Brahmamudi May 24th Episode: అపర్ణ ప్లాన్ లీక్ చేసిన రుద్రాణి..రాజ్‌కి యామిని గండం, రుద్రాణి ట్రాప్‌లో ధాన్యం

Photo Courtesy: JioHotstar

జనాభా లెక్కల అధికారిని కావ్య గురించి వివరాలు తెలుసుకోమని చెబుతుంది రుద్రాణి. మీరు ఈ ఇంటికి ఏమవుతారని ఆ నకిలీ అధికారి అడగ్గా.. కావ్యతో సహా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా టెన్షన్ పడుతుంది. ఇంతలో రాజ్ జోక్యం చేసుకుని కళావతి గారు అపర్ణ ఆంటీకి మేనకోడలని అంటాడు. దాంతో అందరూ నవ్వేస్తారు. తన ప్లాన్ ఫెయిల్ కావడంతో రుద్రాణి జరుకుంటూ ఉండగా ఇందిర పట్టుకుని గదిలోకి తీసుకెళ్లి కోటింగ్ ఇస్తుంది.

కావ్య వంట చేస్తుండగా సైట్ కొడతాడు రాజ్. ఇదంతా కాదు కానీ కావ్యకి ప్రపోజ్ చేయమని ఇందిర, అపర్ణలు సలహా ఇస్తారు. వాళ్లు చెప్పినట్లుగానే రేపొద్దునే వచ్చి కావ్యకి ఐ లవ్ యూ చెప్పేందుకు రాజ్ వెళ్లిపోతాడు. వీరి మాటలను విన్న రాహుల్.. వెంటనే రుద్రాణికి ఈ విషయం చెప్పడంతో ఆమె యామినికి ఫోన్ చేస్తుంది. కావ్యకి రాజ్ ఐ లవ్ యూ చెబితే ఇక నీ పని అయిపోయినట్లే నువ్వు ఎట్టి పరిస్ధితుల్లోనూ రాజ్‌ను ఇల్లు దాటి రాకుండా చూడమని చెబుతుంది రుద్రాని. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక మే 24వ తేదీ ఎపిసోడ్ 730లో ఏం జరిగిందంటే?

Brahmamudi Serial May 24th 2025 Episode 730 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

పోలీస్ స్టేషన్‌లో ఉన్న ఛార్లెస్ కడుపు నొప్పి అని ఏడుస్తున్నాడని అప్పూకి కానిస్టేబుల్ ఫోన్ చేస్తాడు. అతనితో మాట్లాడుతుండగా అప్పూని వెనుక నుంచి వచ్చి పట్టుకుంటాడు కళ్యాణ్. కానిస్టేబుల్‌కి తర్వాత కాల్ చేస్తానని చెప్పిన అప్పూ .. కళ్యాణ్‌పై కోప్పడుతుంది. ఇలా ఎంతకాలం పస్తులు పెడతావ్ అంటూ అప్పూపై మండిపడతాడు కళ్యాణ్. నేను అర్జెంట్‌గా పూర్తి చేయాల్సిన కేసులు మూడు ఉన్నాయని అవి పూర్తయ్యే వరకు నువ్వు వెయిట్ చేయాల్సిందేనని చెబుతుంది అప్పూ. అలాగే నాకు ఇప్పట్లో పిల్లలు వద్దని 2 సంవత్సరాలు వెయిట్ చేద్దామని అంటుంది.

అప్పూ వెనుక కళ్యాణ్ పరిగెత్తుతుండగా ధాన్యలక్ష్మీ ఎదురవుతుంది. మా ఫ్రెండ్‌కి కొత్తగా పెళ్లయ్యింది, వాడి ఫస్ట్ నైట్ గురించి మాట్లాడుకుంటున్నామని చెబుతాడు కళ్యాణ్. నేను ఏమీ అడక్కుండానే సమాధానం చెబుతున్నావేంటీ అని మండిపడుతుంది ధాన్యలక్ష్మీ. అంటే ఇప్పటి వరకు వీరికి మొదటి రాత్రే జరలేదని తెలుసుకున్న ధాన్యం రగిలిపోతుంది. అప్పూ నా కొడుకుని తన కొంగుకి కట్టేసుకుని గుప్పిట్లో పెట్టుకుందని, దీని ఆటలు సాగనివ్వకూడదని అనుకుంటుంది.

ఆనందంగా హడావుడిగా ఇంటికొస్తున్న రాజ్‌ను యామిని ఆగమని కోపంగా చెబుతుంది. ఎప్పుడూ లేని విధంగా నీ ఫేస్ చిచ్చుబుడ్డిలా వెలిగిపోతుంటే కారణం ఏంటి అని ప్రశ్నిస్తుంది యామిని. ఈరోజు నా ఫ్రెండ్స్‌ని కలిశానని అందుకే ఇంత సంతోషంగా ఉన్నానని అంటుంది. ఫ్రెండ్స్‌ని రోజూ కలుస్తూనే ఉన్నావ్ కదా కానీ ఈరోజు మాత్రమే ఎందుకింత హ్యాపీగా కనిపిస్తున్నావని అడుగుతుంది. యామినికి నేను కళావతి ఇంటికి వెళ్లిన విషయం తెలిసిపోయిందా? అని అనుకుంటాడు రాజ్. నీ ఆనందానికి కారణమేంటో తెలిస్తే మేం కూడా హ్యాపీగా ఫీలవుతామని అంటుంది యామిని.

నువ్వు ఎక్కడికి వెళ్లావో? నీ ఆనందానికి కారణం ఏంటో? నాకు అన్ని తెలుసని మనసులో అనుకుంటుంది యామిని. ఎప్పటి నుంచో మీ కోసమే వెయిట్ చేస్తున్నానని రామ్‌తో చెబుతుంది వైదేహి. కలిసి భోజనం చేద్దామని అడగ్గా.. నేను తినేసి వచ్చానని అంటాడు రాజ్. ఎక్కడ తినేసి వచ్చారని రఘునాథ్ అడగటంతో, బావకి బాగా కావాల్సిన చోటే తినేసి ఉంటాడని సెటైర్లు వేస్తుంది యామిని. అప్పటికే కడుపు నిండిపోయి ఉంటుందని, ఇక మనింటి భోజనం ఎలా తింటాడని ప్రశ్నిస్తుంది యామిని. నేను నిన్ను ఎప్పుడూ అర్ధం చేసుకుంటానని, కానీ నువ్వు నా ప్రేమను అర్ధం చేసుకోవడం లేదని మండిపడుతుంది యామిని.

నా వల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా? అని ప్రశ్నిస్తుంది యామిని. ఏదో సమస్య ఉందని, అందుకే మీరు యామినిని సరిగా పట్టించుకోలేదని అనిపిస్తోందని వైదేహి కూడా అంటుంది. కొద్దిరోజుల్లోనే మీ పెళ్లి ఉందని, అందరికీ కార్డ్స్ కూడా పంచేశామని ఇలాంటి టైంలో మీరు , అమ్మాయి జంట పక్షుల్లా కలిసి ఉండాలి కానీ ఒంటరి పక్షుల్లా ఒకరితో ఒకరికి సంబంధం లేనట్లుగా ఉంటున్నారని వైదేహి బాధపడుతుంది. పొద్దున్నే వెళ్తున్నారు, మళ్లీ ఏ రాత్రికో వస్తున్నారని ఎక్కడికి వెళ్లారని అడిగితే ఫ్రెండ్స్ అంటున్నారని రఘునాథ్ చెబుతాడు. కానీ మీ కోసం ఇంట్లో ఒకరు ఉన్నారు, మీకోసమే ఎదురుచూస్తుంటారని ఆలోచించలేక పోతున్నారని అంటాడు. మీతో కలిసి భోజనం చేయాలని ఎంతో ఆశగా తినకుండా ఎదురుచూసిందని, కానీ మీరేమో సారీ అని తేలిగ్గా చెప్పారని అంటాడు.

మాతో ఏదైనా చెప్పాలని అనుకుంటున్నారా? వైదేహి అడగటంతో మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని అనుకుంటున్నానని, కానీ ఇప్పుడు కాదని అంటాడు రాజ్. రేపు నాకో క్లారిటీ వస్తుందని, అప్పుడు ఖచ్చితంగా చెబుతానని అంటాడు. రామ్ మాటల్లో ఏదో తేడా కనిపిస్తోందని, రేపు క్లారిటీ వస్తుందని అంటున్నాడని యామినిని అడుగుతుంది వైదేహి. బావ రేపు ఆ కావ్యకి ప్రపోజ్ చేయబోతున్నాడని చెప్పడంతో వైదేహి, రఘునాథ్ షాకవుతారు. ఆ కావ్యకి ప్రపోజ్ చేస్తే నీ జీవితం నాశనం అవుతుంది కదా అని అంటుంది వైదేహి. కావ్యకి బావ ప్రపోజ్ చేయకుండా ఉండటానికి మీ ఇద్దరి సాయం కావాలని అడుగుతుంది యామిని. నీ కోసం ఏమైనా చేస్తామని వైదేహి మాటిస్తుంది.

టెన్షన్‌గా తిరుగుతున్న ధాన్యలక్ష్మీని ఏం జరిగిందని రుద్రాణి అడుగుతుంది. కళ్యాణ్‌కి పిల్లలు ఉండాలని, కనీసం సక్రమంగా కాపురం కూడా చేయట్లేదని చెబుతుంది ధాన్యం. పెళ్లి చేసుకున్నాడు కానీ ఇప్పటి వరకు ఫస్ట్ నైట్ కూడా జరగలేదని అంటుంది. ఆ పొట్టిది కనీసం నా కొడుకుని చేయి కూడా వెయ్యనివ్వడం లేదని ఇలా అయితే వాడు పిల్లల్ని ఎప్పుడు కంటాడు అని అడుగుతుంది. నీ సమస్యకి పరిష్కారం నా దగ్గర ఉందని, అలా చేస్తే నీ కొడుక్కి పిల్లలు పుట్టడంతో పాటు అప్పూని జాబ్ నుంచి కూడా మానిపించొచ్చని చెబుతుంది రుద్రాణి.

అప్పూ - కళ్యాణ్‌లకు ఫస్ట్ నైట్ జరగలేదని ఇంట్లో వాళ్లందరికీ చెప్పమంటుంది. వాడి మొదటి రాత్రికి ముహూర్తం పెట్టించు, అప్పూ నెల తప్పితే ఏడాది పాటు ఉద్యోగం మాన్పించేయ్ అని అంటుంది. ఏడాది తర్వాత పిల్లాడి భవిష్యత్ కోసం నువ్వు ఇంట్లోనే ఉండమని బ్లాక్‌మెయిల్ చేయొచ్చని చెబుతుంది. రాజ్ ప్రపోజ్ చేస్తే ఏం చెప్పాలి, ఆయనని ఆపడానికి యామిని గొడవ చేస్తే ఎలా అడ్డుకోవాలి? అని ఆలోచిస్తుంది కావ్య. ఇంతలో స్వప్న, అప్పూ వచ్చి ఏడిపిస్తారు. రాజ్ ప్రపోజ్ చేసిన తర్వాత యామిని ఏం చేయలేదని అంటారు. కావ్యకి ఎలా ప్రపోజ్ చేయాలన్న దాని గురించి రాజ్ ఆలోచిస్తుంటాడు. స్వప్న నగలు కొట్టేయడానికి రాహుల్ స్కెచ్ వేస్తాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X