Brahmamudi May 25th Episode: సీఈవో పోస్ట్‌పై రేఖతో రాజ్ ఛాలెంజ్.. ఉద్యోగం పోయి రోడ్డునపడ్డ రాజ్ తమ్ముడు
Photo Courtesy: JioHotstar
ఐశ్వర్య గదిలో బెడ్ బాగుందని హాయిగా పడుకుంటానని చెబుతాడు రాజ్. అయితే నువ్వు ఇక్కడ పడుకోవడానికి వీల్లేదని వెళ్లి సోఫాలో పడుకోమని ఇందూ ఆర్డర్ వేయడంతో విసుక్కుంటాడు. నువ్వు ఆ ఉరుములు, మెరుపులు కలని నిజం చేస్తావేమోనని భయంగా ఉందని అంటుంది ఇందూ. సోఫాలో నిద్ర పట్టకపోవడంతో స్వాతి పక్కనే పడుకుంటుంది ఐశ్వర్య. స్వాతి కాళ్లు, చేతులు వేయడంతో చిరాకు పడుతుంది. ఉదయాన్నే లేచేసరికి తన ముఖం దగ్గర రాజ్ ఉండటం చూసి భయపడుతుంది ఇందూ.
మన గొడవ తర్వాత కానీ ఉద్యోగుల జీతం, ఇతర సమస్యల గురించి ఆలోచించమని చెబుతాడు రాజ్. ఇప్పుడు నేను సీఈవో పోస్ట్‌కి పోటీ చేస్తే మా రేఖ ఆంటీకి అనుమానం వస్తుంది, అందుకే నాకు బదులుగా నువ్వు పోటీ చేయమని ఇందూ చెప్పడంతో రాజ్ సంబరపడిపోతాడు. వెంటనే ఇందూ చెప్పినట్లుగా అభిలాష్ అనే బోర్డ్ మెంబర్‌కి రాజ్ కాల్ చేస్తాడు. అయితే తాను రేఖ మేడం మనిషిని చెప్పడంతో రాజ్, ఇందూలు ఖంగు తింటారు. ఆ వెంటనే ఇందూ.. రేఖ దగ్గరకి వెళ్లి రాజ్ సీఈవో పోస్ట్ కోసం పోటీ చేస్తున్నాడని చెప్పడంతో రేఖ షాక్ అవుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక మే 25వ తేదీ ఎపిసోడ్ 1041లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
ఆఫీస్ వరకు వచ్చిన వాడు సీఈవో ఛైర్‌ని అందుకోలేడా అని రాజ్ గురించి ఇందూ చెప్పడంతో రేఖ షాక్ వుతుంది. నువ్వు చెబుతుంటే నాకు కూడా అనుమానం వస్తుందని అంటుంది రేఖ. వాడు బోర్డ్ మెంబర్స్‌ని మేనిప్యూలేట్ చేసి వాడి వైపుకు తిప్పుకుంటారు, వాడు అస్సలు సీఈవో అవ్వకూడదు, మీరే సీఈవోగా ఉండాలని చెబుతుంది ఇందూ. వాడి ప్రయత్నాల్లో వాడుంటే నా ప్రయత్నంలో నేను ఉంటానని చెబుతుంది రేఖ. మీరు ఏం చేసినా త్వరగా చేయండి, వాడు నా జీవితంలో నుంచి వెళ్లిపోవాలని అంటుంది ఇందూ. ఇదంతా విన్న రాజ్ కంగారుపడి ఇందూ దగ్గరే తేల్చుకుందామని అనుకుంటాడు.
కంపెనీలో లే ఆఫ్స్ ఎక్కువగా ఉన్నాయని మన పేర్లు ఎక్కడ వస్తాయోనని వెంకీతో అంటాడు అతని ఫ్రెండ్. మనం చాలా సిన్సియర్‌గా వర్క్ చేస్తున్నాం.. మనల్ని తీసేయరని వెంకీ చెబుతుండగా ఇంతలో అతని ఫోన్‌కి 3 లక్షల రూపాయలు అకౌంట్‌లో పడినట్లుగా మెసేజ్ వస్తుంది. నా శాలరీ లక్ష రూపాయలే కదా? మరి 3 లక్షలు పడ్డాయని ఫ్రెండ్‌తో అంటాడు వెంకీ. నీకు ప్రమోషన్ వచ్చిందేమోనని ఒకసారి వెళ్లి మేనేజర్‌ని కలవమని చెబుతాడు ఫ్రెండ్. దాంతో నా అకౌంట్‌లో పొరపాటున 3 లక్షల రూపాయలు క్రెడిట్ అయ్యాయని మేనేజర్‌తో చెబుతాడు వెంకీ. ఇందులో ఏ పొరపాటు లేదు.. నీ అకౌంట్‌ని సెటిల్ చేశాం, నిన్ను ఉద్యోగంలో నుంచి తీసేశామని మేనేజర్ చెప్పడంతో వెంకీ షాక్ అవుతాడు.
నేను ఏ తప్పు చేయలేదు.. ప్రతీది చాలా క్లియర్‌గా చేస్తున్నాను, చాలా కష్టపడుతున్నానని చెబుతాడు వెంకీ. ఇప్పుడు మాకు కావాల్సింది కష్టపడే వాళ్లు కాదు.. చాలా స్మార్ట్‌గా ఏఐ టెక్నాలజీ యూజ్ చేసి వర్క్ చేసేవాళ్లు కావాలని చెబుతాడు మేనేజర్. ఇప్పుడేదో కొత్త టెక్నాలజీ వచ్చిందని నా ఉద్యోగం తీసేయడం ఏంటీ? నేను ఇన్నాళ్లు పడ్డ కష్టానికి విలువ లేదా? అని ప్రశ్నిస్తాడు. నీలాంటి ఔట్ డేటెడ్ పర్సన్స్ ఈ జాబ్‌కి ఫిట్ అవ్వరు.. ఎప్పటికప్పుడు టెక్నాలజీతో పాటు అప్‌డేట్ కావాలి, నీకు డిగ్రీ పట్టా తప్పించి మరేం లేదు. 10 వేలకి, 20 వేలకి కొత్త కుర్రాళ్లు వచ్చి ఏఐ టెక్నాలజీ వాడి మీరు చేసే పనే చేస్తున్నారు. అలాంటప్పుడు మీకు లక్షల్లో జీతాలు మేమెందుకు ఇవ్వాలని ప్రశ్నిస్తాడు మేనేజర్.
నాకు ఉద్యోగం చాలా ఇంపార్టెంట్.. దీని మీదే నా కుటుంబం బతుకుతోందని బతిమలాడతాడు వెంకీ. నువ్వు ఇక్కడి నుంచి వెళ్లకపోతే.. నువ్వు జాబ్‌కి అన్‌ఫిట్ అని రెడ్ స్టాంప్ వేసి పంపిస్తా, లైఫ్‌లో మరెక్కడా జాబ్ రాదని బెదిరిస్తాడు. ఆ మూడు లక్షలతో ఏదో ఒక టీ కొట్టో, ఇడ్లో కొట్టో పెట్టుకోమని చెబుతాడు మేనేజర్. రాజ్ తిండి తినడం చూసి షాక్ అవుతారు. కానీ అపర్ణకి మాత్రం తన కొడుకు అలాగే తినేవాడని గుర్తొచ్చి ఎమోషనల్ అవుతుంది. నువ్వు నా కొడుకులా ఉండటం మాత్రమే కాదు.. తన అలవాట్లు కూడా నీకు వచ్చాయని అపర్ణ చెప్పడంతో రేఖ షాక్ అవుతుంది. పోలీకలు ఒకేలా ఉన్నంత మాత్రాన చరిత్రని మార్చలేం .. అంతపెద్ద సంఘటన జరిగినప్పుడు దానిని గుర్తుచేసుకోవాలని అపర్ణని రేఖ రెచ్చగొడుతుంది.
నువ్వు కంపెనీ సీఈవో పోస్ట్‌కి పోటీ పడుతున్నావా? నా బోర్డ్ మెంబర్స్‌తో కూడా మాట్లాడావా? అని రేఖ నిలదీయడంతో అంతా షాక్ అవుతారు. తన భార్యకి సొంతమైనవన్నీ నావే.. తన బాధ్యతలన్నీ నేనే తీసుకుంటానని చెబుతాడు రాజ్. ఎవరొచ్చినా, ఎదురు నిలబడినా ఇలా ఊదేస్తానని అంటాడు. నువ్వు కూడా సీఈవో అవ్వగలవేమో ట్రై చేయ్.. ఆశపడటంలో తప్పు లేదు, కూలి పనులు చేసుకునేవాడు కూడా కోటీశ్వరుడు కావాలని అనుకుంటాడు. నువ్వు కూడా ఇలాగే కలలు కను అంటుంది రేఖ. ఒకడు గోల్డెన్ స్పూన్‌తో పెట్టి సీఈవో ఛైర్‌లో కూర్చొని కోట్లు సంపాదించడంలో కిక్కు ఏముంది? నాలాగా మిడిల్ క్లాస్‌లో పుట్టి.. కోట్లు సంపాదిస్తేనే ఓ కిక్క్ ఉంటుందని అంటాడు రాజ్. నీలాంటి వాడిని ఎదిరించడంలోనూ స్వరాజ్‌లాగే ఉన్నాడు నా మనవడు అంటుంది అపర్ణ.
రాజ్ గురించి ఆలోచిస్తూ చలపతి- లక్ష్మీలు బాధపడుతుండగా వెంకీ బాధతో ఇంటికొచ్చి మూడు లక్షల రూపాయల్ని తండ్రి చేతిలో పెడతాడు. నీ జీతం లక్షే కదా? 3 లక్షలు ఇస్తున్నావేంటీ? అని అడుగుతాడు చలపతి. నా ఉద్యోగం పోయిందని వెంకీ చెప్పడంతో తల్లిదండ్రులిద్దరూ బాధపడతారు. రెగ్యులర్‌గా వెళ్తావు, సెలవులు కూడా పెట్టవు, ఎంత వర్క్ ఇచ్చినా చేస్తావు, నిన్ను ఉద్యోగంలో నుంచి తీసేయడం ఏంటీ? ఎవరైనా సర్దుకుపోతావని చెబుతాడు చలపతి. నేను ఆ ఉద్యోగానికి పనికిరానట.. అందుకే నన్ను ఆ ఉద్యోగంలో నుంచి తీసేశారని చెబుతాడు వెంకీ.
మన స్థోమతకి మించి అప్పుల మీద అప్పులు చేసి వాడిని పెద్ద చదువులు చదివించాం.. బ్యాంక్‌లో, శంకర్ దగ్గర తీసుకున్న 5 లక్షలకి నెల నెలా వడ్డీలు కడుతున్నాం. ఇప్పుడు వీడి ఉద్యోగం పోయిందని బాధపడతాడు చలపతి. వాడిచ్చిన డబ్బుతో రెండు మూడు నెలలు గడిచిపోతాయి, ఆ తర్వాత పరిస్ధితి ఏంటని ప్రశ్నిస్తాడు. ఈలోపు వాడికి మరో ఉద్యోగం వస్తుందని అంటుంది లక్ష్మీ. ఈరోజుల్లో ఒక చోట ఉద్యోగం పోతే.. మరో చోట ఉద్యోగం దొరకడం చాలా కష్టం. చాలామంది డిగ్రీలు పట్టుకుని రోడ్ల మీద తిరుగుతున్నారు. ఇప్పుడు మనం ఈఎంఐలు ఎలా కట్టాలి, శంకర్‌కి వడ్డీలు ఎలా కట్టాలని బాధపడతాడు చలపతి. మన పెద్దోడు ఇంటి గురించి అప్పుల గురించి పట్టించుకోడు.. ఎప్పుడు చూసినా బరువు బాధ్యత లేకుండా తిరుగుతుంటాడని మండిపడతాడు. అసలు చిన్నోడి ఉద్యోగం పోయిందన్న మాట వినగానే నా గుండెల్లో పిడుగు పడినట్లుగా ఉందని అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications