Brahmamudi May 27th Episode: తప్పించుకున్న ఛార్లెస్.. డేంజర్‌లో అప్పూ ఉద్యోగం, కళ్యాణ్ సూపర్‌ప్లాన్

Photo Courtesy: JioHotstar

స్వప్న నగలు కొట్టేయాలని ప్లాన్ చేసిన రాహుల్.. కబోర్డ్‌లో ఒరిజినల్ నగల ప్లేస్‌లో నకిలీవి పెడతాడు, ఇంతలో స్వప్న లోపలికి వచ్చి ఎందుకంత కంగారు పడుతున్నావని అడుగుతుంది. అతనిపై అనుమానంతో కబోర్డ్‌లో తన నగలన్నీ చెక్ చేసుకుంటుంది. ఉదయాన్నే ఇంటికి వస్తున్న రాజ్ వెనుక పంతులు గారిని చూసిన దుగ్గిరాల ఫ్యామిలీ షాకవుతుంది. ఎవరు మీరు? ఎందుకొచ్చారని అపర్ణ అడిగేలోపే నేను పిలిపించానని ధాన్యలక్ష్మీ చెబుతుంది. అప్పూ- కళ్యాణ్‌లకు ఫస్ట్ నైట్ కోసం ముహూర్తం పెట్టించడానికి రమ్మాన్నానని అంటుంది.

కళ్యాణ్ - అప్పూలకి ఇంత వరకు పెళ్లి జరగకపోవడంతో అంతా షాక్ అవుతారు. ఇదే అదనుగా కావ్యని ఇంప్రెస్ చేయాలని రాజ్ రెచ్చిపోతాడు. నా చేతుల మీదుగా ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేస్తానని బిల్డప్ ఇస్తాడు. రాజ్ కాసేపట్లో కావ్యకి ప్రపోజ్ చేయబోతున్నాడని, ఇక నీ జీవితం నాశనమేనంటూ యామినికి ఫోన్ చేస్తుంది రుద్రాణి. మీరేం కంగారు పడొద్దని నేను అంత తేలిగ్గా రాజ్‌ను వదిలిపెట్టనని కత్తితో తండ్రి వంక చూస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక మే 27వ తేదీ ఎపిసోడ్ 732లో ఏం జరిగిందంటే?

Brahmamudi Serial May 27th 2025 Episode 732 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

ఫస్ట్ నైట్ గురించి ఆలోచిస్తున్న అప్పూ.. కళ్యాణ్‌పై మండిపడుతుంది. ఈ ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేయించింది నువ్వేనా? నువ్వే వెనుకుండి నడిపిస్తున్నావ్ కదా? అని నిలదీస్తుంది. ఆ మాటలతో కళ్యాణ్ షాక్ అవుతాడు. నిన్న రాత్రి ఫస్ట్ నైట్ జరగలేదని గొడవ పెట్టావు, ఆ సమయంలోనే అత్తయ్య గారు ఎదురుపడ్డారని గుర్తుచేస్తుంది అప్పూ. ఆవిడకి మొత్తం చెప్పేశావ్ కదా అని మండిపడుతుంది. నన్ను అనుమానిస్తే కళ్లు పోతాయని అంటాడు కళ్యాణ్. ఇంట్లో ఇంతమంది ఉన్నారు? మనం ఇద్దరమే ఉన్నప్పుడు ఏ రోజైనా తొందరపడ్డానా? అని ప్రశ్నిస్తాడు. నా ఫీలింగ్స్‌ని నాలోనే దాచుకున్నాను కానీ నువ్వు పోలీస్ అయ్యే వరకు కనీసం నోరైనా జారానా అని అడుగుతాడు.

అయితే అత్తయ్య గారికి సడెన్‌గా ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడుగుతుంది అప్పూ. నువ్వు చెప్పకుండా మనకి ఫస్ట్ నైటే జరగలేదని ఆవిడకి ఎలా తెలుస్తుందని డౌట్ పడుతుంది అప్పూ. మనం రాత్రి మాట్లాడుకునేటప్పుడు వినిందేమో అని అనుకుంటాడు కళ్యాణ్. నేను ఛార్లెస్ అనే దొంగను పట్టుకున్నాను.. వాడు ఇప్పటికే 49 సార్లు తప్పించుకున్నాడు. వాడు ఇంకోసారి తప్పించుకుంటే డిపార్ట్‌మెంట్ పరువు పోతుంది. అదే గనుక జరిగితే నా ఉద్యోగం కూడా పోతుందని చెబుతుంది అప్పూ. నేనే నైట్ డ్యూటీ చేస్తానని మా సీఐకి చెప్పాను, నన్ను నమ్మి ఆయన ఫ్యామిలీతో కలిసి తిరుపతి వెళ్లాడని చెబుతుంది అప్పూ. నేను కనుక స్టేషన్‌లో లేకపోతే వాడు చాలా ఈజీగా తప్పించుకుంటాడని అంటుంది. అత్తయ్యని ఒప్పించి ఈ ఫస్ట్ నైట్‌ని వాయిదా చేయించమని చెబుతుంది అప్పూ.

వారి మాటలు విన్న ధాన్యలక్ష్మీ.. ఫస్ట్ నైట్ వాయిదా వేయించడం మాత్రం జరగదని తేల్చి చెబుతుంది. నువ్వు చెప్పినదంతా వినడానికి నేను వీడిలా చవటను కాదని అంటుంది. ఈ రోషాలు, పౌరుషాలు నా మీద కాదు.. నీ పెళ్లాం మీద చూపించమని కళ్యాణ్‌పై మండిపడుతుంది. స్వప్న, కావ్యలు వచ్చి నిన్ను రెడీ చేస్తారని అప్పూతో చెబుతుంది. నువ్వు మా గదిలోకి వెళితే.. రాజ్ వచ్చి రెడీ చేస్తాడని కళ్యాణ్‌తో అంటుంది ధాన్యలక్ష్మీ. అప్పూ ఫస్ట్ నైట్‌ని వాడుకుని స్వప్న నగలు కొట్టేయాలని ప్లాన్ చేస్తాడు రాహుల్. ధాన్యలక్ష్మీ అత్తయ్యకి నగలంటే ప్రాణమని కాబట్టి అప్పూకి నీ నగలు వేయమని స్వప్నతో చెబుతాడు.

నా ఏడు వారాల నగలు బ్యాంక్‌లో ఉన్నాయని స్వప్న చెప్పడంతో వెళ్లి తీసుకునిరా అంటాడు రాహుల్. సడెన్‌గా నీకు ఇంత మంచి బుద్ధి పుట్టిందేంటీ అని స్వప్న ప్రశ్నిస్తుంది. నిన్నటి నుంచి నువ్వు తేడాగా బిహేవ్ చేస్తున్నావని అనుమానిస్తుంది. నీ చెల్లెలి ఆనందం కోసం చెప్పానని, చేస్తే చేయ్ లేకపోతే లేదని మండిపడతాడు రాహుల్. ఇద్దరం కలిసి బ్యాంక్‌కి వెళ్లి నగలు తీసుకొద్దామని చెబుతుంది స్వప్న. తన ప్లాన్ వర్కవుట్ అయినందుకు రాహుల్ చాలా సంతోషిస్తాడు. వెంటనే ఈ విషయాన్ని తన ప్రియురాలికి చెబుతాడు. నగల్ని తీసుకొస్తున్నానని, రేపు మనం ఫస్ట్ నైట్ చేసుకుందామని అంటాడు. ఇంతలో స్వప్న రావడంతో రాహుల్ షాక్ అవుతాడు.

అప్పూ - కళ్యాణ్‌ల ఫస్ట్ నైట్ కావడంతో రాజ్ హడావుడి చేస్తాడు. కిచెన్‌లో ఉన్న కావ్య దగ్గరికి వచ్చి ఫస్ట్ నైట్ ఏర్పాట్ల గురించి మాట్లాడతాడు. కార్యానికి చాలా సమయం ఉందని అంటుంది కావ్య. దానికి కావాల్సినవి బజారుకెళ్లి కొనుక్కుని తీసుకురావాలి కదా అని అంటాడు రాజ్. ఆమె ఎంతకీ రాకపోవడంతో కావ్య చేతిని పట్టుకుని హాల్‌లోకి లాక్కెళ్తాడు. ఆమెను కూర్చోబెట్టి స్వీట్స్, ఫ్రూట్స్ లిస్ట్ చెప్పడంతో కావ్య షాక్ అవుతుంది. వాళ్లిద్దరూ గొడవ పడటంతో ఇందిర, అపర్ణ వచ్చి ఏం జరిగిందని అడుగుతారు. వాడేం కోరుకుంటున్నాడో అన్ని తీసుకుని రమ్మని కావ్యతో చెబుతారు. ఈరోజు రాత్రినాటికి కావ్యని పడేస్తానని చెబుతాడు రాజ్.

పోలీస్ స్టేషన్‌లో ఉన్న ఛార్లెస్ తప్పించుకోవడానికి ప్లాన్ చేస్తాడు. ఓ కుర్రాడితో పోలీసుందరికీ టీలో మత్తు మందు కలిపి డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్స్‌కి ఇప్పిస్తాడు. ఆ దెబ్బకు అందరూ నిద్రపోతారు. మరోవైపు.. ఫస్ట్ నైట్ కోసం అప్పూని అందంగా రెడీ చేస్తుంది స్వప్న. నాకు ఈ నగలు, ఈ హడావుడి నచ్చడం లేదని మండిపడుతుంది అప్పూ. నా దగ్గరే నీ కబుర్లన్నీ, అందరి ముందే కళ్యాణ్‌కి నువ్వు కన్ను కొట్టి వెళ్లడం నేను చూశానని ఆట పట్టిస్తుంది స్వప్న. భార్యాభర్తలు అన్నాక ఆ మాత్రం రొమాన్స్ ఉండాలని, నాకు దొరికాడు అంటూ రాహుల్ గురించి చెప్పబోతుండగా రాహుల్ అక్కడికి వస్తాడు.

చీర వరకు ఓకే కానీ నగలు కూడా వేసుకోవాలా? అని స్వప్నను అడుగుతుంది అప్పూ. నీ కోసం కష్టపడి బ్యాంక్‌కి వెళ్లి ఈ నగలన్నీ తీసుకొచ్చామని, నువ్వు వేసుకుంటేనే కదా మా స్వప్న కూడా హ్యాపీగా ఉండేదని చెబుతాడు రాహుల్. సడెన్‌గా రాహుల్‌లో అంతమంచి బుద్ధి ఎందుకు వచ్చిందో నాకు అర్ధం కావడం లేదని అంటుంది స్వప్న. ఇప్పటికీ నాకు నీ మీద అనుమానంగానే ఉందని చెబుతుంది. ఇలాంటి నగలే వేసుకుని పెళ్లి పీటల మీద నుంచి పారిపోతే జీవితాంతం గుర్తుండేలా చేశావని మండిపడుతుంది స్వప్న. స్వీట్స్ తీసుకురావాలని చెప్పి స్వప్నని తీసుకుని వెళ్తాడు రాహుల్.

ఇంతలో ఛార్లెస్ తప్పించుకున్నాడని అప్పూకి స్టేషన్ నుంచి ఫోన్ వస్తుంది. దీంతో అప్పూ షాకవుతుంది. మీరు కనుక ఇప్పుడు రాకపోతే మనందరి ఉద్యోగాలు పోతాయని కానిస్టేబుల్ చెప్పడంతో అప్పూ ఉలిక్కిపడుతుంది. మరోవైపు ఫస్ట్ నైట్ కోసం ఎదురుచూస్తున్న కళ్యాణ్ దగ్గరికి వెళ్లి ఛార్లెస్ తప్పించుకున్న విషయం చెబుతుంది. ఈ సమస్య నుంచి మా రాజ్ అన్నయ్యే కాపాడతాడని అంటాడు కళ్యాణ్. అటు రాజ్ - కావ్యలు కలిసి శోభనం గదిని డెకరేట్ చేస్తుంటారు. నేను చెప్పినా వినకుండా చాలా ఎక్కువ తెప్పించారని, ఇవన్నీ మిగిలిపోయాయని రాజ్‌పై కావ్య మండిపడుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X