Brahmamudi May 29th Episode: దొంగ కోసం అప్పూ వేట.. దుగ్గిరాల వారింట్లో దూరిన ఛార్లెస్, ప్రమాదంలో రాజ్- కావ్య
Photo Courtesy: JioHotstar
అప్పూ - కళ్యాణ్‌ల ఫస్ట్ నైట్ కోసం బెడ్‌రూమ్‌ని అందంగా డెకరేట్ చేస్తారు రాజ్- కావ్య. నా మీద మీ ఓపీనియన్ ఏంటని కావ్యని నిలదీస్తాడు రాజ్. ఇంతలో అప్ప- కళ్యాణ్‌లు వచ్చిన చార్లెస్ తప్పించుకున్న సంగతి చెబుతారు. దాంతో మీరు ఆ దొంగని పట్టుకోండి, మీరు వచ్చే వరకు మేం మేనేజ్ చేస్తామని ప్లాన్ చెబుతాడు రాజ్. అప్పూ జీవితం కోసం కావ్య కూడా అందుకు సరేనని అంటుంది. అప్పూని ఆడవాళ్లంతా గది లోపలికి పంపుతారు. నీ ఫస్ట్ నైట్ చెడగొట్టి నిన్ను టార్చర్ చేస్తున్నానని కళ్యాణ్‌కి అప్పూ సారీ చెబుతుంది.
రాజ్ టెన్షన్ పడటం గమనించిన రుద్రాణి.. ఏదో జరుగుతోందని అనుమానిస్తుంది. ప్లాన్ ప్రకారం రాజ్- కావ్యలు ఫస్ట్ నైట్ జరుగుతున్న గదిలోకి వచ్చి అప్పూ- కావ్యలని బయటికి పంపిస్తారు. అప్పూ డ్రెస్ మార్చుకోవడానికి వెళ్తుంది. ఆమెను ఫాలో అయిన రాహుల్.. ఆ నగల్ని కొట్టేయాలని ప్లాన్ చేస్తాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక మే 29వ తేదీ ఎపిసోడ్ 734లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
ఫస్ట్ నైట్ పెట్టుకుని కారులో వెళ్తుంది ఎవరు? కళ్యాణ్ లోపలే ఉన్నాడా? వాళ్లు గదిలో ఉండాలి కదా? బయటికి ఎందుకు వస్తారు? అని ధాన్యలక్ష్మీ ఆలోచిస్తూ ఉంటుంది. ఛార్లెస్ గురించి అప్పూ- కళ్యాణ్‌లు మాట్లాడుకున్న విషయాలు గుర్తు చేసుకుంటుంది. ఒకవేళ ఇద్దరూ కలిసి నాకు మస్కా కొట్టి బయటికి వెళ్లారా? ఏంటీ అని ఆలోచిస్తూ ఉంటుంది. వాళ్లిద్దరూ గదిలో ఉన్నారో లేదో తెలుసుకుంటే సరిపోతుందని అనుకుంటుంది. మరోవైపు గదిలో ఉన్న రాజ్ - కావ్యలు మూడు గంటలు ఎలా మేనేజ్ చేయాలా? అని ఆలోచిస్తుంటారు.
నాతో ఉన్నప్పుడల్లా సీరియస్‌గా ఉండాలని రూల్ పెట్టుకున్నారా? అని కావ్యని అడుగుతాడు రాజ్. నా ఫ్యామిలీని, ఫ్రెండ్స్‌ని కాదని మీకోసం వెతుక్కుంటూ ఇంత దూరం వస్తున్నా నన్ను పట్టించుకోవడం లేదని మండిపడతాడు. మీరు అడగకపోయినా అన్ని చేస్తున్నారంటే ఏంటీ అర్ధం అని రాజ్ ప్రశ్నిస్తాడు. ఏమో నాకు తెలియదు... నాకు తెలిసిందల్లా ఒకటే .. మీరు యామినిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయారు అంటూ రాజ్‌తో గొడవ పడుతుంది. ఇంతలో ఎవరో వచ్చిన అలికిడి కావడంతో రాజ్ అలర్ట్ అవుతాడు. వెంటనే ఫోన్‌లో కళ్యాణ్, అప్పూల వాయిస్ ప్లే చేస్తారు రాజ్- కావ్య. వీళ్లిద్దరూ గదిలోనే ఉన్నారని.. అనవసరం అనుమానించానిన అనుకుంటుంది. గది బయట దొంగచాటుగా మాటల్ని వింటున్న ధాన్యలక్ష్మీని ప్రకాశం చూస్తాడు.
నీకసలు బుద్ధుందా? కొడుకు కోడలు శోభనం గదిలో ఉంటే వాళ్ల మాటలు వినడానికి అసలు నీకు సిగ్గు అనిపించడం లేదా? అని మండిపడతాడు. ఇందాక ఎవరో బయటికి వెళ్లడం చూసి కళ్యాణ్ ఏమో అనుకున్నాను.. అనుమానం వచ్చి వాళ్లు గదిలో ఉన్నారేమో తెలుసుకోవడానికి వాళ్ల మాటలు వింటున్నానని చెబుతుంది ధాన్యం. నేను కాకుండా ఇంకెవరైనా నిన్ను చూస్తే ఎంత తప్పుగా అనుకునేవారని అక్కడి నుంచి భార్యను తీసుకుని వెళ్లిపోతాడు. మా పిన్నిని ఎలా బోల్తా కొట్టించానో చూశారా అంటూ రాజ్ మురిసిపోతూ ఉంటాడు. రేపు ఇలాగే మిమ్మల్ని నమ్మి వచ్చిన వారిని మోసం చేయరని గ్యారెంటీ ఏంటీ? అని ప్రశ్నిస్తుంది కావ్య. మీ ఆడవాళ్లు ఎప్పుడు అనుమానించడమేనా? ఇక్కడ జరుగుతుంది ఏంటీ? అని నిలదీస్తాడు రాజ్.
ఛార్లెస్‌ను వెతుక్కుంటూ వెళ్తారు అప్పూ - కళ్యాణ్‌లు. ఈ టైంలో వాడు ఎక్కడ దొరుకుతాడు, పైగా వాడు 49 సార్లు మిస్ అయ్యాడని నువ్వే చెబుతున్నావని అంటాడు కళ్యాణ్. ట్రాఫిక్ పోలీసులకు వాడి ఫోటో పంపించానని, సీసీటీవీ ఫుటేజ్‌లో వాడు ఎక్కడ చిక్కినా వెంటనే సమాచారం వస్తుందని అంటుంది అప్పూ. పోలీసుల నుంచి తప్పించుకుని తిరిగి ఒక్క దొంగ కూడా లేడని చెబుతుంది. ఇంతలో అప్పూకి ఛార్లెస్ ఆచూకి తెలుస్తుంది. మరోవైపు.. దుగ్గిరాల ఫ్యామిలీ అంతా మాట్లాడుకుంటూ ఉంటారు. కళ్యాణ్- అప్పూ గదిలోకి వెళ్లారు? మరి రాజ్- కావ్య ఎక్కడ? అని ఆపర్ణని అడుగుతుంది ఇందిర.
పెళ్లికి ముందే శోభనానికి ప్లాన్ చేశాడా? అని అడగటంతో అపర్ణ సిగ్గు పడుతుంది. నా కొడుకు అలాంటి వాడు కాదని అపర్ణ చెప్పగా.. కావ్యని బూత్ బంగ్లాకి తీసుకెళ్లింది ఎవరని ప్రశ్నిస్తుంది. నాకు అనుమానంగా ఉందని, ఫోన్ చేస్తానని చెబుతుంది ఇందిర. ఫోన్ రావడంతో రాజ్- కావ్యలు టెన్షన్ పడతారు. నువ్వు, నా మనవరాలిని తీసుకుని ఎక్కడికి వెళ్లావని అడుగుతుంది ఇందిర. కావ్య నా దగ్గరే ఉందని చెబుతాడు రాజ్. మీ మనవడు తెచ్చిన పూలు వేస్ట్ చేయడం ఎందుకని వాటిని ఆరబెట్టి అగరబత్తిలు చేద్దామని టెర్రస్ పైకి వచ్చామని చెబుతుంది కావ్య. ఇంతకీ నువ్వు అనుకున్నది చెప్పావా? లేదా అని ఇందిర అడగ్గా రాజ్ టెన్షన్ పడి ఫోన్ పెట్టేస్తాడు. దాంతో అపర్ణ- ఇందిరలు నవ్వుకుంటారు.
తప్పించుకున్న ఛార్లెస్ .. కళ్యాణ్ - అప్పూల కార్‌ను ఢీకొడతాడు. దాంతో వారిద్దరూ ఆ దొంగను ఫాలో అవుతుండగా వాడు చాలా ఈజీగా తప్పించుకుంటాడు. మరోవైపు.. అప్పు- కళ్యాణ్‌ల కోసం రాజ్ - కావ్యలు వెయిట్ చేస్తుంటారు. బోర్ కొట్టిన కావ్య వెంటనే ఛార్లెస్ ఫైల్ తీసుకుని చదువుతూ ఉంటుంది. పక్కన నేనుంటే మీరు ఫైల్ చదువుకుంటారేంటీ అని మండిపడుతాడు రాజ్. ఇంతలో ఆ ఛార్లెస్ .. దుగ్గిరాల ఇంట్లోకే దొంగతనానికి వస్తాడు. ఈరోజుల్లో ఎవ్వరినీ నమ్మడానికి లేదని.. మిమ్మల్నే తీసుకుంటే పద్ధతిగా పదహారణాల తెలుగు అమ్మాయిలా ఉంటారు. కానీ మీ ఆలోచనలు, మీ మాటలు చాలా కఠినంగా ఉంటాయని అంటాడు రాజ్. మీరు కూడా నాదే తప్పని ఎప్పుడూ నిందిస్తుంటారని అంటుంది కావ్య. వాళ్లిద్దరి గొడవని చూసిన చార్లెస్ మనం సేఫ్‌గా ఉండటానికి ఈ ప్లేసే కరెక్ట్ అనుకుని వెంటనే పవర్ కట్ చేస్తాడు. చీకట్లో రాజ్, కావ్యలని కట్టేస్తాడు. కరెంట్ రాగానే వాళ్లిద్దరూ ఛార్లెస్‌ని చూస్తారు. నువ్వు ఇక్కడ ఉన్నావేంటీ? అప్పూ నిన్ను అరెస్ట్ చేయలేదా? అని అడుగుతాడు.
నువ్వు వచ్చింది ఎవరింటికో తెలుసా? అని రాజ్ ప్రశ్నించగా.. శోభనం చేసుకోవడానికి రెడీ అయిన ఓ యువ జంట దగ్గరికి వచ్చానని అంటాడు. మేమిద్దరం భార్యాభర్తలం కాదని చెబుతుంది కావ్య. మీ గొడవలు, మీ బాడీ లాంగ్వేజ్‌ను చూస్తే మీరు భార్యాభర్తల్లాగానే ఉన్నారని అంటాడు చార్లెస్. నిన్ను అరెస్ట్ చేయాలని తిరుగుతున్న అప్పూ నా చెల్లెలు, తను కూడా ఈ ఇంట్లోనే ఉంటుందని కావ్య చెప్పడంతో చార్లెస్ షాక్ అవుతాడు. అయినాసరే మీ ఇద్దరిని తెల్లారే వరకు ఇలా కట్టేసే ఉంచుతానని చెబుతాడు ఆ దొంగ. అయిగే కట్టేసి ఉంచినప్పటికీ రాజ్ తెలివిగా ఫోన్ తీసుకుని అప్పూకి మెసేజ్ పెడతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











