Brahmamudi May 4th Episode: దుగ్గిరాల ఆస్తిపై రాజ్- కావ్యల మెలిక... రేఖకు షాకిచ్చిన ఇందూ

Photo Courtesy: JioHotstar

గుడిలో దేవుడికి దండం పెట్టుకుంటూ ఉండగా రేఖ కనిపించడంతో ఇందూ షాక్ అవుతుంది. ఆమెను తీసుకుని వెళ్తుండగా వెనుక నుంచి రాజ్ చూస్తూ బాధపడతాడు. డబ్బులు అందాయని లక్కీ చెప్పినా బాధగా కనిపిస్తాడు. నువ్వు ఇందూని ప్రేమించావా అని అడుగుతాడు లక్కీ. అలాంటిదేం లేదని మాట మారుస్తాడు రాజ్. అనంతరం సాహూ డబ్బుని పంపేసి, మిగిలిన డబ్బును తీసుకుని ఆసుపత్రికి వెళ్తాడు. అక్కడ బెడ్ మీద ఒకావిడ పడుకుని ఉండటంతో ఆమెను ఎలాగైనా కాపాడమని డాక్టర్లను అడుగుతాడు రాజ్. ఇందూని తీసుకొచ్చి నట్టింటిలో పడేస్తుంది రేఖ. నువ్వు అడిగినట్లు నీ మనవరాలిని ప్రాణాలతో తీసుకొచ్చా.. నేను అడిగినట్లు నా ఆస్తి నాకు కావాలి, ఈసారి ఏదైనా పొరపాటు జరిగితే ఊరుకోనని అపర్ఱకి వార్నింగ్ ఇస్తుంది రేఖ.

ఆసుపత్రిలో నుంచి వస్తున్న రాజ్ పీఏ శృతి.. రాజ్‌ను చూసి షాక్ అవుతుంది. వెంటనే అతనిని ఫాలో అవుతూ చలపతి ఇంటికి వస్తుంది. రాజ్ ఎవరు అని శృతి అడగ్గా.. మా పెద్దబ్బాయి అని చలపతి- లక్ష్మీలు చెబుతారు. మీరు అబద్ధం చెబుతున్నారు.. రాజ్ మా ఎండీకి మేనల్లుడు, దుగ్గిరాల కుటుంబానికి వారసుడు అని శృతి చెప్పడంతో చలపతి- లక్ష్మీలు షాక్ అవుతారు.ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక మే 4వ తేదీ ఎపిసోడ్ 1023లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial May 4th 2026 Episode 1023 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

మీ ఇంట్లో ఉన్న రాజ్.. దుగ్గిరాల కుటుంబానికి, స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కి వారసుడు. తను మా ఎండీ రాజ్ గారి అక్క కొడుకు, కోట్ల ఆస్తికి అధిపతి అని పీఏ శృతి చెప్పడంతో చలపతి- లక్ష్మీలు షాక్ అవుతారు. మీ కొడుకు, మా ఎండీ రాజ్ గారు అచ్చం ఒకేలా ఉంటారని ఫోన్‌లో ఫోటో చూపిస్తుంది శృతి. అది చూసిన చలపతి- లక్ష్మీ ఉలిక్కిపడతారు. రాజ్ ఎలా తప్పిపోయాడని చలపతి అడగ్గా.. ఆ కుటుంబం మొత్తం శ్రీశైలం వెళ్తుంటే వారి వెహికల్‌ పేలిపోయి అందరూ చనిపోయారు. నాకు తెలిసి బస్సులో నుంచి బాబు పడిపోయినట్లుగా ఉన్నాడు. ఆ దేవుడే తనని కాపాడి, మీకు దొరికేలా చేశాడని అంటుంది శృతి. తన గతం గురించి పిల్లాడికి తెలుసా? అని శృతి అడగ్గా... అతని కన్నవాళ్ల కోసం చాలా వెతికాం, మేమే కన్నవాళ్లమని అనుకుంటున్నాడు అని అంటాడు చలపతి.

తనకి నిజం చెప్పకుండా మీరు చాలా మంచిపని చేశారు.. తను బతికే ఉన్నాడని ఆ రేఖకి తెలిస్తే తన ప్రాణాలకే ప్రమాదమని శృతి చెప్పడంతో చలపతి- లక్ష్మీలు షాక్ అవుతారు. ఆ రేఖ వాళ్ల అమ్మే మా ఎండీ రాజ్ సార్ వాళ్ల ఫ్యామిలీని చంపించిందని కొంతమంది చెబుతూ ఉంటారు. ఆ రేఖ ఆస్తి కోసం ఎంత వరకైనా వెళ్తుంది. రాజ్ బతికే ఉన్నాడని తెలిస్తే చాలా ప్రమాదం. కొత్తగా ఆస్తికి వారసుడు వచ్చాడని తన ప్రాణాలు తీయడానికైనా సిద్ధపడుతుంది. దుగ్గిరాల వంశానికి వారసుడు ఉన్నాడు.. మీరు ఈ విషయం ఎవరికి చెప్పకండి, తను మీ కన్నకొడుకని ఎలా అనుకున్నారో అలాగే అనుకోండి. మీ మౌనమే రాజ్‌కి శ్రీరామరక్ష అని చెబుతుంది శృతి.

నా డబ్బులు నాకివ్వు అంటూ రాజ్‌ని నిలదీస్తుంది ఐశ్వర్య. తన వల్లే కదా? మనం సాహూ నుంచి తప్పించుకుంది, ఆ డబ్బులు తనకు ఇవ్వమని చెబుతాడు లక్కీ. నా దగ్గర డబ్బులు లేవు, నేనే ఖర్చు పెట్టేసుకున్నానని రాజ్ చెప్పడంతో ఐశ్వర్య షాక్ అవుతుంది. మీరిద్దరూ కలిసి నన్ను మోసం చేయాలని అనుకుంటున్నారా? నా డబ్బులు నాకు ఇవ్వకపోతే పోలీస్ స్టేషన్‌లో కంప్లయంట్ చేస్తానని చెబుతుంది ఐశ్వర్య. నువ్వు కంప్లయంట్ చేయడానికి మనం చేసింది బిజినెస్ కాదు.. కిడ్నాప్ అని రాజ్ హెచ్చరిస్తాడు. ఈ విషయం బయటికొస్తే నా కన్నా నీకే ఎక్కువ డేంజర్ అని అంటాడు రాజ్. అవసరానికి ఖర్చు పెట్టేశాను.. ఆ డబ్బు ఇచ్చేయమంటే ఎక్కడి నుంచి తీసుకురావాలని మండిపడతాడు

నిన్ను మోసం చేయాలనే ఉద్దేశం నాకు లేదు.. నీ డబ్బులు నీకు ఖచ్చితంగా ఇస్తాను. కాకపోతే నాకు కొంచెం టైం ఇవ్వు, అంతేకానీ ఇప్పుడే కావాలని గొడవ చేస్తే మాత్రం నీ డబ్బులు నీకు రావని చెబుతాడు రాజ్. మిమ్మల్ని నమ్మినందుకు నన్ను మోసం చేస్తారా? మీ దగ్గరి నుంచి డబ్బులు ఎలా తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది ఐశ్వర్య. ఆ డబ్బులు ఏం చేశావు? ఐశ్వర్యని సెట్ చేసుకుందామనుకుంటే మొత్తం పాడు చేశావని రాజ్‌పై కోప్పడతాడు లక్కీ.

ఇందూ చేత వేలిముద్రలు తీసుకుని, ఆస్తిని తన పేరు మీదకి రాయించుకోవడానికి లాయర్లను పిలిపిస్తుంది రేఖ. ఈసారి ఎలాంటి ఇబ్బంది లేదు కదా? అని లాయర్లు అడగ్గా.. ఈసారి ఏ ప్రాబ్లమ్ రాదని హామీ ఇస్తుంది రేఖ. ఇందూని పిలిచి ఆస్తి పేపర్ల మీద వేలిముద్రలు వేయమని చెబుతుంది రేఖ. ఇందూ వేలిముద్రలు వేయడానికి సిద్దమవుతుండగా అపర్ణ వచ్చి ఆగమంటుంది. బెదిరింపులకు భయపడితే బతకలేవని, ఈ ఆస్తిని ఇలాంటి వాళ్ల చేతిలో పెట్టొద్దని బతిమలాడుతుంది. కానీ ఇందూ మాత్రం వేలిముద్రలు వేయడానికి ఒప్పుకుంటుంది. దాంతో సుభాష్- అపర్ణలు బాధపడుతూ వెళ్లిపోతారు.

ఇందూ వేలిముద్రలు వేయడంతో రేఖ, భూషణ్, భ్రమరాంబలు సంతోషిస్తారు. ఇక ఇందూ పేరు మీదున్న ఆస్తి మొత్తం మీకు వచ్చినట్లేనని లాయర్లు చెప్పడంతో నేను బోల్డెంత బంగారం చేయించుకుంటానని అంటుంది భ్రమరాంబ. అప్పుల వాళ్లు ప్రాణాలు తోడేస్తున్నారు.. నాకు కొంచెం సెటిల్ చేయమని అడుగుతాడు భూషణ్. నేను కొత్త కారు కొనుక్కుంటానని శేషం చెబుతాడు. ఈ టైంలోనే ఆంటీని 10 లక్షలు అడగాలని ఐశ్వర్య కూడా అనుకుంటుంది. అయితే ఆస్తి మొత్తం మన పేరు మీదకి రావడానికి ముందు మనం కంపెనీ లీగల్ అడ్వైజర్స్‌ని కలవాలని చెబుతుంది రేఖ. అందరూ కలిసి అక్కడికి వెళ్తారు.

నువ్వు ఏం చేశావో? నీకైనా తెలుసా? వేలిముద్రలు ఎందుకు వేశావని ఇందూపై మండిపడుతుంది అపర్ణ. ఆస్తి నీ పేరు మీదున్నప్పుడే మనల్ని రేఖ పురుగుల్లా చూసింది.. ఇప్పుడు నిన్ను బానిసలా ఆడిస్తుందని హచ్చరిస్తుంది. నువ్వు దుగ్గిరాల కుటుంబానికి వారసురాలివి, మా మనవరాలు పనిమనిషిలా ఉండటం నేను చూడలేనని అంటాడు సుభాష్. నువ్వు చేసింది తప్పని స్వాతి కూడా ఇందూ దగ్గర బాధపడుతుంది. నేను వేలిముద్ర వేసినంత మాత్రాన్న ఆస్తి.. ఆ రేఖ ఆంటికి దక్కదని ఇందూ చెప్పడంతో అంతా షాక్ అవుతారు.

ఆస్తి పేపర్లు మొత్తం చూసిన లాయర్.. ఆస్తి మీ పేరు మీదకి రాదని చెబుతాడు లాయర్. ఆ మాటలు విన్న రేఖ, భూషణ్‌లు షాక్ అవుతారు. డాక్యుమెంట్స్ ఒకటి రెండు సార్లు చెక్ చేశామని చెబుతాడు భూషణ్. కోర్టు ఈ విషయాన్ని ఒప్పుకోదని లాయర్ చెబుతాడు. ఇందూ చెప్పినా, నా కళ్లముందే మరో డాక్యుమెంట్ మీద సంతకం పెట్టినా ఆ సంతకం చెల్లదు, ఆస్తి మీకు రాదని లాయర్ చెప్పడంతో రేఖ, భూషణ్‌లు షాక్ అవుతారు. ఇందూకి పెళ్లి కాలేదు కాబట్టి.. ఆమె సంతకం చెల్లదని చెబుతాడు లాయర్. కొన్ని సంవత్సరాల క్రితం రాజ్, కావ్యలు చనిపోయే ముందు వీలునామా రాయించారని అసలు విషయం చెబుతాడు లాయర్.

మా ఆస్తి మొత్తం కావ్య పేరు మీద నుంచి నాకు పుట్టిన కూతురి మీదకు వస్తుంది. అలా నేరుగా కాకుండా తనకు పెళ్లయిన తర్వాతే ఆస్తి మొత్తం తనకి వచ్చేలా వీలునామా రాయాలని అనుకుంటున్నామని చెబుతాడు రాజ్. కొన్నిరోజులుగా మా జీవితంలో చాలా ఇన్సిడెంట్ జరుగుతున్నాయి.. ఏ క్షణంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియడం లేదు. రేపు అనేరోజు మేము ఉంటామో లేదో కూడా తెలియదు. ఈ ట్రస్ట్ ఇలాగే కొనసాగాలి.. ఈ ట్రస్ట్ ద్వారా ఎన్నో జీవితాలు నిలబడతాయి. ఈ ట్రస్ట్ నీడలో ఎన్నో కుటుంబాలు బతుకుతున్నాయి. కానీ చిన్న వయసులోనే ఈ ఆస్తి తన పేరు మీద ఉంటే తనకు కూడా ప్రమాదం రావొచ్చని అంటాడు రాజ్. పెళ్లి జరగాలంటే ఖచ్చితంగా 18 ఏళ్లు నిండి ఉండాలి.. అప్పుడు తనకు లోకం తీరు తెలిసి ఉంటుంది, పెళ్లయిన తర్వాత తనకు తోడు దొరుకుతుందని చెబుతాడు రాజ్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X