Brahmamudi May 31st episode: కావ్య చెంప పగలగొట్టిన ఇందిరా దేవి.. అప్పు అన్వేషణ ఫలిస్తుందా!
కావ్య కి రాజ్ కి విడాకులు ఇప్పించే ప్రయత్నం చేస్తుంది అపర్ణ. విడాకులు ఇవ్వనని గట్టిగా చెప్తుంది కావ్య. కావ్య కి అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోం అంటూ అపర్ణకి వార్నింగ్ ఇస్తుంది ఇందిరా దేవి. రాజ్ తో మాయ పెళ్ళికి ఎలాంటి అభ్యంతరం లేదని రాసిస్తుంది కావ్య. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక మే 31వ తేదీ ఎపిసోడ్ 424 లో ఏం జరిగిందంటే..
అనుమతి పత్రాలు మీద కావ్య సంతకం పెట్టినందుకు మరింత అసహ్యించుకుంటుంది అపర్ణ. నీకు డబ్బు తప్పితే భర్త ఏమైపోయినా పర్వాలేదు అని చీదరించుకుంటుంది. అప్పుడే కోవెల నుంచి వచ్చిన ఇందిరా దేవి భర్త మరో పెళ్లి చేసుకుంటానంటే అనుమతించి సంతకం పెట్టావా అంటూ కావ్య చెంప చెళ్ళు మనిపిస్తుంది. ఎవరికోసం నీ బ్రతుకుని త్యాగం చేస్తున్నావు ఇంత త్యాగం చేసినందుకు మీ అత్త నీకు ఏం కిరీటం పెట్టింది, ఇక్కడ ఉన్న గొర్రెల మందలో ఒకరైన నీకు తోడుగా వచ్చారా, అలాంటి వాళ్ళ కోసమా నీ బ్రతుకుని ఫణంగా పెడుతున్నావు అంటుంది.

కావ్యశాంతకం పెడితేనే కదా సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అంటుంది అపర్ణ. నీకు మాట్లాడే అర్హత లేదు, భార్యాభర్తల సమస్యలకి విడాకులే పరిష్కారం అయితే కళ్యాణ్ అనామిక కి విడాకులు ఇస్తాను అన్నప్పుడు ఎందుకు మందలించావు అంటూ అపర్ణ ని కూడా కోప్పడి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఒంటరిగా కూర్చున్న కావ్య దగ్గరికి వచ్చిన కళ్యాణ్ నాకు మీ తెలివితేటలు మీద ఇన్నాళ్లు ఎన్నో అంచనాలు ఉండేవి కానీ ఇప్పుడు మీ తెలివితేటలు అంచనాలను మించిపోయాయి, ఎవరైనా భర్తకి ప్రేమని ఇస్తారు కానీ మీరు ఏకంగా బర్తనే ఇచ్చేశారు.
అసలు మీ జీవితం గురించి ఆలోచించారా అంటూ వదిన మీద తన సానుభూతిని వ్యక్తం చేస్తాడు. నా మంచి కోరుకునే వాళ్లలో మీరు ముందు ఉంటారని నాకు తెలుసు, మీరే నా జీవితం గురించి ఇంతగా ఆలోచిస్తుంటే నా జీవితం గురించి నేను ఎంత ఆలోచిస్తాను చెప్పండి, ఇంకా సమయం మిగిలే ఉంది కదా చూద్దాం ఏం జరుగుతుందో అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య. మరోవైపు పెళ్లికి అనుమతించి కావ్య సంతకం పెట్టడం పట్ల సంతోష పడుతూ ఉంటారు రాహుల్, రుద్రాణి, మాయ.
ఇప్పుడు బానే ఉంది కానీ పెళ్లయ్యాక నిజం తెలిస్తే రాజ్ వదిలేస్తాడేమో అని భయపడుతుంది మాయ. రాజ్ కి ఒక క్యారెక్టర్ ఉంది వాడు అన్యాయం చేయడు అని ఆమెకి భరోసా ఇస్తాడు రాహుల్. కావ్యకి ముసుగేసి పెళ్లి చేసింది నేనే కానీ పెళ్లి తర్వాత తోక జాడించింది, అందుకే నిన్ను రప్పించాను, రేపు నువ్వు తోక జాడిచ్చినా అదే పరిస్థితి వస్తుంది అని మాయని బెదిరిస్తుంది రుద్రాణి. అలా ఎప్పటికీ జరగనివ్వను, ఏం జరిగినా మీ పక్షానే ఉంటాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మాయ.

తర్వాత తల్లితో మాట్లాడుతూ కావ్య అంత సులువుగా సంతకం పెట్టేసింది అంటే దాని వెనుక ఏదో ఉద్దేశ్యము ఉండే ఉంటుంది అంటూ తన అనుమానాన్ని వ్యక్తం చేస్తాడు రాహుల్. మరోవైపు నేను చేసిన తప్పుకి మీ ఇద్దరి జీవితం బలైపోయేలాగా ఉంది ఇప్పుడే నిజం చెప్తాను అంటాడు సుభాష్. అందుకు అభ్యంతరం చెప్తారు రాజ్, కావ్య. మరి ఈ సమస్య నుంచి పరిష్కారం ఎలా అంటాడో సుభాష్.
అదే మీ కోడలికే తెలియాలి సమస్యని తీరుస్తాను అంటూ సమస్యని మరింత పెద్దది చేసేసింది అంటూ కావ్య ని కోపంగా చూస్తూ ఉంటాడు రాజ్. నేను ఈ పెళ్ళి జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నారా అంటుంది కావ్య. నీ నమ్మకమే నిజం అవ్వాలని కోరుకుంటున్నాను అంటూ వెళ్ళిపోతాడు సుభాష్. ఈ సమస్యని ఎలా పరిష్కరిస్తావు అంటాడు రాజ్, ఏదో ఒకటి చేస్తాను అంటుంది కావ్య.

మరోవైపు అప్పు నిజమైన మాయని వెతికే పనిలో పడుతుంది. ఒక షాప్ ఆవిడ మాయ అడ్రస్ ఇస్తుంది, ఆ అడ్రస్ వెతుక్కుంటూ వెళ్తుంది అప్పు. మరోవైపు ఇందిరా దేవికి కాఫీ తీసుకొని వస్తుంది కావ్య. నాకు తాగాలని లేదు ఇంతకుముందు నీ మీద చాలా ప్రేమాభిమానాలు ఉండేవి కానీ ఇప్పుడు నీ నిర్ణయాలు నువ్వే తీసుకునే అంత స్థాయికి వెళ్ళిపోయావు అంటూ కావ్య పై కోప్పడుతుంది ఇందిరా దేవి.
తరువాయి భాగంలో రుద్రాణి కావ్యతో మాట్లాడుతూ ఇప్పుడు ఈ రుద్రాణి అంటే ఏంటో అర్థమైందా, చాలెంజ్ చేసినంత ఈజీ కాదు నాతో గెలవడం అంటే అంటుంది. ఆ తర్వాత అప్పు ఫోన్ చేసి నీకు ఒక గుడ్ న్యూస్ అంటూ మాయ ఇల్లు దొరికింది అని చెప్తుంది.


Click it and Unblock the Notifications











