Brahmamudi May 23rd Episode: రుద్రాణి - యామినిలకి షాక్.. కావ్యని కాపాడిన రాజ్, ప్రమాదంలో అప్పూ ఉద్యోగం
Photo Courtesy: JioHotstar
కావ్యకు రాజ్ ఇచ్చిన లవ్ లెటర్‌లో కళ్యాణ్ సంతకం ఉండటంతో తమ్ముడి మీదకి కత్తితో వెళ్తాడు రాజ్. దాంతో ఇందిర, అపర్ణలు రాజ్‌ను ఆపుతారు. నేను ఫెయిల్ అయ్యానని, ఇకపై మీరు చెప్పినట్లే వింటానని అంటాడు రాజ్. తన కోసం, తన ప్రేమ కోసం భర్త పడుతున్న తపన చూసి కావ్యకి ఆనందం కలుగుతుంది. ఇంతలో యామిని ఫోన్ చేసి రాజ్‌ను ఎలాగైనా దక్కించుకుంటానని, నా సైకోయిజాన్ని ఇకపై చూపిస్తానని వార్నింగ్ ఇస్తుంది.
రాజ్‌కి గతం గుర్తుచేయాలని అనుకుంటున్న రుద్రాణికి యామిని ఫోన్ చేస్తుంది. నువ్వు, నేను చెబితే రాజ్ నమ్మడని.. జనాభా లెక్కల అధికారిగా నా మనిషిని పంపిస్తానని అప్పుడు చచ్చినట్లు దుగ్గిరాల ఫ్యామిలీ కావ్య భర్త ఎవరో చెప్పాల్సిందేనని అంటుంది. ఇంట్లో వాళ్లందరి మద్ధతుతో ఓ సాంగ్ పాడి కావ్యకు సారీ చెబుతాడు రాజ్. ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉన్న సమయంలో యామిని మనిషి జనాభా లెక్కల ఆఫీసర్‌గా వచ్చి దుగ్గిరాల ఫ్యామిలీ వివరాలు నోట్ చేసుకుని వెళ్లిపోతుండగా కావ్య గురించి కూడా కనుక్కోమని చెబుతుంది రుద్రాణి. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక మే 23వ తేదీ ఎపిసోడ్ 729లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
ఈ ఇంటికి కావ్య ఏమవుతారని జనాభా లెక్కల ఆఫీసర్ అడగటంతో అంతా షాక్ అవుతారు. ఏం చెప్పాలో తెలియక అంతా వణికిపోతారు. ఇంతలో రుద్రాణి జోక్యం చేసుకుని ఈవిడ మా వదినకి కోడలు అవుతారని చెబుతుంది రుద్రాణి. కళావతి గారు ఆవిడకు మేనకోడలని అంటాడు రాజ్. ఈ దెబ్బతో అంతా ఉలిక్కిపడి నవ్వుకుంటారు. నేను చెప్పింది కరెక్టేనా? అని అడుగుతాడు రాజ్. కరెక్ట్‌గా చెప్పావురా అని ఇందిర మెచ్చుకుంటుంది. మేనకోడలే అయితే వాళ్ల అమ్మానాన్న ఎక్కడ అని అడుగుతాడు రాజ్. ఆ మాటలతో ఏం చెప్పాలో తెలియక టెన్షన్ పడుతుంది అపర్ణ. వాళ్లు వాళ్ల ఇంట్లో ఉన్నారు.. చిన్నప్పటి నుంచి మా ఆపర్ణ దీనిని పెంచుకోవడం వల్ల ఇది ఇక్కడే ఉండిపోయిందని చెబుతుంది ఇందిర.
ఇంతకీ ఈ కళావతి ఈ ఇంటి మనిషా? ఆ ఇంటి మనిషా? అని అడుగుతాడు ఆఫీసర్. మా కళావతి అందరి మనిషి అని చెబుతాడు ప్రకాశం. వివరాలు రాసుకోవడం అవ్వగానే రుద్రాణి జారుకోవడానికి ప్రయత్నిస్తుంది రుద్రాణి. ఆ పనులన్నీ మేం చూసుకుంటాం కానీ నువ్వు నానమ్మతో వెళ్లమని కళ్యాణ్ సెటైర్లు వేస్తాడు. రూమ్‌లోకి తీసుకెళ్లి రుద్రాణిని చితకబాదుతుంది ఇందిర. రూమ్‌లో నుంచి బయటికొచ్చిన రుద్రాణిపై సెటైర్లు వేస్తుంది స్వప్న. మీ ఫేస్‌పై ఐదు వేళ్ల గుర్తు బాగా పడిందని అంటూ ఏడిపిస్తుంది. పనికిరాని విషయాల్లో వేలు పెడితే ఇలాగే ఉంటుందని వార్నింగ్ ఇస్తుంది. నా చెల్లెలి జోలికి వస్తే ఇలాగే ఉంటుందని చెబుతుంది.
కిచెన్‌లో వంట చేసుకుంటున్న కావ్య దగ్గరికి వచ్చి ఆమెకు సైట్ కొడతాడు రాజ్. ఇంకా నా మీద మీకు కోపం పోలేదా? సారీ కూడా చెప్పానని అంటాడు రాజ్. సారీ చెప్పమని నేను అడిగానా? అని నిలదీస్తుంది కావ్య. నా సారీని మీరు యాక్సెప్ట్ చేయలేదా? మరి ఎందుకు నవ్వారు అని అడుగుతాడు రాజ్. నేను సినిమాలు చూసి కూడా నవ్వుతానని అంటుది కావ్య. నా సారీని యాక్సెప్ట్ చేసినందుకు గుర్తుగా ఒక మంచి కాఫీ ఇవ్వమని అడుగుతాడు రాజ్. నేను మీకు కాఫీ ఇవ్వనని తేల్చిచెబుతుంది కావ్య. ఇంతలో అపర్ణ, ఇందిరలు వచ్చి ఓ కాఫీ కోసం ఎంత దిగజారిపోతున్నావని అడుగుతారు. మీ కళావతి పైకి కోపంగా ఉంటుందని, లోపల నేనంటే ఎంతో ఇష్టమని అంటాడు రాజ్.
నువ్వు వెంటనే కళావతికి ప్రపోజ్ చేయమని అత్తా కోడళ్లు రాజ్‌కి చెబుతారు. తొందరపడితే మొదటికే మోసం వస్తుందని రాజ్ భయపడగా, ఆలస్యం చేస్తే యామినికి సమాధానం చెప్పాల్సి వస్తుందని నచ్చచెబుతారు. వెంటనే వెళ్లి నీ మనసులోని ప్రేమను కళావతి ముందు పెట్టి తనను పెళ్లికి ఒప్పించమని అంటుంది ఇందిర. ఇప్పుడే కదా కోపాన్ని పోగొట్టాను, అప్పుడే ప్రేమ పెళ్లి అంటే వెంటనే కంగారుపడుతుందని.. రేపు శుక్రవారం కాబట్టి అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది రేపు చెబుతానని అంటాడు రాజ్. రేపు ఉదయం 11 గంటల నుంచి మంచి ఘడియలు కూడా ఉన్నాయని అపర్ణ అనడంతో ఐతే ఓ ఐదుగురు ముత్తయిదువులను పిలిపించండని సెటైర్లు వేస్తుంది ఇందిర.
కళావతికి ప్రపోజ్ చేయాలంటే దానికి ప్రిపేర్ కావాలి కదా? ఇవాళ రాత్రికి ఫుల్‌గా ప్రిపేర్ అయిపోయి మీ మనవరాలికి ప్రపోజ్ చేస్తానని అంటాడు రాజ్. నా కొడుకును చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉందో అని ఇందిరతో చెబుతుంది అపర్ణ. వాడికి గతం గుర్తుకురాకపోయినా పర్లేదు, జీవితాంతం కావ్యని ప్రేమిస్తూ భార్యాబిడ్డలతో లైఫ్‌ని గడిపేస్తే చాలని అంటుంది. అలా జరగాలంటే ముందు కావ్యని ఒప్పించాలి కదా అని ఇందిర అంటుంది. వీరి మాటలన్నీ రాహుల్ విని, పెద్ద ప్లానే వేశారని వెంటనే ఈ విషయం మమ్మీకి చెప్పాలని రుద్రాణి దగ్గరికి వెళ్తాడు.
ఇందిర కొట్టిన దెబ్బకి బుగ్గ వాచిపోయి బాధపడుతున్న రుద్రాణి దగ్గరికి రాహుల్ వచ్చి కావ్యకి రాజ్ ప్రపోజ్ చేయబోతున్న విషయం గురించి చెబుతారు. ఇదంతా ఇందిర, అపర్ణల ప్లాన్ అని చెప్పడంతో రుద్రాణి షాక్ అవుతుంది. అదే జరిగితే రాజ్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలై తిరిగి వాడు మనింటికే వచ్చి కూర్చొంటాడని అంటాడు రాహుల్. అక్కడిదాకా వచ్చాక ఏదో ఒకటి చేసి రాజ్‌కి కావ్య గతాన్ని గుర్తుచేస్తుందని చెబుతాడు. అలా జరగదు జరగనివ్వనని రాహుల్‌తో రుద్రాణి అంటుంది. వెంటనే యామినికి ఫోన్ చేస్తుంది. కావ్యకి రేపు రాజ్ ప్రపోజ్ చేయబోతున్నాడని నువ్వేం చేస్తావని మండిపడుతుంది. రేపు వాడు ప్రపోజ్ చేయగానే కావ్య ఒప్పుకుందంటే రాజ్ పర్మినెంట్‌గా నీకు దూరమైపోయినట్లేనని వార్నింగ్ ఇస్తుంది రుద్రాణి. నువ్వేం చేస్తావో? ఎలా ఆపుతావో నాకు తెలియదు? రేపు ఆ రాజ్ మా ఇంటికి రాకూడదని తేల్చిచెబుతుంది.
రుద్రాణి మాటలతో యామిని టెన్షన్ పడుతుంది. యామిని ఖచ్చితంగా రాజ్‌ను ఆపుతుందా? అని రుద్రాణిని అడుగుతాడు రాహుల్. రాజ్ లేకుండా యామిని బతకలేడని కాబట్టి ఖచ్చితంగా వాడిని ఆపుతుందని అంటుంది రుద్రాణి. వాడిని చంపినా చంపుతుంది కానీ రాజ్‌ను మాత్రం వదిలిపెట్టదని చెబుతుంది. ఛార్లెస్ అనే దొంగను పట్టుకున్న అప్పూని పై అధికారులు మెచ్చుకుంటారు. వాడు ఇప్పటి వరకు 49 సార్లు తప్పించుకున్నాడని ఈసారి తప్పించుకుంటే నీ ఉద్యోగమే పోతుందని అప్పూని హెచ్చరిస్తాడు ఆఫీసర్. రాజ్ రేపు నీకు ప్రపోజ్ చేయబోతున్నాడని, దానికి నువ్వు ఒప్పుకోవాలని కావ్యకి చెబుతారు ఇందిర, అపర్ణ. నువ్వు తొందరపడకుంటే రాజ్‌ని యామిని పెళ్లి చేసుకుంటుందని హెచ్చరిస్తారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











