Brahmamudi may 29th episode: రుద్రాణి ట్రాప్ లో అపర్ణ.. మాయ కి మాస్ వార్నింగ్ ఇచ్చిన స్వప్న!

ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను ఇంట్లోంచి వెళ్ళిపోమని మాయతో చెప్తాడు సుభాష్. ఇంట్లో కోడలి స్థానం కోసం కావ్య తో పోటీ పడుతూ ఉంటుంది మాయ. కావ్య కి రాజ్ కి విడాకులు ఇప్పించే ప్రయత్నం చేస్తుంది అపర్ణ. విడాకులు ఇవ్వనని గట్టిగా చెప్తుంది కావ్య. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక మే 29వ తేదీ ఎపిసోడ్ 422 లో ఏం జరిగిందంటే..

మాయని రాజ్ కి ఇచ్చి పెళ్లి చేసేది వాళ్ళు సుఖంగా కాపురం చేసుకుంటారని కాదు, రాజ్ కి ప్రతిరోజు నరకం చూపించడానికి, ఎంతటి మొనగాడికైనా ఇంట్లో పెళ్ళాం పోరు ఉంటే వాడు బయటికి వ్యవహారాల మీద దృష్టి పెట్టలేడు అంటుంది. అప్పుడు కంపెనీని నేను హస్తగతం చేసుకుంటాను అంటాడు రాహుల్. ఈ ఇంటిని నేను గుప్పెట్లో పెట్టుకుంటాను అంటుంది రుద్రాణి. ఇదంతా జరగాలంటే ముందు మాయకి రాజ్ కి పెళ్లి జరగాలి అంటుంది. అత్త పెళ్లికి ఒప్పుకుంది కదా అంటాడు రాహుల్.

Brahmamudi serial May 29th Episode of 422 Here is full story

కానీ ఇంకా చిన్న అనుమానం ఉంది అనుమానం వదిలించేస్తే వదిన వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేస్తుంది అంటుంది రుద్రాణి. ఒక ఆడదానికి ఇన్ని తెలివితేటలా,నీకు కొడుకుని అయిపోయాను కాబట్టి సరిపోయింది లేదంటే నీ ఎత్తులకి నేను విలవిల్లాడిపోయేవాడిని అంటాడు రాహుల్. మరోవైపు కావ్య అప్పుకి ఫోన్ చేసి నువ్వు భయపడినట్లుగానే మా అత్తగారు మాయతో మా ఆయన పెళ్లి చేస్తానంటున్నారు అంటుంది. అందుకు కోప్పడుతుంది అప్పు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావో చెప్పు అంటుంది.

అసలు మాయ గురించి తెలుసుకో మనం వెళ్ళిన దగ్గర చుట్టుపక్కల వాళ్ళని అడుగు అంటుంది. వర్క్ అవుట్ అవ్వదేమో అంటుంది అప్పు. నా చుట్టూ ఇప్పుడు చీకటి అల్లుకొని ఉంది నాకు వేరే దారి లేదు అంటుంది కావ్య. మాయని వెతకటానికి ఒప్పుకుంటుంది అప్పు. మరోవైపు ఆలోచనలో ఉన్న అపర్ణ దగ్గరికి వచ్చిన రుద్రాణి కావ్య విడాకులు అయితే ఇవ్వనని కచ్చితంగా చెప్పింది కానీ నువ్వు మాయతో రాజ్ పెళ్లి చేయడానికి నా దగ్గర ఒక ఆలోచన ఉంది అంటూ కొన్ని పేపర్లు ఆమె చేతిలో పెడుతుంది రుద్రాణి. ఏమిటిది అంటుంది అపర్ణ.

ఒప్పందం పత్రాలు, నా భర్తకి మాయతో పెళ్లి చేయడం నాకేమీ అభ్యంతరం లేదు అని నీ కోడలితో సంతకం పెట్టించు అప్పుడు రాజ్ పెళ్లి మాయతో జరిపించవచ్చు అంటుంది రుద్రాణి. కావ్య ఒప్పుకుంటుందా అంటుంది అపర్ణ. ఒప్పుకోకుండా ఏం చేస్తుంది పుట్టింటికి పోయి ఉండే రకం కాదు ఈ ఆస్తి అనుభవించడానికి తన భర్త ఏం చేసినా ఈ ఇంట్లోనే పడి ఉంటుంది అంటుంది రుద్రాణి. రుద్రాణి మాటలకి మెత్తబడిన అపర్ణ రుద్రాణి చెప్పినట్లు చేయటానికి నిశ్చయించుకుంటుంది.తన పేరు బయటికి రానీయవద్దు అంటుంది రుద్రాణి.

మరోవైపు ఏడుస్తున్న బాబుని ఆడిస్తున్న కావ్య దగ్గరికి వచ్చిన స్వప్న వాడి కన్నతల్లి ఉంది కదా అయినా నువ్వు ఎందుకు వాడిని ఆడిస్తున్నావు వెళ్లి వాడి తల్లికి అప్పగించు అంటుంది. అలా చేయటానికి ఇష్టపడదు కావ్య. నీ మంచితనం వల్లే వాళ్ళందరూ నీతో ఆడుకుంటున్నారు నువ్వు ఇవ్వలేవు నేనే వెళ్లి బాబుని వాళ్ళ అమ్మకి ఇచ్చి వస్తాను అని చెల్లెలి దగ్గర బలవంతంగా బాబుని లాక్కొని తీసుకువెళ్లి మాయా కి ఇస్తుంది.కన్నతల్లిని అని చెప్పుకోవడం కాదు వాడి మంచి చెడ్డలు కూడా చూసుకోవాలి అంటుంది.

Brahmamudi serial May 29th Episode of 422 Here is full story

పక్కనే ఉన్న రుద్రాణిని చూస్తూ బర్రె పక్కన దున్నపోతు లాగా పడుకొని బాబుని పట్టించుకోకపోతే ఊరుకునేది లేదు అంటూ మాయ కి ఓ రేంజ్ లో వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది స్వప్న. మరోవైపు ఒక్కర్తే వచ్చిన కావ్య ను చూసి బాబు ఏడి అని అడుగుతాడు. మాయ దగ్గర ఉన్నాడు అంటుంది కావ్య. తనకెందుకు ఇచ్చావు తను కన్నతల్లి కాదని తెలుసు కదా తను బాబుని సరిగ్గా చూసుకోదు అంటాడు.

నేనేం చేసేది వాడి తల్లి మాయ కాదు అని అక్కతో చెప్పలేను కదా, అక్కే బాబు ని తీసుకెళ్లి మాయకి ఇచ్చింది, ఏం పర్వాలేదు ఈ రాత్రికి ఉండనివ్వండి అంటుంది. అయినా మనసు కుదుటపడక బాబు నీ మాయ చూసుకుంటుందో లేదో నేను వెళ్లి బాబుని తీసుకువచ్చేస్తాను అంటాడు రాజ్. అలా చేస్తే మాయ మీరు తన కోసమే తన రూమ్ కి వచ్చారు అని అందరిని పిలిచి పెద్ద సీన్ చేస్తుంది అంటుంది కావ్య. నిజమే అంటాడు రాజ్. మీరు పడుకోండి అవసరం అయితే నేను వెళ్లి చూస్తాను అంటుంది కావ్య.

తరువాయి భాగంలో రాజ్ కి మాయ తో పెళ్లి చేయడానికి అభ్యంతరం లేదని ఒప్పందం పత్రాల మీద కావ్య ని సంతకం పెట్టమంటుంది అపర్ణ. ఆ మాటలకి ఇంట్లో అందరూ షాక్ అవుతారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X