Brahmamudi May 3rd Episode : రుద్రాణిని ట్రాప్ చేసిన స్వప్న .. కావ్య వెనకాలే రాహుల్, రంగంలోకి యామిని

అర్థరాత్రి రాజ్ దగ్గరికి వచ్చిన యామిని.. అతనికి వెడ్డింగ్ కార్డ్ చూపిస్తుంది. అది చూసిన వెంటనే రాజ్ చాలా బాధపడతాడు. ఎలాగైనా కళావతి మనసులో ఏముందో కనుక్కుని ఈ పెళ్లి ఆపేయాలని అనుకుంటాడు. అటు రాజ్‌కి గతం గుర్తొచ్చేలా చేయడానికి కావ్యని ప్లాన్ చేయమని సలహా ఇస్తుంది అపర్ణ. మా ఫ్రెండ్ సందీప్ వెడ్డింగ్ యానివర్సరీ వుందని ఓ రిసార్ట్‌లో దానిని చేస్తున్నారని చెబుతుంది కావ్య. దీనిని ఉపయోగించుకుని ఆయనకి గతం గుర్తొచ్చేలా చేస్తానని అంటుంది.

రాజ్‌కి ఫోన్ ఎలా చేయాలో తెలియ టెన్షన్ పడుతుండగా రాజే కావ్యకి ఫోన్ చేస్తాడు. నేను మా ఫ్రెండ్స్‌తో గెట్ టూ గెదర్ అవుతున్నానని చెప్పడంతో అక్కడికి నేను కూడా వస్తానని అంటాడు రాజ్. రెండు రోజులు రిసార్ట్స్‌లో ఉంటామని, అందుకు కావాల్సినవి తీసుకుని రమ్మని రాజ్‌తో చెబుతుంది కావ్య. ఉదయాన్నే వెడ్డింగ్ కార్డ్స్ పంచాలని యామిని అనుకుంటూ ఉండగా రాజ్ లగేజ్ తీసుకుని రావడంతో ఆమె షాక్ అవుతుంది. మనం వెడ్డింగ్ కార్డ్స్ పంచాలని ముందే నీతో చెప్పాను కదా అని అంటుంది యామిని. నేను మా ఫ్రెండ్ వివాహ వార్షికోత్సవం కోసం వెళ్తున్నానని తన పరిస్ధితి అర్ధం చేసుకోమని అంటాడు రాజ్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక మే 3వ తేదీ ఎపిసోడ్‌ 712లో ఏం జరిగిందంటే?

Brahmamudi Serial May 3rd 2025 Episode 712 Here is Today s full story

రాజ్‌ని రిసార్ట్‌కి తీసుకెళ్లేందుకు గాను కావ్య లగేజ్ సర్దుకుని కిందకి వస్తుంది . ఆమెను చూసిన రుద్రాణి.. మొగుడు కనిపించకపోతే బాధపడాలి, చనిపోయాడని తెలిస్తే ఏడవాలి. కానీ ఏ ఇంట్లో మాత్రం మొత్తం రివర్స్‌లో ఉందని సెటైర్లు వేస్తుంది. కోడలు ఏ దిగులు లేకుండా ఫంక్షన్లు , పార్టీలు అంటూ తిరుగుతున్నా ఇంట్లో వాళ్లు ఈజీగా పర్మిషన్ ఇచ్చేస్తున్నారని నానా మాటలు అంటుంది రుద్రాణి. తనేదో వరల్డ్ కప్‌లో గోల్డ్ మెడల్ సాధించడానికి వెళ్తున్నట్లు అందరూ అంత సపోర్ట్ చేస్తారేంటీ అని మండిపడుతుంది. ఇప్పుడిప్పుడే తను ఈ బాధల నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తోందని చెబుతుంది ఇందిర.

ఈ విషయాలేవీ నువ్వు పట్టించుకోవద్దని, రెండ్రోజులు మీ ఫ్రెండ్స్‌తో సంతోషంగా గడిపిరా అని పంపిస్తుంది అపర్ణ. ఇంతలో కావ్యకి రాజ్ ఫోన్ చేయడంతో ఫోన్ కట్ చేస్తుంది కావ్య. దాంతో రాజ్‌కు డౌట్ వస్తుంది. కావ్య అందంగా రెడీ అయి వెళ్తుంటే నాకు డౌట్‌గా ఉందని రాహుల్‌తో అంటుంది రుద్రాణి. ఈరోజు ఎలాగైనా అది ఎక్కడికి వెళ్తుందో కనుక్కోవాలని తల్లీకొడుకులు అనుకుంటారు. ఇంతలో రాజ్ మరోసారి ఫోన్ చేసి కావ్యపై విరుచుకుపడతాడు. నేను బయల్దేరిపోయాను మీరు బయల్దేరారా లేదా? ఎక్కడి వరకు వచ్చారు? అని ప్రశ్నలు అడుగుతుంటాడు.

అక్కడుంది నా ఫ్రెండ్స్ వాళ్లేమీ బాధపడదరని అంటుంది కావ్య. నేను మీకోసం వెయిట్ చేస్తున్నానని.. నా కోసం త్వరగా రండి అని అంటాడు రాజ్. కావ్య బయల్దేరుతుండగా రుద్రాణి వచ్చి అనుమానంగా చూస్తుంది. నా ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకోవడానికి వెళ్తున్నానని కావ్య చెప్పడంతో .. నీకు పార్టీ కల్చర్ లేదు కదా అని అంటాడు రాహుల్. చీరలు కట్టుకున్న వాళ్లు ఛీర్స్ కొట్టకూడదని లేదు కదా అని అంటుంది కావ్య. మమ్మల్ని తప్పుదారి పట్టించకుండా నిజం చెప్పమని రుద్రాణి నిలదీస్తుంది. దుగ్గిరాల కుటుంబానికి కోడలిగా వచ్చాను కదా అని నాలో వెస్ట్రన్ కావ్యని దాచేసి లోకల్ కావ్యలా మేనేజ్ చేసుకుంటూ వచ్చానని అంటుంది. ఇప్పుడు అందరి కోసం కష్టపడి నా ఆనందాన్ని వదిలేసుకుంటున్నానని ఈ మధ్యే బాధపడ్డానని , అందుకే నా ఫ్రెండ్స్‌తో గెట్ టూ గెదర్ పార్టీ ఏర్పాటు చేసుకున్నానని చెబుతుంది.

కావ్య మాటలతో రుద్రాణి - రాహుల్‌లకు అనుమానం వస్తుంది. ఇది పార్టీల బ్యాచ్ కాదు.. వన భోజనాల బ్యాచ్ . అలాంటిది ఇది ఎంజాయ్ చేయడానికి వెళ్తుందంటే ఎడారిలో వ్యవసాయం చేయడానికి వెళ్లున్నట్లేనని అంటుంది రుద్రాణి. రాజ్ బతికే ఉన్నాడని చెబుతున్న కావ్య.. ఎక్కడ ఉన్నాడనేది మాత్రం చెప్పడం లేదని అంటుంది. అది ఎక్కడికి వెళ్తుందో మొత్తం డిటెయిల్స్ కనుక్కోమని కొడుక్కి చెబుతుంది. కావ్యతో కలిసి రాజ్ కారులో వెళ్తుంటారు.మీ ఇంటికొచ్చి మీ వాళ్లని పలకరిద్దామని అనుకున్నానని.. వద్దని ఎందుకన్నారని అడుగుతాడు రాజ్. ఎంతసేపు మా ఇంటికి వస్తాను అంటారు కానీ.. నా పరిస్థితి అర్ధం చేసుకోరా అని అడుగుతుంది కావ్య.

ఒక అబ్బాయితో కలిసి ఇలా ఫంక్షన్స్‌కి, రిసార్ట్స్‌కి వెళ్తున్నానంటే ఇంట్లో వాళ్లు ఏమనుకుంటారు అని అడుగుతుంది. కాళ్లు విరగ్గొట్టి ఇంట్లో కూర్చోబెడతారని చెబుతుంది కావ్య. మీరు నాతో వెళ్తున్నానని కాకుండా అబద్ధం చెప్పొచ్చారా అని రాజ్ అడగ్గా.. యామినికి మీరేమైనా నిజం చెప్పి వచ్చారా అని కౌంటర్ ఇస్తుంది కావ్య. ఆ మాటలతో ఏం మాట్లాడాలో తెలియక రాజ్ టెన్షన్ పడతాడు. కొంతమంది కోసం కొన్నిసార్లు అబద్దం ఆడినా పర్లేదని కావ్య చెప్పడంతో రాజ్ మురిసిపోతాడు. కావ్య ఎక్కడికి వెళ్లిందో తెలియక రుద్రాణి - రాహుల్‌లు అటు ఇటు తిరుగుతారు. కావ్య ఫ్రెండ్స్ నెంబర్లు నా దగ్గర లేవని ఎలా కనుక్కోవాలో తెలియడం లేదని అంటాడు రాహుల్. ఇంతలో స్వప్న వచ్చి వాళ్లకి పాపని ఇచ్చి వెళ్లిపోతుంది.

కావ్య ఎక్కడికి వెళ్లిందో తెలియక నేను టెన్షన్ పడుతుంటే నాకు అంటగట్టేసి వెళ్లిందని రుద్రాణి మండిపడుతుంది. నేను అందరినీ ఏడిపిస్తే నువ్వు నన్ను ఏడిపిస్తావా? అని మనవరాలిపై ఫైర్ అవుతుంది. కావ్య ఎక్కడికి వెళ్లిందో తెలుసుకోవడానికి దారి దొరికిందని స్వప్న మొబైల్ చూపిస్తాడు రాహుల్. ఇందాక పాపని తీసుకుంటూ కొట్టేశానని చెప్పి ఫోన్ ఓపెన్ చేసి ఓ నెంబర్‌కు కాల్ చేస్తాడు . ఆది ఓ అమ్మాయితో కావడంతో ఆమె భర్త ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. నీకు నా పెళ్లానికి అప్పటి నుంచి యవ్వారం సాగుతుందా అని మండిపడతాడు.

ఇంతలో కావ్య ఎక్కడికి వెళ్లిందో రాహుల్‌కి మెసేజ్ రావడంతో పాపని ధాన్యలక్ష్మీకి ఇచ్చి వారిద్దరూ బయల్దేరతారు. రాజ్ గతం మరిచిపోయాడని ఫ్రెండ్స్‌కి ముందే చెప్పడంతో వాళ్లు షాకవుతారు. కాలేజ్ రోజుల్లో రాజ్ ప్రిన్సిపల్ కంటే స్ట్రిక్ట్‌గా ఉండేవాడని వాడిపై ప్రతీకారం తీర్చుకుంటామని వార్నింగ్ ఇస్తారు. వీళ్లని నమ్మి బావగారిని వాళ్ల చేతిలో పెడితే ఏం చేస్తారోనని కళ్యాణ్‌తో చెప్పి బాధపడుతుంది అప్పూ. అన్నయ్య అంటే వాళ్లకి ప్రాణమని ఏం జరగదని అంటాడు కళ్యాణ్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X