Brahmamudi may 28th episode:అపర్ణకు వార్నింగ్ ఇచ్చిన ఇందిరా దేవి..విడాకులు ఇచ్చేది లేదంటూ తేల్చి చెప్పిన కావ్య

ఇదంతా రుద్రాణి ప్లాన్ అని తర్వాత తెలుసుకుంటుంది కావ్య. ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను ఇంట్లోంచి వెళ్ళిపోమని మాయతో చెప్తాడు సుభాష్. ఇంట్లో కోడలి స్థానం కోసం కావ్యతో పోటీ పడుతూ ఉంటుంది మాయ. కావ్యకి రాజ్ కి విడాకులు ఇప్పించే ప్రయత్నం చేస్తుంది అపర్ణ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక మే 28వ తేదీ ఎపిసోడ్ 421 లో ఏం జరిగిందంటే..

కోడల్ని కాబట్టి నా అభిప్రాయం అక్కర్లేదు కనీసం మీ అబ్బాయి నైనా ఈవిడాకులు నీకు ఇష్టమేనా అని అడిగారా అని అత్తని నిలదీస్తుంది కావ్య, తనకి విడాకులు ఇవ్వటం ఇష్టం లేదని కచ్చితంగా చెప్తుంది. కావ్య నిర్ణయాన్ని చిట్టి మెచ్చుకుంటుంది ఇక నే నిర్ణయం చెప్పు అని రాజ్ ని అడుగుతుంది. ఈ విషయంలో నాకు మాట్లాడడానికి ఎలాంటి అర్హత లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాజ్. వాళ్ళ నిర్ణయాలు విన్నావు కదా ఇక ఈ విషయాన్ని పక్కన పెట్టండి అని చెప్తాడు సీతారామయ్య.

Brahmamudi serial May 28th Episode of 422 Here is full story

ఆ తర్వాత ఒంటరిగా దీర్ఘాలోచనలో ఉన్న అపర్ణ దగ్గరికి వస్తుంది చిట్టి. నువ్వు తప్పు చేస్తున్నావు కావ్యకి అన్యాయం చేయాలి అనుకుంటే నీకు అడ్డుపడే మొదటి మనిషిని నేనే అవుతాను అంటుంది. నేను కావ్యకి అన్యాయం చేయడం లేదు, తను మాత్రం ఏం సుఖపడుతుంది విడాకులు ఇస్తే అయినా సుఖపడుతుంది అనుకున్నాను అంటుంది. వేరే వాళ్ళ జీవితాలలో ఏది మంచి ఏది చెడు అనేది నువ్వు ఎలా చెప్తావు వాళ్లు కదా చెప్పాలి.

అయినా ఎట్టి పరిస్థితులలోనూ రాజ్ కి మాయకి పెళ్లి జరగనివ్వను అని కోడల్ని హెచ్చరించి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది చిట్టి. మరోవైపు మాయ, రుద్రాణి మాట్లాడుకుంటూ ఉంటారు. కావ్య విడాకులు చేస్తుంది ఏమో ఇక రాజ్ తో నా పెళ్ళేమో అని ఆనందపడిపోయాను అంటుంది మాయ. కావ్య చూడటానికి అమాయకంగా ఉంటుంది కానీ తేడా వస్తే ఇంటిని తగలబెట్టేస్తుంది మెల్లగా మా వదిన ని రెచ్చగొట్టి కావ్య తో విడాకులు ఇప్పించేలాగా చేస్తాను.

Brahmamudi serial May 28th Episode of 422 Here is full story

నేను వేసే ప్లాన్ తో ఆ కావ్య తనంతట తానే విడాకులు ఇచ్చేలా చేస్తాను తర్వాత మీ పెళ్లి అంటుంది రుద్రాణి. అప్పుడే అక్కడికి వచ్చిన స్వప్న వాళ్ళిద్దర్నీ కోప్పడుతుంది. ఒక జాతి పక్షులు ఒక గూటికి చేరినట్లు మీ ఇద్దరూ బాగా సరిపోయారు గద్ద, రాబందుల్లాగా అంటుంది. ఆమెపై కోప్పడుతుంది మాయ. ఎక్కువ రెచ్చిపోకు టిప్పర్ లారీ లాంటి మా అత్తనే పక్కన కూర్చోబెట్టాను నువ్వు ఒక లెక్క అంటూ తీసిపారేసినట్లు మాట్లాడుతుంది స్వప్న. క్లాస్ పీకడానికి వచ్చావా అంటుంది రుద్రాణి.

Brahmamudi serial May 28th Episode of 422 Here is full story

లేదు వాటర్ కి వచ్చాను అంటుంది స్వప్న. తీసుకొని వెళ్ళిపో ప్లీజ్ అంటుంది రుద్రాణి. వాటర్ తీసుకుని వెళ్ళిపోతుంది స్వప్న. ఈ ఇంట్లో ఎవరితోనైనా పెట్టుకో కానీ దాంతో పెట్టుకోకు అది పెద్ద రాక్షసి అని మాయని హెచ్చరిస్తుంది రుద్రాణి. మరోవైపు విడాకులు ఇవ్వనన్నందుకు కావ్య కే థాంక్స్ చెప్తాడు రాజ్. అంటే నేను విడాకులు ఇచ్చి ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని భయపడ్డారా అంటుంది కావ్య. లేదు నువ్వు వెళ్ళిపోతే ఆ మాయ ని తీసుకువచ్చి ఎక్కడ నాకు అంట కట్టేస్తారో అని భయం అంటాడు రాజ్. Y

అయితే నేనంటే ఇష్టం లేదన్నమాట అయితే నేను పుట్టింటికి వెళ్ళిపోతాను అంటుంది కావ్య. ఇష్టం అంటే చంకనెక్కి కూర్చుంటావు ఇష్టం లేదు అంటే ఇలా మాట్లాడుతావు ఎలా చచ్చేది నీతో అంటాడు రాజ్. మీ మనసులో నేనంటే ఇష్టం ఉంది కదా అంటుంది కావ్య. పెద్ద రాక్షసి భరించడం కన్నా చిన్న రాక్షసితో ఎడ్జస్ట్ అవ్వడం మంచిదనిపించింది అందుకే అలా మాట్లాడాను అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రాజ్.

Brahmamudi serial May 28th Episode of 422 Here is full story

భర్త ప్రవర్తనకి నవ్వుకుంటుంది కావ్య. మరోవైపు రాహుల్,రుద్రాణి ఇద్దరు రాజ్ పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. రాజ్ కి మాయకి పెళ్లి చేయాలనుకుంటున్నావు అప్పుడు కొత్తగా ఒరిగేదేముంది, ఇప్పుడు కావ్య అప్పుడు మాయ ఏదైనా ఒకటే కదా మన ప్రాణానికి అంటాడు రాహుల్. రాహుల్ కి మాయ నుంచి పెళ్లి చేసేది సంతోషంగా కాపురం చేసుకోవటానికి కాదు వాడికి ప్రతి రోజు నరకం చూపించడానికి అంటుంది రుద్రాణి.

తరువాయి భాగంలో నాకు నా భర్త కావాలి, విడాకులు ఇవ్వను అని అంత ఖచ్చితంగా చెప్పావు కదా ఇప్పటికీ అదే మాట మీద నించున్నావా అంటుంది అపర్ణ. ఎప్పటికప్పుడు నిర్ణయాలు మార్చుకోవటానికి ఇది వ్యాపారం కాదు సంసారం అంటుంది కావ్య. అయితే నా కొడుకు మాయని పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ఈ నో అబ్జెక్షన్ పత్రాల మీద సంతకం పెట్టు అంటుంది అపర్ణ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X