Brahmamudi May 3rd episode: రెండు రోజుల్లో నువ్వేం తేలుస్తావు.. స్వప్నకు సవాల్ విసిరిన రుద్రాణి
అప్పుని అరెస్టు చేయించినందుకు దుగ్గిరాల ఇంటికి వచ్చి రచ్చ రచ్చ చేస్తుంది కనకం. అప్పుని,కళ్యాణ్ ని విడిపించి ఇంటికి తీసుకు వస్తారు కావ్య దంపతులు. అరెస్టు చేయించినందుకు అనామిక చెంప పగల కొడుతుంది స్వప్న. బాబు తల్లిని పట్టుకునే ప్రయత్నంలో రాజ్ ని ఫాలో అవుతుంది కావ్య. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక మే 3వ తేదీ ఎపిసోడ్ 400 లో ఏం జరిగిందంటే..
కావ్య తనని ఫాలో అయిందేమో అని కంగారు పడతాడు రాజ్. తనని ఫాలో కాలేదని నిర్ధారణకి వచ్చాక రిలాక్స్ ఫీల్ అవుతాడు. బాబుకి డైపర్ మార్చిన తర్వాత కావ్య మీరు ఎక్కడికి వెళ్లారు అని అడుగుతుంది. ఎక్కడికో దగ్గరికి వెళ్లాను అంటాడు రాజ్. మీరు ఎలాగో నిజం చెప్పరు, మీ ఫోన్ చూస్తే అయినా నిజం తెలుస్తుంది అని మనసులో అనుకుంటుంది కావ్య రాజ్ ని ఫోన్ ఇమ్మని అడుగుతుంది. నీ ఫోన్ ఉంది కదా అంటే చార్జింగ్ లేదని, రీఛార్జ్ లేదని అబద్ధాలు చెప్పి మొత్తానికి రాజ్ దగ్గర నుంచి ఫోన్ తీసుకొని బయటికి వస్తుంది.

ఆ ఫోన్లో ఒకే నెంబర్ కి నాలుగైదు సార్లు రాజ్ కమ్యూనికేట్ అవడం గమనిస్తుంది. ఆ నెంబర్ అప్పుకి చెప్పి ఈ నెంబర్ ఎవరిదో అడ్రస్ కొనుక్కో అంటుంది. వెనక్కి తిరిగి చూసేసరికి రాజ్ ఉంటాడు ఒక్కసారిగా షాక్ అవుతుంది కావ్య. నీ ఫోన్లో చార్జింగ్ లేదు అన్నావు ఎలా మాట్లాడావు, నాకు ఏదో తేడా కొడుతుంది అంటాడు రాజ్. అతనికి ఏవో తిక్క సమాధానాలు చెప్పి ఇంట్లో కి వెళ్ళిపోతుంది కావ్య.
మరోవైపు ఇంటి డాక్యుమెంట్స్ కోసం కబోర్డ్ అంతా వెతుకుతుంది స్వప్న. డాక్యుమెంట్స్ ఎక్కడ కనిపించకపోవడంతో ఆలోచనలో పడుతుంది, తరువాత తల్లికి ఫోన్ చేసి విషయం చెప్తుంది. నీ ఆస్తి లాక్కోవాలని చూస్తారా ఇప్పుడే వస్తున్నాను అంటూ స్వప్న చెప్పిన ప్లేస్ కి వెళ్తుంది కనకం. సేటు ఇంటి దగ్గర ఉన్న స్వప్న తల్లి రాకపోవడంతో ఆమెకి ఫోన్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసిన కనకం నీ వెనకే ఉన్నాను తిరిగి చూడు అంటుంది. భద్రకాళి గెటప్ లో ఉన్న తల్లిని చూసి షాక్ అవుతుంది స్వప్న.
కంగారు పడకు నేనే, మీ అమ్మని. అమ్మోరు గెటప్ లో వాడి అంతు తేలుస్తాను అంటూ లోపలికి వెళ్లి నిద్రపోతున్న సేటు మంచం మీదకి ఎక్కి వాడి పీక మీద త్రిశూలం పెట్టి స్వప్న ఆస్తి పత్రాల గురించి నిజం చెప్పు అంటుంది. భయపడి పోయిన సేటు పత్రాలు రాహుల్ తెచ్చి ఇచ్చాడు అని చెప్తాడు. స్వప్న దగ్గరికి వెళ్లి మర్యాదగా చేసిన తప్పు ఒప్పుకో క్షమించమని తన కలలో కనిపించి చెప్తాను అంటుంది కనకం. అలాగే అని భయంతో కళ్ళు మూసి తెరిచేసరికి అక్కడ కనకం కనిపించదు. జరిగిందంతా స్వప్నతో చెప్తుంది కనకం. మరోవైపు కావ్యకి ఫోన్ చేసిన అప్పు తో అడ్రస్ దొరికిందా అని అడుగుతుంది కావ్య.
ఆ అడ్రస్ తో నీకేం పని, ఇందాక అడిగినా కూడా చెప్పలేదు అంటుంది అప్పు. జరిగిందంతా చెప్తుంది కావ్య. నువ్వు ఒక దానివే వెళ్తే ఇబ్బంది పడతావు నేను కూడా నీకు తోడుగా వస్తాను అంటుంది అప్పు. వద్దు నీకేమైనా అయితే తట్టుకోలేను, నా సమస్య నేనే తీర్చుకుంటాను అంటుంది కావ్య. చిన్నప్పటినుంచి మా కోసం ఎంతో చేసావు ఇప్పుడు నువ్వు కష్టంలో ఉంటే వదిలేస్తానా.. నేను కూడా వస్తాను లేదంటే నీకు అడ్రస్ చెప్పను అంటుంది అప్పు.
సరే అంటుంది కావ్య. సరే లొకేషన్ షేర్ చేస్తాను అంటుంది అప్పు. రేపు మార్నింగ్ వెళ్దాం అంటుంది కావ్య. మరోవైపు కోటి రూపాయలు చేతికి వచ్చినందుకు ఆనందంగా డ్రింక్ చేస్తూ ఉంటారు తల్లీ కొడుకులు. అది చూసిన స్వప్న కోపంతో రగిలిపోతుంది. కానీ బయటపడకుండా వాళ్ల దగ్గరికి వెళ్లి నేను బాధలో ఉంటే మీరు ఆనందంగా పార్టీ చేసుకుంటారా అని అడుగుతుంది.
మేము కూడా బాధలోనే ఉన్నాము ఆ బాధ మర్చిపోవటానికి తాగుతున్నాము అంటుంది రుద్రాణి. నాక్కూడా తాగాలని ఉంది కానీ కడుపులో బిడ్డ ఉంది అందుకే తాగలేకపోతున్నాను. మంచి మ్యూజిక్ పెట్టు డాన్స్ చేస్తాము అంటుంది స్వప్న. కాసేపు మీరే కోడలు, నేను అత్తగారు అంటుంది స్వప్న. సరే అంటూ కోడలితో కలిసి డాన్స్ చేస్తుంది రుద్రాణి. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications










