Brahmamudi May 21st Episode: వెంకీకి నందూ ప్రేమ పరీక్ష... రాజ్ ప్రాణాల కోసం చలపతి- లక్ష్మీ ఆందోళన
Photo Courtesy: JioHotstar
భ్రమరాంబ దగ్గర కారు కోట్టేసి ఆఫీస్‌కి ఇందూని తీసుకెళ్తాడు రాజ్. ఇందూ- రాజ్‌లు ఆఫీస్‌కి వెళ్లడం చూసి సుభాష్- అపర్ణలు సంతోషిస్తారు. వాళ్లిద్దరూ ఆఫీస్‌కి వెళ్తుంటే రాజ్- కావ్యలు వెళ్తున్నట్లే ఉందని అపర్ఱ అంటుంది. దేవుడు మన కొడుకు- కోడల్ని దూరం చేశాడు. కానీ వాళ్ల రూపంతోనే ఇందూ- రాజ్‌లను మళ్లీ పుట్టించాడని చెబుతాడు సుభాష్. ఆఫీస్‌లో పెండింగ్ వర్క్స్ పెరిగిపోవడంతో శృతిపై సీరియస్ అవుతుంది రేఖ. శాలరీలు ఇచ్చే వరకు ఎంప్లాయిస్ వర్క్ చేయమని చెప్పేశారని అంటుంది శృతి. దాంతో అందరినీ పిలిచి మాట్లాడుతుంది రేఖ. శాలరీ టైంకి పడకపోతే మధ్య తరగతి జీవితాలు దారుణంగా తయారవుతాయని అంటారు ఉద్యోగులు. శాలరీ ఇస్తేనే పనిచేస్తామని లేదంటే లేదని తేల్చేస్తారు. నన్ను బెదిరిస్తే మీ పేర్లను బ్లాక్ లిస్ట్‌లో పెడతాను. మీకు ఎక్కడా ఉద్యోగాలు లేకుండా చేస్తానని వార్నింగ్ ఇస్తుంది రేఖ.
ఇంతలో ఇందూ- రాజ్‌లు ఆఫీస్‌కి రావడంతో రేఖ షాక్ అవుతుంది. వాడిని ఇక్కడికెందుకు తీసుకొచ్చావని అడగ్గా.. అతనే నన్ను ఆఫీస్‌కి తీసుకెళ్లమన్నాడని చెబుతుంది ఇందూ. మీ అందరికీ నేను అండగా ఉంటాను, త్వరలోనే మీ శాలరీ మీకు వచ్చేలా చేస్తానని ఇందూ చెప్పడంతో ఉద్యోగులు తిరిగి పనుల్లోకి దిగుతారు. ఆఫీస్ దగ్గరికి వచ్చిన ఆంటోనీ.. రేఖను కలవాలని శృతితో గొడవపడుతుండగా అతను వచ్చిన విషయాన్ని రేఖకి చెబుతుంది శృతి. దాంతో కంగారుపడిన రేఖ పరిగెత్తుకుంటూ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఆంటోనీని పక్కకి తీసుకెళ్లి మాట్లాడుతుంది. నాకు నెల నెలా లక్ష రూపాయలు ఇస్తే ఓకే లేదంటే మీ అక్రమ సంతానం గురించి చెప్పేస్తానని వార్నింగ్ ఇవ్వడంతో రేఖ ఒప్పుకుంటుంది. ఆంటోనీకి లక్కీ ఫోన్ చేసి మా అమ్మ ఆచూకీ ఏమైనా దొరికిందా అని అడుగుతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక మే 21వ తేదీ ఎపిసోడ్ 1038లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
రాజ్ నా కారుతో వస్తాడో లేదోనని టెన్షన్ పడుతుంది భ్రమరాంబ. ఇంతలో రాజ్ కారుతో సేఫ్‌గా రావడంతో భ్రమరాంబ సంతోషిస్తుంది. ఇకపై నా కారు అడగొద్దని వార్నింగ్ ఇస్తుంది. నేను ఆఫీస్‌కి వెళ్లినన్ని రోజులు నీ కారునే తీసుకెళ్తానని రాజ్ చెప్పడంతో భ్రమరాంబ షాక్ అవుతుంది. కారును క్లీన్ చేయమని చెప్పి రాజ్ వెళ్తాడు. ఇదంతా చూసిన అపర్ణ నవ్వుకుంటుంది. రాజ్ తమ్ముడు వెంకీని రెస్టారెంట్‌కి తీసుకొస్తుంది నందూ. బ్రహ్మముడి డేటింగ్ యాప్ నుంచి నీ ప్రొఫైల్‌కి సెట్ అయ్యేలా ముగ్గురు అమ్మాయిల్ని సెలెక్ట్ చేశానని నందూ చెబుతుంది. ఆ ముగ్గురిని నేనే సెలెక్ట్ చేసినా ఒకరిని సెట్ చేసుకోవాల్సిన బాధ్యత నీదేనని చెబుతుంది.
నాకు ట్రూ లవ్ కావాలి.. అగ్నిలా ఉండే అమ్మాయి కావాలని నన్ను చంపుతున్నావు. చీటికిమాటికి నాకు ఫోన్ చేయడం, మెసేజ్‌లతో నన్ను చంపుతున్నావు. నాకెందుకు ఈ బాధ.. అందుకే ఒక అమ్మాయిని సెట్ చేస్తే నేను హ్యాపీగా ఉంటా. వాళ్లతోనే ఛాటింగ్, ఫోన్స్ చేసుకుంటావని అంటుంది నందూ. ఆ ముగ్గురు వన్ బై వన్ వస్తారు.. ఒక్కొక్కరితో జాగ్రత్తగా మాట్లాడమని చెబుతుంది. ఇంతలో వెంకీ కోసం ఒక అమ్మాయి రెస్టారెంట్‌కి వస్తుంది. ఇంతకుముందులా మోసపోకుండా వీళ్లకి బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడో లేడో తెలుసుకోవాలని అనుకుంటాడు వెంకీ.
అయితే ఆ అమ్మాయి నాకు చాలా బ్రేకప్స్ జరిగాయని చెప్పడంతో వెంకీ షాక్ అవుతాడు. నిజమైన ప్రేమ దొరికే వరకు నాకు నచ్చేవాడిని వెతుకుతూనే ఉంటానని అంటుంది. నాలో కూడా నీకు నిజమైన ప్రేమ దొరక్కపోతే వదిలేస్తావా అని అడుగుతాడు వెంకీ. ఖచ్చితంగా వదిలేసి మరొకరినీ చూసుకుంటానని ఆ అమ్మాయి చెప్పడంతో వెంకీ షాక్ అవుతాడు. నా ఫోన్ ఎవరికీ ఇవ్వను, పాస్‌వర్డ్ కూడా చెప్పనని ఆ అమ్మాయి అనడంతో వెళ్లిపోమ్మని చెబుతాడు. ఇదంతా చూసిన నందూ.. నేను చెప్పినట్లు కాకుండా మరోలా ఎందుకు మాట్లాడావని మండిపడుతుంది. నాకు ట్రూ లవ్ కావాలి.. వాళ్ల ఫోన్‌లో, మనసులో ఏముందో తెలియకుండా ముందుకు వెళ్లలేనని చెబుతాడు వెంకీ. నందూ చెప్పినట్లు మరో అమ్మాయి వచ్చి.. నా ప్రైవసి, ఫ్రీడమ్ గురించి అడగకూడదని చెప్పడంతో నీకు నాకు సెట్ అవ్వదని వెళ్లిపోమంటాడు వెంకీ.
చలపతి- వెంకీ వీడియో కాల్ చేయడంతో రాజ్ షాక్ అవుతాడు. రాజ్ సూట్ బూట్‌లో ఉండటంతో అంత కాస్ట్‌లీ బట్టలు వేసుకున్నావు? ఎక్కడున్నావని అడుగుతాడు చలపతి. నీ కొడుకులా అనిపించడం లేదా? కోటీశ్వరుల ఇంటి బిడ్డలా అనిపిస్తున్నానా అంటాడు రాజ్. నువ్వు నిజంగానే కోటీశ్వరుల బిడ్డవని లక్ష్మీ బాధపడుతుంది. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లావు? ఒక ఫోన్ లేదు? మెసేజ్ లేదు? ఆ లక్కీగాడికి కూడా ఏం తెలియదు అంటున్నాడని క్లాస్ పీకుతాడు చలపతి. బిజినెస్‌లో ఉన్నాను.. రిచ్‌గా పర్మినెంట్‌గా ఉండాలంటే చాలా కష్టపడాలని చెబుతాడు రాజ్.
మాకన్నా బిజినెస్ ఎక్కువైపోయిందా? మీ నాన్న నీకు అడ్డుచెప్పడు.. నువ్వు మా కళ్ల ముందుంటే చాలని అంటుంది లక్ష్మీ. బిజినెస్‌లో ఉంటే చాలా పనులు ఉంటాయి, వంద లావాదేవీలు ఉంటాయని చెబుతాడు రాజ్. రాత్రికి చికెన్ తీసుకొస్తాను ఇంటికి రమ్మని పిలుస్తాడు చలపతి. నువ్వు చికెన్ తీసుకొచ్చినా ఇంటికి రానని చెబుతాడు రాజ్. మనకి ఈ బిజినెస్‌లు వద్దు.. ఉన్న దానిలో సంతోషంగా ఉందాం, నువ్వు ఏ పని చేయకపోయినా పర్లేదు. బిజినెస్ అంటే పెద్ద పెద్ద వాళ్లతో శత్రుత్వం ఉంటుంది.. ఎప్పుడు ఎవరైనా నిన్ను ఏమైనా చేస్తారని భయంగా ఉందని అంటారు లక్ష్మీ, చలపతి. నేను బిజినెస్‌లో మునిగిపోయాను.. నా పనులన్నీ పూర్తి చేసే వరకు ఇంటికి రాను. మీ పేరు నిలబెట్టి, ఇంద్రభవనం లాంటి ఇంట్లో ఉంచుతానని అంటాడు రాజ్. బిజినెస్ వద్దంటే వాడు వినడు.. అయినా అది వాడి రక్తంలోనే ఉందని లక్ష్మీతో చెబుతాడు చలపతి.
రాజ్ ఫోన్‌లో మాట్లాడి వెనక్కి తిరిగి చూసేసరికి అపర్ణ ఉండటంతో షాక్ అవుతాడు. మా కష్టాలన్నీ తీర్చడానికి ఆ దేవుడు నిన్ను మా ఇంటికి పంపించాడు. ఈరోజు నా మనవరాలిని ఆఫీస్‌కి తీసుకెళ్లాక నాకు ధైర్యం వచ్చింది. ఆస్తిని, కంపెనీని అన్నింటిని నువ్వు కాపాడతావన్న ధైర్యం వచ్చింది. మా కన్నీళ్లు తుడవటానికి నువ్వు మా ఇంటికి వచ్చావు.. నా మనవరాలికి ఎప్పుడు ఇలాగే తోడుగా ఉంటావా అని అడుగుతుంది. జీవితాంతం తోడుగా ఉంటానని రాజ్ చెప్పడంతో అపర్ణ సంతోషిస్తుంది. ఈ ఆస్తికి వారసురాలు నా మనవరాలు.. కానీ తాను ఇంట్లో పనిమనిషిగా అన్ని పనులు చేస్తోంది. ఓ మూలన చిన్నగదిలో ఉంటుందని అపర్ణ బాధపడటంతో నేను చూసుకుంటానని అంటాడు రాజ్. అపర్ణకి మాటిచ్చినట్లు రాజ్ ఇంట్లో పెద్ద గొడవ చేస్తాడు. నాకు మర్యాదలు కావాలి, రెస్పెక్ట్ కావాలని చెబుతాడు. ఇంటికి అల్లుడిని అయ్యుండి.. అలాంటి ముష్టి రూమ్‌లో ఉండాలా అనడంతో అంతా షాక్ అవుతారు.


Click it and Unblock the Notifications