుతుంది. శాలరీ ఇవ్వకపోతే పనిచేయమని వాళ్లు చెప్పేస్తారు. శాలరీ కొంచెం లేటైతే పనిచేయడం ఆపేస్తారా? ఇప్పుడు మీరు పనిచేయడం ఆపడం వల్ల క్లయింట్స్ నుంచి రావాల్సిన అమౌంట్ మనకి రాదు. ఇన్నేళ్లుగా నేను శాలరీ ఎగ్గొట్టలేదు కదా? ఒక్కసారి లేటైతే ప్రాణాలు పోతాయా అంటూ మండిపడుతుంది.

ఇంత పెద్ద కంపెనీని నడుపుతూ మీరే శాలరీ ఇవ్వడానికి ఇబ్బంది పడుతుంటే ఆ శాలరీ మీద బతుకుతున్న మేము.. శాలరీ రాకపోతే ఇబ్బందిపడతామని చెబుతారు ఉద్యోగులు. నన్ను ఎదిరించి, బెదిరించి శాలరీ తీసుకోవాలని అనుకుంటున్నారా? అంటూ మండిపడుతుంది రేఖ. మీరు నన్ను ఎదిరించి బతికితే .. మీ పేర్లు బ్లాక్‌లిస్ట్‌లో పెడతా, అప్పుడు బయట ఏ కంపెనీ కూడా మీకు జాబ్ ఇవ్వదని వార్నింగ్ ఇస్తుంది రేఖ. మీకు ఇక్కడ సపోర్ట్‌గా ఎవరూ ఉండరని అంటుండగా.. నేనున్నాను అంటూ రాజ్- ఇందూ రావడంతో రేఖ షాక్ అవుతుంది. రాజ్‌ని చూసిన పీఏ శృతి ఉలిక్కిపడుతుంది.

వీడిని ఇక్కడికెందుకు తీసుకొచ్చావని అడుగుతుంది రేఖ. నేను తీసుకురాలేదు.. వాడే ఇక్కడికి తీసుకొచ్చాడు, నన్ను కంపెనీకి తీసుకెళ్లు లేకపోతే అందరికీ మన విషయం చెప్పేస్తానని బెదిరించడంతో తప్పక తీసుకొచ్చానని ఇందూ అబద్ధం ఆడుతుంది. స్టాఫ్‌కి ఇవ్వాల్సిన శాలరీ గురించి మాట్లాడుతున్నామని భూషణ్ అంటాడు. ఇక నుంచి టైం మారుద్ది, టైం టేబుల్ మారుద్ది.. రూల్స్ మారతాయి. అంతా మన స్టైల్‌లోనే నడుస్తుందని అంటాడు రాజ్. వీళ్ల శాలరీల సంగతి నేనే సాల్వ్ చేస్తానని చెబుతాడు. వీళ్ల శాలరీలు ఇవ్వాలంటే లక్షలు కావాలని అంటుంది రేఖ. దాంతో ఈ శాలరీలు ఇతనే క్లియర్ చేస్తాడట కాబట్టి నిర్మోహమాటంగా అడగండి అని వెళ్లిపోతుంది రేఖ.

మీరు శాలరీల కోసం స్ట్రైక్ చేయరు, వేరే కారణాలు ఉండుంటాయని అంటాడు రేఖ. మాకు వర్క్ లోడ్ ఎక్కువ అవుతోంది, మమ్మల్ని మనుషుల్లాగే చూడటం లేదు. మా అమ్మగారికి హెల్త్ బాగోకపోతే లీవ్ అడిగితే ఇవ్వలేదని ఒక్కొక్కరు ప్రాబ్లమ్ చెబుతారు. ఒకప్పుడు మా అమ్మనాన్నలు ఉన్నప్పుడు మిమ్మల్ని ఎలా చూసుకున్నారో నాకు బాగా తెలుసు.. నాకు కొన్ని రోజులు గడువు ఇవ్వండి, నేను తప్పకుండా మీ శాలరీలు క్లియర్ చేయడంతో పాటు మీకు ఏ సమస్యలు రాకుండా చూసుకుంటానని ఇందూ హామీ ఇస్తుంది. మీ అమ్మానాన్నల మీదే ఏ గౌరవం ఉందో అలాగే మీకు కూడా రెస్పెక్ట్ ఇస్తామని అంటారు ఉద్యోగులు. కంపెనీ బాధ్యతలు మీరు తీసుకుంటే అంతకంటే సంతోషకరమైన విషయం మరొకటి ఉండదని చెబుతారు. మేడం అంత క్లియర్‌గా చెప్పారు కదా మీ వర్క్ మీరు చూసుకోమని శృతి అందరికీ చెబుతుంది.

మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుగా ఉందని శృతితో అంటాడు రాజ్. ఇంతకీ సార్ ఎవరు? అని శృతి అడగ్గా.. నా హజ్బెండ్ అంటుంది ఇందూ. నాకు కంపెనీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని ఇవ్వమని అడుగుతుంది. ఒకప్పుడు ఈ కంపెనీ 200 కోట్ల టర్నోవర్ చేసేదని శృతి చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు. ఆ దేవుడు నిజంగా విచిత్రమైనవాడు.. మీరు దుగ్గిరాల కుటుంబానికి వారసుడని మీకు తెలియకుండానే ఇక్కడ పడేశాడు. మీరే వారసుడన్న విషయం రేఖకి తెలిస్తే ఆ రేఖ వదిలిపెట్టదు, నిజం చెప్పనని అనుకుంటుంది శృతి. ఇంతలో రేఖ మేడమ్‌ని కలవాలంటూ ఆంటోనీ గొడవ చేయడంతో శృతి వచ్చి అడుగుతుంది. దాంతో మీ రేఖ మేడంతో నాది 20 ఏళ్ల పరిచయం.. నా పేరు చెబితే ఆవిడే పరిగెత్తుకుంటూ వస్తుందని అంటాడు ఆంటోనీ. ఇదే విషయాన్ని రేఖకి శృతి చెప్పగా.. రేఖ షాకై పరిగెత్తుకుంటూ కిందకి వస్తుంది. దాంతో శృతికి అనుమానం వస్తుంది.

జీవితంలో నా కంటికి కనిపించొద్దని చెప్పాను కదా అని వార్నింగ్ ఇస్తుంది రేఖ. మీరు నా చేతిలో పెట్టిన బిడ్డ పెరిగిన బిడ్డ.. రోజూ మా అమ్మ ఎవరు? ఎక్కడుంది? అని అడుగుతున్నాడు. నాకు నెలకు లక్ష రూపాయలు ఇవ్వకపోతే నిజం చెప్పేస్తానని బ్లాక్‌మెయిల్ చేస్తాడు ఆంటోనీ. దాంతో డబ్బులు ఇవ్వడానికి రేఖ ఒప్పుకుంటుంది. ఇంతలో లక్కీ ఫోన్ చేసి నీకోసం రూమ్ రెడీ చేసి పెట్టానని చెప్పడంతో ఆంటోనీ సంతోషిస్తాడు. ఈ రేఖ నెలకు లక్ష ఇస్తుంది.. లక్కీ గాడు రూమ్, ఫుడ్ చూసుకుంటాడు ఇక హ్యాపీగా బతికేయొచ్చని అనుకుంటాడు ఆంటోనీ. తన కారు ఇంకా రాకపోవడంతో భ్రమరాంబ బాధపడుతుంది. మరోవైపు.. రాజ్ స్పీడుగా వెళ్లడంతో ఇందూ మండిపడుతుంది. నా గుండె స్పీడు చూస్తే వాడు చాలా ర్యాష్‌గా వెళ్తున్నాడని అనుకుంటుంది భ్రమరాంబ. నాకు నీ కారు ఒక్కసారి కూడా ఇవ్వలేదు. ఆ రాజ్ గాడు.. కారుని కారులా తీసుకొస్తాడన్న నమ్మకం లేదని అంటాడు శేషం. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X