Brahmamudi May 31st Episode: దుగ్గిరాల ఫ్యామిలీకి షాకిచ్చిన యామిని.. కావ్య ఆశలు ఆవిరి, నగలతో రాహుల్ జంప్
Photo Courtesy: JioHotstar
తనను కట్టేసినప్పటికీ తెలివిగా ఫోన్ పట్టుకున్న రాజ్.. వెంటనే ఛార్లెస్ మనింట్లోనే ఉన్నాడని అప్పూకి మెసేజ్ పెడతాడు. ఆలోపే కట్లు విప్పుకుని వాడిని కట్టేసి గోనె సంచెలో కుక్కి కిందకి విసిరేస్తారు. ఫ్యామిలీ అంతా నట్టింట్లో ఉండిపోవడంతో అప్పూ- కళ్యాణ్‌లు పైకి ఎలా వెళ్లాలో అర్ధం కాక అప్పూ ఓ తాడు తీసుకొస్తుంది. ఇంతలో వారిద్దరిని ప్రకాశం- ధాన్యలక్ష్మీ చూస్తారు. ఛార్లెస్ అనే దొంగ పారిపోయాడని అతనిని వెంటనే పట్టుకోకుంటే అప్పూ ఉద్యోగం పోతుందని ఆమెకు సాయం చేశానని చెబుతాడు కళ్యాణ్. ఈ సోసైటీ కోసం ప్రాణాలు పెట్టి పనిచేసే నా భార్య కోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటానని అంటాడు.
ఆ మాటలతో కళ్యాణ్‌ని అపర్ణ మెచ్చుకుంటుంది. ఇంతకీ రాజ్- కావ్యలు ఎక్కడని ఇందిర అడగ్గా.. అక్కాబావ మా రూమ్‌లో ఉన్నారని చెబుతుంది అప్పూ. ఫ్యామిలీ మొత్తం తలుపు బద్ధలు కొట్టుకుని వచ్చేయడంతో రాజ్- కావ్యలు షాక్ అవుతారు. నీ మనసులోని మాటను చెప్పమని ఇందిర అనడంతో కావ్య వెనుక పడతాడు రాజ్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక మే 31వ తేదీ ఎపిసోడ్ 736లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
కావ్యకి రాజ్ ప్రపోజ్ చేస్తుండగా వైదేహి పదే పదే ఫోన్ చేస్తుంది. ఏం జరిగిందోనని రాజ్ ఫోన్ లిఫ్ట్ చేయగా.. బాబూ రామ్ ఎక్కడున్నావని కంగారుగా అడుగుతుంది వైదేహి. ఏమైంది ఎందుకు ఏడుస్తున్నారు? అని అడుగుతాడు రామ్. యామిని కళ్లు తిరిగి పడిపోయిందని ఇప్పుడున్న పరిస్ధితుల్లో నువ్వు ఒక్కడివే దానిని కాపాడగలవని చెప్పడంతో తాను వెంటనే వస్తున్నానని చెబుతాడు. తమ ప్లాన్ మొత్తం ఫెయిల్ కావడంతో కావ్య, దుగ్గిరాల ఫ్యామిలీ బాధపడుతంది. కావ్యకి రాజ్ ప్రపోజ్ చేయకపోవడంతో రుద్రాణి ఊపిరి పీల్చుకుంటుంది. ఆ యామిని అనుకున్నది అనుకున్నట్టుగా సాధించిందని ఇక రాజ్ - కావ్య విడిపోయినట్లేనని సంతోషపడుతుంది.
ఇంట్లో వాళ్లంతా బాధలో ఉండగా అప్పూ గదిలోకి రాహుల్ వచ్చి స్వప్న నగలు కొట్టేస్తాడు. ఆ యామిని ఇచ్చిన షాక్‌కి ఇంట్లో వాళ్లంతా తేరుకోవడానికి ఒక వారం రోజులు పడుతుందని, ఈ లోపు నేను ఈ నగల ప్లేస్‌లో గిల్ట్ నగలు చేసి పెట్టేస్తానని అనుకుంటాడు రాహుల్. రాజ్ వచ్చేసరికి యామిని బెడ్‌పై ఉండగా.. డాక్టర్ ట్రీట్‌మెంట్ చేస్తుంటాడు. సరిగా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల స్పృహ తప్పారని చెబుతాడు డాక్టర్. ప్రస్తుతానికి పర్లేదని మెడిసిన్స్ రెగ్యులర్‌గా వాడమని చెప్పి రాజ్‌ను పక్కకి పిలుస్తాడు.
డాక్టర్ పక్కకి తీసుకెళ్లడంతో ఏం జరిగిందని అడుగుతాడు రాజ్. తను కళ్లు తిరిగి పడిపోయింది ఫుడ్ వల్ల కాదని డిప్రెషన్ వల్ల అని రాజ్‌తో చెబుతాడు డాక్టర్. పేషెంట్ దగ్గర చెప్పకూడదు కాబట్టే మిమ్మల్ని పక్కకి పిలిచానని అంటాడు. కానీ తను మనసులో ఏదో విషయమై డిప్రెషన్‌లో ఉందని చెబుతాడు. అదేంటో కనుక్కోకపోతే చాలా ప్రాబ్లమ్ అవుతుందని హెచ్చరిస్తాడు డాక్టర్. యామిని గురించి పట్టించుకోకుండా ఏం చేస్తున్నారని వైదేహి- రఘునాథ్‌లపై సీరియస్ అవుతాడు రాజ్. టైంకి ఫుడ్ తీసుకుంటుందో లేదో? టైంకి పడుకుంటుందో లేదో చూడాల్సిన బాధ్యత మీది కాదా? అని ప్రశ్నిస్తాడు.
తనకి ఈ పరిస్థితి రావడానికి కారణం మేం కాదు బాబు నువ్వు అని అంటాడు రఘునాథ్. మీరంటే దానికి ఎంత ఇష్టమో తెలుసు కదా? అని అంటుంది వైదేహి. చిన్నప్పటి నుంచి అది మిమ్మల్ని ఎంతలా ప్రేమించిందో తెలుసా? మీరంటే దానికి పిచ్చి ప్రేమే కాదు, ప్రాణమని చెబుతుంది వైదేహి. ఎప్పుడూ బావ బావ అంటూ తల్లి చుట్టూ తిరిగే పసిబిడ్డలా మీ చుట్టూనే తిరిగేదని, మీరే ప్రపంచంగా బతికేది అంటుంది. కానీ మీరు దాన్ని అస్సలు పట్టించుకోవడం లేదని, ఈ ప్రపంచం యామిని కాకుండా ఇంకెవరో అన్నట్లుగా తిరుగుతున్నారని మండిపడుతుంది వైదేహి. ఇన్నేళ్లకి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలన్న దాని కల నెరవేరబోతోందని నా కూతురు చాలా సంతోషంగా ఉండేదని అంటుంది. పెళ్లి జరిగే వరకు ప్రతిక్షణం మీతోనే గడపాలని మీపైనే ఎన్నో ఆశలు పెట్టుకుందని చెబుతుంది.
తన మనసులోని బాధని తల్లిదండ్రులతో చెప్పుకోలేక, నీకూ చెప్పలేక తనలో తానే నలిగిపోయిందని అంటాడు రఘునాథ్. అసలు మీకు ఈ పెళ్లి ఇష్టమా? కాదా? అని నిలదీస్తుంది వైదేహి. ఈ పెళ్లి ఇష్టమో కాదో నమ్మాలంటే నాకు మాట ఇవ్వమని అడగటంతో తప్పనిసరి పరిస్దితుల్లో ఇచ్చేస్తాడు. నా కూతురిని రెండ్రోజులు ఎక్కడికైనా తీసుకెళ్లండి, తనని సంతోషపెట్టి నార్మల్‌గా చేయమని అంటుంది. నాకు వేరే పనులు ఉన్నాయని రాజ్ చెప్పడంతో.. నీకు కాబోయే భార్య కంటే కూడా నీ పనులే నీకు ముఖ్యమా? అని ప్రశ్నిస్తుంది యామిని. నువ్వు ఇచ్చిన మాట మీద నిలబడే మనిషివి కాదని, మేమే ఎక్కడికైనా తీసుకెళ్తామని అంటుంది.
దాంతో యామినిని తీసుకెళ్తానని రాజ్ చెబుతాడు. కానీ ఇప్పటికిప్పుడు ఎక్కడికి తీసుకెళ్లాలో అర్ధం కావడం లేదని రాజ్ చెప్పడంతో అవన్నీ మాకు వదిలేయండి.. మేం చూసుకుంటామని అంటాడు రఘునాథ్. నా ఫ్రెండ్‌కి వికారాబాద్‌లో రిసార్ట్ ఉందని అక్కడికి వెళ్లమని చెబుతాడు. ఈ మాటలన్నీ దొంగచాటుగా విన్న యామిని.. రాజ్ వచ్చేసరికి బెడ్‌పై నిద్రపోతున్నట్లుగా నటిస్తుంది. రాజ్ ఆమెను చూసి వెళ్లిపోతాడు. తమ ప్లాన్ సక్సెస్ అయినందుకు యామిని, ఆమె పేరెంట్స్ సంతోషిస్తారు. మరోవైపు.. రాజ్ కోసం కావ్య ఇంట్లో ఎదురు చూస్తుంటుంది. ఆమెను చూసిన ఇందిర, అపర్ణలు బాధపడతారు.
నా ఆశలన్నీ కళ్ల ముందే ఆవిరి అయిపోయామని అంటుంది కావ్య. నీ బాధ నాకు తెలుసు, కానీ వాడు మాత్రం అలా జరుగుతుందని ఊహించాడా? అని ప్రశ్నిస్తుంది అపర్ణ. నేను మీ మనవడి గురించి ఆలోచించడం లేదు, ఐస్‌క్రీమ్ ఆర్డర్ పెట్టాను దాని కోసం వెయిట్ చేస్తున్నానని కావ్య చెప్పడంతో ఇందిర, అపర్ణలు షాక్ అవుతారు. ఆయన ఏదో ఒక రోజు నా దగ్గరికి వచ్చేస్తాడు. ఇంతలో రాజ్ ఫోన్ చేశాడా? లేదా? అని ధాన్యం అడుగుతుంది. ముందు అప్పూ- కళ్యాణ్‌లను లోపలికి పంపించమని చెప్పి ధాన్యానికి చెబుతుంది ఇందిర. ఈలోపు రాజ్ ఫోన్ చేసి యామిని స్పృహ తప్పిపడిపోయిందని చెబుతాడు. నేను కావ్యకి ప్రపోజ్ చేద్దామని ఎంతో ఆశపడితే ఇలా జరిగిందని రాజ్ బాధపడతాడు.
రేపైనా వచ్చి కావ్యకి ప్రపోజ్ చేయమని అంటుంది ఇందిర. దాంతో రేపు రాలేనని, యామినిని రిసార్ట్స్‌కి తీసుకెళ్తున్నానని చెబుతాడు రాజ్. ఆ మాటలతో ఇందిర షాక్ అవుతుంది. నువ్వు ఎక్కడికి వెళ్లినా కళావతితోనే వెళ్లాలి? రేపు మా ఇంటికి రావాల్సిందేనని తేల్చిచెబుతుంది ఇందిర. యామినిని రిసార్ట్‌కి తీసుకెళ్తున్నానని మాట ఇచ్చానని వెళ్లక తప్పదని చెబుతాడు రాజ్. మరోవైపు.. నీ కోసం రామ్‌ని ఒప్పించానని, అతనిని రిసార్ట్‌లో ఏం చేయబోతున్నావని అడుగుతుంది వైదేహి. బావని నా సొంతం చేసుకోబోతున్నానని, రేపు బావతో నా శోభనం జరగబోతోందని అంటుంది యామిని. ఆ మాటలతో వైదేహి మండిపడుతుంది. వెంటనే ఈ పిచ్చి పని ఆపేయ్, పెళ్లికి ముందే ఫస్ట్ నైట్ నైట్ ఏంటీ అని కేకలు వేస్తుంది. బావ లేకుండా నేను బతకలేనని నేను ఇంత చేసినా మళ్లీ ఆ కావ్య చుట్టూ తిరుగుతున్నాడని అంటుంది యామిని. బావతో నా శోభనం జరిగిందంటే ఇంకెప్పటికీ కావ్య జోలికి వెళ్లడని నా మెడలో మూడు ముళ్లు వేస్తాడని అంటుంది. మరోవైపు అప్పూ- కావ్యలు ఫస్ట్ నైట్ గదిలో ఉంటారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











