Brahmamudi may 24th episode: భర్తతో ఛాలెంజ్ చేసిన అనామిక.. సుభాష్ కి చెమటలు పట్టించిన మాయ!
మాయ జోలికి వెళ్ళొద్దంటూ రాజ్ కావ్యని హెచ్చరిస్తాడు. బిడ్డ తల్లిని తీసుకొని వస్తానంటూ మాయని ఇంటికి తీసుకువస్తుంది కావ్య. కానీ అక్కడ ప్లేట్ ఫిరాయిస్తుంది మాయ. ఇదంతా రుద్రాణి ప్లాన్ అని తర్వాత తెలుసుకుంటుంది కావ్య. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక మే 24వ తేదీ ఎపిసోడ్ 418 లో ఏం జరిగిందంటే..
అనామిక కళ్యాణ్ తో మాట్లాడుతూ మీ వదిన చాలా తెలివైనది అందుకే సవతిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంది. నేనైతే ఎప్పటికీ అలా చేయలేను నిజంగా మీ వదిన చాలా గ్రేట్ అంటుంది. మా వదిన ఈ పని ఎందుకు చేసిందో తెలియదు కానీ ఈ పని వెనుక ఏదో పరమార్థం ఉందని మాత్రం తెలుసు అంటాడు కళ్యాణ్. తెలిస్తే మాత్రం ఏం ప్రయోజనం రేపు మీ వదిన ఇంట్లోంచి వెళ్లిపోతే ఏమి చేయలేవు కదా అంటుంది అనామిక. తన ఇంట్లోంచి వెళ్ళిపోతుందని నువ్వెందుకు అనుకుంటున్నావు అంటాడు కళ్యాణ్.

వెళ్లిపోవడం ఖాయం, కావాలంటే నా మాట రాసి పెట్టుకో బిడ్డ తల్లిని తీసుకువస్తే రాజ్ బావతో పెళ్లి చేస్తానని పెద్ద అత్తయ్య చెప్పారు కదా. అప్పుడు కోడలు స్థానం పక్కనపడితే కనీసం ఇంట్లో కూడా కావ్యకి స్థానం దక్కదు కావాలంటే చూడు అని భర్తతో చాలెంజ్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అనామిక. అలా జరగకూడదు వదినకి ఎలాగైనా సాయం చేయాలి అనుకుంటాడు కళ్యాణ్. మరోవైపు సుభాష్ కావ్య నాకు సాయం చేయబోయి తను సమస్యలలో ఇరుక్కుంది. ఎలాగైనా ఆమెకు సాయం చేయాలి,ఆ మాయని ఇంట్లోంచి పంపించేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు.
మరోవైపు కావ్య చేసిన పనికి స్వప్న ఆమెకి చివాట్లు పెడుతుంది. లోతు తెలియకుండా ఈతకి దిగకూడదని నువ్వే నాకు చాలా సార్లు చెప్పావు ఇప్పుడు నువ్వు ఈత రాకుండా సముద్రంలోకి దూకేశావు. ఇప్పుడు ఆ సముద్రం నుంచి ఎలా బయటపడతావో ఏంటో అని బాధపడుతుంది. ఎలా బయట పడతానో అని నాకు తెలియదు కానీ ఎలాగైనా బయటపడతాను. అంతవరకు నువ్వు నాకోసం ఎవరితోనూ గొడవపడకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య. నీకు ఉన్నంత సహనం నాకు లేదు.

నీ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే వారి చెంప చెల్లుమనిపిస్తాను. అది నీ అత్త అయినా,నీ మొగుడైనా సరే అనుకుంటుంది స్వప్న. మరోవైపు సుభాష్ మాయతో మాట్లాడుతూ నువ్వు ఆ బిడ్డకు తల్లివి కావని నాకు తెలుసు. నువ్వు వచ్చింది డబ్బు కోసం అని కూడా తెలుసు ఎంత కావాలో చెప్పు ఇస్తాను అంటాడు. మహారాణి లాగా మీ ఇంట్లో కోడలు స్థానంలో ఉన్న వాళ్ళు ఎవరైనా చిల్లర డబ్బులకి కక్కుర్తి పడతారా.. ఆ బిడ్డ తండ్రి మీరే అని నాకు తెలుసు.
నేను మాయను కాదు అని మీకు తెలుసు కానీ మీరు నిజాన్ని బయట పెట్టలేరు. మీరు చేసిన ఒక చిన్న తప్పు నాలాంటి మామూలు ఆడదాని ముందు కూడా మీరు తలవంచుకునేలాగా చేసింది అంటుంది. ఆమె మాటలకి షాక్ అయిపోతాడు సుభాష్. ఇంట్లో చక్కబెట్టవలసిన పనులు చాలా ఉన్నాయి వస్తాను అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది మాయ.
మరోవైపు సీతారామయ్య దంపతులిద్దరూ ఇంట్లో సమస్య గురించి మాట్లాడుకుంటూ ఎలాగైనా కావ్యకి న్యాయం చేయాలి,మనిద్దరం కావ్య వైపే నిలబడాలి అని ఒక నిర్ణయానికి వస్తారు. మరోవైపు మాయ అందరికీ కాఫీ తీసుకొని వస్తుంది.రుద్రాణి, ధాన్య లక్ష్మి తీసుకుంటారు కానీ స్వప్న వాళ్ళు తీసుకోరు. చిట్టి దగ్గరికి కాఫీ తీసుకు వెళ్తుంది మాయ. నేను కాఫీ బాగా కలుపుతాను తీసుకోండి అమ్మమ్మ గారు అంటుంది.నువ్వు వరుసలు కూడా బాగా కలుపుతావని అర్థమైంది కానీ నేను కావ్య చేతి కాఫీ తప్పితే ఏది తాగను అంటుంది చిట్టి.

అప్పుడు కాఫీ అపర్ణకి పట్టుకెళ్తుంది మాయ అప్పుడే కావ్య కూడా అపర్ణకి కాఫీ ఇస్తుంది. అపర్ణ మాత్రం మాయ చేత కాఫీ తాగుతుంది. బాధపడుతుంది కావ్య. వదిన కూడా మాయ చేతి కాఫీ తీసుకుంది నువ్వెందుకు మాయని బాధపడతావు అని చిట్టి తో అంటుంది రుద్రాణి. ఒక్క పూటకి నువ్వు మాయ కష్టాన్ని గుర్తించావు, సంవత్సరం నుంచి కావ్య ఇదే పని చేస్తుంది ఎవరైనా గుర్తించారా అంటుంది చిట్టి.
తరువాయి భాగంలో మాయ అందరికీ టిఫిన్లు సిద్ధం చేస్తుంది. రుద్రాణి మా ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం టిఫిన్ ఇష్టం అంటుంది. ఎవరెవరికి ఏం టిఫిన్ ఇస్టమో నాకు తెలుసు అంటుంది మాయ. రాజ్ కి ఏమి ఇష్టం అంటుంది రుద్రాణి.ఉప్మా పెసరట్టు అంటుంది మాయ. ఇంతలోనే రాజ్ టిఫిన్ చేయడానికి వస్తాడు. కావ్యని పక్కకు తప్పించి రాజ్ కి చైర్ చూపించి కూర్చోమంటుంది మాయ.


Click it and Unblock the Notifications











