Brahmamudi may 30th episode: రాజ్ తో మాయ పెళ్ళికి ఒప్పుకున్న కావ్య.. కోడల్ని మరింత అసహ్యించుకుంటున్న అపర్ణ!
ఇంట్లో కోడలి స్థానం కోసం కావ్య తో పోటీ పడుతూ ఉంటుంది మాయ. కావ్య కి రాజ్ కి విడాకులు ఇప్పించే ప్రయత్నం చేస్తుంది అపర్ణ. విడాకులు ఇవ్వనని గట్టిగా చెప్తుంది కావ్య. కావ్య కి అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోం అంటూ అపర్ణకి వార్నింగ్ ఇస్తుంది ఇందిరా దేవి. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక మే 30వ తేదీ ఎపిసోడ్ 423 లో ఏం జరిగిందంటే..
ఏడుస్తున్న బాబుని ఓదార్చటానికి నానా పాట్లు పడుతూ ఉంటారు మాయ, రుద్రాణి. అప్పుడే అక్కడికి వచ్చిన స్వప్న వాడు అలా ఏడుస్తుంటే ఇద్దరు ఏం చేస్తున్నారు అంటూ కేకలు వేస్తుంది. బాబు అలా ఏడుస్తుంటే ఏ తల్లి అయినా పాలు పడుతుంది కానీ నీలా చూస్తూ ఊరుకోదు అసలు నువ్వు బాబుకి తల్లివేనా అని అనుమానంగా అడుగుతుంది. నాకు పాలు ఎలా వస్తాయి అంటుంది మాయ. ఆ మాటలకి స్వప్న షాక్ అవుతుంది.

వెంటనే రుద్రాణి మాట్లాడుతూ ఇన్ని రోజులు బాబుకి పాలు పట్టలేదు కదా అందుకే పాలు ఆగిపోయాయి అంటూ కవర్ చేసేస్తుంది. సరే బాబుకి పాలు పట్టి తర్వాత నాకు ఆపిల్ జ్యూస్ తీసుకొని రండి అని రుద్రాణికి ఆర్డర్ వేసి వెళ్ళిపోతుంది స్వప్న. బాబుకి పాలు పట్టే పనిలో పడతారు మాయ, రుద్రాణి. మరోవైపు ఇంట్లో అందర్నీ సమావేశపరుస్తుంది అపర్ణ. ఎందుకు అందర్నీ సమావేశపరిచావు, నీ నిర్ణయం ఏమిటి అని రుద్రాణి అడుగుతుంది.
ఇంకేం నిర్ణయం, అపర్ణ విడాకులు ఇవ్వమంటే ఇవ్వను అని కావ్య తెగేసి చెప్పింది కదా అంటాడు సుభాష్. బిడ్డ తల్లికి న్యాయం చేయాలి కదా అంటుంది రుద్రాణి. ఈ విషయంలో మాయ కన్నా మా అత్తకి ఎక్కువ తొందరగా ఉన్నట్లుంది అని రుద్రాణి పై కోప్పడుతుంది స్వప్న. అప్పుడు అపర్ణ మాట్లాడుతూ కావ్య.. భర్తకి విడాకులు ఇవ్వనన్నావు కదా ఇప్పటికీ అదే మాట మీద ఉన్నావా అని అడుగుతుంది. మాటిమాటికి నిర్ణయాలు మార్చుకోవడానికి ఇది వ్యాపారం కాదు సంసారం అంటుంది కావ్య.

అయితే రాజ్ తో మాయ పెళ్ళికి ఒప్పుకుంటునట్లు ఒప్పందం పత్రాల మీద సంతకం పెట్టు అంటుంది అపర్ణ. అపర్ణ నిర్ణయాన్ని అందరూ తప్పు పడతారు. నేనేమీ కావ్యకి అన్యాయం చేయడం లేదు బిడ్డ తల్లికి న్యాయం చేయాలనుకుంటున్నాను అంతే అంటుంది అపర్ణ. కానీ నేను పెళ్ళికి ఒప్పుకోవాలి కదా అంటాడు రాజ్. ఈ విషయంలో నీకు మాట్లాడే అర్హత లేదు,ఇదంతా నువ్వు తెచ్చుకున్న తద్దినమే అంటుంది అపర్ణ.
సంతకం ఎక్కడ పెట్టాలో చెప్పండి నేను పెడతాను అంటుంది స్వప్న. ఇందులో నీకేంటి సంబంధం ఉంటుంది అపర్ణ. మరి నా చెల్లెలికి ఏంటి సంబంధం రాజ్ తప్పు చేస్తే నా చెల్లెలు ఎందుకు బలి అయిపోవాలి,మీరే చెప్పారు కదా పెళ్లయిన దగ్గరనుంచి కావ్య సంసారం సరిగ్గా లేదని, అలాంటి కావ్యకి అన్యాయం చేయాలని చూస్తారా నాకు సమాధానం చెప్పండి అని నిలదీస్తుంది.

ఇప్పుడు నేను సంతకం చేయకపోతే మాయని ఎందుకు తీసుకువచ్చావు అని అడుగుతారు, ఇప్పుడు సంతకం పెట్టేస్తే పెళ్లికి ఇంకా టైం ఉంటుంది కాబట్టి ఈ లోపు అసలు మాయ ను తీసుకురావచ్చు అనుకున్న కావ్య నేను సంతకం పెట్టడానికి ఒప్పుకుంటున్నాను అంటుంది. ఆమె నిర్ణయానికి అందరూ షాక్ అవుతారు. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు అంటారు.

నేను అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను అంటూ సంతకం పెట్టేస్తుంది కావ్య.అప్పుడు కావ్యని మరింత అసహ్యించుకుంటుంది అపర్ణ. నువ్వు నా దృష్టిలో మరింత దిగజారిపోయావు,నువ్వు ఆస్తి కోసము, ఈ ఇంట్లో కోడలి హోదా మాత్రమే నీకు కావాలి, అంతేగాని నీ భర్త ఏమైపోయినా పర్వాలేదు, నీ భార్య హోదా ఏమైపోయినా పర్వాలేదు అంటూ కోడల్ని తిడుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన ఇందిరాదేవి అవును నువ్వు అన్నది నిజమే అంటుంది.

తరువాయి భాగంలో సంతకం ఎందుకు పెట్టావు అని కావ్యని మందలిస్తాడు రాజ్. మీ ఇద్దరికీ పెళ్లి జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకుంటానా అంటుంది కావ్య. ఏం చేస్తావు అంటాడు రాజ్. అదే చేస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య.


Click it and Unblock the Notifications










