Brahmamudi May 2nd Episode: రాజ్‌ని చూసిన పీఏ శృతి... రాజ్ పుట్టుకపై నిజం చెప్పిన చలపతి- లక్ష్మీ

Photo Courtesy: JioHotstar

మధ్య తరగతి వాడికి అన్నీ కష్టాలేనని ఇందూకి పెద్ద క్లాస్ పీకుతాడు రాజ్. తన డబ్బులు తనకి కట్టాలని, 24 గంటలు మాత్రమే రాకేష్ టైం ఇవ్వడంతో ఐశ్వర్య వణికిపోతుంది. ముందు ఎంతోకొంతకి ఈ డీల్ క్లోజ్ చేయాలని అనుకుంటుంది. వెంటనే రేఖ దగ్గరికి వెళ్లి. మన దగ్గర ఉన్నది 20 లక్షల రూపాయలేనని చెప్పమని చెబుతుంది. భ్రమరాంబ కూడా అదే ఐడియా ఇవ్వడంతో రాజ్‌కి కాల్ చేసి తాము 20 లక్షల రూపాయలు మాత్రమే ఇవ్వగలమని, అంతకుమించి చిల్లిగవ్వ కూడా ఇవ్వలేనని చెబుతుంది రేఖ. దాంతో రాజ్ మండిపడతాడు. మీకు చిల్లర మనుషుల్లా కనిపిస్తున్నామా? మేం అడిగిన డబ్బు ఇవ్వకపోతే మీ అమ్మాయిని చంపేస్తానని వార్నింగ్ ఇస్తాడు.

ఆ వెంటనే రాజ్‌కి ఐశ్వర్య ఫోన్ చేసి.. 20 లక్షల రూపాయల డీల్‌కు ఒప్పుకోమని ఒత్తిడి చేస్తుంది. సాహూ వార్నింగ్, తన కుటుంబం గురించి ఆలోచించి రాజ్ కూడా ఆ డీల్‌కు ఒప్పుకుంటాడు. వెంటనే రేఖకి కాల్ చేసి 20 లక్షల రూపాయలు ఇస్తే వెంటనే ఇందూని మీకు అప్పగిస్తామని చెబుతాడు. ఇదంతా విన్న లక్కీ మండిపడతాడు. నాకు నా ఫ్యామిలీయే ముఖ్యం.. డబ్బులు సంగతి తర్వాత అని చెబుతాడు రాజ్. ఇందూని గుడికి తీసుకొచ్చిన రాజ్- లక్కీలు.. ఇందూని అక్కడే రేఖకి అప్పగించేందుకు ప్లాన్ చేస్తారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక మే 2వ తేదీ ఎపిసోడ్ 1022లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial May 2nd 2026 Episode 1022 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

గుడిలో రేఖను చూడగానే ఇందూ షాక్ అవుతుంది. ఇందూ దొరికింది, డబ్బులు ఇచ్చేయమని భూషణ్‌కి చెబుతుంది రేఖ. ఆ వెంటనే లక్కీకి డబ్బులున్న బ్యాగ్ ఇస్తాడు భూషణ్. ఇందూని తీసుకుని రేఖ వెళ్తుండగా అది చూసి రాజ్ బాధపడతాడు. ఇంతలో లక్కీ వచ్చి డబ్బులు అందాయి. ఇందాకటి నుంచి ఆ అమ్మాయిని అలా చూస్తున్నావు, ఇంత బాధపడుతున్నావు, నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించావా? అందుకే అంతలా ఫీల్ అవుతున్నావా? అని లక్కీ అడుగుతాడు. ప్రేమ తొక్కా.. మనకి డబ్బులే ముఖ్యమని చెబుతాడు రాజ్. ఆ వెంటనే ఇద్దరూ కలిసి డబ్బులు లెక్క చూసుకుని ఐశ్వర్యకి రావాల్సిన డబ్బుల్ని తిరిగి ఇచ్చేస్తాడు. ఇందూ కారెక్కుతూ ఓ లుక్ ఇచ్చింది.. ఆ కళ్లలో ఏదో కాంతి కనిపించింది, కళ్లలో చక్రాలు తిరుగుతున్నట్లుగా కనిపించింది. దాని అర్ధం ఏంటో తెలియడం లేదని అంటాడు. రాత్రి మిగిలిపోయిన కూరలు ఫ్రిజ్‌లో ఉన్నాయని మరిచిపోకుండా తినమని తన కళ్ల ద్వారా చెబుతోందని అంటాడు. ముందు ఆ సాహూ గాడికి డబ్బులు ఇచ్చేయమని లక్కీకి చెబుతాడు రాజ్.

ఇందూని ఇంటికి తీసుకొచ్చి విసిరికొడుతుంది రేఖ. మీ మనవరాలు కిడ్నాప్ అయ్యిందని మీడియాకు చెబుతాను, పోలీసులకు చెబుతానని అన్నావు. నేను వద్దంటే నా మీద అరిచావు కదా? ఇప్పుడు చూడు నేనే నీ మనవరాలిని ప్రాణాలతో ఇంటికి తీసుకొచ్చానని అపర్ణతో అంటుంది రేఖ. ఈ కిడ్నాప్ ఏంటో కానీ వాడు మూడు చెరువుల నీళ్లు తాగిచ్చాడు. ప్రతి ఒక్కరితో మాటలు పడ్డామని అంటాడు భూషణ. నా బంగారం మొత్తం ఆ చక్రీగాడు లాగేసుకున్నాడు.. తలచుకుంటేనే ఏడుపు వస్తుంది, దీనికి కారణం నువ్వేనని అంటుంది భ్రమరాంబ. అందరిముందు గంభీరంగా తలెత్తుకుని తిరిగే రేఖ.. నీ కోసం అడుక్కునే స్టేజ్‌కి వెళ్లిందని అంటుంది భ్రమరాంబ. తన వాలకం చూస్తుంటే ఇందూ కిడ్నాప్ అయినట్లు లేదు.. ఏదో పిక్నిక్‌కి వెళ్లినట్లుగా ఉందని అంటాడు శేషం. అసలు నీకేమైందో? నువ్వు ఎప్పుడు తిరిగొస్తావోనని వారం రోజులూ తిండి తిప్పలు మానేశామని అంటుంది భ్రమరాంబ.

మీరు కోరుకున్నట్లుగానే మీ మనవరాలిని ప్రాణాలతో తీసుకొచ్చాను.. నేను అనుకున్నట్లుగా రేపు ఆస్తి పేపర్ల మీద సంతకాలు పూర్తవ్వాలి. ఈ విషయంలో తేడా వస్తే మాత్రం నేను ఊరుకోను, మీకేమైనా ఆలోచనలు ఉంటే అవి మానుకోండని వార్నింగ్ ఇస్తుంది రేఖ. తన మాటలు కొట్టిపారేయొద్దు.. తను రుద్రాణి కూతురు ఏ విషయంలోనైనా ఒక మెట్టుపైనే ఉంటుందని చెబుతుంది భ్రమరాంబ. నువ్వు ఎక్కడికి వెళ్లావో? ఏమైపోయావోనని మేమంతా కంగారుపడ్డామని ఇందూతో అంటాడు సుభాష్. ఆస్తి కోసం మన అనుకున్న వాళ్లే.. కుళ్లు, కుతంత్రాలతో జీవితాల్ని ఆడుకుంటున్నారు. అసలు నిన్ను ఎవరు కిడ్నాప్ చేశారు? మనం ప్లాన్ చేసినవాళ్లు కాదు కదా అని అంటుంది స్వాతి. డబ్బుల కోసం కిడ్నాప్ చేసుంటారని చెబుతుంది ఇందూ. నువ్వు కనిపించకపోయేసరికి ఊపిరి ఆగినంత పని అయ్యింది.. నిన్ను చూడగానే పోయిన ప్రాణాలు వచ్చినట్లుగా ఉందని అంటుంది అపర్ణ.

హాస్పిటల్‌లో బెడ్‌పై ఉన్న ఒకరిని చూడటానికి రాజ్ వెళ్తాడు. ఆమె ఎప్పుడు కోలుకుంటుందని డాక్టర్‌ని అడుగుతాడు. మా ప్రయత్నాలు మేం చేస్తున్నాం.. తను ఎప్పుడు లేచి కోలుకుంటోందో చెప్పలేమని అంటాడు డాక్టర్. ఏ ట్రీట్‌మెంట్ ఆగినా తన ప్రాణాలు కాపాడలేమని చెబుతాడు. ఎలాగైనా ఎంత కష్టపడి అయినాసరే డబ్బులు కడతానని అంటాడు రాజ్. హాస్పిటల్‌లో రాజ్‌ పోలికలతో ఉన్న రాజ్‌ని చూసిన పీఏ శృతి షాకై.. అతనిని ఫాలో అవుతుంది. ఇంటికొచ్చిన రాజ్‌ని చూసి నీ బిజినెస్ ఎంత వరకు వచ్చింది? ఆ సాహూగాడితో ఓకేనా అని అడుగుతాడు తండ్రి చలపతి. ఫస్ట్ టైం కాబట్టి.. లాభాలు రాలేదు, ఎక్కడికక్కడ సరిపోయిందని చెబుతాడు రాజ్. మంచి జాబ్ చూసుకుంటే నెల నెలా జీతం వస్తుందని అంటాడు.

ఫంక్షన్ చేసిన అమ్మాయి.. మీ ఇంటి కోడలైతే బాగుంటుందని అందరూ అంటున్నారని తల్లి అంటుంది. నీ మనసులో కూడా అదే ఉందని డైరెక్ట్‌గా చెప్పొచ్చు కదా అని అంటాడు రాజ్. అంత తెలివైన అమ్మాయి.. ఏ పనిపాటా లేని నిన్నెందుకు చేసుకుంటుందని అంటాడు చలపతి. నీకు జాబ్ కావాలా? అమ్మాయి కావాలా? అని అడుగుతాడు రాజ్. ఇంతలో లక్కీ ఫోన్ చేయడంతో సీరియస్‌గా వెళ్లిపోతాడు రాజ్. ఇంతలో రాజ్‌ని వెతుక్కుంటూ పీఏ శృతి వస్తుంది. కానీ రాజ్ పట్టించుకోకుండా వెళ్లిపోతాడు. లోపలికి వెళ్లి రాజ్ గురించి అడుగుతుంది. వాడి పేరు రాజు.. నా పెద్ద కొడుకు అని చలపతి చెప్పగా.. మీరు అబద్ధం చెబుతున్నారని అంటుంది శృతి. తను మీ కన్నకొడుకు కాదని శృతి అనడంతో లక్ష్మీ- చలపతి షాక్ అవుతారు. అతను అచ్చం .. మా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండీ రాజ్ సార్‌లాగే ఉన్నాడని చెబుతుంది శృతి.

దాంతో చలపతి- లక్ష్మీలు నిజం చెప్పేయాలని అనుకుంటారు. వాడు మా కన్నకొడుకు కాదని చెబుతాడు చలపతి. మేము శ్రీశైలం నుంచి తిరిగొస్తున్నప్పుడు, ఒళ్లంతా దెబ్బలతో వాడు మాకు దొరికాడు. అందుకే మేం వాడిని పెంచుకుంటున్నామని చెబుతాడు చలపతి. నా అనుమానమే నిజమైంది. తను దుగ్గిరాల ఇంటి వారసుడని శృతి చెప్పడంతో చలపతి- లక్ష్మీలు షాక్ అవుతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X