Brahmamudi May 30th Episode: ధాన్యలక్ష్మీకి దొరికిపోయిన అప్పూ.. రుద్రాణి నోరు మూయించిన కళ్యాణ్

Photo Courtesy: JioHotstar

కారులో కళ్యాణ్ - అప్పూలు వెళ్లిపోయినట్లుగా అనిపించడంతో ధాన్యలక్ష్మీకి అనుమానం వస్తుంది. గదిలో ఉన్న రాజ్- కావ్యలు మూడు గంటల పాటు ఎలా మేనేజ్ ఎలా చేయాలా అని ఆలోచిస్తుండగా ధాన్యలక్ష్మీ దొంగచాటుగా వచ్చి గమనిస్తుంది. దీంతో అలర్ట్ అయిన రాజ్- కావ్యలు వెంటనే తమ మొబైల్స్‌లో ఉన్న అప్పూ-కళ్యాణ్‌ల వాయిస్‌లు ప్లే చేస్తారు. దొంగచాటుగా కొడుకు - కోడలు ఫస్ట్ నైట్ గది దగ్గరికి వచ్చిన ధాన్యలక్ష్మీపై ప్రకాశం కోప్పడతాడు.

అప్పూ- కళ్యాణ్‌లు బెడ్‌రూంలో ఉన్నారు ఓకే మరి రాజ్- కావ్యలు ఎక్కడ అని ఇందిర, అపర్ణలు ఆలోచిస్తూ రాజ్‌కి ఫోన్ చేస్తారు. మేం పైన ఉన్నాం కాసేపట్లో వచ్చేస్తామని చెబుతుంది కావ్య. దొంగను వెతుకుతూ వెళ్లిన అప్పూ- కళ్యాణ్‌లకు ఛార్లెస్ కనిపించడంతో వాడిని ఫాలో అవుతారు. దుగ్గిరాల ఇంట్లోకి ప్రవేశించిన ఛార్లెస్ .. రాజ్- కావ్యలను కొత్త జంట అనుకుని వాళ్లని తాడుతో కట్టేస్తాడు. రాజ్ తెలివిగా ఫోన్ అందుకుని ఛార్లెస్ గురించి అప్పూకి మెసేజ్ పెడతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక మే 30వ తేదీ ఎపిసోడ్ 735లో ఏం జరిగిందంటే?

Brahmamudi Serial May 30th 2025 Episode 735 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

చాకచక్యంగా ఫోన్ అందుకున్న రాజ్.. ఛార్లెస్ మనింట్లోనే ఉన్నాడని అప్పూకి మెసేజ్ పెడతాడు. అది చూసిన అప్పూ- కళ్యాణ్‌లు షాకై ఇంటికి బయల్దేరతారు. ఇంతలో కట్లు విడిపించుకున్న రాజ్, కావ్యలు .. ఛార్లెస్‌ని కట్టేసి కిందకి విసిరేస్తారు. అప్పూ వాడిని పట్టుకుని పోలీస్ స్టేషన్‌కి పంపిస్తుంది. ఫ్యామిలీ అంతా లోపలే ఉండటంతో అప్పూ- కళ్యాణ్‌లకు లోపలికి ఎలా వెళ్లాలో అర్ధం కాదు. మనం మెయిన్ ద్వారం గుండా లోపలికి వెళ్తే దొరికిపోతామని కళ్యాణ్ చెప్పగా.. గదిలో లేకపోయినా దొరికిపోతామని అంటుంది అప్పూ. గదిలో ఉన్నది అక్కా బావ అని తెలిస్తే చాలు మన సంగతి ఔట్ అని అంటుంది.

రాజ్- కావ్యలు ఇంతసేపు అవుతున్నా కిందకి రాలేదని అపర్ణ, ఇందిరలు మాట్లాడుకుంటూ ఉంటారు. అది విన్న కళ్యాణ్.. నిజమే పొట్టి నువ్వు ఇలా అనగానే ఇలా అడిగేశారేంటీ అని ప్రశ్నిస్తాడు. నేను అనకపోయినా వాళ్లికి అనుమానం వస్తుందని, ఏదో ఒకటి చేసి మనం వెంటనే గదిలోకి వెళ్లిపోవాలని చెబుతుంది. అది ఎలా అని అప్పూని అడుగుతాడు కళ్యాణ్. ఆ వెంటనే అప్పూ ఒక తాడు తీసుకొచ్చి .. ఈ తాడుని పైకి వేస్తాను, దీనిని పట్టుకుని పాక్కుంటూ పైకి వెళ్లిపోతే మన రూమ్‌లోకి వెళ్లిపోవచ్చని అంటుంది అప్పూ. నువ్వంటే పోలీస్ ట్రైనింగ్ తీసుకున్నావ్ కాబట్టి తాడు పట్టుకుని పాములా వెళ్లిపోతావ్. మరి నా పరిస్ధితేంటీ అని ప్రశ్నిస్తాడు కళ్యాణ్.

ఇంతలో ప్రకాశం మే ఐ హెల్ప్ యూ అని అనడంతో ఇద్దరూ షాక్ అవుతారు. నిచ్చెన ఏమైనా తీసుకునిరానా లేక మీ అమ్మని పిలవనా? అని సెటైర్లు వేస్తాడు ప్రకాశం. ఇప్పుడు అమ్మ వచ్చిందంటే గోల గోల చేస్తుందని కళ్యాణ్ భయపడతాడు. ఇంతలో ధాన్యలక్ష్మీ గట్టిగా కేకలు వేయడంతో కళ్యాణ్- అప్పూ షాక్ అవుతారు. ఫ్యామిలీ మొత్తం అప్పూ- కళ్యాణ్‌లను రౌండప్ చేసి పంచాయితీ పెడుతుంది. మనింట్లో ఎవ్వరూ నేరుగా శోభనం చేసుకోరా అని ప్రశ్నిస్తుంది ఇందిర. రాజ్ ఏమో బూత్ బంగ్లాకి వెళ్లాడు, నువ్వేమో గోడ దూకి ఎక్కడికో వెళ్లావ్ అని మండిపడుతుంది అపర్ణ. అప్పూ కేసు పని మీద పోలీస్ స్టేషన్‌కి వెళ్లాలని ముందే చెప్పింది కదా, దానికి ధాన్యలక్ష్మీ నో అని చెప్పడంతో మొగుడిని కన్విన్స్ చేసి కళ్యాణ్‌ని పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లిందని అంటుంది అపర్ణ.

రుద్రాణి చెప్పినదంతా నిజమా? అని ధాన్యలక్ష్మీ నిలదీస్తుంది. నువ్వు లేనిపోని గొడవలు పెట్టొద్దని అంటాడు కళ్యాణ్. మేం నిన్ను మోసం చేయాలని అనుకోలేదు, మేం పోలీస్ స్టేషన్‌కి వెళ్లిన మాట నిజమేనని.. కానీ వెళ్లడానికి ఓ కారణం ఉందని చెబుతాడు. అప్పూ ఎంతో కష్టపడి అరెస్ట్ చేసిన ఓ దొంగ తప్పించుకుని పారిపోయాడని, వాడిని పట్టుకోవడానికే మేం వెళ్లామని అంటాడు కళ్యాణ్. అలా వెళ్లకపోయుంటే అప్పూ జాబ్ పోయేదని చెబుతాడు. ఇంతకీ ఆ దొంగ దొరికాడా? అని ప్రశ్నిస్తాడు ప్రకాశం. మీ కోడలు చేసే పనికిరాని చేజింగ్‌లోకి నా కొడుకుని తీసుకెళ్లి వాడిని కూడా రిస్క్‌లో పడేసిందని, వాడికి జారగరానిది ఏమైనా జరిగి ఉంటే అని మండిపడుతుంది ధాన్యలక్ష్మీ.

అర్ధరాత్రి పూట నా భార్య ఒంటరిగా వెళ్తుంటే తోడుగా వెళ్లకుండా వదిలేయమంటావా అని ప్రశ్నిస్తాడు కళ్యాణ్. మీరు చెప్పింది నిజమే, అనవసరంగా కళ్యాణ్‌ని ఇన్వాల్వ్ చేసినందుకు తనను క్షమించాలని అడుగుతుంది అప్పూ. వాడు పట్టుకోవాలన్న దొంగ దగ్గర గన్ లాంటిది ఉండి, వాడు షూట్ చేసుంటే, అది నేరుగా వచ్చి కళ్యాణ్‌కి తగిలి ఉంటే ఏమయ్యేదని ధాన్యలక్ష్మీని రెచ్చగొడుతుంది రుద్రాణి. తన ప్రాణాలు అడ్డుపెట్టయినా సరే అప్పూ వాడిని కాపాడుకుంటుందని కోడలిని వెనకేసుకొస్తాడు ప్రకాశం. అందరూ నా గురించే మాట్లాడుతున్నారు కానీ అప్పూకి ఏమవుతుందోనని ఆలోచించారా? అని ప్రశ్నిస్తాడు కళ్యాణ్. ఆ బుల్లెట్‌కి ఎదురు నిలబడేది అప్పూనే తన ప్రాణాలకు విలువ లేదా అని నిలదీస్తాడు.

అయినా దొంగ దొరికింది మనింట్లోనే అని చెబుతాడు కళ్యాణ్. అప్పూ అరెస్ట్ చేయకుండా ఉంటే మన ఫ్యామిలీ మీద ఆ దొంగ అటాక్ చేసేవాడని చెప్పడంతో అంతా షాక్ అవుతారు. పోలీసులు వాళ్ల సంతోషాన్ని పక్కనపెట్టి డ్యూటీ చేయడం వల్లే మనం హ్యాపీగా ఉంటున్నామని చెబుతాడు కళ్యాణ్ . అలాంటి పని చేస్తున్న నా భార్య అంటే నాకు చాలా రెస్పెక్ట్ అని ఆమె కోసం ఎన్ని సార్లయినా ఇలాంటి రిస్క్ తీసుకుంటానని తేల్చేస్తాడు. ఆ మాటలతో కళ్యాణ్‌ని మెచ్చుకుంటుంది అపర్ణ. మీ పెట్టించిన ముహూర్తానికి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి మీ శోభనం జరిపించొచ్చని చెబుతుంది. ఇంత జరుగుతుంటే రాజ్- కావ్యలు ఎక్కడ అని అడుగుతుంది ఇందిర. వాళ్లిద్దరూ మా గదిలోనే ఉన్నారని, మేం వచ్చే వరకు మేనేజ్ చేస్తామన్నారని అప్పూ చెప్పడంతో అంతా పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తారు.

ఫ్యామిలీ మొత్తాన్ని చూసి రాజ్- కావ్యలు షాక్ అవుతారు. రాజ్ తప్పించుకోవడానికి ఏదో చెప్పబోతుండగా మేం దొరికిపోయామని అప్పూ- కళ్యాణ్‌లు ఎంట్రీ ఇస్తారు. దాంతో కావ్య సిగ్గుపడుతూ వెళ్లిపోతుంది. ఇంతకన్నా మంచి టైం దొరకదని వెళ్లి కావ్యకి ప్రపోజ్ చేయమని చెబుతుంది ఇందిర. పరిగెడుతున్న కావ్య చేతిని పట్టుకుని తన మనసులోని మాటని చెప్పాలని అనుకుంటాడు. నాకు మీకు ఉన్న బంధం ఏంటో నాకు తెలియదు, మొదటిసారి చూసినప్పటి నుంచి మనకి ఎప్పటి నుంచో పరిచయం ఉన్న ఫీలింగ్ కలిగిందని అది తెలుసుకోవడానికే ఇన్ని రోజులు మీ వెంట తిరిగానని అంటాడు రాజ్. ఒకవేళ నేను మరిచిపోయిన గతంలో మీరు ఉన్నారా? అని ఎన్నోసార్లు అడిగానని చెబుతాడు. నా మనసులో ఉన్నది మీ కళ్లలో కనిపిస్తోందని అంటాడు. రాజ్ తన మనసులోని మాటని చెప్పబోతుండగా అతనికి వైదేహి నుంచి ఫోన్ వస్తుంది. దాంతో దుగ్గిరాల ఫ్యామిలీ డిజప్పాయింట్ అవుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X