Brahmamudi May 28th Episode: రాజ్ కోసం ఇందూ త్యాగం... వెంకీ జీవితంలో ఏఐ టెక్నాలజీ చిచ్చు

Photo Courtesy: JioHotstar

సీఈవో పోస్ట్ కోసం పరంధామయ్య అనే బోర్డ్ మెంబర్‌ని రాజ్, ఇందూలు కలుస్తారు. ఆ రేఖ ఆంటీ నుంచి కంపెనీని కాపాడి, పూర్వవైభవం తీసుకురావడానికి ఈ రిస్క్ చేస్తున్నాను.. నాకు సపోర్ట్ చేయమని ఇందూ అడగటంతో పరంధామయ్య సరేనని చెబుతాడు. ఆ రేఖకి ఎదురెళ్తున్నావు జాగ్రత్త అని హెచ్చరిస్తాడు పెద్దాయన. మా కుటుంబాన్ని నమ్ముకున్న వాళ్లకి న్యాయం చేయడానికి, మా అమ్మానాన్నల ఆశయాల్ని కాపాడటానికి ఇలా చేస్తున్నానని అంటుంది ఇందూ.

రేఖ టెన్షన్‌లో అటు ఇటు తిరుగుతుండగా భ్రమరాంబ, శేషం వచ్చి ఏం జరిగిందని అడుగుతారు. నేను నా కొడుకు మదన్ కోసం వెయిట్ చేస్తున్నానని చెబుతుంది రేఖ. ఇంతలో మదన్ రావడంతో ఇకపై నువ్వు ఇందూతో బాగా క్లోజ్‌గా ఉండాలి.. నువ్వు లేకపోతే ఉండలేని స్టేజ్‌కి తీసుకురావాలని చెప్పడంతో మదన్ సరేనని అంటాడు. ఇందూ- రాజ్‌లకు విడాకులు ఇప్పించి ఇందూతో నా కొడుకు పెళ్లి చేసి ఈ ఆస్తిని దక్కించుకుంటానని రేఖ చెబుతుంది. ఆ మాటలతో శేషం- భ్రమరాంబలు షాక్ అవుతారు. ఇందూ- రాజ్‌లు విడిపోకుండా ఉండాలంటే వాళ్లిద్దరికీ శోభనం జరిపించాలని భ్రమరాంబ ప్లాన్ చేస్తుంది. అపర్ణ- సుభాష్‌లకి వినిపించేలా ఈ విషయం గురించి గట్టిగా మాట్లాడటంతో వాళ్లిద్దరు కూడా ఇందూ- రాజ్‌ల ఫస్ట్‌నైట్‌కు ఏర్పాట్లు చేయాలని అనుకుంటారు. ఆఫీస్‌కి ఇంటర్వ్యూకి వెళ్తున్న వెంకీకి నందూ షర్ట్ పంపిస్తుంది. రాజ్‌ని కాకపట్టడానికి నానా కష్టాలు పడతాడు శేషం. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక మే 28వ తేదీ ఎపిసోడ్ 1044లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial May 28th 2026 Episode 1044 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

నీ సీఈవో పనులు ఎంత వరకు వచ్చాయని శేషం అడగ్గా.. నేను సీఈవో ఏంటీ? మీ ఇందూ చేసే పనులు తెలిస్తే మీరంతా గుండె ఆగి చస్తారని అనుకుంటాడు రాజ్. ఇందూ గురించి నీ అభిప్రాయం ఏంటని అడగ్గా.. ఇందూ బంగారం, కానీ అమాయకురాలు, అక్షరం ముక్క కూడా రాదని అంటాడు శేషం. దానికి చదువురాకపోవడం ఏంటీ? మీకు తెలియకుండా డిగ్రీల మీద డిగ్రీలు చదివేసింది. కొన్నాళ్ల తర్వాత మిమ్మల్ని ఒకాట ఆడుకుంటుందని అనుకుంటాడు రాజ్. సీఈవోగా పక్కగా నేనే గెలుస్తానని అంటాడు రాజ్. నువ్వు సీఈవోగా గెలిస్తే నన్ను పీఏగా పెట్టుకుంటావా? అని అడుగుతాడు శేషం. ఎవడినో పీఏగా పెట్టుకోవడం కంటే తెలిసినవాడిని, నీ మేలు కోరేవాడిని, పైగా మావయ్యని అంటాడు. నీ పీఏ పోస్ట్ కన్ఫర్మ్ చేశానని చెబుతాడు రాజ్.

ఇంతలో రాజ్‌కి హాస్పిటల్ నుంచి ఫోన్ రావడంతో షాక్ అవుతాడు. మీకు నేను ఇచ్చిన వారం రోజుల గడువు పూర్తయ్యింది.. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా కట్టలేదని చెబుతాడు. మీరు ఇప్పుడొచ్చి డబ్బులు పే చేస్తే ట్రీట్‌మెంట్ కంటిన్యూ అవుతుంది. లేదంటే మీ పేషెంట్‌ని తీసుకుని వెళ్లొచ్చని డాక్టర్ తేల్చేయడంతో రాజ్ షాక్ అవుతాడు. గంటలో డబ్బులు ఇస్తే ఓకే లేదంటే పేషెంట్‌ని మీరు ఏం చేస్తారో? లేదో మీ ఇష్టమిన అంటాడు రాజ్. వెంటనే ఇందూ దగ్గరికి వెళ్లి డబ్బులు అడుగుతాడు. దాంతో చేతిలో 100 రూపాయలు పెడుతుంది ఇందూ. ఆ మాటలతో సీరియస్ అయిన రాజ్.. నాకు ఈ వారం మొత్తం డబ్బులు ఒకేసారి కావాలని అడుగుతాడు.

నా దగ్గర డబ్బులు లేవని ఇందూ చెప్పడంతో కొంచెం కూడా నీకు జాలి లేదు, నాకు డబ్బులు చాలా అవసరమని అంటాడు రాజ్. నువ్వు చెప్పినట్లే చేస్తున్నాను.. అన్నీ సహించాను, భరించాను. ఇన్నిరోజులు మా ఇంటికి కూడా వెళ్లకుండా నీ దగ్గరే ఉన్నాను.. మా అమ్మానాన్న చాలా కంగారుపడుతున్నారు అయినా కూడా నేను ఇక్కడే ఉన్నానని చెబుతాడు రాజ్. నీ పరిస్ధితి నాకు అర్ధమైంది.. కానీ నా దగ్గర డబ్బులు లేవని చెబుతుంది ఇందూ. నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి.. దాని కోసం నేను చిల్లరగాడిని అయ్యాను, కిడ్నాపర్‌ని అయ్యాను, నీకు అద్దె మొగుడిని కూడా అయ్యాను. నా అనుకున్న వాళ్ల కోసం, వాళ్ల మంచి కోసం ఏం జరిగినా పట్టించుకోను.. ఒక మనిషి ప్రాణం కాపాడటమే నాకు ముఖ్యం.. ఇది చావు బ్రతుకుల సమస్య. నేనేమైనా తప్పు చేసుంటే నీ కళ్లు పట్టుకుంటానని అంటాడు రాజ్.

నువ్వు కనుక డబ్బులు ఇవ్వకపోతే నేను అద్దె మొగుడిగా నటించలేను, అసలు జీవితంలో కనిపించనని రాజ్ చెప్పడంతో ఇందూ షాక్ అవుతుంది. ఏం చేయాలో తెలియక తన తల్లి జ్ఞాపకంగా ఉంచుకున్న చైన్‌ని రాజ్ చేతిలో పెడుతుంది. ఇది నగ కాదు.. మా అమ్మ జ్ఞాపకం దానిని అమ్మొద్దని చెబుతుంది ఇందూ. దాంతో తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుంటానని చెబుతాడు రాజ్. ఇప్పుడు తను నా పక్కన ఉండటం చాలా అవసరం, తనుంటేనే కంపెనీ బాధ్యతలు చేపట్టగలను. రేఖ ఆంటీ నుంచి ఈ ఆస్తిని కాపాడగలను, అందుకే నీ జ్ఞాపకంగా పెట్టుకున్న ఆ గోల్డ్ చైన్ తనకు ఇచ్చానని తల్లికి క్షమాపణలు చెబుతుంది ఇందూ.

ఇంటర్వ్యూకి వెళ్లిన వెంకీకి ఏఐ టెక్నాలజీ గురించి ఎలాంటి క్వాలిఫికేషన్ లేకపోవడంతో జాబ్ ఇవ్వనని తేల్చేస్తారు మేనేజర్. ఏ కంపెనీ అయినా, ఏ వర్క్ అయినా సరే ఏఐ టెక్నాలజీ మీద ఆధారపడి చేస్తున్నారని ముఖం మీదే చెబుతాడు మేనేజర్. ఇందూ ఇచ్చిన చైన్ తీసుకుని తాకట్టు పెట్టడానికి గోల్డ్ షాప్‌కి వెళ్తాడు రాజ్. ఇది చాలా కాస్ట్‌లీ చైన్‌లా ఉంది.. ఎక్కడ కొట్టుకొచ్చావని రాజ్‌ని నానామాటలు అంటాడు సేటు. ఇది నా భార్యదే వాళ్లు బాగా రిచ్.. డబ్బులు అవసరం ఉంది అడిగి తీసుకొచ్చానని చెబుతాడు రాజ్. దీనికి 50 వేల రూపాయలు మించి ఇవ్వనని చెబుతాడు సేట్. నాకు 70 వేల రూపాయలు కావాలని రాజ్ అడుగుతాడు. దీనిని కొట్టుకొచ్చావో.. పట్టుకొచ్చావో ఎవరికి తెలుసని అంటాడు సేట్. నువ్వు చెప్పింది నిజమే అయితే నువ్వు డబ్బులు కట్టుకోకపోతే ఇది నా సొంతం అవుతుందని అంటాడు సేట్.

డబ్బుల గురించి సేట్‌తో గొడవ పడుతుండగా రాజ్‌కి డాక్టర్ ఫోన్ చేయడంతో 50 వేలు తీసుకోవడానికి రాజ్ ఓకే చెప్పి వెంటనే హాస్పిటల్‌లో బిల్ కట్టేస్తాడు. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లి బిల్ కట్టేశానని చెబుతాడు. మిగిలిన 20 వేలు తర్వాత కడతానని చెప్పగా.. డాక్టర్ సరేనని అంటాడు. మిమ్మల్ని డబ్బుల కోసం ఇబ్బంది పెట్టాలనేది నా ఉద్దేశం కాదు. కానీ తనకు మెడికల్ ఖర్చులు, మందులకు చాలా అమౌంట్ అవుతుంది. మేనేజ్‌మెంట్ వాళ్లు పేషెంట్‌ని డిశ్చార్జ్ చేసేద్దామని చెప్పారు.. కానీ నేనే రిక్వెస్ట్ చేశాను, అందుకే ట్రీట్‌మెంట్ కంటిన్యూ అవుతోంది. లేదంటే ఏ రోజైతే డబ్బులు కట్టలేదో.. ఆ రోజే పేషెంట్‌ని పంపించేసే వాళ్లని చెబుతాడు డాక్టర్. తన ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదు.. తను కోలుకోవడానికి కొంత టైం పడుతుందని చెబుతాడు. ఐసీయూలో నుంచి పేషెంట్‌ని చూస్తూ.. నీకేం కాదు, నీ కోసం ఎన్ని కష్టాలైనా పడతాను, ఎన్ని అవమానాలైనా భరిస్తాను. నేను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానని అనుకుంటాడు రాజ్.

మరో ఇంటర్వ్యూకి వెళ్లిన వెంకీకి అక్కడ కూడా ఏఐ టెక్నాలజీ గురించే ప్రశ్నలు ఎదురవుతాయి. నేను ఏఐ టెక్నాలజీ గురించి నేర్చుకుంటానని వెంకీ చెప్పగా.. మేం స్కిల్స్ ఉన్నవాళ్లకే జాబ్స్ ఇస్తాము, అంతేకానీ జాబ్ ఇచ్చి స్కిల్స్ నేర్పించమని చెప్పి వెళ్లిపోమని అంటాడు మేనేజర్. ఏఐ టెక్నాలజీ గురించి ఆలోచిస్తూ.. ఉద్యోగం పోయిందని బాధపడుతూ వస్తాడు వెంకీ. ఈ ఏఐ రావడం వల్ల నా లాంటి వాళ్ల జీవితాల్లో నిప్పులు పోసిందని అనుకుంటాడు. హాస్పిటల్ నుంచి ఇంటికొచ్చిన రాజ్‌ని నీ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యిందా? లేదా? అని అడుగుతుంది ఇందూ. ఇకపై నా పేమెంట్స్ ఏమాత్రం లేట్ చేయొద్దు, నాకు డబ్బులు చాలా అవసరమని చెబుతాడు రాజ్. ఎప్పుడు చూసినా డబ్బు డబ్బు అంటావు? అంత అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తుంది ఇందూ. నువ్వేదో నా సొంత పెళ్లాం అయినట్లు ఎందుకు దబాయిస్తున్నావని మండిపడతాడు రాజ్. ఆ మాటలు విన్న అపర్ణ షాక్ అవుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X