Brahmamudi May 2nd episode: ఇంటి నుంచి గెంటి వేస్తే.. మీ పరిస్థితి ఏమిటి? కావ్యతో రుద్రాణి
అనామిక కళ్యాణ్ మీద, అప్పు మీద కేసులు పెట్టి అరెస్టు చేయిస్తుంది. అప్పుని అరెస్టు చేయించినందుకు దుగ్గిరాల ఇంటికి వచ్చి రచ్చ రచ్చ చేస్తుంది కనకం. అప్పుని,కళ్యాణ్ ని విడిపించి ఇంటికి తీసుకు వస్తారు కావ్య దంపతులు. అరెస్టు చేయించినందుకు అనామిక చెంప పగల కొడుతుంది స్వప్న.ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక మే 2వ తేదీ ఎపిసోడ్ 399 లో ఏం జరిగిందంటే..
రుద్రాణి రాహుల్ తో మాట్లాడుతూ నువ్వు ఏం చేస్తావో తెలియదు మరో గంటలో సేటు ఇక్కడ ఉండాలి అంటుంది. సరే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాహుల్. వెనక్కి తిరిగి చూసేసరికి అనామిక ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అవుతుంది రుద్రాణి. సిగ్గుందా మీకు, మీరేదో నా మంచి కోరుకొని నాకు సాయం చేస్తారు అనుకుంటే మీరు కూడా మీ స్వార్థం మీరు చూసుకుంటున్నారా, మీరు చెప్పినట్లు చేశాను కాబట్టే ఇప్పుడు నా అత్త నా భర్తకి నేను శత్రువుని అయిపోయాను అంటుంది.

ఎంతమాట అన్నావు నేను నీ మంచి కోసమే ఇదంతా చేశాను, రెండు రోజులు నీ భర్త మాట్లాడలేదని బాధపడుతున్నావ్ కానీ ఆ తర్వాత నువ్వు చెప్పినట్లే వింటాడు, ఆ అప్పు జోలికి పోడు. అప్పుడు ఆఫీసులోనూ ఇంట్లోనూ నీదే రాజ్యం అని చెప్తుంది. ఆ మాటలని నమ్ముతుంది అనామిక, మీ ఉపాయం వెనుక ఇంత లోతుందని గ్రహించలేకపోయాను, మిమ్మల్ని తిట్టినందుకు ఏమీ అనుకోవద్దు అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు సుభాష్ రాజ్ కి 10 లక్షలు డబ్బు ఇస్తూ ఇలా ఎన్నాళ్ళు.. నిజం ఎప్పటికైనా తెలియాల్సిందే కదా అంటాడు.
ఇదే ఆఖరి సారి నాన్న, నిజం బయటపడకూడదంటే ఇలా చేయక తప్పదు. లేదంటే తను ఇంటి మీదకు వచ్చి గొడవ చేస్తుంది అని చెప్పి ఆ డబ్బు తీసుకొని బయటికి వెళ్తాడు రాజ్. ఇదంతా పైనుంచి గమనిస్తుంది కావ్య. ఈ డబ్బు ఆ పిల్లాడి తల్లి దగ్గరికి తీసుకొని వెళ్తున్నాడా అనుకుంటూ రాజ్ ని ఫాలో అవుతుంది. రాజ్ ఒక ప్లేస్ కి వెళ్తే అక్కడ రాజ్ కోసం వెయిట్ చేస్తున్న వ్యక్తి మీకోసం ఎంత సేపు వెయిట్ చేయాలి అని చిరాకు పడతాడు.
వాడి చెంప పగల కొట్టి ఒక నిజం దాయటం కోసం, మా కుటుంబం కోసం నేను ఈ పని చేస్తున్నాను. అంతేకానీ నీకు భయపడి కాదు మళ్ళీ బ్లాక్ మెయిల్ చేసావంటే ఊరుకునేది లేదు అని హెచ్చరించి డబ్బు అతని చేతిలో పెట్టి అక్కడ నుంచి వెళ్లిపోతాడు రాజ్. ఇదంతా గమనించిన కావ్య ఆ వ్యక్తిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది కానీ కొద్దిలో మిస్ అయిపోతుంది. మరోవైపు సేటు ఇంటికి వచ్చి మీ కోడలు స్వప్న నా దగ్గర కోటి రూపాయలు అప్పు తీసుకుంది అంటాడు.
స్వప్న షాక్ అవుతుంది, నాకు డబ్బు తీసుకోవాల్సిన అవసరం లేదంటుంది. అప్పుడు సేటు డాక్యుమెంట్స్ చూపిస్తాడు, తన సంతకాన్ని డాక్యుమెంట్స్ మీరు చూసి షాక్ అవుతుంది స్వప్న. పెద్దింటి కోడలు వి కదా అని నమ్మి డబ్బిస్తే నేను ఎవరో తెలియదు అంటున్నావా ఇప్పుడే పోలీస్ స్టేషన్ కి వెళ్తాను అంటాడు సేటు. నిజా నిజాలు కనుక్కొని మేమే మీ డబ్బు మీకు పంపిస్తాము మీరు ఏమి కంగారు పడకండి అంటాడు సుభాష్.

సేటు వెళ్లిపోయిన తర్వాత అపర్ణ మాట్లాడుతూ నీకు అంత డబ్బుతో అవసరం లేదని మా అందరికీ తెలుసు, అసలు ఏం జరిగిందో నిదానంగా ఆలోచించు అంటుంది. ఆలోచిస్తాను, రెండు రోజుల్లో నిజానిజాలు బయటపడతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది స్వప్న. రెండు రోజుల్లో నువ్వేం తేలుస్తావు.. నువ్వు రెండు రోజుల్లో ఇంట్లోంచి బయటికి వెళ్లిపోవడం ఖాయం అనుకుంటుంది రుద్రాణి.
మరోవైపు ఇంటికి వచ్చిన రాజ్ బాబు పడుకోవటం చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. వెంటనే బాబు ఏడవడంతో డైపర్ కోసం వెతుకుతాడు. అప్పుడే డైపర్ తో అక్కడికి వస్తుంది కావ్య. ఎక్కడికి వెళ్లావు అని అడుగుతాడు రాజ్. మీ అడుగుజాడల్లో నడుస్తున్నాను అంటుంది కావ్య. షాక్ అవుతాడు రాజ్. నేను ఎక్కడికి వెళ్తాను డైపర్ తీసుకురావడానికి వెళ్లాను అంటూ బాబుకి డైపర్ చేంజ్ చేస్తుంది కావ్య. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











