Brahmamudi May 26th Episode: సీఈవో చైర్ దక్కించుకునేలా ఇందూ పావులు.. స్వాతి ప్రేమను తిరస్కరించిన మదన్

Photo Courtesy: JioHotstar

ఆ రాజ్ గాడు ఆఫీస్ వరకు వచ్చేశాడు.. ఇక సీఈవో పోస్ట్ ఎంత అని ఇందూ చెప్పడంతో రేఖకి టెన్షన్ వస్తుంది. వాడు అస్సలు సీఈవో అవ్వకూడదు.. మీరే సీఈవోగా ఉండాలని ఇందూ చెప్పడంతో నేను చూసుకుంటానని అంటుంది రేఖ. ఆఫీస్‌లో లే ఆఫ్స్ గురించి వెంకీ తన ఫ్రెండ్‌తో మాట్లాడుకుంటూ ఉండగా.. అతని ఖాతాలో 3 లక్షల రూపాయలు పడతాయి. దీని గురించి మేనేజర్‌ని అడుగుదామని వెళ్లగా.. నిన్ను ఉద్యోగంలో నుంచి తీసేశామని చెప్పడంతో వెంకీ షాక్ అవుతాడు. స్కిల్స్ లేకుండా నీకు ఎక్కడా జాబ్ రాదు.. ఏ టిఫిన్ బండో పెట్టుకుని అవమానిస్తాడు మేనేజర్.

పెరుగులో చికెన్ వేసుకుని తింటున్న రాజ్‌ని చూస్తుంటే తన కొడుకే అపర్ణకి గుర్తొస్తాడు. నువ్వు సీఈవో పోస్ట్‌కి పోటీ చేస్తున్నావా అని రేఖ నిలదీయగా రాజ్ అవునని అంటాడు. నీ ప్రయత్నాలు నువ్వు చేసుకో, నా ప్రయత్నాలు నేను చేసుకోమని సవాల్ విసురుతాడు. రాజ్ గురించి బాధపడుతున్న చలపతి - లక్ష్మీల దగ్గరికి వెంకీ వచ్చి 3 లక్షల రూపాయలు ఇచ్చి.. నన్ను ఉద్యోగంలో నుంచి తీసేశారని చెబుతాడు. దాంతో తల్లిదండ్రులు షాక్ అవుతారు. వీడు ఉద్యోగం మానేస్తే అప్పులు, ఈఎంఐల పరిస్ధితి ఏంటీ? అంటూ లక్ష్మీ దగ్గర చలపతి బాధపడతాడు. రేఖకి తన మీద చాడీలు చెప్పిన ఇందూ మీద రగిలిపోతాడు రాజ్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక మే 26వ తేదీ ఎపిసోడ్ 1042లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial May 26th 2026 Episode 1042 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

రేఖ ఆంటీ దగ్గర ఇరికించేసి హ్యాపీగా తింటున్న ఇందూని అలాగే చూస్తాడు. నీకు కావాలంటే కిచెన్‌లోకి వెళ్లి తెచ్చుకో.. నాకు దిష్టి తగులుతుందని అంటుంది ఇందూ. అద్దె మొగుడనే జాలి, దయ నీకు లేదు. నిన్ను కిడ్నాప్ చేశా? కానీ టార్చర్ నేను అనుభవించా? చిన్నప్పటి కోరికలు అన్ని తీర్చా.. అద్దె మొగుడిగా రమ్మంటే వచ్చా? ఆఫీస్‌కి రమ్మంటే సూట్ బూట్ వేసుకుని వచ్చా? నువ్వు ఇచ్చే 2500 పేమెంట్‌కి ఎవడొస్తాడు? మళ్లీ అందులో కన్ను కొట్టావు.. చేయి పట్టుకున్నానని కటింగ్‌ల మీద కటింగ్‌లు చేస్తావు? అసలు నీ ఉద్దేశం ఏంటీ? నన్నేం చేయాలని అనుకుంటున్నావా అంటూ మండిపడతాడు.

నన్ను చంపేయాలని ఫిక్స్ అయ్యావు? నేనేం పాపం చేశాను? మా అమ్మానాన్నలకి ఒక్కగానొక్క పెద్ద కొడుకుని అంటాడు రాజ్. మీ రిచ్ వాళ్లు ఐలవ్ యూ, ఐ మిస్ యూ అని ప్రేమను వ్యక్తపరుస్తారేమో కానీ.. మా మధ్యతరగతి వాళ్లు ప్రేమను తిట్లు, కోపంలోనే చూపిస్తారు. నేను కనుక ఇప్పుడు ఇంటికి వెళ్తే మా అమ్మానాన్న ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు అంటాడు రాజ్. నేను ఇంటికెళితే కేజీ కేజీలు చికెన్ తీసుకొస్తారని అంటాడు. ఇక్కడ కూడా చికెన్ తింటున్నావు కదా అని ఇందూ అడగ్గా.. చికెన్ చూపించి నా పీక పీసకేస్తున్నావని మండిపడతాడు రాజ్.

నన్ను మీ రేఖ ఆంటీ ముందు బలి చేయడానికి సిద్ధమయ్యావు. నా మానాన నేనుంటు కంపెనీ అని చెప్పి తీసుకెళ్లావు, నీ అంతట నువ్వే సీఈవోగా పోటీ చేయమని నువ్వే ప్లాన్ చేసి నాతో ఫోన్లు చేయించావు. మళ్లీ ఈ విషయాలన్నీ తీసుకెళ్లి మీ రేఖ ఆంటీకి చెప్పి నన్ను ఇరికించావు. మీ రేఖ ఆంటీ ఊరుకోదు.. తేడా వస్తే పీక తీసేస్తుందని భయపడతాడు రాజ్. నేను సీఈవో అవ్వాలని ప్రయత్నిస్తే రేఖ ఆంటీ అడ్డుపడుతుంది. నా మీద డౌట్ పడుతుంది. నువ్వు పోటీలో ఉంటే తనని తాను కాపాడుకోవడానికి మా రేఖ ఆంటీ నన్ను సీఈవోని చేస్తుందని ఇందూ చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు.

నన్ను సీఈవోని చేయవా? అని రాజ్ అడగ్గా.. నువ్వొక దొంగవి, అబద్థాల కోరువి. అలాంటి నీ చేతుల్లో కంపెనీని పెడితే ఏమైనా ఉందా? అని అంటుంది ఇందూ. మీ రేఖ ఆంటీ వాళ్లకి ఏమైనా డౌట్ వస్తే అని రాజ్ ప్రశ్నించగా.. వాళ్లు నీ గురించే ఆలోచిస్తారని చెబుతుంది ఇందూ. మరోవైపు.. రాజ్‌గాడు మననెత్తికెక్కి కూర్చొంటున్నాడు, నువ్వు వాడిని వదిలేస్తున్నావని రేఖతో అంటుంది భ్రమరాంబ. ఒకప్పుడు వాడి చేత ఆస్తి పేపర్ల మీద సంతకాలు పెట్టించుకోవాలని మంచివాళ్లు లాగా నటించాం. కానీ ఇప్పుడు వాడు నా చైర్‌లోనే కూర్చోవాలని చూస్తున్నాడని రగిలిపోతుంది రేఖ

వాడు మొండోడు దేనికి భయపడడు.. ఆల్రెడీ చెప్పినట్లే చేస్తున్నాడని అంటాడు భూషణ్. కానీ నేను ఊరుకోను కదా? నా ప్లాన్స్ నాకు ఉంటాయి కదా? నా దగ్గర ఒక బ్రహ్మాస్త్రం ఉందని చెబుతుంది రేఖ. ఆ బ్రహ్మాస్త్రాన్ని వాడుకుని నేనే సీఈవోని అవుతానని చెబుతుంది. మరోవైపు.. నన్ను అడ్డుపెట్టుకుని సీఈవో అవ్వాలన్న రేఖ ఆంటీ ప్లాన్‌ని మనం అడ్డుకోవాలి.. అలా జరగాలంటే మన బోర్డ్ మెంబర్స్‌లో సీనియర్ మెంబర్ అయిన పరంధామయ్య గారిని మనం వెంటనే కలవాలని రాజ్‌తో చెబుతుంది ఇందూ. తనకు మనకి సపోర్ట్ చేస్తాడన్న గ్యారంటీ ఏంటీ? అని రాజ్ అడుగుతాడు. మా తాతయ్య, మా నాన్నలతో కలిసి పరంధామయ్య గారు బిజినెస్ చేశారు. మా కుటుంబం కోసం ఏమైనా చేస్తారని అంటుంది ఇందూ.

నువ్వు చూస్తే చాలా అమాయకంగా కనిపిస్తావు. కానీ నీ మైండ్‌లో ఇన్ని కుట్రలా అంటూ ఇందూపై మండిపడతాడు రాజ్. నా కుటుంబాన్ని, కంపెనీని కాపాడుకోవడానికే ఇదంతా చేస్తున్నానను అని చెబుతుంది ఇందూ. నేను అన్న మాటలన్నీ మనసులో పెట్టుకుని నా పేమెంట్‌ని కట్ చేయొద్దని రాజ్ బతిమలాడటంతో ఇందూ సరేనని అంటుంది. ఇందూని అడ్డుపెట్టుకుని ఆ రాజ్ గాడిని పిచ్చోడిని చేస్తానని చెబుతుంది రేఖ.

ఓ రెస్టారెంట్‌లో వెంకీ, నందూలు కలుసుకుంటారు. ఉద్యోగం పోయిందని బాధపడొద్దు.. నిన్ను వద్దు అనుకున్న వారికి ఎదిగి చూపించమని వెంకీకి ధైర్యం చెబుతుంది నందూ. నీ కోసం ఒక అమ్మాయితో ఛాట్ చేశాను..ఆ అమ్మాయి ఇక్కడికి వస్తుంది, ఆమెతో మాట్లాడమని చెబుతుంది నందూ. నాకు ఉద్యోగం పోయింది, 10 లక్షల అప్పుందని నందూ చెప్పడంతో ఆ అమ్మాయి ముఖం మీదే ఛీ కొట్టి వెళ్లిపోతుంది. డబ్బుతోనే అన్నీ వస్తాయని నేటి యువత ఆలోచిస్తోందని నందూతో అంటాడు వెంకీ. ఈ పరిస్థితుల్లో నాకు మూడు పూటలా తిండి దొరికేలా లేదని చెబుతాడు. జాబ్ లేకపోతే నువ్వు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయేలా ఉన్నావు.. పాజిటివ్ మైండ్‌సెట్‌తో ట్రై చేస్తే నీకు జాబ్ దొరుకుతుందని అంటుంది నందూ.

మందన్ బయటకు వెళ్తుండగా గుమ్మానికి అడ్డుగా నిలబడుతుంది స్వాతి. నీకు చాలా రోజుల నుంచి చెప్పాలని అనుకుంటున్నాను, నేను నిన్ను చిన్నప్పటి నుంచి ఇష్టపడుతున్నాను, నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నిన్నే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. ఈ విషయం నీకు చాలా సార్లు చెప్పాలని అనుకున్నాను. నీకు ఇందూ అక్కకి పెళ్లి చేసుకుంటుంటే బాధపడ్డాను. నా ప్రేమను నాలోనే సమాధి చేసుకోవాలని అనుకున్నాను. కానీ అక్కకి పెళ్లయిపోవడంతో నా ప్రేమకు ఊపిరి వచ్చింది. నేనంటే నీకు ఇష్టమేనా? పెళ్లి చేసుకుంటావా? అని తన మనసులోని మాటను చెబుతుంది స్వాతి.

కానీ నేను ఎవరినీ ప్రేమించాలని అనుకోవడం లేదు.. మా అమ్మ ఏం చెబితే నేను అదే చేస్తాను. మొన్న ఇందూని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోయినా సరేనని అన్నాను. మా అమ్మ ఎవరిని పెళ్లి చేసుకోమంటే వాళ్లనే పెళ్లి చేసుకుంటానని మదన్ తేల్చేయడంతో స్వాతి వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఇదంతా చూసిన ఇందూ.. స్వాతిని ఓదారుస్తుంది. మదన్ లేకపోతే నేను బతకలేనని అంటుంది స్వాతి. వాళ్లమ్మ ఏం చెబితే అదే చేస్తానని అన్నాడు. నువ్వంటే ఇష్టం ఉండొచ్చు.. వాళ్లమ్మ గురించి ఆలోచించే నీ మీద ప్రేమను మనసులోనే దాచుకున్నాడేమో ఎవరికి తెలుసు అంటుంది ఇందూ. వాళ్లమ్మ నిన్నే పెళ్లి చేసుకోమని చెబుతుందేమో? ఏం జరిగినా సరే.. నీకు, మదన్‌కి పెళ్లి చేసే బాధ్యత నాది అని మాటిస్తుంది ఇందూ. ఇదంతా చూసిన రేఖ రగిలిపోతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X