Brahmamudi May 25th episode: మరో మోసానికి తెర తీసిన రాహుల్.. అసలు విషయం మరిచిపోయిన కావ్య!

బిడ్డ తల్లిని తీసుకొని వస్తానంటూ మాయని ఇంటికి తీసుకువస్తుంది కావ్య. కానీ అక్కడ ప్లేట్ ఫిరాయిస్తుంది మాయ. ఇదంతా రుద్రాణి ప్లాన్ అని తర్వాత తెలుసుకుంటుంది కావ్య. ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను ఇంట్లోంచి వెళ్ళిపోమని మాయతో చెప్తాడు సుభాష్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక మే 25వ తేదీ ఎపిసోడ్ 419 లో ఏం జరిగిందంటే..

మీకు నేను నచ్చినట్లుగా నేను అమ్మమ్మ గారు త్వరలోనే మీకు నచ్చినట్లుగా మారతాను అంటుంది మాయ. మారే గుణం నీకున్నా మాకు లేదు అంటుంది చిట్టి. నువ్వు ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా మా అత్తకి నచ్చుతావు ఇద్దరి గుణాలు ఒకటే లా ఉన్నాయి అంటుంది స్వప్న. ఈ మాటలు పడాలనే నేను ఇంటికి రాను అన్నాను అయినా నువ్వే బలవంతంగా తీసుకువచ్చావు అయినా ఈ మాటలన్నీ నా బిడ్డ కోసం భరిస్తాను అని కావ్య తో అంటుంది మాయ.

Brahmamudi serial May 25th Episode of 419 Here is full story

నీలాగే అందరికీ నచ్చేటట్లుగా నడుచుకుంటున్నానా అని కావ్య ని అడుగుతుంది మాయ. అప్పుడు కావ్య బిడ్డని చేతిలోకి తీసుకొని మాయ చేతిలో పెడుతూ అన్ని బాగానే ఉన్నాయి కానీ నీ కడుపున పుట్టిన నీ బిడ్డ బాధ్యత ఇకమీదట నీదే. వాడు లండన్ కి వెళ్ళాడు వెళ్లి క్లీన్ చెయ్యు అని చెప్తుంది. దాంతో షాక్ అవుతుంది మాయ. రుద్రాణి నీ తోడు రమ్మని పిలుస్తుంది.

రుద్రాణి వెళ్లడానికి ఇబ్బంది పడుతుంది కానీ ఇప్పటివరకు తనకి సపోర్ట్ చేశావు కదా వెళ్ళు అని చిట్టి చెప్పడంతో మాయకు సాయంగా వెళుతుంది. వాళ్ళిద్దరూ పిల్లడిని క్లీన్ చేయడానికి అవస్థలు పడుతుంటే స్వప్న వచ్చి అత్తగారితో ఫ్యూచర్లో మీకు పనికొస్తుంది బాగా కడగండి అంటుంది. అదేంటి అంటుంది రుద్రాణి. రేపటి రోజున నాకు పిల్లలు పుడితే వాళ్లకి మీరే కదా అన్ని చేయాలి అంటుంది స్వప్న. నేనెందుకు చేస్తాను అంటుంది రుద్రాణి.

నేను చేయిస్తాను కదా అని వెటకారంగా మాట్లాడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది స్వప్న. తర్వాత వారు పడుతున్న పాట్లు చూసి కావ్య నవ్వుకుంటుంది. ఈ నవ్వు ఎన్నో రోజులు ఉండదు అని మనసులో అనుకుంటుంది రుద్రాణి. మరోవైపు రాహుల్ ఎవరితోనో మాట్లాడుతూ గోల్డ్ డీలింగ్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. అవతలి వ్యక్తి నేను నిన్ను నమ్మను గత సారి కూడా కొంటాను అని చెప్పి కొనలేదు నేను చాలా ఇబ్బంది పడ్డాను అంటాడు.

Brahmamudi serial May 25th Episode of 419 Here is full story

అప్పుడు వేరు కానీ ఇప్పుడు కంపెనీకి నేనే ఎండిని,ఎంత బంగారం అయినా కొనగలను అంటాడు రాహుల్. నువ్వు ఎండి అయితే నీతో డీలింగ్ చేయడానికి ఓకే, అన్నయ్య తో మాట్లాడి డీల్ క్లోజ్ చేద్దాం అంటాడు అవతలి వ్యక్తి. ఇంతకుముందు నాకు 20% పర్సెంట్ ఇచ్చేవారు కానీ ఇప్పుడు నాకు 50% కావాలి, ఆ విషయం మీ అన్నయ్య తో డిస్కస్ చేసి నాకు చెప్పు లేదంటే వేరే పార్టీ రెడీగా ఉంది అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు రాహుల్.

మరోవైపు అందరి కోసము టిఫిన్లు రెడీ చేస్తారు కావ్య, మాయ. మా ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం టిఫిన్ ఇష్టం అంటుంది రుద్రాణి అందరూ ఇష్టాలు ఏమిటో చెప్తుంది మాయ. అలాగే రాజ్ కి ఇష్టమైన టిఫిన్ ఏమిటో కూడా చెప్తుంది. మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ బాగా ఉన్నట్లుంది అంటుంది రుద్రాణి. అంతలోనే రాజ్ వస్తే అతనికి టిఫిన్ పెట్టాలని చూస్తుంది మాయ కానీ రాజ్ కావ్య చేసిన శాండ్విచ్ తీసుకొని అక్కడినుంచి వెళ్ళిపోతాడు.

మిగిలిన వాళ్ళు కూడా టిఫిన్ చేయకుండా అక్కడినుంచి వెళ్ళిపోతారు రాహుల్, రుద్రాణి, అపర్ణ మాత్రం ఉండిపోతారు. పాపం పొద్దుట్నుంచి కష్టపడి మనకోసం ఇవన్నీ ప్రిపేర్ చేసింది తనకి న్యాయం చేయాలి, న్యాయం చేసే ముందు ఆమె ఈ ఇంటి వారసుడికి తల్లి అని గుర్తుంచుకో అని అపర్ణతో చెప్తుంది రుద్రాణి. మరోవైపు ఇంట్లో జరుగుతున్న గొడవల గురించి అప్పుతో చెప్తుంది కావ్య.

Brahmamudi serial May 25th Episode of 419 Here is full story

ఈ మాయ ఇంట్లో ఇంత గొడవ చేస్తుంటే అసలు తల్లి ఏం చేస్తుందో ఎక్కడుందో అని మామూలుగా అంటుంది అప్పు. అప్పుడు కావ్య కి ఒక ఐడియా వస్తుంది, నేను అసలు విషయం మర్చిపోయాను ఏంటి అసలు బిడ్డ తల్లిని పట్టుకుంటే ఈ నకిలీ మాయ బయట పడుతుంది ఎలాగైనా బిడ్డ తల్లిని పట్టుకోవాలి అంటుంది కావ్య. మరోవైపు బయటి నుంచి ఆలస్యంగా ఇంటికి వచ్చిన కావ్య పై కోప్పడతాడు రాజ్.

తరువాయి భాగంలో ఇంటికి లాయర్ వచ్చి ఏవో పేపర్స్ అపర్ణకి ఇస్తాడు. అవి ఏమిటి అని ప్రశ్నిస్తారు ఇంట్లో వాళ్ళు. ఇంట్లో సమస్యలు సర్దుమణగడానికి నేనొక నిర్ణయం తీసుకున్నాను అంటూ కావ్య రాజ్ లతో మీరిద్దరూ విడాకులు తీసుకోవాలి అని చెప్తుంది అపర్ణ అందరూ షాక్ అవుతారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X