Brahmamudi May 27th Episode: ఇందూపైకి మదన్‌ని వదిలిన రేఖ.. ఇందూ- రాజ్‌ల ఫస్ట్ నైట్‌కి భ్రమరాంబ స్కెచ్

Photo Courtesy: JioHotstar

చేసినదంతా చేసి హ్యాపీగా తింటున్నావా అంటూ ఇందూపై మండిపడతాడు రాజ్. నేను సీఈవో పోస్ట్‌కి పోటీ పడుతున్నానని మీ రేఖ ఆంటీతో సీరియస్‌గా తీసుకుని నన్ను ఏమైనా చేస్తే ఏంటీ పరిస్థితి అని అడుగుతాడు రాజ్. నేను సీఈవో అవుతున్నాని తెలిస్తే మా రేఖ ఆంటీకి అనుమానం వస్తుంది.. అందుకే నిన్ను ముందుపెట్టి వెనుక నేను గేమ్ ఆడుతున్నా. మా రేఖ ఆంటీ నా ద్వారా తిరిగి సీఈవో కావాలని అనుకుంటోంది. అది జరగనివ్వకూడదని రాజ్‌తో చెబుతుంది ఇందూ.

ఓ రెస్టారెంట్‌లో నందూ, వెంకీలు కలుసుకుంటారు. ఉద్యోగం పోయిందని బాధపడొద్దు.. దీనికంటే మంచి జాబ్ వస్తుంది, నిన్ను వద్దు అనుకున్న వారికి నీ టాలెంట్ ఏంటో చూపించాలని అంటుంది నందూ. ఓ డేటింగ్ యాప్‌లో మాట్లాడిన అమ్మాయిని నందూ పిలిపిస్తుంది. ఆమెను ఇష్టాయిష్టాలు తెలుసుకున్న వెంకీ ముఖం మీదే ఛీ కొడతాడు. బయటకు వెళ్తున్న మదన్‌కి స్వాతి అడ్డొచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడుగుతుంది. మా అమ్మ ఏది చెబితే అదే చేస్తానని ఆమె ప్రేమను తిరస్కరిస్తాడు మదన్. ఇదంతా చూసిన ఇందూ.. స్వాతికి ధైర్యం చెప్పి మదన్‌తో పెళ్లి చేస్తానని మాట ఇస్తుంది. వీరి మాటలు విన్న రేఖ రగిలిపోతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక మే 27వ తేదీ ఎపిసోడ్ 1043లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial May 27th 2026 Episode 1043 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

సీఈవో పోస్ట్ కోసం బోర్డ్ మెంబర్ అయిన పరంధామయ్య దగ్గరికి వస్తారు ఇందూ- రాజ్. మీ ఇద్దరినీ చూస్తుంటే రాజ్ - కావ్యలని చూసినట్లుగానే ఉందని అంటాడు పెద్దాయన. ఒకప్పుడు మీ కుటుంబం ఎంత గొప్పగా బతికిందో నాకు తెలుసు. స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అంటే ఒక బ్రాండ్. కానీ ఎప్పుడైతే మీ అమ్మనాన్నలు పోయారో.. అప్పుడే మీ కుటుంబం తలకిందులైంది. ఆ రేఖ మీ కంపెనీని, ఆస్తుల్ని తన చేతుల్లోకి తీసుకుంది. రోజు రోజుకి కంపెనీ పడిపోతోంది.. ఆ రేఖ తన స్వార్ధం తప్ప కంపెనీ గురించి, ఎంప్లాయిస్ గురించి అస్సలు పట్టించుకోదు. నేను అడిగితే అవమానించేది. ఒకప్పుడు దుగ్గిరాల కుటుంబం ఎంతోమంది పేదవాళ్లకి సాయం చేసింది. అలాంటిది ఎంప్లాయిస్‌కు ఆ రేఖ కనీసం జీతం కూడా ఇవ్వడం లేదు, అసలు బోర్డ్ మెంబర్‌గా కూడా ఉండకూడదని అనుకున్నాను. కానీ సీతారామయ్య గారికి ఇచ్చిన మాట కోసమే ఇంకా కొనసాగుతున్నాను అంటాడు పరంధామయ్య.

నాకు సపోర్ట్ చేస్తే కంపెనీకి పూర్వ వైభవం తీసుకొస్తాను. మీరు అనుకున్నట్లుగా గొప్ప స్థాయికి తీసుకెళ్తానని అంటుంది ఇందూ. ఆ రేఖని ఎదిరించి నువ్వేం చేయగలవు, తను ఎన్నెన్ని దారుణాలు చేసిందో నీకు తెలియదని చెబుతాడు పరంధామయ్య. చిన్నప్పటి నుంచి నేను ఆ ఇంట్లోనే పెరిగాను... కంపెనీ బాగు కోసం, మమ్మల్ని నమ్ముకున్న వాళ్లు రోడ్డు మీదకి పడకూడదని ఈ రిస్క్ తీసుకున్నానని చెబుతుంది ఇందూ. కంపెనీకి మళ్లీ పూర్వ వైభవం వస్తుందంటే నాకు సంతోషం.

కంపెనీ మన చేతుల్లోకి రావాలంటే మన దగ్గర ఐదుగురు బోర్డ్ మెంబర్స్ ఉన్నారు. ఇద్దరు రేఖ ఆంటీకి సపోర్ట్ చేస్తే.. మిగిలిన ఇద్దరూ మీరు ఎవరికి సపోర్ట్ చేయమంటే వాళ్లకే సపోర్ట్ చేస్తారని చెబుతుంది ఇందూ. మీ సపోర్ట్ నా భర్తకేనని చెప్పండి అంటుంది. నీ భర్తని సీఈవోని చేస్తున్నావా అని పెద్దాయన అడగ్గా.. నేను సీఈవోని అవుతానని చెబుతుంది ఇందూ. నువ్వు చాలా పెద్ద ప్రమాదానికి ఎదురెళ్తున్నావని పరంధామయ్య వార్నింగ్ ఇస్తాడు. మా అమ్మానాన్నల ఆశయాన్ని నిలబెట్టాలంటే నాకు మరో దారి లేదని చెబుతుంది ఇందూ. నా ఓటు నీకే వేస్తానని పెద్దాయన చెబుతాడు.

రేఖ టెన్షన్‌లో అటు ఇటూ తిరుగుతుండటంతో ఏం జరిగిందని అడుగుతారు భ్రమరాంబ, శేషం. నేను నా కొడుకు మదన్ గురించి వెయిట్ చేస్తున్నానని చెబుతుంది రేఖ. ఇంతలో మదన్ రావడంతో ఎక్కడికి వెళ్లావని మండిపడుతుంది. ఈరోజు నుంచి నువ్వు ఇందూతో స్నేహంగా ఉండాలని, వీలైనంత త్వరగా దానిని నీ దారిలోకి తెచ్చుకోవాలని రేఖ చెప్పడంతో భ్రమరాంబ, శేషం షాక్ అవుతారు. దానికి పెళ్లయి మొగుడు ఉన్నాడు కదా అని భ్రమరాంబ అంటుంది. ఆ పెళ్లిని పెటాకులు చేసి, వాళ్లకి విడాకులు ఇప్పించి దానిని నా కొడుక్కి ఇచ్చి పెళ్లి చేస్తానని చెబుతుంది రేఖ. విడాకులు వచ్చేలోపు అది నా కొడుక్కి దగ్గరవుతుందని అంటుంది.

ఈరోజు నుంచి నువ్వు ఇందూతో క్లోజ్‌గా ఉండాలి.. ఎప్పుడు అది నీ పేరే తలచుకునేలా ఉండాలి, నువ్వు లేకపోతే అది చచ్చిపోతాను అనే రేంజ్‌లో ఉండాలని మదన్‌తో చెబుతుంది రేఖ. నీ కూతురిని నా కొడుక్కిచ్చి కట్టబెడదామని అనుకుంటున్నావా? అది అస్సలు జరగదని మనసులో అనుకుంటుంది రేఖ. ఉన్న ఒక్క అవకాశం కూడా పోయిందని భ్రమరాంబతో అంటాడు శేషం. ఇందూకి, రాజ్‌కి విడాకులు ఇప్పించాలని రేఖ అనుకుంటున్నప్పుడు నేను ఊరుకోను. ఇందూని, రాజ్‌ని ఒక్కటి చేస్తానని చెబుతుంది భ్రమరాంబ.

భార్య చెప్పిన ప్లాన్ ప్రకారం నటిస్తాడు శేషం. నాకు ఇందూ గురించి చాలా బాధగా ఉందని అంటుంది భ్రమరాంబ. ఇందుకి పెళ్లయ్యింది, బంగారం లాంటి అబ్బాయి మొగుడిగా వచ్చాడని అంటుంది శేషం. ఇందూకి పెళ్లయినా కూడా తన జీవితం ఏం మారింది.. మెడలో తాళిబొట్టు, తాళికి మెట్టలు తప్పించి ఏం జరిగింది. సాంప్రదాయం ప్రకారం.. పెళ్లి తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు ఉంటాయి. వాళ్ల అచ్చట ముచ్చట తీర్చాలని ఈ ఇంట్లో ఒక్కరైనా చేశారా అని ప్రశ్నిస్తుంది భ్రమరాంబ. ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేద్దామని ఎవ్వరూ అనుకోవడం లేదని చెప్పడంతో ఈ మాటలన్నీ విన్న అపర్ణ, సుభాష్‌లు షాక్ అవుతారు. ఇన్నిరోజులు ఆస్తి గొడవల్లో పడి మనం ఆ విషయం మరిచిపోయాం. అస్సలు మనవరాలి గురించి ఆలోచించలేకపోయామని సుభాష్‌తో అంటుంది అపర్ణ. వెంటనే పంతుల్ని పిలిపించి మంచి ముహూర్తం చూడమంటానని చెబుతుంది.

వెంకీ ఇంటర్వ్యూకి రెడీ అవుతుండగా కొరియర్ వస్తుంది. అందులో షర్ట్ ఉండటంతో అంతా షాక్ అవుతారు. ఆ వెంటనే వెంకీకి నందూ కాల్ చేసి షర్ట్ వేసుకుని రెడీ అవ్వమని చెబుతుంది. ఖచ్చితంగా నీకు జాబ్ వస్తుందని నందూ చెప్పడంతో సంతోషిస్తాడు. ఈ అమ్మాయి చాలా మంచిదిలా ఉంది. ఒక మనిషి జీవితంలో మనం సక్సెస్ అవ్వాలని కోరుకునేవాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్లని ఎప్పుడూ దూరం చేసుకోవద్దని కొడుక్కి లక్ష్మీ చెబుతుంది.

రాజ్‌ని మంచి చేసుకోవడానికి శేషం నానాకష్టాటు పడతాడు. ఇంత సడెన్‌గా నా మీద ప్రేమ పొంగుతోందని రాజ్ డౌట్ పడతాడు. నువ్వు ఇంట్లోకి అడుగుపెట్టాక.. నాకు కాస్త మనశ్శాంతి దొరికిందని చెబుతాడు శేషం. రేపు సీఈవోగా నువ్వే గెలవాలని అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X