Brahmamudi may 22nd episode: కథలో సూపర్ ట్విస్ట్ ఇచ్చిన మాయ.. తీవ్ర సంక్షోభంలో రాజ్ కుటుంబం!

మాయని వెతుకుతున్న కావ్య ని రౌడీలు కిడ్నాప్ చేస్తారు. అప్పు ద్వారా నిజం తెలుసుకున్న రాజ్ కావ్యని కాపాడుకుంటాడు. తర్వాత మాయ జోలికి వెళ్ళొద్దంటూ హెచ్చరిస్తాడు. బిడ్డ తల్లిని తీసుకొని వస్తానంటూ మాయని ఇంటికి తీసుకువస్తుంది కావ్య. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక మే 22వ తేదీ ఎపిసోడ్ 416 లో ఏం జరిగిందంటే..

మౌనంగా నిలబడ్డ మాయతో అమాయకంగా నిలబడ్డావ్ ఏమ్, చేసిన ఘనకార్యం గురించి అందరికీ చెప్పు అంటుంది కావ్య. బిడ్డ తల్లిని నేనే, తండ్రి రాజ్ అని చెప్తుంది మాయ. కావ్య తో సహా అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. రాజ్ తనతో చాలా క్లోజ్ గా ఉండేవాడని రాజ్ మీద నమ్మకంతో అతనికి దగ్గర అయ్యానని ఆ నమ్మకంతోనే బిడ్డను కూడా కన్నానని చెప్తుంది మాయ. కానీ పెళ్లి విషయం వచ్చేసరికి కావ్య ఇంట్లో ఉండగా మన పెళ్ళికి ఎవరూ ఒప్పుకోరు అని రాజ్ వెనకడుగు వేశాడు.

Brahmamudi serial May 22th Episode of 416 Here is full story

కనీసం నా బిడ్డ అయినా సుఖపడతాడని తల్లి ప్రేమను చంపుకొని బిడ్డని రాజ్ తో పంపించాను అంటుంది మాయ. ఆ బిడ్డకి తల్లిని తీసుకువచ్చావా, లేదంటే నీకు సవతిని తీసుకువచ్చావా నిజంగా నీ ధైర్యాన్ని పొగడటానికి కూడా నాకు ధైర్యం చాలటం లేదు అంటుంది రుద్రాణి. ఇన్నాళ్లు నిజం బయటపడలేదు ఇప్పుడు నిజం బయటపడింది ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి అంటుంది ధాన్యలక్ష్మి. సుమిత్ర భర్తతో మాట్లాడుతూ మన ఇద్దరం తల్లిదండ్రులుగా ఓడిపోయామా, లేదంటే మన బిడ్డ కొడుకుగా ఓడిపోయాడా నాకు ఏం చేయటానికి అర్థం కావడం లేదు అని కంగారు పడుతుంది.

బిడ్డని కన్నతల్లి ఈ ఇంటి కోడలు అవుతుంది, ఆమెకే అన్ని హక్కులు ఉంటాయి అంటుంది రుద్రాణి. మీ సలహా ఎవడూ అడగలేదు మీరు కామ్ గా ఉండండి అని అత్తని కసురుకుంటుంది స్వప్న. చిట్టి కూడా రుద్రాణిపై కోప్పడుతుంది. తరువాత కావ్య దగ్గరికి వెళ్లి నీకు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను నీ ప్రయత్నాలు ఆపమని, ఇప్పుడు చూడు పరిస్థితి ఎంత వరకు వచ్చిందో అని కావ్య ని మందలిస్తుంది.

Brahmamudi serial May 22th Episode of 416 Here is full story

తప్పు ఎక్కడ జరిగినా కావ్య వైపు ఏ తప్పు లేదు, అలాగే రాజ్ అందరి ముందు కావ్య మెడలో తాళికట్టాడు ఆమే ఈ ఇంటి కోడలు ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు అంటుంది. ఇదేంటి పరిస్థితి ఇలా తయారయింది ఇప్పుడు మాయ చెప్పింది అబద్ధం అంటే నిజం ఏమిటి అని అడుగుతారు, అప్పుడు మావయ్య విషయం బయటకు వస్తుంది అనుకుంటూ ఏమి మాట్లాడకుండా ఉండిపోతుంది కావ్య.

సీతారామయ్య మాట్లాడుతూ ఇప్పుడు అందరి మనసులు వికలమైపోయి ఉన్నాయి, ఇలాంటి సమయంలో నిర్ణయాలు తీసుకోవటం కష్టం పరిస్థితులు నెమ్మదించాక ఈ విషయం గురించి ఆలోచిద్దాం అంతవరకు మాయని ఇక్కడే ఉంచండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు కావ్య చేసిన పనికి చివాట్లు పెడతాడు రాజ్. అసలు మాయని వదిలేసి ఈ మాయలేడిని తీసుకువచ్చావు, ఇది ఎక్కడ దొరికింది అని అంటాడు.

Brahmamudi serial May 22th Episode of 416 Here is full story

నేను ఇచ్చిన అడ్రస్ కి వెళ్లలేదా అని సుభాష్ అడుగుతాడు. జరిగిందంతా చెప్తుంది కావ్య. ఇప్పుడు ఈ సంఘటన నుంచి బయటపడే పరిస్థితులు కనిపించడం లేదు అంటాడు రాజ్. నేను చేసింది తప్పే అసలు తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకొని అసలు మాయ ను తీసుకు వస్తాను అంటుంది కావ్య. ఇప్పటివరకు చేసింది చాలు ఇంక మీదట ఎలాంటి తలనొప్పులు తీసుకువచ్చి మా నెత్తి మీద పెట్టకు అని కోప్పడతాడు రాజ్.

Brahmamudi serial May 22th Episode of 416 Here is full story

తరువాయి భాగంలో మాయ రుద్రాణితో మాట్లాడుతూ బాగా నటించానా అంటుంది. జీవించావు అంటుంది రుద్రాణి. సుఖంగా జీవించాలంటే ఆ మాత్రం నటించాలి అంటుంది మాయ. ఇదంతా నీ ప్లానా అని ఆశ్చర్యంగా అడుగుతాడు రాహుల్. మరేమనుకున్నావు రుద్రాణి అంటే నన్ను తక్కువగా అంచనా వేయకు అంటుంది

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X