Brahmamudi May 29th Episode: కావ్య చైన్ విడిపించిన రాజ్... రాజ్‌కి దగ్గరవుతున్న ఇందూ
Photo Courtesy: JioHotstar
కంపెనీకి సీఈవో అయితే శేషంను పీఏగా పెట్టుకోవడానికి రాజ్ సరేనని చెబుతాడు. ఆ వెంటనే డాక్టర్ దగ్గరి నుంచి రాజ్‌కు ఫోన్ వస్తుంది. నేను ఇచ్చిన టైం అయిపోయింది. మరో గంటలో వచ్చి డబ్బులు కట్టకపోతే పేషెంట్‌ను తీసుకెళ్లిపోవచ్చని చెప్పడంతో రాజ్ వెంటనే డబ్బు కోసం ఇందూ దగ్గరికి వెళ్తాడు. నాకు డబ్బు చాలా అవసరం.. దాని కోసమే ఎన్నో అవమానాలు భరిస్తున్నాను. మా ఇంటికి కూడా వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయానని చెబుతాడు రాజ్. తన దగ్గర డబ్బులు లేవని ఇందూ ఎంత చెప్పినా వినకపోవడంతో కాళ్లపై పడబోతాడు. దాంతో తన తల్లి జ్ఞాపకంగా దాచుకున్న గోల్డ్ చైన్‌ని రాజ్‌కి ఇస్తుంది ఇందూ. మా అమ్మ గుర్తుగా నా దగ్గర ఉన్న ఏకైక వస్తువు ఇదొక్కటే దీనిని అమ్మకుండా తాకట్టు పెట్టుకుని డబ్బులు తెచ్చుకోమని చెబుతుంది ఇందూ.
సేట్ దగ్గరికి వెళ్లి చైన్ తాకట్టు పెట్టుకుని 70 వేల రూపాయలు ఇవ్వమని చెప్పగా.. సేట్ మాత్రం 50 వేలు మాత్రమే ఇస్తానని తేల్చేస్తాడు. ఇంతలో డాక్టర్ నుంచి ఫోన్ రావడంతో 50 వేలు తీసుకోవడానికి రాజ్ సరేనని అంటాడు. ఆసుపత్రి డబ్బులు కట్టేసిన రాజ్‌తో డాక్టర్ మాట్లాడుతూ.. నిన్ను డబ్బుల కోసం వేధించడం నా ఉద్దేశం కాదు. కానీ ఈ ట్రీట్‌మెంట్ చాలా ఖర్చుతో కూడుకున్నదని చెబుతాడు. రాజ్ ఐసీయూలో నుంచి చూస్తూ.. నిన్ను ఎలాగైనా కాపాడుకుంటానని మనసులో అనుకుంటాడు. వెంకీ ఇంటర్వ్యూకి వెళ్లగా... ఏఐ టెక్నాలజీ వస్తేనే జాబ్ ఇస్తానని చెప్పడంతో బాధపడతాడు. హాస్పిటల్ నుంచి ఇంటికొచ్చిన రాజ్.. ఇందూతో గొడవపడతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక మే 29వ తేదీ ఎపిసోడ్ 1045లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
చిన్నప్పటి నుంచి తనకున్న కోరికలన్నీ నాతో తీర్చేసుకుంది. మీ మనవరాలిని తట్టుకోవడం చాలా కష్టంగా ఉందని అపర్ణతో అంటాడు రాజ్. నీ మెడలో చైన్ ఏది? అని అపర్ణ అడగ్గా.. రాజ్, ఇందూలు షాక్ అవుతారు. ఆ చైన్ నువ్వు మరిచిపోయావా? అది నీ మెడలో ఉంటే మీ అమ్మ నీతో ఉంటుందని నీకు చాలా ధైర్యంగా ఉంటుందని అన్నావు కదా. ఇంతకుముందు ఒకసారి అది కనిపించకపోతే నువ్వు కన్నీళ్లు కూడా పెట్టుకున్నావు, ఒక రోజంతా భోజనం కూడా చేయలేదని గుర్తుచేస్తుంది అపర్ణ. దానిని నేను పొగొట్టుకోను.. బెడ్‌రూంలో ఉందని చెప్పి వెళ్లిపోతుంది ఇందూ. ఇందూకి వాళ్లమ్మ అంటే ప్రాణం.. తన జ్ఞాపకంగా పెట్టుకున్న ఒకే ఒక్క వస్తువు ఆ చైన్. అది నిజంగానే బెడ్‌రూంలో ఉందా? లేదా? నువ్వే ఆ చైన్ ఏమైందో కనుక్కోమని రాజ్‌ని అడుగుతుంది అపర్ణ. అది ఇందూ వాళ్ల అమ్మ జ్ఞాపకమమా? నేను దానిని అనవసరంగా తాకట్టు పెట్టానని బాధపడతాడు రాజ్.
ఆంటోనీ మందు తాగుతూ, బిర్యానీ తింటూ ఉంటాడు. నీకు ఏం కావాలంటే అది ఇస్తాను.. కానీ నువ్వు మాత్రం మా అమ్మ గురించి చెప్పమని అడుగుతాడు లక్కీ. మీ అమ్మ గురించి నాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్‌తో ఎలాగైనా మీ అమ్మని పట్టుకోవాలని ట్రై చేశాను. మీ అమ్మ దొరుకుతుందని ఆశపడ్డాను.. కానీ చివరి నిమిషంలో నా ప్రయత్నం ఫెయిలైందని చెబుతాడు ఆంటోనీ. ఇన్నిరోజులు ఓపిక పట్టావు కదా? మీ అమ్మను తప్పకుండా పట్టుకుంటా.. నా కోసం దమ్ బిర్యానీ తీసుకురా అని చెబుతాడు ఆంటోనీ. ఇలా అనాథలా ఉండలేకపోతున్నా.. అసలు ఎవరికి పుట్టానా అని తెలియకపోవడం అనేది భరించలేం. రోజు రోజుకు నా వల్ల కావడం లేదని చెబుతాడు ఆంటోనీ. ఇంతలో రాజ్ ఫోన్ చేసి లక్కీని బైక్ తీసుకురమ్మని చెబుతాడు.
డబ్బుల కోసం రాకేష్ విసిగించడంతో ఐశ్వర్య సీరియస్ అవుతుంది. అసలు ఇదంతా కాదు.. ఫోన్ ఆ ఇందూకి ఇవ్వు, డబ్బులు ఇప్పిస్తాను గొడవ చేయొద్దని అడిగిందని అంటాడు. నీతో మాట్లాడి ఏ ప్రయోజనం ఉండదని చెప్పడంతో ఫోన్ తీసుకెళ్లి ఇందూకి ఇస్తుంది. మొన్న రాకేష్‌కి డబ్బులు ఇస్తానని చెప్పావు కదా నా డబ్బులు నాకు ఇవ్వమని ఇందూని అడుగుతాడు రాకేష్. కొంచెం టైం ఇవ్వండి అని అడుగుతారు తప్పించి డబ్బులు మాత్రం ఇవ్వడం లేదని రాకేష్ మండిపడతాడు. ఇక నాకు ఓపిక లేదు.. మీ ఇంటి పరువుని తీసేస్తానని వార్నింగ్ ఇస్తాడు రాకేష్. రెండ్రోజుల్లో నా డబ్బు నాకు ఇవ్వకపోతే దీనిని పబ్లిక్ చేసేస్తానని డెడ్‌లైన్ పెడతాడు రాకేష్. అనవసరంగా నువ్వు నా విషయంలో జోక్యం చేసుకున్నావు.. వాడు ఇంకా సీరియస్ అవుతున్నాడని మండిపడుతుంది ఐశ్వర్య.
అసలు మన స్థాయి ఏంటీ? మన పరిస్ధితి ఏంటీ? అనేది తెలుసుకోకుండా అప్పులు చేశావు.. ఇప్పుడు తనతో ఇలా మాటలు పడాల్సి వస్తోందని రగిలిపోతుంది ఇందూ. నీ అప్పుని నేను తీరుస్తాను, ఇక నుంచి అయినా ఇలాంటి అప్పులు చేయొద్దని వార్నింగ్ ఇస్తుంది ఇందూ. ఛాన్స్ దొరికింది కదా అని ఇలాంటి సెంటిమెంట్ డైలాగులు కొట్టొద్దు.. అసలు నువ్వంటేనే నటన, నా రూమ్ లాక్కుని ఇప్పుడు నాకు నీతులు చెబుతావా అని ఐశ్వర్య నానామాటలు అంటుంది.
లక్కీని రప్పించిన రాజ్.. నెక్లెస్ విషయం చెప్పి దానిని ఎలాగైనా తాకట్టు నుంచి విడిపించాలని అనుకుంటాడు రాజ్. ఆ నెక్లెస్ తనకి వాళ్లమ్మ జ్ఞాపకం, అది తన మెడలో ఉంటే వాళ్లమ్మే తనతో ఉన్నట్లు ఫీలవుతుంది. డబ్బు వస్తుందంటే వెనుకా ముందు ఆలోచించకుండా ఏ పనైనా చేసేవాళ్లం. డబ్బు కోసం ఎంత రిస్క్ అయినా తీసుకునేవాళ్లం, అలాంటిది నువ్వు మారిపోయావు. కిడ్నాప్ చేయడం వల్ల నీకు పెళ్లాం వచ్చింది, డబ్బు వచ్చింది, కోట్ల ఆస్తి వచ్చింది. చివరికి నీ క్యారెక్టరే మారిపోయిందని చెబుతాడు లక్కీ. ఆ నెక్లెస్ ఇందూ వాళ్ల అమ్మదని తెలిసినప్పటి నుంచి బాధగా ఉంది. ఆ నెక్లెస్‌ని విడిపించి ఇందూకి ఇచ్చేస్తానని అంటాడు రాజ్. బైక్ తాకట్టు పెట్టి నెక్లెస్ విడిపిస్తానని చెబుతాడు.
ఐశ్వర్య గురించి ఇందూ బాధపడుతుండగా రాజ్ వచ్చి ఏం జరిగిందని అడుగుతాడు. ఐశ్వర్య చేసే పనుల వల్ల మనశ్శాంతి ఉండటం లేదని అంటుంది ఇందూ. ఆమెను నువ్వు మార్చలేవని తేల్చేస్తాడు రాజ్. నీకొక సర్‌ప్రైజ్ అని చెప్పి ఇందూకి తన చైన్ తిరిగి ఇస్తాడు రాజ్. నీ దగ్గర డబ్బులు లేవు కదా? ఎలా విడిపించావని అడుగుతుంది ఇందూ. నాకు డబ్బులు ఎంత అవసరమో? ఈ నెక్లెస్ నీకు అంతే అవసరమని అంటాడు రాజ్. నీకు మనసుంటే ఆ రోజు మా రేఖ ఆంటీకి అప్పగించేవాడివి కాదు కదా అంటుంది ఇందూ. నేను డబ్బు కోసం ఏమైనా చేస్తానని అంటాడు రాజ్. బాధగా ఇంటికొచ్చిన వెంకీ.. ఎక్కడా ఉద్యోగం దొరకలేదని చెప్పడంతో చలపతి షాక్ అవుతాడు. ఇంతలో వడ్డీ వ్యాపారి వచ్చి వడ్డీ తీసుకుని వెళ్తాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications