Brahmamudi May 21st Episode: రుద్రాణికి స్వప్న వార్నింగ్.. అమ్మాయి ట్రాప్‌లో రాహుల్, స్వప్న నగలకి గండం

బెడ్‌రూమ్‌లో రాజ్‌కి కనిపించేలా నా ఫోటో ఎందుకు పెట్టావని రుద్రాణిపై మండిపడుతుంది స్వప్న. నాకేం తెలియదని రుద్రాణి తప్పించుకోగా స్వప్న నవ్వుకుంటుంది. రుద్రాణి బెద్ రూమ్ నుంచి కోపంగా వచ్చిన రాజ్‌ని కావ్యను ఇంప్రెస్ చేయడానికి గిఫ్ట్ తీసుకొచ్చావా అని అడుగుతారు ఇందిర, అపర్ణ. రాజ్ శారీ చూపించడంతో ఇలాంటివి కాదని మోడ్రన్ డ్రెస్ ఇచ్చి కావ్య దగ్గరికి పంపిస్తుంది ఇందిర. ఆ డ్రెస్ చూసిన కావ్య.. రాజ్‌పై మండిపడుతుంది.

నీరసంగా వచ్చిన రాజ్‌ను చూసి ఏం జరిగిందని అడుగుతారు ఇందిర, అపర్ణ. నీ మనవరాలు నా ముఖంపై ఛీ కొట్టిందని, ఇకపై తాడో పేడో నేనే తేల్చుకుంటానని చెప్పి వెళ్లిపోతాడు రాజ్. నువ్వెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావని కావ్యపై మండిపడతారు అపర్ణ, ఇందిర. రాజ్‌కు ఫోటో చూపించే ప్లాన్ ఫెయిలైందని యామినికి చెబుతుంది రుద్రాణి. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక మే 21వ తేదీ ఎపిసోడ్ 727లో ఏం జరిగిందంటే?

Brahmamudi Serial May 21st 2025 Episode 727 Here is Today s full story

మా ప్లాన్‌కి ఒప్పుకుంటావా? లేదా? అని కావ్యని నిలదీస్తారు అపర్ణ, ఇందిర. నన్ను మాత్రం వదిలేయండి మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండని అంటుంది కావ్య. ఇది ఒప్పుకోకపోతే ఏమైంది నా మనవడు ఉన్నాడు కదా వాడి సైడ్ నుంచి మన ప్లాన్ వర్కవుట్ చేద్దామని అపర్ణతో అంటుంది ఇందిర. ఈ పెద్దవాళ్ల ఐడియాలు మనకు సెట్ కావడం లేదని, కళావతిని ఇంప్రెస్ చేయడానికి మనమే కొత్త రూట్ కనుక్కోవాలని అనుకుంటాడు రాజ్. ఇంతలో కళ్యాణ్ సిగ్గుపడుతూ ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తాడు. తమ్ముడు మంచి కవి కాబట్టి.. కళావతి మీద మంచి లవ్ లెటర్ రాయిద్దామని అనుకుంటాడు రాజ్.

రాజ్ దగ్గరికి వెళ్లేసరికి అప్పూకి ఫోన్ చేసి ముద్దు అడుగుతాడు కళ్యాణ్. ఆ మాటలు విన్న రాజ్ షాక్ అవుతాడు. కళ్యాణ్ వినిపించుకోకుండా ముద్దు అడుగుతుండటంతో అప్పూ ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. ఈ మాటలు విన్న కానిస్టేబుల్ నవ్వుకుంటుంది. మీరు ముద్దు ఇచ్చే వరకు సార్ వదిలేలా లేరని అంటుంది. స్టాఫ్ ఉన్నారని తగ్గి మాట్లాడుతుంటే రెచ్చిపోతున్నావేంటీ అని కళ్యాణ్‌పై మండిపడుతుంది అప్పూ. మన ఫస్ట్ నైట్‌కి ఏర్పాటు చేస్తానని గోల గోల చేయడంతో కళ్యాణ్‌కు ఫోన్‌లో అప్పూ ముద్దు ఇవ్వబోతుండగా రాజ్ ఫోన్ లాక్కొంటాడు.

మనకి దొరకాల్సింది ఇంకొకడికి దొరికిస్తుంటే కడుపు మంట అందుకే డిస్ట్రబ్ చేశానని చెబుతాడు రాజ్. మీ వదినని ఇంప్రెస్ చేయడానికి నీ హెల్ప్ కావాలని అడుగుతాడు రాజ్. అసలేం జరిగిందని కళ్యాణ్ అడగ్గా రాజ్ జరిగినదంతా చెబుతాడు. నానమ్మ మాట నమ్మి మా వదిన గురించి తెలిసి కూడా మోడ్రన్ డ్రెస్ ఇచ్చావా అని మండిపడతాడు కళ్యాణ్. పెళ్లి కానీ నీకు పెళ్లయిన వాడి కష్టాలు నీకేం తెలుసు.. నా ముద్దు మిస్ చేస్తావా అని ఫైర్ అవుతాడు. నువ్వొచ్చి లవ్ లెటర్ రాయడానికి హెల్ప్ చేయమని అడుగుతాడు రాజ్. ఇంతలో కానిస్టేబుల్ వచ్చి ముద్దు పెట్టారా? లేదా? అని అప్పూని అడుగుతుంది. ఆ మాటలతో సిగ్గుపడ్డ అప్పూ కానిస్టేబుల్‌పై కోప్పడుతుంది.

కళ్యాణ్‌- రాజ్‌లు కలిసి లవ్ లెటర్ రాస్తుంటారు. నేను కళావతి గారి ముఖాన్ని వర్ణిస్తూ ఉంటా నువ్వు నీ కవి హృదయంతో లెటర్ రాయమని చెబుతాడు రాజ్. లెటర్ ఎలాగోలా పూర్తి చేసిన కళ్యాణ్.. దానిని వదినకి ఇవ్వమని రాజ్‌కి ఇస్తాడు. నువ్వే జీవితమని బతుకుతుంది వదిన.. నిన్ను కాదనుకుని ఎక్కడికి వెళ్తుందని మనసులో అనుకుంటాడు కళ్యాణ్. ఇంట్లో ఉన్న వాళ్ల వరసల గురించి రాజ్‌కి చెప్పి.. కావ్య స్థానం ఏంటో తెలియజేయాలని అనుకుంటుంది రుద్రాణి. లెటర్ తీసుకుని వస్తున్న రాజ్‌కి రుద్రాణి ఎదురై నాకు తెలియకుండా ఏదో దాస్తున్నావ్? చూపించమని అంటుంది.

నీ లైఫ్ గురించి నీకు ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలని అంటుంది రుద్రాణి. నేను కూడా ఓ ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నానని అడ్డు తప్పుకోండి అని మండిపడతాడు రాజ్. నేను కళావతి గారి దగ్గరికి వెళ్తున్నానని రాజ్ అనగా.. నేను చెప్పేది కూడా కళావతి గురించేనని అంటుంది రుద్రాణి. మాటలతో షాకైన రాజ్ ఏంటది చెప్పమని అడుగుతాడు. ఇంట్లో ధాన్యలక్ష్మీ ఉంది తనకొక కొడుకు ఉన్నాడు.. అతనికి పెళ్లయ్యింది కాబట్టి కోడలు ఉంది అంటుంది. నాకు కొడుకు ఉన్నాడు, వాడికి పెళ్లయ్యింది కాబట్టి స్వప్న ఉంది అని చెబుతుంది. అలాగే మా వదినకి కూడా అని రుద్రాణి చెప్పబోతుండగా.. ఈ ఇంట్లో వాళ్ల వరసల గురించి నేను సాయంత్రం వింటానని కోప్పడతాడు రాజ్. నువ్వు ఇది ఇప్పుడే వినాలని చెబుతుంది రుద్రాణి. కొంపలు కూల్చే పని తప్ప వేరే పని ఉండదని మా అమ్మా నాకు చెప్పిందని అంటాడు రాజ్. మీ మాటలు వినడానికి నాకు టైం లేదు, ఓ గంట తర్వాత తీరిగ్గా వింటానని వెళ్లిపోతాడు.

కావ్యకి పెళ్లయిపోయిందని చెబుదామనుకుంటే ఇలా వెళ్లిపోయాడేంటీ అనుకుంటుంది రుద్రాణి. ఇంతలో స్వప్న వచ్చి నీకు కొంచెం కూడా సిగ్గు లేదా? నా చెల్లెలి విషయం బయటపెడితే నీకేం వస్తుందని మండిపడుతుంది స్వప్న. రాజ్‌కి తనకు తానుగా గతం గుర్తురావాలని ఇంట్లో వాళ్లంతా ప్రయత్నిస్తుంటే నువ్వు మాత్రం తన ప్రాణాలతో ఆడుకోవాలని ఎందుకు అనుకుంటున్నావని ఫైర్ అవుతుంది. రాజ్ అంటే నాక్కూడా ఇష్టమే అని కవర్ చేసుకుంటుంది రుద్రాణి. అందుకేనా నీ బెడ్‌రూమ్‌లో కావ్య పెళ్లి కూతురు గెటప్‌లో ఉన్న ఫోటోని పెట్టి రాజ్‌క చూపించాలని అనుకున్నావా అని ప్రశ్నిస్తుంది. అయితే ఆ ఫోటో మార్చింది నువ్వేనా అని నిలదీస్తుంది రుద్రాణి. నువ్వు నా చెల్లెలు విషయం బయటపెట్టాలని అనుకుంటే నేను చూస్తూ ఉండాలా అని కౌంటర్ వేస్తుంది. ఇంకోసారి నా చెల్లెలి జోలికి వస్తే మీ ఇద్దరికి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ స్టార్ట్ అవుతుందని వార్నింగ్ ఇస్తుంది స్వప్న.

ఇంతలో ఓ అమ్మాయితో ఎంజాయ్ చేస్తుంటాడు రాహుల్. నేను ఏడు వారాల నగలు అడిగితే నువ్వేం తీసుకొచ్చావని ఫైర్ అవుతుంది ఆ అమ్మాయి. నా వైఫ్ నన్ను దూరం పెడుతుంది కాబట్టే నేను ఇక్కడికి వచ్చానని అంటాడు. నువ్వు నిజంగా నన్ను లవ్ చేస్తే మీ ఇంట్లో ఉన్న ఏడు వారాల నగలు తీసుకుని రా అని తేల్చి చెబుతుంది. ఆ నగలు నా చేతుల్లోకి రాగానే నీకు ఇస్తానని అంటాడు రాహుల్. దీనిని నా సొంతం చేసుకోవాలంటే ఆ నగలు కొట్టేయాల్సిందేనని అనుకుంటాడు రాహుల్. రాజ్‌ని చూసిన కావ్య లోపలికి పరుగులు తీస్తుంది. నేను రావడం చూసి ఎందుకు లోపలికి వచ్చేశారని ప్రశ్నిస్తాడు రాజ్. నా రూమ్‌లోకి ఎందుకొచ్చారని కావ్య అడగ్గా లవ్ లెటర్ ఇస్తాడు రాజ్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X