Brahmamudi May 5th Episode : రాజ్‌లో మొదలైన మార్పు .. కావ్య ప్లాన్ సక్సెస్, రిసార్ట్‌లో దిగిన యామిని
రిసార్ట్‌లో అన్ని ఏర్పాట్లు చేశారా? లేదా అని కళ్యాణ్‌ని అడుగుతుంది కావ్య. మొత్తం రెడీ చేశామని మీరు అన్నయ్యని తీసుకుని వచ్చేయమని చెబుతాడు కళ్యాన్. బ్యాగ్‌తో రిసార్ట్‌కి బయల్దేరిన కావ్యని చూసిన రుద్రాణి .. మొగుడు కనిపించడం లేదనే బాధ నీలో అస్సలు లేదని నానామాటలు అంటుంది. ఇలాంటి పరిస్ధితుల్లో ఏ భార్య అయినా పార్టీలు, ఫంక్షన్‌లు అంటూ తిరుగుతారా అని మండిపడుతుంది రుద్రాణి. దీంతో ఇంట్లో వాళ్లంతా రుద్రాణికి చీవాట్లు పెట్టి కావ్యకి అండగా నిలబడతారు.
నువ్వు నిజంగానే రిసార్ట్‌కి వెళ్తున్నావా? నిజం చెప్పమని కావ్యని నిలదీస్తుంది రుద్రాణి. దుగ్గిరాల కుటుంబానికి కోడలిగా అడుగుపెట్టడంతో ఇన్నాళ్లు వెస్ట్రన్ కావ్యని దాచేశానని నాలుగు రోజులు మా ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్ చేస్తానని చెప్పి వెళ్లిపోతుంది కావ్య. ఆమె మాటలు అనుమానాస్పదంగా ఉండటంతో కావ్య ఎక్కడికి వెళ్తుందో కనుక్కోమని రాహుల్‌కి రుద్రాణి చెబుతుంది. స్వప్న ఫోన్ కొట్టేసిన రాహుల్ ఏదో ప్లాన్ వేసి రిసార్ట్ అడ్రస్ సంపాదిస్తాడు. ఇంతలో కారులో కావ్య- రాజ్‌లు రిసార్ట్‌కు బయల్దేరతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక మే 5వ తేదీ ఎపిసోడ్ 713లో ఏం జరిగిందంటే?

రాజ్‌కి గతం గుర్తుచేయడానికి నేను ఏమైనా చేస్తానని శ్వేత అనే అమ్మాయి వచ్చి కళ్యాణ్‌తో చెబుతుంది. మీరు కాలేజ్‌లో అన్నయ్యకి ఎంత క్లోజో తెలుసని నన్నే రాజ్‌లా అనుకుని ఆ క్షణాలన్ని గుర్తుచేయాలని చెబుతాడు కళ్యాణ్. అన్నయ్య నాలో తనను చూసుకుని గతం గుర్తుచేసుకుంటాడని ఆశపడుతున్నట్లు చెబుతాడు. ఇంతలో కావ్యని తీసుకుని రాజ్ కారులో అక్కడికొస్తాడు. కళ్యాణ్ - అప్పూలని రాజ్‌కు పరిచయం చేస్తుంది కావ్య. వాళ్లిద్దరూ భార్యాభర్తలు అని చెప్పడంతో మీకు ఇంకా పెళ్లి కాలేదు, మరి మీ చెల్లి పెళ్లి చేసుకోవడం ఏంటని రాజ్ ప్రశ్నిస్తాడు. మేం తొందరపడటంతో త్వరగా పెళ్లి చేసుకున్నామని చెబుతాడు రాజ్. అప్పు నిక్ నేమ్ పొట్టి అన్నయ్య అని కళ్యాణ్ చెప్పడంతో నాకు సొంత బ్రదర్స్ ఎవరూ లేరు , నిన్ను నా తమ్ముడినే అనుకుంటానని అంటాడు రాజ్. దాంతో రాజ్‌ని హగ్ చేసుకుంటాడు కళ్యాణ్.
కళ్యాణ్ కంటతడి పెట్టడంతో ఎందుకంత ఎమోషనల్ అవుతున్నావని అడుగుతాడు రాజ్. నేను మా అన్నయ్యని బాగా మిస్ అవుతున్నానని కళ్యాణ్ చెబుతాడు. వాళ్ల అన్నయ్య గుడికి వెళ్లి, ఇంకా తిరిగి రాలేదని చెబుతుంది కావ్య. గుడికి వెళ్లి రెండు సంవత్సరాలు అయ్యిందని అనడంతో.. దీనిని గుడికి వెళ్లడం అనరని, ఇల్లు వదిలి వెళ్లిపోవడం అంటారని చెబుతాడు రాజ్. ఏదో ఒకరోజు వస్తాడని మేం ఆశపడుతున్నామని అప్పూ అంటుంది. తను తప్పకుండా తిరిగొస్తాడని , ఆయన జ్ఞాపకాలతో హ్యాపీగా ఉండమని చెబుతాడు రాజ్.
ఇంతలో శ్వేత వచ్చి రాజ్‌కి హాయ్ చెబుతుంది. మీ పెద్ద చెల్లెలు నాకు చేయి ఊపిందని రాజ్ చెప్పడంతో తను వచ్చింది మీకోసం కాదు కళ్యాణ్ కోసమని అంటుంది కావ్య. ఆమె కళ్యాణ్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు. నన్ను లోపల వెయిట్ చేయమని ఇక్కడేం చేస్తున్నావని శ్వేత ప్రశ్నిస్తుంది. ఆమె రావడం చూసిన అప్పు నువ్వు ఇక్కడికెందుకు వచ్చావని మండిపడుతుంది. ఏం జరిగింది? ఎందుకు మీ పొట్టి ఎగిరెగిరి పడుతుందని అడుగుతాడు రాజ్. తను నా ఫ్రెండ్ ఆమెతో నేను మాట్లాడటం అప్పూకి ఇష్టం లేదని చెబుతాడు కళ్యాణ్. ఓన్లీ ఫ్రెండ్ కాదు .. గర్ల్ ఫ్రెండ్ అని మండిపడుతుంది అప్పూ.
చిన్నప్పటి నుంచి మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అని .. ఆ క్లోజ్‌నెస్‌తోనే తనకు తన హజ్బెండ్ నుంచి ప్రాబ్లమ్ ఉందని తెలిసి నేను హెల్ప్ చేశానని.. నా ప్లేస్ నువ్వుంటే ఏం చేస్తావని ప్రశ్నిస్తాడు కళ్యాణ్. ఇదంతా వింటుంటే నాకు ఎక్కడో జరిగినట్లుగా అనిపిస్తోందని రాజ్ చెప్పడంతో కావ్య, అప్పూ, కళ్యాణ్‌లు సంతోషిస్తారు. మా పవిత్రమైన స్నేహాన్ని అలా అనుమానించడం తప్పు కదా రామ్ అని శ్వేత అనడంతో .. నా పేరు నీకెలా తెలుసని అడుగుతాడు రాజ్. నేనే చెప్పానని కావ్య కవర్ చేస్తుంది. శ్వేతను చూస్తుంటే మీకు నాకు ఎక్కడో? ఏదో కనెక్షన్ ఉన్నట్లుగా అనిపిస్తోందని చెబుతాడు రాజ్. ఆ కనెక్షన్ ఏంటో చెప్పమని కావ్య అడుగుతుంది.
రిసార్ట్ లోపలికి తీసుకెళ్లిన కళ్యాణ్.. నువ్వు నేను ఆ రూమ్‌లో, అన్నయ్య వదిన ఆ రూమ్‌లో ఉంటారని చెబుతాడు. ఆ మాటలతో రాజ్ షాక్ అవుతాడు. నీకు నాకు పెళ్లయ్యంది.. కానీ వాళ్లిద్దరూ ఫ్రెండ్స్ కదా అని మండిపడుతుంది అప్పూ. అయితే నా సింగిల్ బెడ్ ఎక్కడో చెప్పండి అక్కడికే వెళ్లి పడుకుంటానని అంటాడు రాజ్. వదిన, అప్పూ ఓ రూమ్‌లో ఉంటారని.. మనిద్దరం ఓ రూమ్‌లో ఉందామని చెబుతాడు కళ్యాణ్. ఇంతలో రిసార్ట్‌ను వెతుక్కుంటూ యామిని అక్కడికి వస్తుంది. రాజ్ నా కళ్లే కప్పి నీ దగ్గరికి తోక ఊపుకుంటే వచ్చేలా చేసుకున్నావని, పర్మినెంట్‌గా నీ దగ్గరే ఉంటాడని అనుకోవద్దని అనుకుంటుంది. ఈ యామినితో పెట్టుకుంటే ఫలితం ఎలా ఉంటుందో ఈరోజు నీకు రుచి చూపిస్తానని రిసార్ట్‌లోకి వెళ్తుంది.
కావ్య ఒంటరిగా ఉండగా శృతితో డిజైన్లు తెప్పిస్తుంది అప్పూ. ఈ డిజైన్లు చూపించి రాజ్‌కు గతం గుర్తుచేయబోతున్నారు కదా అని అంటుంది. సార్‌కి గతం గుర్తొచ్చి ఆఫీస్‌కి వస్తే నా పరిస్ధితి ఏంటోనని భయమెస్తోందని చెబుతుంది శృతి. ఆ మాటలతో కావ్య రగిలిపోతుంది. మా ఆయనకు గతం గుర్తుచేయాలని మా ఫ్యామిలీ అంతా ఇంత కష్టపడుతుంటే నీకు మాత్రం వద్దా అని మండిపడుతుంది. నీకు నెల రోజులు జీతం కట్ చేస్తున్నా అంటూ వార్నింగ్ ఇస్తుంది. రూమ్‌లో వాటర్ రావడం లేదని కళ్యాణ్ .. బావని మన రూమ్‌లోకి పంపిస్తాడని కావ్యతో చెబుతుంది అప్పూ.
కళావతి ఏం చేస్తుందోనని వాళ్ల రూమ్‌లోకి తొంగిచూస్తాడు రాజ్. అది చూసిన కళ్యాణ్ నవ్వుకుంటూ రాజ్‌ని ఆటపట్టిస్తాడు. నువ్వు స్నానం చేయడానికి వెళ్లావు కదా? ఐదు నిమిషాలకే బయటికి వచ్చేశావని అడుగుతాడు రాజ్. లోపల వాటర్ రావడం లేదని నువ్వు అప్పూ వాళ్ల రూమ్‌లో స్నానం చేయమని కళ్యాణ్ చెప్పడంతో రాజ్ సంబరపడిపోతాడు. రాజ్ టవల్ కట్టుకుని రాగా.. కావ్య లోపల సిగ్గుపడుతూ కనిపిస్తుంది. మీరు వస్తారనే ఎదురుచూస్తున్నా.. మీ రూమ్‌కి వాటర్ రాకుండా చేసింది నేనే అని చెబుతుంది కావ్య. రోజులో 48 గంటలు ఉంటే బాగుండు అని ఈ మనసు మీ గురించే ఆలోచిస్తూ ఉంటుందని చెబుతుది కావ్య. దాంతో రాజ్ సిగ్గుపడుతుంటాడు.
ముందు మీ మనసులో ఉన్నది చెప్పమని కావ్య అడగ్గా.. ఈ మనసు ఎప్పుడో మీ మనసును కోరుకుందని, మీ చేయి పట్టుకుని మీతో ఏడాడుగులు వేయమంటోందని చెబుతాడు రాజ్. మీతో ఇలాగే నూరేళ్లు ఉండిపోమని చెబుతుందని అంటాడు. మరి మీ మరదలు యామిని సంగతి ఏంటని కావ్య ప్రశ్నించడంతో తను నన్ను బావ.. బావ అంటుందే కానీ ఏరోజు నేను దాని బావనన్న ఫీలింగే రాలేదని చెబుతాడు రాజ్. అసలు మా బంధమే అబద్ధంలా ఉందని అంటాడు. మన బంధం మాత్రం అందమైన కావ్యంలా ఉంటుందని సిగ్గుపడుతూ కళ్లు తెరిచి కలవరిస్తుంటాడు రాజ్. స్నానం చేద్దామని టవల్ తీస్తుండగా కావ్య రావడంతో టెన్షన్ పడతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











