Brahmamudi may 21th episode: కళ్యాణ్ ప్రవర్తన సరి చేసుకోమంటున్న కావ్య.. భయంతో వణికి పోతున్న మాయ!

కళ్యాణ్ తనకి నచ్చినట్లుగా ఉండటం లేదని పంచాయతీ పెడుతుంది అనామిక. మాయని వెతుకుతున్న కావ్య ని రౌడీలు కిడ్నాప్ చేస్తారు. అప్పు ద్వారా నిజం తెలుసుకున్న రాజ్ కావ్యని కాపాడుకుంటాడు. తర్వాత మాయ జోలికి వెళ్ళొద్దంటూ హెచ్చరిస్తాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక మే 21వ తేదీ ఎపిసోడ్ 415 లో ఏం జరిగిందంటే..

రుద్రాణి అడిగిన సందేహానికి అత్త మీద కోప్పడుతుంది స్వప్న. సింగల్ గా ఉంది కదా అందుకే ఏ జంటలనైనా చూస్తే కడుపు మంట, అంత మంటగా ఉంటే ఆ అక్షంతలు తీసుకొని మీ వారి దగ్గరికి వెళ్ళండి అంటుంది కావ్య. ఆశీర్వచనం కోసం అక్కడికి వెళ్ళవలసిన అవసరం నాకు లేదు అంటుంది రుద్రాణి. అలాంటప్పుడు ఎలాంటి అధర్మసందేహాలు అడగకుండా ఎవరికి లేనిపోని సందేశాలని ఇవ్వకుండా ఉండండి. ఎవరు ఏమనుకున్నా నా భర్త నా దృష్టిలో శ్రీరామచంద్రుడే అని భర్త దగ్గర ఆశీర్వచనం తీసుకుంటుంది కావ్య.

Brahmamudi serial May 21th Episode of 415 Here is full story

ఆ తర్వాత స్వప్న అనామిక తో మాట్లాడుతూ నువ్వు కూడా మా అత్త లాగా సింగిల్ గా ఉంటావా ఏంటి, వెళ్లి నీ భర్త దగ్గర తీసుకో అంటుంది. అక్షింతలు తీసుకుని కళ్యాణ్ దగ్గరికి వెళుతుంది అనామిక.అక్షింతలు వెయ్యమని ఆర్డర్ వేస్తుంది. అలా ఆర్డర్ వేస్తే ఏ మొగుడు అక్షింతలు వేయడు, అయినా పవిత్రమైన అక్షింతలు నీలాంటి సూర్పణక మీద వేయకూడదు, భార్యాభర్తలు కలకాలం కలిసి ఉండాలని వేస్తారు కానీ నీతో నేను కలిసి ఉండాలని కోవటం లేదు.

విడిపోవాలనుకుంటున్నాను కాబట్టి అక్షింతలు వెయ్యను అని అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఈ సంఘటన అంతా కావ్య చూస్తుంది. పద్ధతి బాగోలేని భార్యని దారిలోకి తెచ్చుకోవాలి అంతేగాని మీరే దారితప్పి ప్రవర్తించకూడదు, ఏమంత కష్టాలు పడిపోతున్నారని ఆమె నుంచి విడిపోవడానికి, నా పెళ్లి నాటికి ఈ ఇంట్లో నన్ను ఎవరూ గుర్తించలేదు ఇప్పటికీ ఈ ఇంట్లో నా స్థానం కోసం పోరాడుతూనే ఉన్నాను.

Brahmamudi serial May 21th Episode of 415 Here is full story

అయినా విడాకులు ఇస్తానంటే ఇంట్లో ఎవరూ మీకు సపోర్ట్ చేయరు. భార్యని మార్చుకునే ప్రయత్నం చేయండి అని చెప్పి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్ లో కావ్య కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అప్పు. అప్పుడే అక్కడికి వచ్చిన కావ్య మాయ ఇల్లు ఎక్కడ అనటంతో కావ్యకి ఇల్లు చూపించి ఆమెని ఆ ఇంటికి తీసుకు వెళుతుంది అప్పు. మొదట వారిద్దరిని చూసిన మాయ వాళ్ళు ఎవరో తెలియనట్లు ప్రవర్తిస్తుంది కానీ అప్పు బెదిరించడంతో జరిగిందంతా చెప్తుంది.

బిడ్డ తండ్రి సుభాష్ కాదని డబ్బున్న వాడు కావడంతో పరువు కోసం అన్నీ ఒప్పుకుంటాడని ఇలా చేసాము అంటుంది. ఆమె చెంప పగలగొడుతుంది కావ్య.అదే విషయాన్ని మా ఇంట్లో ఒప్పుకో, నీ వలన మా ఇల్లు ముక్కలైపోయే పరిస్థితికి వచ్చింది అంటుంది కావ్య. రావటానికి ఒప్పుకోదు మాయ. అలా అయితే పద పోలీస్ స్టేషన్ కి వెళ్దాం అక్కడే నిజం చెబుదువు గానివి అంటుంది అప్పు. పోలీస్ స్టేషన్ కి వద్దు అంటూ భయంతో వణికి పోతుంది మాయ.

Brahmamudi serial May 21th Episode of 415 Here is full story

పోలీసులు అంటే అంత భయపడుతుంది అంటే ఇంతకుముందు కూడా ఏవో వెధవ వేషాలు వేసి ఉంటుంది అంటుంది అప్పు. తన గతంతో నాకు పని లేదు తను చెప్పిన నిజంతో నా భర్త మీద పడినప్పుడు అపవాదు చెరిగిపోవాలి, ఆయనని ఇన్ని రోజులు బాధ పెట్టినందుకు ఇంట్లో వాళ్ళందరూ పశ్చాతాప పడాలి అంటూ బలవంతంగా మాయని తమతో పాటు తీసుకువస్తారు అప్పు, కావ్య. మరోవైపు బిడ్డ తల్లిని తీసుకు వస్తానని మీ ముద్దుల మనవరాలు బయటికి వెళ్ళింది ఇంకా రాలేదేంటి అని చిట్టిని అపర్ణ అడుగుతుంది.

Brahmamudi serial May 21th Episode of 415 Here is full story

తను కూర్చున్న కొమ్మని తానే నరుక్కోవటానికి వెళ్ళిందా పిచ్చిది అంటుంది చిట్టి. నిజం నిరూపించుకోలేక,నీకు మొహం చూపించలేక వెళ్ళిపోయి ఉంటుంది అంటుంది రుద్రాణి. అప్పుడే అక్కడికి వచ్చిన కావ్య నాకు ఆ అవసరం లేదు చేసిన పని ఆలస్యం కావచ్చు కానీ కచ్చితంగా చేసి తీరతాను అంటూ మాయని పిలుస్తుంది కావ్య. మీకు మాటిచ్చినట్లుగా బిడ్డ తల్లిని తీసుకువచ్చాను అని అపర్ణతో అంటుంది. మాయతో నిజం చెప్పమని చెప్తుంది కావ్య.

తరువాయి భాగంలో ఆ బిడ్డ తల్లిని నేనే అని చెప్తుంది మాయ. మరి తండ్రి ఎవరు అని అడుగుతుంది అపర్ణ. రాజ్ అని చెప్తుంది మాయ. అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X