Brahmamudi May 26th Episode: రాజ్‌ని లాక్ చేసిన యామిని .. కావ్య ఎదురుచూపులు, అపర్ణలో టెన్షన్

Photo Courtesy: JioHotstar

పోలీస్ స్టేషన్‌లో ఛార్లెస్ కడుపునొప్పని ఏడుస్తుంటాడు. కానిస్టేబుల్ అప్పూకి ఫోన్ చేసి ఈ విషయం చెబుతుండగా.. తప్పించుకోవడానికి వాడు నాటకాలు వేస్తున్నాడని నమ్మొద్దని అంటుంది. కానిస్టేబుల్‌తో ఫోన్ మాట్లాడుతుండగా కళ్యాణ్ వెనుక నుంచి వచ్చి అప్పూని పట్టుకుంటాడు. కళ్యాణ్‌కు దొరక్కుండా పారిపోతూ ధాన్యలక్ష్మీకి ఎదురుపడుతుంది అప్పూ. కళ్యాణ్ - అప్పూలకి ఫస్ట్ నైట్ జరగలేదని తెలుసుకున్న ధాన్యలక్ష్మీ రగిలిపోతుంది. హ్యాపీగా ఇంటికొచ్చిన రాజ్‌ని ఎక్కడి నుంచి వస్తున్నావని అడుగుతుంది యామిని.

ఫ్రెండ్ దగ్గరి నుంచి వస్తున్నానని చెబుతాడు. అందరం కలిసి భోజనం చేయాలని మీ కోసం వెయిట్ చేస్తున్నామని రఘునాథ్ చెప్పగా.. నేను బయట తినేసి వచ్చానని అంటాడు రాజ్. మీయిద్దరికీ త్వరలో పెళ్లికాబోతోందని .. కానీ మీరు యామినిని దూరం పెడుతున్నారని క్లాస్ పీకుతుంది వైదేహి. త్వరలోనే అన్ని విషయాలపై క్లారిటీ వస్తుందని నేనే మీకు అసలు విషయం చెబుతానని అంటాడు రాజ్. బావ రేపు ఆ కావ్యకి ప్రపోజ్ చేయబోతున్నాడని పేరెంట్స్‌కి చెబుతుంది యామిని. కావ్యకి ఎలా ప్రపోజ్ చేయాలా అని నైట్ అంతా రాజ్ ఆలోచిస్తుంటాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక మే 24వ తేదీ ఎపిసోడ్ 730లో ఏం జరిగిందంటే?

Brahmamudi Serial May 26th 2025 Episode 731 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

స్వప్న నగలు కొట్టేసేందుకు రాహుల్ ప్లాన్ చేస్తాడు. ఆమె రావడానికి ముందే కొన్ని డూప్లికేట్ నగల్ని అక్కడ పెడతాడు. సడెన్‌గా స్వప్న రావడంతో షాక్ అవుతాడు. టైం చూసుకుని ఏమైనా ప్లాన్ చేశావా? అని అడుగుతుంది స్వప్న. నా కబోర్డ్ ముందు నువ్వేం చేస్తున్నావ్, నీకేం పని? నన్ను చూడగానే భయపడుతూ ఎందుకు టెన్షన్ పడుతున్నావ్ అని నిలదీస్తుంది. ఏసీ గదిలో ఎందుకు చెమటలు పడుతున్నాయ్? ఏదో తప్పు చేశావ్? అది నీ ముఖంలోనే నాకు క్లారిటీగా కనిపిస్తుందని చెప్పి కబోర్డ్ ఓపెన్ చేసి అన్ని నగల్ని చూసుకుంటుంది.

నీ నగలు కొట్టేయడానికి వచ్చానని అనుకుంటున్నావా? అని రాహుల్ అడుగుతాడు. నేను ఆ మాట అనలేదు కదా అని ఆమె అనగా.. నువ్వు లోపలికి రాగానే నగల్ని చెక్ చేసుకుంటే దాని అర్ధం అదే కదా అని అంటాడు రాహుల్. నన్నెప్పుడూ అనుమానిస్తావ్? అవమానిస్తావ్? నా మనసుని అర్ధం చేసుకోవు అని మండిపడతాడు. నీ కోసం నేను ఒకటి తీసుకొచ్చానని మల్లెపూల పొట్లం చూపిప్తాడు. ఇది నిజంగా నా కోసమే తీసుకొచ్చావా? లేక వేరే వాళ్ల కోసం తీసుకుని మిగిలిన పూలు ఇక్కడికి తీసుకొచ్చావా? అని సెటైర్లు వేస్తుంది స్వప్న.

మారిపోయిన వాడిని పదేపదే దొంగ అంటే వాడు మళ్లీ దొంగగానే మారిపోతాడని అంటాడు రాహుల్. నువ్వు మీ అమ్మ మారారు అంటే అస్సలు నమ్మనని అంటుంది. మంచి మొగుడు కావాలంటే మల్లెపూలు తీసుకురావడం కాదు .. కుటుంబ బాధ్యతల్ని కూడా తీసుకోవాలని మండిపడి స్వప్న వెళ్లిపోతుంది. స్వప్నకు ఎలాంటి అనుమానం రాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న రాహుల్.. ఎలాగైనా స్వప్న నగల్ని కొట్టేయాలని అనుకుంటాడు. ఆస్తి నా చేతికి రాగానే నిన్ను, నీ కూతురిని బయటికి గెంటేస్తానని కోప్పడతాడు.

ఉదయాన్నే దుగ్గిరాల ఫ్యామిలీ అంతా రాజ్ కోసం వెయిట్ చేస్తుంది. రాజ్ తప్పకుండా వస్తాడని, టెన్షన్ పడొద్దని అపర్ణతో అంటాడు ప్రకాశం. నువ్వు అన్ని మరిచిపోయి ప్రశాంతంగా ఉంటావ్, మ పరిస్థితి వేరని అంటుంది అపర్ణ. నేనేమీ అన్ని మరిచిపోనని రాజ్ ఇక్కడికి వచ్చి యామిని పెళ్లి విషయం మాట్లాడతాడు అంతే కదా అనడంతో అపర్ణ, ఇందిరలు తలపట్టుకుంటారు. రాజ్ వస్తోంది యామిని పెళ్లి విషయం మాట్లాడటానికి కాదు, కావ్య ప్రేమ విషయం మాట్లాడటానికి అని చెబుతుంది ఇందిర. ఇంతలో రాజ్ పూజారిని వెంటబెట్టుకుని రావడంతో అంతా షాక్ అవుతారు. వీడు కావ్య ప్రేమ విషయం మాట్లాడటానికి వస్తున్నాడా? లేక పెళ్లి విషయం మాట్లాడటానికి వస్తున్నాడా? అని ఇందిర, అపర్ణలు అనుకుంటారు.

ఉద్యోగం మానను అన్నా ఒప్పుకున్నాను, కనీసం పిల్లలైన కంటారా? లేదా అని ధాన్యలక్ష్మీ నిలదీస్తుంది. ఇవాళ నీకు ఫస్ట్ నైట్ ముహూర్తం పెడుతున్నాం, కళావతి గారు నేను దగ్గరుండి ఏర్పాట్లు చేస్తున్నాం అంటాడు రాజ్. దానికి కావ్య సరేనని అంటుంది. ఈరోజు రాత్రి మంచి ముహూర్తం ఉందని పంతులు గారు చెప్పడంతో దానిని ఖాయం చేయమని అంటుంది ధాన్యలక్ష్మీ. కళ్యాణ్ - అప్పూలు ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా నేను చెప్పింది మీరు వినాల్సిందేనని అంటుంది. రాజ్ ఓవరాక్షన్ చూసిన ఇందిర, అపర్ణలు అతనిని పక్కకి తీసుకెళ్తారు.

పంతుల్ని ఎందుకు తీసుకొచ్చావ్ అని ఇందిర అడగ్గా.. పూజారి వచ్చి అందరికీ నమస్కారం చెబుతాడు. ఆయనకి నాకు ఏ సంబంధం లేదని, నేనేమీ రమ్మని చెప్పలేదని అంటాడు. ఇంతలో పంతులు గారిని నేను పిలిపించానని చెబుతుంది ధాన్యలక్ష్మీ. శోభనం ముహూర్తం పెట్టడానికి పిలిచానని ధాన్యం చెప్పడంతో ప్రకాశం పొంగిపోతాడు. ఇంతలో అప్పూ వచ్చి నేను స్టేషన్‌కి వెళ్తున్నానని చెప్పడంతో పంతులుగారిని పిలిపించిందే మీకోసమని మండిపడుతుంది ధాన్యలక్ష్మీ. మీ ఇద్దరి శోభనానికి ముహూర్తం పెట్టమని పంతులుగారికి చెప్పానని అంటుంది.

తమ్ముడు.. మీకింకా ఫస్ట్ కాలేదా? అని రాజ్ ప్రశ్నించడంతో కళ్యాణ్ లేదని చెబుతాడు. అప్పూ పోలీస్ అయ్యేవరకు వెయిట్ చేశానని అంటాడు కళ్యాణ్. ఆవిడగారు పోలీస్ అయ్యారు, నువ్వు రైటర్ అయ్యావ్.. ఇక వెయిట్ చేసింది చాలని అంటుంది ధాన్యలక్ష్మీ. అప్పూ ఇంకొన్ని రోజులు ఆగుదామని అంటుండగా.. రిటైర్ అయ్యాక శోభనం చేసుకుంటావా? అని మండిపడుతుంది ధాన్యం. కళ్యాణ్ ఫస్ట్ నైట్‌ని అడ్డుపెట్టుకుని కళావతికి ప్రపోజ్ చేయాలని ప్లాన్ చేస్తాడు రాజ్. వాళ్లకి మాత్రం మనవడినో, మనవరాలినో ఎత్తుకోవాలని ఆశ ఉండదా? అని అడుగుతాడు. పెళ్లి కాని వాళ్లకే ఫస్ట్ నైట్ విలువ తెలుస్తుందని అంటాడు.

ఉద్యోగం మానను అన్నా ఒప్పుకున్నాను, కనీసం పిల్లలైన కంటారా? లేదా అని ధాన్యలక్ష్మీ నిలదీస్తుంది. ఇవాళ నీకు ఫస్ట్ నైట్ ముహూర్తం పెడుతున్నాం, కళావతి గారు నేను దగ్గరుండి ఏర్పాట్లు చేస్తున్నాం అంటాడు రాజ్. దానికి కావ్య సరేనని అంటుంది. ఈరోజు రాత్రి మంచి ముహూర్తం ఉందని పంతులు గారు చెప్పడంతో దానిని ఖాయం చేయమని అంటుంది ధాన్యలక్ష్మీ. కళ్యాణ్ - అప్పూలు ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా నేను చెప్పింది మీరు వినాల్సిందేనని అంటుంది. రాజ్ ఓవరాక్షన్ చూసిన ఇందిర, అపర్ణలు అతనిని పక్కకి తీసుకెళ్తారు. కళ్యాణ్ - అప్పూల రూమ్ డెకరేట్ చేసే వంకతో కళావతికి బాగా దగ్గరవుతానని, టైం చూసి ఆమెకు ప్రపోజ్ చేస్తానని అంటాడు రాజ్.

కావ్యకి ప్రపోజ్ చేయడానికి రాజ్ వచ్చిన విషయాన్ని యామినికి ఫోన్ చేసి చెబుతుంది రుద్రాణి. రాజ్‌ను ఇంటికి రాకుండా ఆపమంటే చివరికి వాడిని కావ్య దగ్గరికి పంపించావేంటీ అని మండిపడుతుంది. రాజ్ కనుక కావ్యకి ప్రపోజ్ చేస్తే ఆ తర్వాత ఇంట్లో వాళ్లంతా వాళ్లిద్దరికి పెళ్లి చేస్తారని చెబుతుంది రుద్రాణి. రాజ్ నేను చెబితే ఆగుతాడా? అని ప్రశ్నిస్తుంది యామిని. ఆ మాత్రం ఆపలేని దానివి నీకెందుకు ప్రేమ, పైగా రాజ్ లేకుంటే చనిపోతానని బిల్డప్‌లు దేనికీ అని మండిపడుతుంది రుద్రాణి. నా ప్రాణం ఉన్నంత వరకు రాజ్‌ను వదులుకోనని, మగాళ్లు శారీరకంగా బలంగా ఉంటారు కానీ , వాళ్లంతా ఎమోషనల్ ఫూల్స్ అని అంటుంది రుద్రాణి.

కావ్యకి ప్రపోజ్ చేయడానికి వెళ్లిన రాజ్ తిరిగి పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చేలా చేయబోతున్నానని అంటుంది. వెంటనే పెళ్లి వేదిక ఎక్కేలా ఏర్పాట్లు చేస్తున్నానని అంటుంది యామిని. మనిషి ప్రాణాల మీదకి వస్తే రాజ్ దేనికైనా తెగిస్తాడని ఆ వీక్‌నెస్‌ని అడ్డుపెట్టుకుని నేను అతనిని లాక్ చేస్తానని చెబుతుంది యామిని. నేనంటే నీకు ఇష్టం కదా? నేను అడిగితే ఏదైనా చేస్తారా? అని తండ్రిని అడుగుతుంది యామిని. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X