Brahmamudi May 28th Episode: ఫస్ట్ నైట్ తప్పించుకున్న అప్పూ.. రాహుల్ చేతికి స్వప్న నగలు, డేంజర్‌లో రాజ్

Photo Courtesy: JioHotstar

ఫస్ట్ నైట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదని ఇవాళ నేను వెళ్లకపోతే ఆ ఛార్లెస్ గాడు తప్పించుకుంటాడని కళ్యాణ్‌తో అంటుంది అప్పూ. నువ్వే మీ అమ్మతో చెప్పి ఫస్ట్ నైట్ ప్లాన్ చేశావా? అని మండిపడుతుంది. మనిద్దరం ఒంటరిగా ఉన్నప్పుడే నేను నిన్ను ఏం చేయలేదు, ఇప్పుడు ఎందుకు తొందరపడతానని అడుగుతాడు కళ్యాణ్. వీళ్లిద్దరూ గొడవ పడుతుండగా ధాన్యలక్ష్మీ వచ్చి ఏం జరిగినా సరే మీ శోభనం జరిగి తీరుతుందని చెబుతుంది.

బ్యాంక్‌లో ఉన్న నీ ఏడు వారాల నగలు తీసుకొచ్చి అప్పూకి అలంకరించమని స్వప్నకి చెబుతాబు రాహుల్. చెల్లెలి కోసం స్వప్న సరేనంటుంది. అప్పూ - కళ్యాణ్‌ల ఫస్ట్ నైట్ కోసం కావ్య దగ్గర రాజ్ హడావుడి చేస్తాడు. ఇంతలో ఛార్లెస్ తప్పించుకున్నాడని అప్పూకి స్టేషన్ నుంచి ఫోన్ రావడంతో ఆమె టెన్షన్ పడుతుంది. వెంటనే ఈ విషయాన్ని కళ్యాణ్‌కు చెబుతుంది. దీంతో కళ్యాణ్ ఓ సూపర్‌ ప్లాన్ వేస్తాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక మే 28వ తేదీ ఎపిసోడ్ 733లో ఏం జరిగిందంటే?

Brahmamudi Serial May 28th 2025 Episode 733 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

అప్పూ- కళ్యాణ్‌ల ఫస్ట్ నైట్ కోసం ఎక్కువగా స్వీట్స్, ఫ్రూట్ తీసుకురావడం.. అవి మిగిలిపోవడంతో రాజ్‌పై మండిపడుతుంది కావ్య. కాస్తయినా రొమాంటిక్ ఫీల్ ఉండాలని కావ్యతో గొడవ పడతాడు రాజ్. ఇప్పుడు అంత రొమాంటిక్‌గా ఉండి ఏం చేయాలి అని కావ్య అడగ్గా.. నా మనసులో మాట మీకు, మీ మనసులో మాట నాకు చెప్పొచ్చని అంటాడు రాజ్.మీ కళ్లలోకి చూసి చెబుతున్నా నా మనసులో ఏం లేదని అంటుంది కావ్య. నా గురించి ఏం ఆలోచించడం లేదా? నా మీద మీ ఓపీనియన్ ఏంటీ? అని అడుగుతాడు రాజ్. దూరంగా ఉన్నప్పుడు కోపం చూపించే మీరు, ఇలా నేను దగ్గరగా ఉన్నప్పుడు తడబడే మీ మాటలకి, మీ మనసుకు ఉన్న సంబంధం ఏంటీ అని నిలదీస్తాడు రాజ్.

కావ్యకి తన మనసులోని మాటను చెప్పబోతుండగా కళ్యాణ్ - అప్పూలు వస్తారు. మీరిద్దరూ కళ్లలోకి కళ్లు పెట్టుకుని చూస్తున్నప్పుడే వచ్చామని చెబుతాడు కళ్యాణ్. ఎంతసేపు మీ ఎమోషన్సే కానీ మా ఎమోషన్స్‌ని పట్టించుకోరా అని మండిపడతాడు రాజ్. అసలే చిరాకులో ఉన్నాం ఏం జరిగిందో త్వరగా చెప్పమని అంటాడు రాజ్. దాంతో జరిగినదంతా రాజ్- కావ్యలకి చెబుతారు అప్పూ- కళ్యాణ్. ఇప్పుడు మీరిద్దరూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలనుకుంటున్నారు అంతేకదా అని అంటాడు రాజ్. అంతా అనుకున్నట్లుగానే ముందు మీరిద్దరూ గదిలో అడుగుపెట్టండి.. ఇటువైపున్న తలుపు నుంచి బయటికి వెళ్లిపోండి అని రాజ్ ఓ ప్లాన్ చెబుతాడు.

మేం లోపల లేమని తెలిస్తే మా అమ్మ ఊరుకోదని కళ్యాణ్ అంటాడు. దానికి నా దగ్గర ఒక ఐడియా ఉందని నేను, కళావతి లోపలికి వస్తామని చెబుతాడు. దొరికిపోతే మీ అమ్మగారు విశ్వరూపం చూపిస్తారని నా వల్ల కాదని అంటుంది కావ్య. నేను చిన్నత్తయ్యని మోసం చేయనని, కావాలంటే నేను మాట్లాడతానని చెబుతుంది కావ్య. వాళ్లు ఆల్రెడీ ట్రై చేసి వర్కవుట్ కాక ఇక్కడికి వచ్చారని అంటాడు రాజ్. నేను చిన్నత్తయ్యని ఒప్పిస్తానని కావ్య చెప్పగా.. ఒకవేళ ఆమె ఒప్పుకోకపోతే నీ చెల్లెలి జాబ్ పరిస్ధితి ఏంటీ? అని ప్రశ్నిస్తాడు రాజ్. వాడు ఎక్కడున్నా పట్టుకుని తిరిగి పోలీస్ స్టేషన్‌లో పెట్టి వచ్చేస్తామని చెబుతాడు కళ్యాణ్.

కళ్యాణ్- అప్పూలు కనిపించకపోవడంతో ధాన్యలక్ష్మీ కంగారుపడుతుంది. ఇంతలో వాళ్లిద్దరూ లోపలికి వస్తారు. ఎక్కడికి వెళ్లారు? ఏం చేస్తున్నారని కొడుకు కోడలిపై మండిపడుతుంది. ముందు నువ్వెళ్లి నీ రూమ్‌లో కూర్చోమని కళ్యాణ్‌తో అంటుంది ధాన్యం. ఇద్దరినీ ఒకేసారి పంపిద్దామని అప్పుడే మేం అనుకున్నది జరుగుతుందని రాజ్ నోరుజారతాడు. అది ఎలా కవర్ చేయాలో తెలియక రాజ్, కావ్యలు టెన్షన్ పడతారు. వీళ్లిద్దరూ ఏదో ఒకటి చేసి నన్ను ఇరికించేలా ఉన్నారని అప్పూ అనుకుంటుంది.

కష్టపడి రూమ్ డెకరేట్ చేశాం.. ఏదో నోరు జారి మాట్లాడితే ఇంత అనుమానం ఎందుకు? అని ప్రశ్నిస్తాడు రాజ్. ముహూర్తానికి టైం అయిపోతుంది ముందు అప్పూని గదిలోకి పంపించండి అంటాడు. ఫస్ట్‌నైట్‌కు అరెంజ్‌మెంట్స్ బాగా జరిగినా వృథా అయిపోతుండటంతో కళ్యాణ్ బాధపడతాడు. ఆడవాళ్లంతా కలిసి అప్పూని గదిలోకి తీసుకెళ్తారు. అసలు వీళ్ల ప్లాన్ ఏంటీ? రాజ్ ఎందుకు కంగారు పడుతున్నాడని రుద్రాణికి అనుమానం వస్తుంది. గదిలోకి వచ్చిన కళ్యాణ్‌కి అప్పూ సారీ చెబుతుంది. ఈరోజు ఎంతో సంతోషంగా మన ఫస్ట్ నైట్ జరగాలని, కానీ.. నా వల్ల నీకు ఆ సంతోషం లేకుండా పోయిందని బాధపడుతుంది అప్పూ. అనవసరంగా నిన్ను టెన్షన్ పెడుతున్నానని, అత్తయ్య చెబుతున్నట్లు నేను ఈ జాబ్ చేయకుంటే నీకు ఈ టెన్షన్ వచ్చేది కాదని అంటుంది. ఆవిడ మాట వినకుండా తప్పు చేస్తున్నానని బాధపడుతుంది అప్పూ.

పోలీస్ అవ్వడం నీ కల.. దాని కోసం నువ్వు, నేను ఎంత కష్టపడ్డామో నీకు తెలుసు. ఫస్ట్ నైట్ ఆగితే వంద ముహూర్తాలు పెట్టుకోవచ్చు, కానీ జాబ్ పోతే జీవితాంతం బాధపడుతూ నువ్వు ఇంట్లోనే కూర్చోవాలని అంటాడు కళ్యాణ్. నువ్వు అలా ఇంట్లోనే కూర్చుంటే జీవితాంతం నేను బాధపడతానని చెబుతాడు. ఇష్టమైనవి దూరమైతే వచ్చే ఫీలింగ్ నాకు తెలుసని, నా కలలు, కవితల్ని దూరం చేయాలని మా అమ్మ అనుకున్నప్పుడు బాధపడ్డానని అంటాడు కళ్యాణ్. నన్ను మా అమ్మ కూడా ఇంతలా అర్ధం చేసుకోలేదని కళ్యాణ్‌ని హత్తుకుంటుంది అప్పూ. ఇంతలో గదిలోకి వచ్చిన కావ్య- రాజ్‌లు వారిని చూసి మేం ఏం చూడలేదని అంటారు.

ఇంత లేట్ చేశారని కళ్యాణ్ అడగ్గా.. మీ అమ్మను దాటుకుని రావాలి కదా? యమలోకం ముందు ద్వారపాలకురాలిలా కాపలా కాస్తోందని చెబుతాడు రాజ్. అప్పూ జాబ్ కోసమే నేను రిస్క్ తీసుకుంటున్నానని, త్వరగా వచ్చేయమని చెబుతుంది కావ్య. అత్తయ్యని బాధపెట్టాలని నాకు లేదని, ఆ దొంగను పట్టుకోగానే తిరిగి వచ్చేస్తామని అంటుంది అప్పూ. నేను డ్రెస్ ఛేంజ్ చేసుకుంటానని కావ్య గదిలోకి వెళ్తుంది అప్పూ. వారిద్దరినీ ఫాలో అవుతున్న రాహుల్.. ఆ నగలు కొట్టేయడానికి ఇదే మంచి టైమ్ అని అనుకుంటాడు. అప్పూ - కళ్యాణ్‌లు వచ్చేసరికి టైం పడుతుంది కాబట్టి మనం శోభనం ఎలా చేయాలో రిహార్సల్స్ చేద్దామని అంటాడు రాజ్. ఆ మాటతో కావ్య మండిపడుతుంది. కళ్యాణ్ - అప్పూలు కలిసి ఇంట్లో నుంచి వెళ్తుండగా ధాన్యలక్ష్మీ చూస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X