Brahmamudi May 22nd Episode: దుగ్గిరాల వారింట్లో యామిని చిచ్చు.. రాజ్ ముందు కావ్యని ఇరికించిన రుద్రాణి

Photo Courtesy: JioHotstar

రాజ్‌కు గతం గుర్తుచేసేలా మీరు వేసే ప్లాన్స్‌కి నేను హెల్ప్ చేయనని ఇందిర, అపర్ణలకి కావ్య తేల్చిచెబుతుంది. నువ్వు హెల్ప్ చేయపోయినా నా మనవడి నుంచి కథ నడుపుకొస్తామని కావ్యకి చెబుతారు అత్తాకోడళ్లు. కళ్యాణ్‌తో లవ్ లెటర్ రాయించి కళావతిని ఇంప్రెస్ చేయాలని అనుకుంటాడు రాజ్. కావ్య దగ్గరికి వెళ్తుండగా దుగ్గిరాల వారింట్లో ఎవరికి ఎవరు ఏమవుతారో వరసలు చెబుతుంది రుద్రాణి. కావ్య దగ్గరికి వెళ్లొచ్చిన తర్వాత మీ కబుర్లు వింటానని రాజ్ వెళ్లిపోతాడు.

ఆ వెంటనే స్వప్న వచ్చి బెడ్ రూంలో కావ్య ఫోటో ప్లేస్‌లో నా ఫోటో పెట్టింది నేనే అని రుద్రాణితో చెబుతుంది స్వప్న. రాహుల్ ఓ అమ్మాయితో రొమాన్స్ చేస్తుంటాడు. అయితే మీ ఆవిడ ఏడు వారాల నగలు తీసుకొచ్చి ఇస్తేనే నీతో గడుపుతానని రాహుల్‌తో చెప్పడంతో స్వప్న నగలపై అతని కన్ను పడుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక మే 22వ తేదీ ఎపిసోడ్ 728లో ఏం జరిగిందంటే?

Brahmamudi Serial May 22nd 2025 Episode 728 Here is Today s full story

రాజ్ తీసుకొచ్చిన లవ్ లెటర్ చూసిన కావ్య పకపక నవ్వుతుంది. చివరిలో కళ్యాణ్ సంతకం ఉండటంతో లవ్ లెటర్ ఎవరైనా సొంతంగా రాస్తారని, మీరు కాపీ కొట్టి తీసుకొచ్చారని మండిపడుతుంది. దాంతో రగిలిపోయిన రాజ్.. కత్తి తీసుకుని కళ్యాణ్ మీదకి వెళ్తాడు. ఇది చూసిన ఇందిర, అపర్ణలు రాజ్‌ను అడ్డుకుంటారు. వీడు నా ప్లాన్ మొత్తం చెడగొట్టాడని, లవ్ లెటర్ చివరిలో వీడి సంతకం పెట్టి నన్ను ఇరికించేశాడని రాజ్ మండిపడతాడు. ఇదంతా చూసి కళావతి నవ్వుకుంటుంది.

మా ఐడియాలు ముసలివి, ఔట్ డేటెడ్ అయిపోయాయి, యూత్‌ఫుల్‌గా ఆలోచించి ఇంప్రెస్ చేస్తాను అన్నావ్ కదా ఇలాగేనా ఇంప్రెస్ చేసేది అని ఇందిర చురకలు వేస్తుంది. మాది ఓల్డే అయినా గోల్డే అంటుంది అపర్ణ. మీ వల్లే కళావతి నన్ను అపార్ధం చేసుకుంది కాబట్టి.. ఇప్పుడు మీ సాయంతోనే తనని ఇంప్రెస్ చేస్తానని చెబుతాడు రాజ్. నా కోసం మీరు ఇలా ఆరాటపడటం, నా ప్రేమను దక్కించుకోవడానికి మీరు తపన పడటం నాకు బాగా నచ్చిందని అనుకుంటుంది కావ్య.

ఇంతలో కావ్యకి యామిని ఫోన్ చేస్తుంది. నీ మొగుడు నీ చుట్టూ తిరుగుతున్నాడని తెగ సంబరపడిపోతున్నావా అని రెచ్చగొడుతుంది. నువ్వే నా మొగుడు అని ఒప్పేసుకున్నావ్, చివరికి అదే నిజమవుతుందని అంటుంది కావ్య. దానిని గతంగా మార్చి భవిష్యత్తులో రాజ్‌ని నా మొగుడిని చేసుకోవడానికే నేను ప్రయత్నిస్తున్నానని అంటుంది యామిని. ఏదో ఒక్క రోజు రాజ్ నీ దగ్గరికి వచ్చేశాడు కదా అని మరి అంత కాన్ఫిడెంట్‌గా ఉండొద్దని చెబుతుంది. ఆయన ఏదో ఒక రోజు మా ఇంటికి రాలేదు, ఆయన నా మెడలో వేసిన మూడు ముళ్ల సాక్షిగా ఇది మూడో రోజని అంటుంది కావ్య.

నాకు మూడు సార్లు బహుమతి కూడా ఇచ్చారని, నువ్వే కుళ్లుకుని చావమని వార్నింగ్ ఇస్తుంది కావ్య. నీ మొగుడని చెప్పుకుంటున్న వాడు మా ఇంట్లో ఉంటున్నాడని చుట్టపు చూపుగా మీ ఇంటికి వస్తున్నాడని అంటుంది యామిని. అక్కడ ఎంతసేపు ఉన్నా తిరిగి మా ఇంటికి రావాల్సిందేనని చెబుతుంది. ఏదో ఒక రోజు శాశ్వతంగా ఆయన నా దగ్గరికి వస్తారని, నువ్వు అంటున్న కాళరాత్రి నీ జీవితంలోకి వస్తుందని చెబుతుంది కావ్య. కష్టాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న నా జీవితాన్ని పూలదారిగా మార్చుకున్నానని, కోడలిగా నేను పనికిరానన్న ఇంట్లో వాళ్ల చేత శెభాష్ అనిపించుకున్నానని చెబుతుంది కావ్య. అలాంటిది నీలాంటి సైకోని ఓడించలేనా? అని ప్రశ్నిస్తుంది కళావతి.

ఏదైనా నాది అనుకుంటే అది దక్కాల్సిందేనని డైలాగులు చెబుతుంటావ్ కదా.. దానిని సైకోయిజమని అంటారని మండిపడుతుంది. తప్పు నీది కాదు మీ అమ్మానాన్నలది, నీ చిన్నప్పుడే డాక్టర్‌ని చూపించి ఉంటే ఇలా అయ్యేదానివి కాదని అంటుంది కావ్య. నా గురించి ఇంత తెలుసుకున్న దానివి నేను కొట్టే దెబ్బ గురించి కూడా తెలుసుకోవాల్సిందని చెబుతుంది యామిని. ధర్మం మీద అధర్మం ఎప్పుడూ నెగ్గదని, నీగతి కూడా అంతేనని వార్నింగ్ ఇస్తుంది కావ్య.

కావ్య అన్న మాటలతో రగిలిపోయిన యామిని వెంటనే రుద్రాణికి ఫోన్ చేస్తుంది. కావ్యని ఊపిరి ఆడకుండా చేయ్యాలని కొత్త ప్లాన్ వేశానని చెబుతుంది. రాజ్‌కి మీరు నిజం చెబితే అది నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు అదే ఆ ఇంట్లోవాళ్లు నోరు తెరిచి నిజం చెబితే తప్పకుండా నమ్ముతారని అంటుంది యామిని. కానీ అలా అడగ్గానే మా ఇంట్లో వాళ్లు నిజం చెప్పరు కదా అని రుద్రాణి అడగ్గా.. అడిగేవాళ్లు అడిగితే నిజం వాళ్లే చెబుతారని అంటుంది యామిని. జనాభా లెక్కల అడగటానికి వచ్చినట్లుగా నా మనుషులు మీ ఇంటికి వస్తారని, అక్కడ ఎవరికి ఎవరు? ఎమవుతారో వాళ్లే తేలుస్తారని చెబుతుంది యామిని.

దుగ్గిరాల వాళ్లంతా ఇంట్లో మాట్లాడుకుంటూ ఉండగా ఎవరో పాట పాడుతున్న సౌండ్ వినిపిస్తుంది. అది రాజ్ కావడంతో అంతా షాక్ అవుతారు. పాట ద్వారా కావ్యకి సారీ చెప్పి ఆమెను ఇంప్రెస్ చేస్తాడు రాజ్. ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉన్న సమయంలో ఓ వ్యక్తి ఇందిర, అపర్ణలకి ఎదురుపడతాడు. నేను జనాభా లెక్కలు రాసుకోవడానికి వచ్చానని పరిచయం చేసుకుంటాడు. పర్మిషన్ తీసుకోకుండా అలా లోపలికి వచ్చేస్తారా? మీ ఐడీ కార్డ్ చూపించమని ఇందిర అడగటంతో వాళ్లతో గొడవలెందుకని అపర్ణ సర్దిచెబుతుంది. నేను బయట మీకు అన్ని విషయాలు బయట చెబుతానని అపర్ణ చెప్పగా.. అలా కుదరదని అందరినీ లైవ్‌లో చూడాల్సిందేనని చెబుతాడు ఆ వ్యక్తి.

ఇంతలో కావ్యని ప్రకాశం పిలవడంతో అపర్ణ, ఇందిర షాక్ అవుతారు. రాజ్ కూడా వచ్చి నా పేరు రాసుకోండి అని చెబుతాడు. ఈ ఇంటికి నేను దత్తపుత్రుడినని చెప్పడంతో నీకు అప్పుడే కుదరదని దుగ్గిరాల వారింటి పేరుతో ఆధార్ కార్డ్ తీసుకోవాలని అంటుంది రుద్రాణి. ఆ తర్వాత సుభాష్ ఇంట్లో వాళ్ల పేర్లు ఒక్కొక్కటిగా చెబుతుంటాడు. దాంతో ఇప్పుడు నేను ఈ కుటుంబానికి ఏమవుతాను, నా భర్త ఎవరు అని అడుగుతారు కదా అని కావ్య టెన్షన్ పడుతుంది. సుభాష్ కూడా తన కొడుకు, కోడలి పేరు చెప్పబోతూ ఆగిపోతాడు. దాంతో రాజ్ కల్పించుకుని కొడుకు ఉండేవాడు, ఇప్పుడు లేడని చెబుతాడు. అందరూ అయిపోయినట్లే కదా? ఇంకెవరూ లేరు కదా అని ఆ ఆఫీసర్ వెళ్లిపోబోతుండగా రుద్రాణి ఆగమని చెబుతుంది. కళావతి గురించి చెప్పడం మరిచిపోయారని గుర్తుచేస్తుంది. మీ అత్తయ్య మరిచిపోతే, నువ్వు కూడా మరిచిపోయావా? అని రుద్రాణి ఇరికిస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X