Brahmamudi may 27th episode: నా భర్త ఎవరితోనో పిల్లాడిని కంటే? నేనెందుకు విడాకులు తీసుకోవాలి? కావ్య షాక్!
కావ్య ఇంటికి వచ్చిన మాయ ప్లేట్ ఫిరాయిస్తుంది. ఇదంతా రుద్రాణి ప్లాన్ అని తర్వాత తెలుసుకుంటుంది కావ్య. ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను ఇంట్లోంచి వెళ్ళిపోమని మాయతో చెప్తాడు సుభాష్. ఇంట్లో కోడలి స్థానం కోసం కావ్య తో పోటీ పడుతూ ఉంటుంది మాయ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక మే 27వ తేదీ ఎపిసోడ్ 421 లో ఏం జరిగిందంటే..
ఇంటికి లేటుగా వచ్చిన భార్యపై కోప్పడతాడు రాజ్. ఇప్పుడు ఏమైంది అని అడుగుతుంది కావ్య. ఇంట్లో నా పరిస్థితి తెలుసు కదా టీ, టిఫిన్ అంటూ ఆ మాయ వచ్చి నా మీద పడుతుంది. నిజం చెప్పలేను అలాగని దానిని భరించలేను అని ఫ్రెస్టేట్ అవుతాడు రాజ్. కంగారు పడకండి ఏదో ఒకటి చేసి దానిని బయటికి పంపిద్దాము అంటుంది కావ్య. దాన్ని తీసుకువచ్చి నా నెత్తి మీద పెట్టావు ఇప్పుడు ఏం చేయగలవు అంటాడు రాజ్. మీతో పాటు నేను కూడా ఇరుక్కున్నాను కదా అలా కంగారు పడితే సమస్యలు తీరవు. దానిని బయటికి పంపించేయటానికి ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది అప్పటివరకు తన దగ్గర నుంచి మీ శీలాన్ని కాపాడుకోండి అని భర్తని ఆటపట్టించి అక్కడినుంచి వెళ్ళిపోతుంది కావ్య.

మరోవైపు అపర్ణ ఫ్యామిలీ లాయర్ కి ఫోన్ చేసి ఒక మేటర్ చెప్పి డాక్యుమెంట్స్ రెడీ చేసి తీసుకురండి ఎక్కడా లీక్ అవ్వకూడదు అంటుంది. ఆమె చెప్పిన విషయం విని షాక్ అవుతాడు లాయర్ కానీ అపర్ణ గట్టిగా చెప్పడంతో ఏమీ అనలేక రేపొద్దున తీసుకొని వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. మరుసటి రోజు పొద్దున్న అందరూ హాల్లో సమావేశం అవుతారు. అప్పుడే లాయర్ వచ్చి అపర్ణకి పేపర్లు ఇస్తాడు. ఏమిటవి అని అందరూ అడుగుతారు.
అపర్ణ లాయర్ ని అక్కడ నుంచి పంపించేసి విడాకుల పత్రాలు అంటుంది. అందరు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఎవరికి అని అడుగుతారు. ఈ ఇంటికి సంబంధించి నేనొక నిర్ణయం తీసుకున్నాను రాజ్ కి మాయతో పెళ్లి చేయాలనుకుంటున్నాను అలా చేయాలంటే రాజ్ ముందు కావ్యతో విడాకులు తీసుకోవాలి అందుకే ఈ పత్రాలు తెప్పించాను అంటుంది అపర్ణ. ఆమె నిర్ణయానికి మాయ, రుద్రాణి ఇద్దరూ సంతోషిస్తారు. అలా చేస్తే సమస్య పరిష్కారం అవుతుందా అని కోప్పడతాడు సుభాష్. పోనీ సమస్యకి పరిష్కారం మీరే చెప్పండి అంటుంది అపర్ణ. రాజ్ ఆ అమ్మాయిని ఇష్టపడ్డాడు, మనకి చెప్పలేక ఇబ్బంది పడ్డాడు అలాగని మాయ మీద ఇష్టాన్ని చంపుకోలేక బిడ్డను కూడా కన్నాడు. కానీ బిడ్డని వదులుకోలేక వారసత్వం కోసం ఇక్కడికి తీసుకు వచ్చాడు. ఇక్కడ కావ్యని ఇష్టం లేని పెళ్లి చేసుకొని ఇబ్బంది పడుతున్నాడు.

రాజ్ కి కావ్య ఇష్టం లేదు అందుకే సంవత్సరం అయినా పిల్లల్ని కనలేదు, అందుకే ఆ తల్లి బిడ్డలకి న్యాయం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నాను అంటుంది అపర్ణ. తన న్యాయం చేయటం కోసం నా చెల్లెలికి అన్యాయం చేస్తారా అంటుంది స్వప్న. ఇంట్లో దానికి ఇప్పుడు మాత్రం న్యాయం జరుగుతుందని అనుకుంటున్నావా, అయినా మీ అమ్మ మోసం చేసి పెళ్లి చేసింది కాబట్టి అనుభవించాల్సిందే అంటుంది అపర్ణ.
అప్పుడు సీతారామయ్య మాట్లాడుతూ ఇంటి పెద్ద కోడలుగా నీ నిర్ణయాన్ని ఎప్పుడూ తప్పు పట్టలేదు కానీ ఇప్పుడు తప్పు పట్టాల్సి వస్తుంది అసలు ఎవరిని అడిగి ఈ నిర్ణయం తీసుకున్నావు, వాళ్లకి విడాకులు ఇప్పించడానికి నువ్వు ఎవరివి అని ప్రశ్నిస్తాడు. ఆ మాటలకి షాక్ అవుతుంది అపర్ణ. చిట్టి మాట్లాడుతూ నువ్వు ఎవరికైతే విడాకులు ఇప్పించాలనుకుంటున్నావో కనీసం ఆ జంటని అయినా సంప్రదించావా అని కోడల్ని ప్రశ్నిస్తుంది.

నేను అడుగుతున్నాను నువ్వు చెప్పు కావ్య నీకు ఈ విడాకులు ఇష్టమేనా అంటుంది చిట్టి. నేను మా అత్తగారిని ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను, నా అభిప్రాయం లేకుండానే నాకు విడాకులు ఇప్పించాలని అనుకుంటున్నారు మా అత్తగారు అసలు నేను చేసిన తప్పేమిటి నా భర్త వేరే ఎవరితోనో పిల్లాడిని కంటే నేనెందుకు విడాకులు తీసుకొని బయటికి వెళ్ళాలి అని అత్తగారిని సూటిగా ప్రశ్నిస్తుంది.

తరువాయి భాగంలో విడాకులు ఇవ్వను అన్నందుకు చాలా థాంక్స్ అని భార్యతో చెప్తాడురాజ్. అంటే నేను వెళ్ళిపోతానని భయపడ్డారన్నమాట అంటుంది కావ్య. నాకంటే విడాకులు ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టి ఇవ్వను అన్నాను, మీరెందుకు మౌనంగా ఉన్నారు అని భర్తని ప్రశ్నిస్తుంది కావ్య.


Click it and Unblock the Notifications











