Brahmamudi May 22nd Episode: ఆస్తి కోసం రాజ్‌ని ట్రాప్ చేస్తోన్న రేఖ.. ఒకే బెడ్‌పై రాజ్- ఇందూ
Photo Courtesy: JioHotstar
రాజ్ కారులో ఎలా వస్తాడో? నా కారు సేఫ్‌గా వస్తుందా లేక పార్ట్స్‌గా వస్తుందా అంటూ శేషం దగ్గర టెన్షన్ పడుతుంది భ్రమరాంబ. ఇంతలో కారులో వేగంగా వస్తాడు రాజ్. ఇకపై నా కారును నువ్వు అడగొద్దని వార్నింగ్ ఇస్తుంది భ్రమరాంబ. నాకు నచ్చిన దానిని లాక్కుంటే నాకు మండిపోతుందని.. నేను ఆఫీస్‌కి వెళ్లినంత కాలం నీ కారులోనే వెళ్తానని చెబుతాడు రాజ్. ఇంటి నుంచి ఫోన్ రావడంతో వీడియో కాల్ మాట్లాడతాడు రాజ్. ఇన్ని రోజులు ఎక్కడున్నావు? ఏమైపోయావు? నువ్వు ఏ పని చేయకపోయినా పర్లేదు కానీ ఇంట్లో మా కళ్ల ముందుంటే చాలని అంటాడు చలపతి. నేను బిజినెస్ చేస్తున్నా.. రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఇంద్రభవనంలో ఉంచుతానని, కారులో తిప్పుతానని చెబుతాడు రాజ్.
వీడియో కాల్ మాట్లాడి వెనక్కి తిరిగి చూసేసరికి అపర్ణ ఏడుస్తూ కనిపించడంతో రాజ్ కంగారుపడతాడు. నువ్వు నా మనవరాలిని, మా ఆస్తికి జీవితాంతం అండగా ఉంటావా అని అడుగుతుంది అపర్ణ. ఆస్తికి వారసురాలు అయ్యుండి కూడా.. ఇంట్లో ఓ మూలన పడుకుంటోంది, పనిమనిషిలా అన్ని పనులూ చేస్తోందని బాధపడుతుంది. మీ మనవరాలి సంగతి నేను చూసుకుంటానని అంటాడు రాజ్. వెంకీని ఓ రెస్టారెంట్‌కు తీసుకొచ్చి.. డేటింగ్ యాప్‌లో నేను ముగ్గురిని చూశాను, వాళ్లతో మాట్లాడి ఎవరు నచ్చితే వాళ్లని లవ్ చేయమని చెబుతుంది నందూ. వచ్చిన ముగ్గురు కూడా తేడాగా ఉండటంతో అందరినీ రిజెక్ట్ చేస్తాడు వెంకీ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక మే 22వ తేదీ ఎపిసోడ్ 1039లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
నాకు ఇందూకి ఉండటానికి రూమ్ కావాలని రాజ్ గొడవ చేస్తాడు. దాంతో భ్రమరాంబ రూమ్ ఇచ్చేయమని అంటుంది రేఖ. నాకు మోకాలి నొప్పులు.. నేను కిందపడుకోలేనని అంటుంది భ్రమరాంబ. అయితే స్వాతి రూమ్ ఇచ్చేద్దామని రేఖ అనగా.. స్వాతికి సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయి. తను అసలే టాపర్.. ఏమాత్రం తేడా వచ్చిన పరీక్షల్లో ఫెయిల్ అవుతుంది.. తనని హ్యాపీగా చదువుకోని అంటుంది భ్రమరాంబ. అయితే ఐశ్వర్యకు పరీక్షలు అయిపోయాయి కాబట్టి.. తన రూమ్ వాడుకోమని చెబుతుంది రేఖ. నా రూమ్‌ని ఇవ్వనని ఐశ్వర్య మారాం చేయగా.. అయితే నువ్వు ఏం చేశావో అందరికీ చెబుతానని రాజ్ బ్లాక్‌మెయిల్ చేయడంతో తప్పక ఒప్పుకుంటుంది.
రూమ్ ఖాళీ చేయడానికి తన బట్టలు సర్దుకుంటున్న ఐశ్వర్య దగ్గరికి వచ్చిన ఇందూ.. నువ్వేం రూమ్ ఖాళీ చేయొద్దని చెబుతుంది. నువ్వు నీ మొగుడు నాటకాలు ఆడి.. అందరి ముందు రూమ్ ఖాళీ చేసి.. ఇప్పుడు నువ్వొచ్చి రూమ్ ఖాళీ చేయొద్దని అంటున్నావా అంటూ ఇందూపై మండిపడుతుంది ఐశ్వర్య. అలా కాదని ఇందూ చెబుతుండగా.. నా రూమ్‌కే ఎసరు పెడతారని అనుకున్నాను, ఇంట్లో ఉన్నవాళ్లంతా పనికొచ్చేవాళ్లు, నేను మాత్రం పనికిరాని దానినా? అందుకే ఎవరి రూమ్ వాళ్లు అలాగే పెట్టుకున్నారు.. నేను మాత్రం మీ మొగుడు, పెళ్లాలు కాపురం చేసుకోవడానికి నేను రూమ్ ఖాళీ చేయాలా అని ఫైర్ అవుతుంది ఐశ్వర్య.
నిన్ను బాధపెట్టడానికి అలా చేయలేదని ఇందూ చెబుతుండగా.. దెబ్బకొట్టి బాధపడొద్దు అంటే ఎలా? ఇదంతా నా మీద కోపంతోనే చేశావు? నువ్వంటే నాకు అసహ్యం.. నీ మాటల్లో నిజాయితీ ఉండదు. మనసులో ఒకటి పెట్టుకుని బయట మాత్రం సాఫ్ట్‌గా అమాయకంగా నటిస్తావని నానామాటలు అంటుంది ఐశ్వర్య. అమ్మ బుద్ధులు ఎక్కడికిపోతాయి.. ఒకప్పుడు మీ అమ్మ కూడా మా నాన్నని, నానమ్మని మోసం చేసింది. నటించడం, మేకవన్నె పులిలా మాట్లాడటం నీ బ్లడ్‌లోనే ఉంది. నీ సానుభూతి, నీ ఓదార్పులు నాకు అవసరం లేదు.. నేనే స్టోర్ రూమ్‌లో పడుంటా. కానీ నన్ను అందరి ముందు వేస్ట్ ఫెలోని చేసి నన్ను ఖాళీ చేయిస్తున్నావు కదా? దీనికి పదిరెట్టు రివెంజ్ తీర్చుకుంటాను, ఎవ్వరినీ వదిలిపెట్టనని కోపంగా వెళ్లిపోతుంది ఐశ్వర్య.
ఇందూ రూమ్‌లో బట్టలు సర్దుకుంటూ ఉండగా.. సాధించాను అంటూ సంతోషిస్తాడు. ఎందుకంత ఓవరాక్షన్ చేశావు? నువ్వు చేసిన పనివాళ్ల ఐశ్వర్య ఎంత బాధపడిందో తెలుసా? అసలే నా మీద దానికి పీకలదాకా కోపం ఉంది. నువ్వు ఇంకా దానిని పెట్రోల్ పోసి పెంచావు. అయినా నువ్వు ఆలోచించాల్సింది ఐశ్వర్య గురించి కాదు. ఎంప్లాయిస్‌కి రెండ్రోజుల్లో, నాకు వారం రోజుల్లో పేమెంట్ ఇచ్చేస్తానని అన్నావు కదా దాని సంగతి చూడమని అంటాడు రాజ్.
నువ్వు చేసిందేం నాకు నచ్చలేదు.. ఈరోజు రూమ్ అడిగాడు, రేపు కారు అడుగుతాడు ఇచ్చేస్తావా? అని రేఖపై ఫైర్ అవుతుంది భ్రమరాంబ. వాడే వారసుడని పొంగిపోతాడు, వాడు మన చేతుల్లో ఉంటాడా అని భ్రమరాంబ సీరియస్ అవుతుంది. వాడిని చూస్తుంటే పెద్ద కంత్రీగాడిలా కనిపిస్తున్నాడని, రేపు మనందరినీ బానిసల్లా చేసి ఆడుకుంటాడని అంటాడు భూషణ్. వాడికి అంత సీన్ లేదు.. వాడిని జస్ట్ మచ్చిక చేసుకుంటున్నాను. వాడు సంతకం పెడితేనే తప్పించి కోట్ల ఆస్తిని మనం దక్కించుకోలేమని లాయర్ చెప్పాడు కదా? అలాంటప్పుడు వాడిని మచ్చిక చేసుకోవాలి, మనదారిలోకి తెచ్చుకోవాలి. వాడే ఒక రూమ్ కావాలని మనకి అవకాశం ఇచ్చాడని అంటుంది రేఖ.
విలాసవంతమైన జీవితం అన్నది ఒక వ్యసనం లాంటిది.. ఒక రెండు రోజులు గది వాడుకోవడం వల్ల మనకొచ్చిన నష్టం ఏంటి? కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాల్సిందేనని చెబుతుంది రేఖ. మొత్తం వదులుకునేలా చేసి మనల్ని కట్టుబట్టలతో బయటికి పంపుతాడేమోనని భయపడుతుంది భ్రమరాంబ. ఇక్కడుంది రేఖ.. మీరు భయంతో వెనకడుగు వేస్తున్నారు. కానీ నేను నా మీద నమ్మకంతో ముందడుగు వేస్తున్నాను. నాకు దుగ్గిరాల కుటుంబం కోట్ల ఆస్తి మాత్రమే కనిపిస్తోంది. దానికి ఎలా దగ్గరవ్వాలా అని ఆలోచిస్తున్నాను.. 365 రోజులూ దాని గురించే ప్లాన్ చేస్తున్నాను అంటుంది రేఖ. నేను ఒకదానిని టార్గెట్ చేశానంటే దాని కోసం ఎంత దూరమైనా వెళ్తానని అంటుంది.
ఆ ఇందూ రూమ్ లాక్కోవడం ఏంటీ? నేను స్వాతి రూమ్‌లో ఉండటం ఏంటీ? అంటూ రగిలిపోతుంది. స్వాతి గదిలోకి వచ్చి నీ బట్టలు తీసేయ్ అంటూ వార్నింగ్ ఇస్తుంది. నువ్వు కొంచెం రిక్వెస్ట్‌గా అడిగితేనే నీ బట్టలు ఎక్కడ పెట్టుకోవాలో చెబుతానని అంటుంది స్వాతి. మనిద్దరిలో పొగరు ఎవరికో తెలుస్తుంది. ఆ ఇందూ కారణంగా నీ వల్ల కూడా మాటలు పడాల్సి వస్తోందని రగిలిపోతుంది.


Click it and Unblock the Notifications