Brahmamudi May 5th Episode: కొడుకుతో ఇందూ పెళ్లికి రేఖ స్కెచ్.. భ్రమరాంబ చేతిలో చిప్ప

Photo Courtesy: JioHotstar

ఈ ఇంట్లో మీ అబ్బాయిగా ఉన్న రాజ్.. దుగ్గిరాల కుటుంబానికి, స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కి వారసుడని చలపతి- లక్ష్మీలకు చెబుతుంది పీఏ శృతి. కొన్నేళ్ల క్రితం దుగ్గిరాల కుటుంబం మొత్తం శ్రీశైలం వెళ్తుండగా వ్యాన్ పేలిపోయి అందరూ చనిపోయారు. కానీ ఈ పిల్లాడు మాత్రం వ్యాన్‌లో నుంచి కిందపడిపోయినట్లుగా ఉన్నాడు. ఇతను బతికున్నాడని ఆ రేఖకి తెలిస్తే రాజ్‌ని చంపేస్తుంది. అందుకే ఈ నిజం ఎవ్వరికీ తెలియనివ్వొద్దని, రాజ్‌ని జాగ్రత్తగా కాపాడమని చెప్పి వెళ్లిపోతుంది పీఏ శృతి.

నా డబ్బులు నాకు ఇవ్వాలంటూ రాజ్ దగ్గర ఐశ్వర్య గొడవ చేస్తుంది. నేను వాటిని నా పర్సనల్ ఖర్చులకు వాడుకున్నాను, త్వరలోనే ఇస్తానని చెబుతాడు రాజ్. ఇందూతో రేఖ ఆస్తి పేపర్ల మీద వేలిముద్రలు వేయించడంతో మనవరాలిపై అపర్ణ మండిపడుతుంది. ఆస్తి ఆ రేఖ పేరు మీదకి రాలేదు, ఇంకా నా పేరు మీదే ఉందని చెబుతుంది ఇందూ. ఆస్తి పేపర్లు మొత్తం చూసిన లాయర్ ఆస్తి మీ పేరు మీదకి రాదని చెప్పడంతో రేఖ, భూషణ్‌లు షాక్ అవుతారు. ఇందూకి పెళ్లయిన తర్వాతే ఆస్తి తన పేరు మీదకి వచ్చేలా రాజ్- కావ్యలు వీలునామా రాయించారని రాజ్ చెప్పడంతో రేఖ షాక్ అవుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక మే 5వ తేదీ ఎపిసోడ్ 1024లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial May 5th 2026 Episode 1024 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

ఇందూ చేతికి ఆస్తి రావడానికి సంబందించి రాజ్- కావ్యలు గతంలో రాయించిన వీలునామాను చూపిస్తాడు లాయర్. అదంతా చూసిన రేఖ షాక్ అవుతుంది. ఈ ఆస్తికి వారసురాలు ఇందూనే అయినప్పటికీ ఆస్తి మీద తనకి ఏ అధికారం లేదా అని అడుగుతుంది రేఖ. ఈ వీలునామా ప్రకారం ఇందూ పెళ్లి చేసుకోవాలి, వాళ్లిద్దరూ సంతోషంగా ఉండాలి. వాళ్లిద్దరూ కంపెనీ పనులు చూసుకోవాలి, ఆ తర్వాతే ఆస్తి మీద తనకి పూర్తి అధికారం వస్తుంది. ఆ వెంటనే వాళ్ల ఇష్టప్రకారం ఎవరికైనా సరే ఆస్తిని ట్రాన్స్‌ఫర్ చేయొచ్చని చెబుతాడు లాయర్. అలా జరగడానికి వీల్లేదని రేఖ చెబుతుంది. ఆస్తిని రాయించిన వారే చనిపోయారు. ఇంకా వీలునామాతో పనేముందని అంటాడు భూషణ్.

ఒక్కసారి వీలునామా రాస్తే దానిని మార్చాలంటే రాసినవాళ్లే మార్చాలి. వాళ్లిద్దరూ ఇప్పుడు బతికిలేరు కదా? ఇందూ పెళ్లి చేసుకుని తన భర్తతో కంపెనీ బాధ్యతలు తీసుకున్న తర్వాతే ఈ ఆస్తి మీద తనకి హక్కు వస్తుంది, అప్పటి వరకు ఈ ఆస్తి పేపర్లు చిత్తు కాగితాలతో సమానమని చెప్పి చించేస్తాడు లాయర్. నాకు పెళ్లయ్యే వరకు ఈ ఆస్తి మీద ఎటువంటి అధికారం లేదు. నేను వేసిన వేలిముద్ర దేనికీ పనికిరాదని చెబుతుంది అపర్ణ, సుభాష్‌లకి చెబుతుంది ఇందూ. వాళ్లు మిమ్మల్ని ఏం చేస్తారోనని భయపడిపోయా.. నాకు ఆస్తి కన్నా మీరే ముఖ్యమని అనుకున్నా. మా అమ్మ పుస్తకం చదివిన తర్వాతే నాకు ధైర్యం వచ్చింది. నాకు మీరు, ఆస్తి రెండూ ముఖ్యమని అనిపించింది.

మా అమ్మనాన్న ఈ లోకంలో లేకపోయినా ఇలాంటి పరిస్ధితి వస్తే ఎదుర్కోవాలని వాళ్లిద్దరూ ముందుచూపుతో ఆ వీలునామా రాశారని చెబుతుంది ఇందూ. మా అమ్మానాన్న కోరుకున్నట్లుగానే ఎలాంటి పరిస్థితి వచ్చినా ధైర్యంగా పోరాడతా.. ఆస్తిలో చిల్లిగవ్వ కూడా రేఖకి దక్కనివ్వనని తేల్చేస్తుంది ఇందూ. నిన్ను చూస్తుంటే మీ అమ్మని చూస్తున్నట్లే ఉందని అంటాడు సుభాష్. మీ అమ్మానాన్నలు బతికున్నప్పుడు ఈ ఇల్లు కళకళలాడుతూ ఉండేది. దుగ్గిరాల వంశానికి చాలా పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టారు, పిల్లా పాపలతో అంతా బాగుంది అనుకున్నప్పుడు వాళ్లు యాక్సిడెంట్‌లో దూరమయ్యారు. మన జీవితాలలో చీకట్లు కమ్ముకున్నాయి. మన ఇంట్లో మనమే ఒక మూలన పడి బతుకుతున్నామని బాధపడుతుంది అపర్ణ.

వీలునామా విషయం నీకెలా తెలుసని స్వాతి అడగ్గా.. నిన్న రాత్రి సత్యదేవ్ గారు ఫోన్ చేశారని చెబుతుంది ఇందూ. నా పేరు సత్యదేవ్.. మీ కంపెనీకి లీగల్ అడ్వైజర్‌ని అని చెబుతాడు లాయర్. మీ ఆస్తి మొత్తం రేఖ గారి పేరు మీదకి మార్చాలని చూస్తున్నారని నాకు తెలిసింది. మీ అమ్మానాన్న నీ పేరు మీద వీలునామా రాశారని జరిగింది చెబుతాడు లాయర్. నాకు ఆస్తిని ఎలా కాపాడుకోవాలో తెలియడం లేదు, చాలా పెద్ద హెల్ప్ చేశారని చెబుతుంది. ఇప్పుడు నిజం తెలిసి వాళ్లు తలపట్టుకుని ఏడుస్తూ ఉంటారని సెటైర్లు వేస్తుంది స్వాతి.

లాయర్ చెప్పిన మాటలు విన్న రేఖ, భూషణ్‌లు ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో శేషం వచ్చి వాళ్ల నెత్తిన గుడ్డలు కప్పుతాడు. ఎప్పుడో చచ్చిపోయిన ఇందూ అమ్మానాన్నలే తనకి శ్రీరామరక్షగా నిలబడతారని ఎవ్వరూ ఊహించలేకపోయారు. రాజ్- కావ్యలు తెలివైన వాళ్లు.. వాళ్ల ముందుచూపు, ముందుజాగ్రత్తగా సెల్యూట్ అంటాడు శేషం. అంతా సగం సగం తెలుసుకుని మమ్మల్ని ముంచేశావని రేఖపై మండిపడుతుంది భ్రమరాంబ. నిజానిజాలు తెలియకుండా రంగంలోకి దిగడం మనదే తప్పు.. అలాగని డ్రాప్ అవుతామా? అంత సులువుగా ఈ ఆస్తిని ఎలా వదిలేస్తానని అంటుంది రేఖ. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో నాకు బాగా తెలుసని చెప్పి తన కొడుకు మదన్‌ని పిలిపిస్తుంది. చేజారిపోతుందనుకున్న ఈ ఆస్తిని, వాడిని అడ్డం పెట్టుకుని ఎలా దక్కించుకుంటానో మీరే చూస్తారని అంటుంది రేఖ.

పడుకుని ఉన్న రాజ్‌ని చూసి లక్ష్మీ- చలపతిలు బాధపడతారు. పొట్ట నింపడం కోసం చాలా కష్టపడుతున్నాడని రాజ్‌ని చూసి బాధపడతారు. బిజినెస్ అనేది వీడి రక్తంలోనే ఉందని ఇప్పుడే అర్ధమైందని చలపతి అంటాడు. మనం వీడికి గతం గురించి చెప్పకపోవడమే మంచిదైంది, మనం వీడికి కల గురించి చెబితే ఏం లేదని చెప్పమని భార్యకు చెబుతాడు. నిజం చెబితే వీడు మనల్ని వదిలిపెట్టి వెళ్లిపోతాడని భయపడుతున్నారా అని అడుగుతుంది లక్ష్మీ. వీడు దుగ్గిరాల ఇంటికి వారసుడని తేలిస్తే ఊరుకుంటాడా? ఆ రేఖకి ఎదురుతిరుగుతాడు. అలాంటిది వీడిని ప్రాణాలతో ఉండనివ్వదని చెబుతాడు చలపతి. నాకు వీడు, వెంకీ ఇద్దరూ ఒక్కటేనని చెబుతుంది లక్ష్మీ. శ్రీశైలంలో జరిగిన విషయం ఇప్పుడే మరిచిపోదామని అనుకుంటారు.

ఉదయాన్నే కొడుకు మదన్ రావడంతో ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఆస్తి ఇందూ పేరు మీదుంది. ఆ ఆస్తిని మనం లాక్కోవాలంటే ఇందూ పెళ్లి చేసుకోవాలని చెబుతాడు. అయితే ఎవరో ఒక తింగరోడిని చూసి ఇందూకి కట్టబెట్టండని అంటాడు మదన్. వేరే వాళ్లతో ఇందూ పెళ్లి జరిగితే ఆస్తిని మనకు రాకుండా అడ్డుపడతాడు. అందుకే నువ్వే ఇందూని పెళ్లి చేసుకోవాలని చెబుతుంది. ఆ మాట వినగానే అంతా షాక్ అవుతారు. అదంటేనే నాకు నచ్చదు, ఏడుపు ముఖంతో కనిపిస్తుంది. దానిని తీసుకుని బయటికెళ్తే నా ఫ్రెండ్స్ అంతా నవ్వుతారని మదన్ పెళ్లికి ఒప్పుకోడు. ఆస్తి మన చేతికి వచ్చిన తర్వాత ఇందూకి నీకు విడాకులు ఇప్పిస్తానని చెబుతుంది రేఖ.

మదన్‌కి నా కూతురిని ఇచ్చి పెళ్లి చేద్దామని చిన్నప్పటి నుంచి అనుకుంటున్నాం కదా అని రేఖతో అంటుంది భ్రమరాంబ. నీ దగ్గర ఏముందని నీ కూతురిని నా ఇంటి కోడలిగా చేసుకుంటానని అనుకుంటున్నావా? నీ కూతురు మదన్ స్థాయికి సరితూగగలదా అని తేల్చేస్తుంది రేఖ. ఆస్తిని నువ్వు ఒక్కదానివే కొట్టేద్దామని అనుకుంటున్నావా? అది జరగనివ్వనని అనుకుంటుంది భ్రమరాంబ. రాకేష్ ఫోన్ చేయడంతో ఐశ్వర్య టెన్షన్ పడుతుంది. రాజ్ మోసం చేస్తాడని నేను అనుకోలేదు.. వాడు నా డబ్బులు నాకు ఇచ్చేస్తే రాకేష్ గాడితో నాకు ప్రాబ్లమ్ ఉండేది కాదని అనుకుంటుంది. ఇంతలో రాకేష్ కోపంగా ఇంటికి రావడం చూసి పక్కకి లాక్కెళ్లి మాట్లాడుతుంది. నన్ను ఒకడు మోసం చేయడంతో నీకు డబ్బులు ఇవ్వలేకపోతున్నానని అంటుంది. మా ఆంటీ నీకు సంబంధం లేదని చెబితే మాత్రం నీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని చెబుతుంది ఐశ్వర్య. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X