Brahmamudi May 20th Episode: మాయ జోలికి పోవద్దంటున్న రాజ్..భర్త మాట వినేదే లేదంటున్న కావ్య!

సుభాష్ ఇచ్చిన డీటెయిల్స్ తీసుకొని మాయని వెతకటానికి బయలుదేరుతుంది కావ్య. కళ్యాణ్ తనకి నచ్చినట్లుగా ఉండటం లేదని పంచాయతీ పెడుతుంది అనామిక. మాయని వెతుకుతున్న కావ్య ని రౌడీలు కిడ్నాప్ చేస్తారు. అప్పు ద్వారా నిజం తెలుసుకున్న రాజ్ కావ్యని కాపాడుకుంటాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక మే 20వ తేదీ ఎపిసోడ్ 414 లో ఏం జరిగిందంటే..

రౌడీల నుంచి కావ్యని కాపాడి ఆమెని ఇంటికి తీసుకువచ్చిన రాజ్ ఆమెకి చివాట్లు పెడతాడు. కాస్తలో ఎంత ప్రమాదం తప్పింది, నేను రాకపోయి ఉంటే ఈపాటికి దేశం దాటేసే దానివి, అయినా నువ్వు ఏమైనా పెద్ద డిటెక్టివ్ వి అనుకుంటున్నావా అంటాడు. ఆ మాటలకి నవ్వుతుంది కావ్య. నేను తిడుతుంటే నువ్వు నవ్వుతున్నావ్ ఏంటి అని చికాకు పడతాడు రాజ్. మీ తిట్లు చాలా తియ్యగా ఉన్నాయి అని నవ్వుతుంది కావ్య. కామెడీలు చెయ్యకు.

Brahmamudi serial May 20th Episode of 414 Here is full story

బాబు విషయంలో నీకు అన్ని నిజాలు తెలుసు అన్న విషయం నాకు తెలుసు, ఇప్పుడేంటి ఆ మాయని తీసుకువచ్చి అమ్మకి నిజం నిరూపిస్తావా, అప్పుడు ఇంట్లో ఎంత గొడవ జరుగుతుందో నీకు తెలుసు కదా అంటాడు రాజ్. నేను అలా చేస్తానని ఎందుకు అనుకుంటున్నారు నాకు బిడ్డ తల్లి విషయంలో చాలా అనుమానాలు ఉన్నాయి అంటుంది కావ్య. ఏది ఏమైనా ఆ మాయ జోలికి వెళ్తే అప్పుడు తను బిడ్డని తీసుకొని వచ్చి ఇంట్లో రచ్చ చేస్తుంది, ఆమె జోలికి పోవద్దు అని హెచ్చరిస్తాడు రాజ్.

Brahmamudi serial May 20th Episode of 414 Here is full story

ఈ విషయంలో మీ మాట వినలేను, నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది కావ్య. మరోవైపు రుద్రాణి అనామిక కి ఎదురుపడుతుంది. తప్పుడు సలహా ఇచ్చినందుకు తిడుతుందేమో అని తప్పించుకోవాలని చూస్తుంది రుద్రాణి. కానీ అనామిక భర్త విడాకులు ఇచ్చేస్తాను అన్నందుకు బాధపడుతుంది. ఇప్పుడు ఏం చేయాలో తెలియటం లేదు అంటుంది. ముందు నువ్వు కళ్యాన్ ని ఒంటరి వాడిని చెయ్యు, ఇప్పుడు నీ మాట వింటాడు అంటుంది రుద్రాణి.

Brahmamudi serial May 20th Episode of 414 Here is full story

అంటే మా ఆయనని ఆ అప్పు నుంచి దూరం చేస్తే సరిపోతుంది, ఆ పనిలోనే ఉంటాను అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అనామిక. మీరు ఎప్పుడు ఇలాగే కొట్టుకుంటూ ఉండండి అప్పుడే కదా నా కొడుకుకి కాంపిటేషన్ రాకుండా ఉంటారు అనుకుంటుంది రుద్రాణి. మరోవైపు భర్తకి కాఫీ తీసుకొని వస్తుంది కావ్య. కానీ అతను తీసుకోడు. పైగా మాయ విషయంలో అన్వేషణ ఆపేయమంటాడు. మళ్ళీ నువ్వు ప్రమాదంలో పడితే రక్షించడానికి ప్రతిసారి నేను ఉండలేకపోవచ్చు అంటాడు.

Brahmamudi serial May 20th Episode of 414 Here is full story

నీ బాధ నేను ప్రమాదానికి గురవుతాననా లేదంటే నిజం తెలిస్తే మీ అమ్మ, నాన్న,మీరు ప్రమాదంలో పడతారనా నిజం చెప్పండి అంటుంది కావ్య. మళ్లీ తనే మాట్లాడుతూ నిజాన్ని వెలికి తీస్తాను, మీకు అత్తయ్యకి మామయ్యకి ఎలాంటి బాధ లేకుండా చేస్తాను అప్పటివరకు పగటిపూట నిద్రపోను అని శపధం చేస్తుంది కావ్య. మరోవైపు ఇంటికి వచ్చిన పంతులు గారిని ఏం పని మీద వచ్చారు మొన్నే కదా సీతారామ కళ్యాణం చేశారు అంటుంది రుద్రాణి.

మీరు ఒక్కరే ఖాళీగా ఉన్నారు మీకే సంబంధం తీసుకొని వచ్చి ఉంటారు అని వెటకారంగా మాట్లాడుతుంది స్వప్న. భద్రాచలం నుంచి అక్షింతలు వచ్చాయి వాటిని మీకు ఇద్దామని వచ్చాను. భర్తలు మనస్ఫూర్తిగా ఈ అక్షంతలు వేసి భార్యలను ఆశీర్వదిస్తే ఆ కాపురాలు చల్లగా ఉంటాయి అంటూ మగవాళ్ళందరి చేతిలోనూ అక్షింతలు పెడతారు పూజారి గారు. ముందుగా చిట్టి భర్త దగ్గర నుంచి ఆశీర్వచనం తీసుకుంటుంది. తర్వాత సుమిత్ర సుభాష్ కాళ్ళకి దండం పెడుతుంది.

Brahmamudi serial May 20th Episode of 414 Here is full story

అక్షింతలు వేయకుండా ఆలోచనలో పడతాడు సుభాష్. నీ మీద వేసే అక్షింతలు వేసి ఆశీర్వదించే అర్హత పోగొట్టుకున్నాను అని బాధపడతాడు. కానీ బయటికి ఏమి చెప్పలేక అక్షింతలు వేసి భార్యని ఆశీర్వదిస్తాడు. రాజ్ తన భార్య ని దీవించబోతే రుద్రాణి ఒక్క నిమిషం ఆగండి నాకు ధర్మ సందేహం ఉంది అని పంతులు గారితో మాట్లాడుతూ ఏకపత్నివ్రతలకే ఆశీర్వదించే అర్హత ఉంటుంది కదా అంటుంది. ఆ మాటలకి అత్తపై కోప్పడుతుంది రుద్రాణి.

తరువాయి భాగంలో బిడ్డ తల్లిని తీసుకొస్తానని వెళ్ళింది కదా కావ్య, ఏది, ఎక్కడ అని కోపంగా అడుగుతుంది సుమిత్ర. ఈరోజు కూడా ఓడిపోయాను అని ఇంటికి వస్తుందేమో అంటుంది రుద్రాణి. అంత లేదు, చేసిన పని కాస్త ఆలస్యం అవుతుందేమో గాని పని మాత్రం కంప్లీట్ చేస్తాను అంటూ అప్పుడే బయట నుంచి వచ్చిన కావ్య మాయని పిలుస్తుంది. అందరూ ఒక్కసారి గా షాక్ అవుతారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X