Brahmamudi May 6th Episode : రాజ్‌కి షాకిచ్చిన యామిని.. కావ్యకి మైండ్ బ్లాక్, వెయిటర్‌గా మారిన రుద్రాణి
రాజ్ - కావ్య వచ్చేసరికి రిసార్ట్‌లో అన్ని ఏర్పాట్లు చేస్తాడు కళ్యాణ్. ఇంతలో వారిద్దరూ రిసార్ట్‌కు రాగా కళ్యాణ్ - అప్పూలని రాజ్‌కి పరిచయం చేస్తుంది కావ్య. మీరు మా అన్నయ్యలా ఉన్నారని చెప్పడంతో నన్ను మీ అన్నయ్యగానే అనుకోమని చెబుతాడు రాజ్. దాంతో రాజ్‌ని హగ్ చేసుకుంటాడు కళ్యాణ్. ఇంతలో శ్వేత అనే అమ్మాయి రావడంతో కళ్యాణ్‌పై అప్పూ మండిపడుతుంది. వీరిద్దరూ లవర్స్ అని ఇదంటే నాకు నచ్చదని అప్పూ చెబుతుంది. వీరి గొడవ చూసిన రాజ్‌కి అది తన జీవితంలో జరిగినట్లుగా అనిపిస్తుంది. రాజ్‌కు కొంచెమైనా గతం గుర్తు రావడంతో వారంతా ఎంతో సంతోషిస్తారు.
రిసార్ట్‌లో కళ్యాణ్ - రాజ్‌లు ఒక గదిలో.. అప్పూ - కావ్యలు ఒక గదిలో ఉంటారు. ఎలాగైనా కావ్యని కలిసి తన మనసులోని మాటను చెప్పాలని రాజ్ విశ్వప్రయత్నాలు చేస్తాడు. శృతితో ఆఫీస్ నుంచి కొన్ని డిజైన్లు తీసుకొచ్చి మంచం మీద పెడుతుంది కావ్య. కళ్యాణ్‌తో వాళ్ల రూమ్‌లో వాటర్ రాకుండా చేసి రాజ్‌ను తన రూమ్‌లోకి వచ్చేలా చేస్తుంది. కావ్య ప్లాన్‌ను తిప్పి కొట్టాలని రిసార్ట్‌లో అడుగుపెడుతుంది యామిని. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక మే 6వ తేదీ ఎపిసోడ్ 714లో ఏం జరిగిందంటే?

కావ్యతో ఒక విషయం చెప్పాలని అంటాడు రాజ్. అది ఏంటో నాకు తెలుసని మనసులో అనుకుంటుంది కావ్య. నా రూమ్‌లో నా బట్టలు ఉన్నాయి, కొంచెం తెచ్చిపెడతారా? అని రాజ్ అడగటంతో కావ్య బాగా డిజప్పాయింట్ అవుతుంది. బట్టల కోసం ఇంత బిల్డప్ ఇచ్చారా అని మండిపడుతుంది కావ్య. కళ్యాణ్ రూమ్‌లోకి వెళ్లిన యామినిని చూసిన కావ్య .. దొంగ దొంగ అని అరుస్తుంది. ఆ దెబ్బతో యామిని లోపల దాక్కుంటుంది. పోలీస్ కుక్క వాసన పసిగట్టి వచ్చినట్లు భలే వచ్చావని ఆమెపై సెటైర్లు వేస్తుంది కావ్య.
ఇంతకీ రాజ్ ఎక్కడ అని ప్రశ్నిస్తుంది యామిని. మా ఆయన మా రూమ్‌లో స్నానం చేస్తున్నారని చెప్పడంతో యామిని షాక్ అవుతుంది. భార్యాభర్తలు కలిసి కాపురం చేస్తున్నప్పుడు కలిసి స్నానం చేయరా అని అడుగుతుంది కావ్య. నా భర్త నా రూమ్‌లో స్నానం చేయక ఇంకెక్కడ స్నానం చేస్తాడని చెబుతుంది కావ్య. అంటే నువ్వు ఇంత సేపు రామ్ పక్కనే ఉన్నావా? అని ప్రశ్నిస్తుంది యామిని. బాత్రూమ్‌కి వెళ్తూ బట్టలు తీసుకెళ్లలేదని ఎందుకు? అని అడుగుతుంది కావ్య. ఆ మాటలతో యామిని రగిలిపోతుంది. నువ్వు తన దగ్గరికి వెళ్లడానికి నేను ఒప్పుకోనని అంటుంది యామిని.
పోనీ నువ్వు బట్టలు తీసుకెళ్లు అని చెబుతుంది కావ్య. నిన్ను ఇక్కడే చూస్తే ఆయన నిన్ను చంపేస్తారని హెచ్చరిస్తుంది. రిసార్ట్ అడ్రస్ ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? అంటే ఏం ఆన్సర్ ఇస్తావని నిలదీస్తుంది కావ్య. అనుమానంతో నీ వెంటపడ్డానని ఆయనతో చెబుతావా? అని ఫైర్ అవుతుంది కావ్య. అప్పుడంటే గుడిలో నిన్ను కాపాడానని, ప్రతిసారి నా మంచితనాన్ని నీ కోసం వాడలేను కదా అంటుంది. దూరం నుంచి మా అన్యోన్న దాంపత్యాన్ని చూస్తూ ఉండమని చెబుతుంది కావ్య.
బట్టలు తీసుకెళ్లినంత మాత్రాన రాజ్ నీకు పడిపోతాడని అనుకోవద్దు.. మీ మధ్య నేను అడ్డుగోడలా ఉంటానని అంటుంది యామిని. ఆ అడ్డుగోడని బద్ధలు కొట్టుకుని ఆయన నా కోసం వస్తారని వార్నింగ్ ఇస్తుంది కావ్య. వీళ్లద్దరిని ఎలాగైనా దూరం చేయాలని అనుకున్న యామిని ఆమె వెనకాలే వెళ్తుంది. దీంతో కావ్య తలుపు వేసేస్తుంది. ఏంటండి అప్పుడే వచ్చేశారు? ఒంటినిండా నురగ ఏంటీ? చిన్న పిల్లాడు అనుకుంటున్నారా? అంటూ రాజ్‌కి ముద్దుపెడుతున్నట్లు నటించి యామినిని రెచ్చగొడుతుంది కావ్య. లోపలి నుంచి ఏ సౌండ్ రాకపోవడంతో యామిని కంగారుపడుతుంది. రూమ్‌కి బయట ఉన్న కిటికి దగ్గరికి వెళ్లి ఏం జరుగుతుందో చూస్తుంది.
ఇంతలో బెడ్‌పై నగల డిజైన్లు చూసిన రాజ్ షాక్ అవుతాడు. అవి మా కంపెనీ డిజైన్లని కావ్య చెబుతుండగా రాజ్‌కు వాటిని గతంలో చూసినట్లుగా అనిపిస్తుంది. రాజ్ వాటిని చూస్తే గతం గుర్తొస్తుందని భయపడ్డ యామిని లోపలికి వస్తుంది. ఆమెను చూడగానే రాజ్ షాక్ అవుతాడు. నువ్వు ఇక్కడికి రమ్మని మేసేజ్ చేశావు కదా? మళ్లీ ఏం తెలియనట్లు కొత్తగా అడుగుతావేంటీ? అని ప్రశ్నిస్తుంది యామిని. దానికి ఆధారంగా మెసేజ్ కూడా చూపించడతో రాజ్, కావ్యలు షాక్ అవుతారు.
ఓ వెయిటర్‌ని లోపలికి పంపించి రాజ్ ఫోన్ నుంచి మెసేజ్ పెట్టించినట్లు గుర్తుచేసుకుంటుంది యామిని. ఏం జరుగుతుందో తెలియక రాజ్, కావ్యలు టెన్షన్ పడతారు. ఎక్కువగా ఆలోచించొద్దు నీ హెల్త్‌కి మంచిది కాదని రాజ్‌తో అంటుంది యామిని. ఈ పార్టీ అయ్యే వరకు నేను నీతోనే ఉంటానని, సరదాగా ఎంజాయ్ చెద్దామని చెప్పడంతో రాజ్ భయపడతాడు. తన ప్లాన్ రివర్స్ కావడంతో కావ్య షాక్ అవుతుంది. పాపను ఆడిస్తున్న ధాన్యలక్ష్మీని చూసిన స్వప్న టెన్షన్ పడుతుంది. పాపని రుద్రాణికి ఇస్తే ఈవిడ దగ్గరికి ఎలా వచ్చిందని అనుకుంటుంది.
పాపని మా అత్తయ్యకిచ్చి ఆడించమని చెప్పానని స్వప్న అడగ్గా.. ఏదో అర్జెంట్ పని ఉందని రాహుల్, రుద్రాణిలు బయటికి వెళ్తూ పాపని నాకు ఇచ్చి వెళ్లారని చెబుతుంది ధాన్యలక్ష్మీ. రాజ్‌కి గతం గుర్తురావడానికి కావ్య ట్రై చేస్తోందని, ఆ విషయం మా అత్తయ్యకి, రాహుల్‌కి తెలియనివ్వకూడదని మనం అనుకున్నాం కదా అని అంటుంది స్వప్న. వాళ్లని ఆపడానికి పాపని వాళ్లిద్దరి చేతుల్లో పెట్టానని చెబుతుంది. ఆ మాటలతో ధాన్యలక్ష్మీ షాక్ అవుతుంది. మతిమరుపు గురించి ధాన్యలక్ష్మీ - ప్రకాశంలు గొడవ పడతారు.
రిసార్ట్‌లోకి వెళ్తున్న రుద్రాణి, రాహుల్‌లను సెక్యూరిటీ గార్డ్ అడ్డుకుంటాడు. ఎలా వెళ్లాలో అర్ధం కాక వెయిటర్స్ వేషంలో వెళ్లాలని ప్లాన్ చేస్తారు. రాజ్‌కి మందు కొట్టించి గతం గుర్తు చేయాలని ప్లాన్ చేస్తారు ఫ్రెండ్స్. మందు తాగితే అన్ని కోల్పోతామని క్లాస్ పీకుతాడు రాజ్. ఈ డైలాగ్స్ అన్ని గతంలో మాతో చెప్పినవేనని.. వాడేమీ గతం మర్చిపోలేదని కళ్యాణ్‌తో చెబుతారు. నువ్వు కోమాలోకి వెళ్లిన విషయం వాళ్లకి చెప్పానని అంటాడు కళ్యాణ్. మీరు ముందు నుంచి మందుకి దూరమయ్యారా? అని కావ్య అడగ్గా.. సొసైటీని చూశాక మందు జోలికి వెళ్లాలని అనిపించడం లేదని చెబుతాడు రాజ్. కట్టుకున్న భర్త కోసం ఎన్నో కష్టాలు పడుతున్నావని కావ్యపై సెటైర్లు వేస్తుంది యామిని. వారి గొడవని రుద్రాణి, రాహుల్‌లు చూస్తారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











